స్వీయానుభవ నవలా కారుడు- పాట్ కాన్ రాయ్
నాలుగు అద్భుత మైన నవలల తో ప్రసిద్ధి చెంది ,జీవితం లో తాను అనుభవించిన వేదనలు అవహేళనలు మొదలైన వాటి నన్నిటికి నవలా ప్రక్రియ లో అపూర్వ సృష్టి చేసి మిలిటరి పదవిలో ఉండి అదే వారసత్వం గా పొంది ,ఆ క్రమ శిక్షణ పైనా విరుచుకు పడ్డ నవలా రచయిత పాట్ కాన్ రాయ్ .పూర్తీ పేరు డోనాల్డ్ పాట్రిక్ కాన్ రాయ్ జననం 1945..తండ్రి మిలిటరి ఉద్యోగస్తుడు .ఎప్పుడూ స్తలం మార్పులే .తలి దండ్రుల మధ్య లోపించిన అవగాహన ,అతి సంతానం ,తన దేహ వైక్లాబ్యం అన్నీ కాన్రాయ్ ని మిగిలిన వారితో కలవ కుండా చేశాయి .ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ .
ఆయన తల్లి తండ్రిని వదిలి ముప్ఫై ఏళ్ళు పైగా విడిగా ఉండి ఒంటరి తనం తో వేదన చెందాడు . .తండ్రి క్రూరత్వాన్ని తల్లి భరించ లేక పోయేది .ఈ సంఘర్షణ ఆయన పై పెద్ద ప్రభావాన్నే కల్గించింది .పన్నెండేల్లలో పద కొండు స్కూళ్ళలో లో చదవాల్సిన పరిస్తితి .ఎప్పుడే క్కడ ఉంటాడో ఎవరితో స్నేహం చేయాలో తెలీని వింత పరిస్తితి .ఎప్పుడూ కొత్త వారితో ఉండాల్సిన రావటం అతను జీర్ణించుకో లేక పోయాడు .ఆ కుటుంబం లో హీరోఇజం ఒక సమస్య .తండ్రి గొప్ప మిలిటరి ఉద్యోగి. కొడుక్కు కూడా ఆ హోదా రావాలని తండ్రికోరిక .ఇతని భావాలేమితో ఆయనకు అక్కర్లేదు తన భావాలు ,అభి రుచులు కొడుకు పై రుద్దు తున్నాడని ఈతనికి లోపల అసహ్యం .కాని ఎదురు చెప్పలేని తనం .గుండె గొంతుకలో కొట్లాడటమే .అమెరికా సైన్యం లో చేరి రెండు సార్లు వియత్నాం యుద్ధం లో పాల్గొన్నాడు .దీన్ని తన నవల” the great satini ”లో చిత్రించాడు .అందులో ప్రేమ అసహ్యం లను నింపాడు .రాయ్ చాలా మొండి గా ఉండే వాడు .బిరుసు స్వభావం .తన మనసు లోనిది ఎప్పుడూ బయటకు చెప్పేసే వాడు .తల్లి బయటి ప్రవృత్తికి అంతర ప్రవృత్తికి భేదం ఉందని ముప్ఫై ఎల్ల తరువాత గ్రహించ గలిగానని ఒప్పుకొన్నాడు .ఇంట్లో అంతా తండ్రి ఇష్టప్రకారమే జరుగుతున్నట్లు అని పించినా అసలు ఇంటిని తీర్చి దిద్దింది తల్లే నన్నాడు .తండ్రి కోప్పడినా తిట్టినా ఆమె ఎంతో సహనం చూపెది .ఒక సారి తండ్రి రాయ్ ని బాగా కొట్టి గాయ పరిస్తే తల్లే ఆస్పత్రికి తీసుకొని వెళ్లి డాక్టర్ తో కింద పడితే దెబ్బ తగి లిందని చెప్పమని అతనితో చెప్పిందట .ఆమె సౌత్ కెరొలినా నుంచి వచ్చిన మహిళా .ఆమె పేరు పెగ్ కాన్ రాయ్. తండ్రి పేరు ఫ్రాన్సిస్ కాన్ రాయ్ .
1963 లో దక్షిణ కెరొలినా సిటడేల్ మిలిటరి కాలేజి లో చేరాడు .అక్కడ చాలా వికృత చేష్టలకు గురైనాడు .తండ్రి చదువు మానేసి రమ్మంటే వచ్చాడు ,మళ్ళీ వెళ్లి కోర్సు పూర్తీ చేశాడు .మిలిటరి కెరీర్ ఇష్టం లేక పోయినా తప్పలేదు .అతనికి మియోపియా కలర్ బ్లిండ్ నేస కూడా ఉండేవి .అందుకని పైలట్ కాలేక పోయాడు .నల్ల వారిని ”నిగ్గర్లు ”అని మొదట ఈస డిం చిన తర్వాత వారితో మంచి స్నేహమే చేశాడు అతనికి టీచింగ్ అంటే మహా ఇష్టం .1970లో మొదటి పుస్తకం ”the boo ”నవల రాసి ప్రచురించాడు .ఇది ఒకరకం గా ఆతని జీవితమే .అతనిలోని అమాయకత్వం హాస్యం ను బాగా పండించాడు .తర్వాతా”the water is wide ” నవల పబ్లిష్ చేశాడు .స్వంత ఖర్చు తోనే ప్రచురించాడు రెండు నవలలను .1976లో ”the great santini ”నవల రాసి విడుదల చేశాడు .ఇదీ ఆత్మా కధే .తన కుటుంబం వారి నరాల బలహీనతను బయట పెట్టుకొన్నాడు ఈ నవల లో .దీన్ని అందరు గొప్ప నవల గా భావించారు .పెళ్లి అవటం విడాకులు ఇవ్వటం జరిగింది దీన్ని అట్లాంటా మేగజైన్ లో తెలిపాడు .తండ్రి ఒక సారి మూడు రోజులు కనిపించక పోతే ఆత్మా హత్య చేసుకోన్నాడేమో నని భయ పడ్డాడు శాటిని నవల అతని భావ అసహనానికి ప్రతీక .మళ్ళీ పెళ్లి చేసుకొన్నా విడాకులులు తప్ప లేడు .
