జన వేమన –24
యుగ వేది -వేమన
వంద బ్రహ్మ ప్రళయాలు ఒక విష్ణువు రోజు అని ,వంద విష్ణు ప్రళయాలు ఒక రుద్రా దినం అని చెప్పే యుగ పరిజ్ఞానం వేమన కు ఉంది .”మేకలు మూకలు సనినాను -బ్రాకటముగ నొక్క కోతి పారనం బెక్కన్ –ఆ కాపులు నూరు చని నను -కోకో యని కొంక నక్క కూయుర వేమా ”అని గుప్తం గా చెప్పాడు మేకను అజం అంటారు .అంటే బ్రహ్మ .కోతిని అరి అంటే విష్ణువు ,కొంక నక్క అంటే శివం అంటే శివుడు .ఈ అర్ధాలు తెలిస్తే యుగాలు ఎలా వస్తాయో తెలుస్తుంది .
గణిత జ్ఞాని
”ఒకటి క్రింద నొక్క తోనారు లబ్దము వెట్టి –అలనుగా గుణింప వరుస చెరుగు -నత్తి రీతి నుండు నౌదార్య ఫలములు ”ఔదార్యం ఉన్న వారికి జామేత్రీక్ ప్రోగ్రేషన్లో ఫలితాలున్తాయన్నాడు .
రైతు పక్ష పాతి
దేశానికి వెన్నెముక రైతు అని అందరం భావిస్తాం .”అన్న దాత ”అని ఆప్యాయం గా అంటాం .రైతు రాజ్యం కావాలి ,రావాలి అని కోరుకుంటాం .అయితే రైతుల కష్టాలను మాత్రం తీర్చం .ఈ విషయా లన్ని వేమన్న కు బాగానే తెలుసు .వాళ్ళ కష్ట సుఖాలను తన కాళ్ళ టో చూసి సానుభూతి ప్రకటించాడు .”పైరు నిడిన వాని ఫలమే సఫల మగును -పైరు నిదాని వాడు ఫలము గనునె ?-పైరు పెట్టి భూమి ప్రజలను బోషించురా ”అని రైతు త్యాగాన్ని ప్రస్తుతించాడు .
దాతృత్వం
సాదా రణం గా దానం ఇచ్చే వాడికి అడిగే వాడు లోకువే .కాని మహాత్ములు దానాన్ని స్వత స్సిద్ధ గుణం గా భావిస్తారు .బలి చక్ర వర్తి వామనుడికి భూదానం ఇస్తుంటే అడ్డు పడిన గురువు శుక్రా చార్యునితో ”మీదై నా కరం బుంటమేల్ గాదే ”అని దాన గర్వం చూపాడని మనకు తెలిసిన విషయమే .అరుదుగా అడిగితే ”ఆర్ది ”కాదుట .తరచుగా ఇవ్వక పోతే ”దాత ”కాదట .ఈ విషయాన్ని పద్యం లో చెప్పి ”దాత కర్ది కంత తార తమ్యము సుమీ ”అని తేల్చాడు .”అడుగకర్ధమిచ్చు నతడు బ్రహ్మ జ్ఞాని -అడుగక నర్ద మిచ్చు నతడు త్యాగి -అడుగ నియ్య లేని యాతడే పెనులోభి ”అని తార తమ్యా లను వివరించాడు .అడగటం లో నీతి ఉందని చెబుతూ ”అడుగ దగు వారి నడుగుట -నిడిన యడల గోసర కుంట ,నీలేననగా –గడు ,పై వేడకయుండుట -యడిగేడు వారలకు నీతి యగురా వేమా ”అని కాండం లో అందం గా అడుక్కొనే నీతి సూత్రం చెప్పాడు .ఇది గొప్ప సూక్తి ముక్తా వళే .
వైద్య వేది
చిన్న రోగాలకు ,వ్యాధులకు చిట్కా వైద్యం చెప్పాడు వేమన .ఆచరణ సాధ్య మైనవే అవి .డబ్బు ఖర్చు కానివే .”కుక్క కరిస్తే అరవ కుండా దాని నోరు కట్టేసి ,ప్రక్కలు విరిగేట్లు దాన్ని కొట్టి ,”మాన్చుకో వచ్చు .”వేము చెక్క దీన్న విష రోగములు వాయు -దేహ కాంతి గలుగు ద్రుధము గలుగు –తినగా తినగా నదియే తీయగా నుండును ”అని ”వాము మహాత్యం ”చెప్పాడు .తినగా తినగా వాము తియ్యగానే ఉంటుంది .వినగా వినగా వేమన పద్యాలూ తియ్యగానే ఉంటాయి వ్యాధి వస్తే వైద్యం చేయించు కోవాలి .మందు వేసుకోవాలి .కాని దీని కంటే ముఖ్యం ”మందు వంటి మనసు మనుజుండు గావలె ”అని హితవు చెప్పాడు .మందు తాగితే ఎలా రోగం పోతుందో ,అంతటి ప్రభావం మనసుకూ ఉంది .మనసు మంచిగా ఉంచుకొంటే రోగాలు దగ్గరకు చేరవని సారాంశం .మనసును జాగ్రత్త గా వాడుకోవాలి .”కాంత సింధు రంబు కాదు పిత్తవ్యాధికి –నొసగు తేనె తోడ నోసర నిడిన –దనరు దేహ బలిమి ధన్యుడై యుండురా ”అన్న పద్యం వల్ల వస్తుగుణ దీపిక తెలిసిన వాడి గా వేమన్న ను మనం భావించ వచ్చు .పిండోత్పత్తి రహస్యం క్షుణ్ణం గా తెలిసిన వాడాయన .ఆతత్మ ను దర్శించిన యోగికి తెలియనిదేమి ఉంటుంది ?
వింతలు విశేషాలతో వేమన
పొరపాటుగా నైనా ఒక సారి వేమన ”ప్లాటో తత్వ వేత్త ”సరసన చేరాడు .ఎలా గంటె -సర్ విలియం జోన్స్ అనే రచయిత వేమన ను ”భారత దేశపు ప్లాటో ”గా చెప్పాడని మాక్దోనాల్ద్ రాశాడు. తీరా ఆరా తీస్తే ఆయన చెప్పింది వేద వ్యాసభగవానుని గురించిఅని ,వేమన గురించి కాదు అనితెలిసింది . ”ప్రజల్లో పట్టం లేని ప్రభువు వేమన ”అన్నారు . ”వేమన యోగీంద్ర చరితం వ్రాసిన మచిలీ పట్నానికి చెందినాపూర్నయా చార్యులు దేశం అంతా తిరిగి వేమన కవితల తాళ పత్ర గ్రంధాలు సంపాదించారు .1913లో ”వేమన పద్య సంకలనం ”ప్రచురించారాయన .ఆయన దృష్టిలో వేమన ”ఒక పురుష వృషభుడు ”.సర్ఘు పతి వెంకట రత్నం నాయుడు గారికి వేమన అంటే విప రీత మైన అభిమానం. ”చావటానికి వ టానికి పుట్ట లేదు మానవుడు ” ”అన్న ఆంగ్ల కవి ”కీట్స్ ”వాక్యమూ ”అతడు మానవుడు ,,అన్ని విధాలా మానవుని గా నే స్వీకరించండి .అతని వంటి వాడిని నేను మరల దర్శించ బోను ”అన్న మహా కవి షేక్స్ పియర్ మాటలూ ,”తళుక్కున తట్టిన తలపును చటుక్కున చెప్పాడు కవి ”అన్న ఎమర్సన్ దార్శకుని మాటలను ‘సహజ హాస్య చతురుడైన గ్రామీణుడు .ప్రకృతి దార్శనికు లలో ఒకడు ”అని భావించిన హురేస్ అభి ప్రాయమూ వేమన గారికి చక్క గా వర్తిస్తాయని విశ్లేషణాత్మకం గా నార్ల వెంకటేశ్వర రావు గారు వివరించారు .
”ఈత కన్నా లోతు నేన్చంగా బని లేదు –చావు కన్న గీడు జగతి లేదు –గోచి పాత కంటే గొంచేమ్బిన్కను లేదు ”అన్న పద్యానికి వి’ఎల్;’యెన్ మూర్తి అద్భుతం గా ఆంగ్లాను వాదం చేశారట .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –11-9-12-కాంప్–అమెరికా