”the lords of discipline ”నవల బాగా డబ్బు ను చేకూర్చింది .పెరూ బానే వచ్చింది .సినిమా గా కూడా వచ్చింది .తర్వాతా రాసిన ”the prince of the tides ”విమర్శకులు మెచ్చిన నవల .బెస్ట్ సెల్లర్ అయింది .గొప్ప సినిమా గా తీశారు .ఈ నవల తో గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కాన్ రాయ్ కి .దక్షిణ రాష్ట్ర భావాలు చిత్రేకరణ తో మంచి ఊపు నిచ్చింది .దీన్ని పాఠ్య పుస్తకం గా కూడా చేశారు .భాష విషయం లో కొంత ఇబ్బంది ఉందని పించినా విషయ ప్రాధాన్యత కలది రచనా విధానం మీద రాయాలని ఆలోచించాడు .అన్నీ వున్నా అతని విధానం బాధ కలిగించేది .1990 లో వచ్చిన ”బీచ్ మ్యూజిక్ ”నవల కొంత ఆలస్యం అయినా మంచి గుర్తింపు పొందింది .1993లో వెన్నెముక కు ఆపరేషన్ జరిగింది .ఆబాధ తట్టు కోవటానికి తాగుడు బాగా అలవాటయింది .ఆత్మా హత్యా ప్రయత్నమూ చేశాడు .అయితే సరైన సమయం లో మంచి కొంసేలింగ్ లభించటం వల్లా అన్నిటికి దూరమై రచన కోన సాగించాడు దీనికి కారణ మైన ”డాక్టర్ మారియాన్ నీల్ ”అభి నంద నీయుడు .సోదరుడు మానసిక వ్యాధికి గురై ఆత్మా హత్యా ప్రయత్నం చేసు కొన్నాడు .తల్ల డిల్లి పోయాడు రాయ్ .బీచ్ మ్యూజిక్ లో దీన్ని వర్ణించాడు ,.ఈ నవల విజయ వంతం అవటం తో పబ్లిసిటి కోసం 34 సిటీలు పర్యటించి పుస్తకాలపై సంతకాలు చేసే కార్య క్రమం ఛే బట్టాడు .సినిమా గా తీసే ప్రయత్నం లో సహక రించాడు .తాను రాసే అన్ని పుస్తకాలకు ప్రేరణ ”thomas wolfe ”అనే ప్రఖ్యాత నవలా రచయిత రాసిన” home land angel ”నవల అని చెప్పాడు రాయ్ .సాన్ ఫ్రాన్సిస్కో లో ఫ్రిప్ప్ ఐలాండ్ లో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు .
కాన్ రాయ్ నవలలు వ్యంగ్యాత్మక రచనలు అని అంటారు లార్డ్స్ ఆఫ్ డిసిప్లిన్ నవల లో కెరొలినా మిలిటరి కాలేజి గురించి వివరించాడు .అతని రచన లలో దక్షిణ రాష్ట్రాల కుటుంబ జీవనం సాహిత్య దృక్పధం ఉంటాయి .తన అంగ వికారత్వాన్ని అధీ గా మించి ,తండ్రి చంద్ర శాసనత్వాన్ని సహించి కాలేజిలో మిత్రుల అవహేలనాను భరించి పెళ్ళిళ్ళు పేటాకులు అయినా తల్లిని ఆలస్యం గా అర్ధం చేసుకొన్నా ,తన కుటుంబ గాధలను తన భావ తీవ్రతలను ,మానసిక దౌర్బల్యాలను ,సామాజిక చైతన్యాన్ని తన స్వంత అనుభవం తో రంగరించి ,స్వీయ చరిత్ర గా జీవిత చరిత్ర గా నవలలను రాసి హిట్లను సాధించాడు పాట్ కాన్ రాయ్
వీక్షకులు
- 979,615 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- చిద్విలాస శతకం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.23 వ భాగం.1.2.23.
- అరుణ మంత్రార్థం. 8వ భాగం.1.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -393
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -391
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.22 వ భాగం.31.1.23.
- అరుణ మంత్రార్థం. 7వ భాగం.31.1.23.
- పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం
- బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-3(చివరి భాగం )
- ముదు నూరులో డా.ఎన్.భాస్కర రావు గారింట్లో జీవిత చరిత్రల గ్రంధాలయ వార్షికోత్సవ 0లో 29.01.2023
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,921)
- సమీక్ష (1,276)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (302)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (359)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు