సాంఘిక సమస్యల నవలా రచయిత- అప్ టాన్ సిన్క్లైర్

సాంఘిక సమస్యల నవలా రచయిత- అప్ టాన్ సిన్క్లైర్ 
దాదాపు వంద నవలలు రాసి ,సమకాలీన సమస్యలను చర్చించి ,కార్మికుల కష్టసుఖాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి ,ప్రజా రచయిత గా ,అధో జగత్ సహోదరులకు అండగా నిల బడి, కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేసిన  రాజకీయ రచయిత  అప్ టాన్  సిన్క్లైర్ .
సిన్క్లైర్ అంటేనే వేతన జీవుల ఆశా జ్యోతి .ప్రెసిడెంట్ రూజ్  వెల్ట్ ను తరచుగా కలిసి వారి సమస్యలను చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నించిన వాడు వర్కర్ల హృదయాలలో చిర స్తానం పొందిన వాడు .”i aimed at the public heart ,but by accident hit in the stomach ”అని గర్వం గా చెప్పుకొన్నాడు రచయిత అప్టాన్ సిన్క్లైర్ .ఎక్కువ పై గంటలను తగ్గించటం లో ,జీతాలను పెంచటం లో పని చోట్ల ఆరోగ్య రక్షణ విషయం లో రచయిత చేసిన కృషి ప్రశంస నీయం .మాంసం దుకాణాలలో పని చేసే వారి దుర్భర వేదనలను నివృత్తి చేయటానికి ,పారిశుద్ధ్య పని వారల గతి మార్చటానికి ఆయన ప్రయత్నించిన తీరు మరువ లెండి .ది జంగిల్ ”అనే నవలలో సమకాలీన జీవన చిత్రణ చెశాదు .అన్నీ సాధించ లేక పోయినా ఆయన ఒక ఆదర్శ నీయడు గా ”ఐకాన్ ”గా ఉన్నాడు .
1878లో సెప్టెంబర్ ఇరవై న మేరి లాండ్ లోని బాల్టిమోర్ లో అప్టాన్ బి ఆల్ సిన్క్లైర్ జన్మించాడు .పదేళ్ళ వయసు లోనే కుటుంబం న్యు యార్క్ లో స్తిర పడింది అతని ద్రుష్టి అంతా రాజకీయం ,ఆర్ధిక సామాజిక సమస్యల పైనే ఉండేది .సామాజిక న్యాయం కోసం తపించే వాడు .అవినీతికి సింహ స్వప్నం .ఆది ఎక్కడున్నా వెతికి జనం ముందుంచే బాధ్యత తీసుకొన్నాడు అలాంటి వారిని ”muckraker” అంటారు .రూస్ వెల్ట్ అలానే సంబోధించాడు ఈయన్ని .అమెరికా లోని రాజ కీయ ,సాంస్కృతిక చరిత్ర లో సిన్క్లైర్ స్తానం స్తిర మైనదే .ఆయన్ను పందోమిదో శతాబ్దపు ఆదర్శ వాది అయిన రచయిత అంటారు .యువకుడు గా ఉన్నప్పుడే వందలాది కధలు రాసి పారేశాడు pulp  రచయిత అని పించుకొన్నాడు .సంగీతం రాజకీయం ఆయన్ను బానే ఆకర్షించాయి .క్రమంగా సామాజిక భావ వ్యాప్తి మీదకు దృష్టి మరలింది .
1900-04 కాలం లో నాలుగు నవలల ను విజ్రుమ్భించి రాశాడు .అందులో రొమాంటిక్ అయిడ లిజం నింపాడు . క్రమం గా దృష్టి సోషలిజం వైపుకు మరలింది .1904లో రాసిన ”manassas ”నవల లో అమెరికన్ సివిల్ వార్ సమయం లో ప్లాంటేషన్ యజమాని కొడుకు బానిస నిర్మూలన కోసం కృషి చేయటం వస్తువు గా తీసుకొని రాశాడు ఇక్కడితో అతని సోషలిస్ట్ భావాల ద్వారాలు తెరుచుకోన్నాయి .ఆ తర్వాత రాసిన” lanny budd ”సిరీస్ అని పదకొండు పుస్తకాలు రాశాడు .వీటిలో ఆదర్శ వంత మైన సమాజంకోసం తపన ,సాంఘిక అన్యాయాలను ఎదిరించే పరిస్తితులన్నీ కన్పిస్తాయి .”మనస్సాస్”నవల ఆ తర్వాత రాయ బోయే ”the jungle  ”నవలకు ఉపోద్ఘాతం లాంటిది .ఉద్యోగస్తులను ”వేతన బానిసలు ”(wage slaves )అని పిలుస్తారు .చికాగో లోని పాకింగ్ ప్లాంట్ కు వెళ్లి అక్కడి పరిస్తితులను రహస్యం గా ,బహిరంగం గ చూసి అర్ధం చేసుకొన్నాడు .అక్కడి దీన ,హీన స్తితులకు చలించి పోయాడు .దీని నేపధ్యం గా” ది జంగిల్ ” నవల రాశాడు .ఇందులో సృజన తో పాటు అవినీతి ని బహిర్గతం చేసే విధానమూ ఉంది .ఆ ఉద్యోగుల లో ఒకడి జీవితాన్ని నవలగా రాశాడు .అందులో మొత్తం సమాజం అంతా ప్రతి ఫలించే టట్లు చేశాడు .అవి నీతి రాజకీయ నాయకులను ఎండ గట్టాడు .ఏది రాసినా సిన్క్లైర్ తన స్వంత కళ్ళ తో చూసే రాస్తాడు అందుకే ఆయన రచనలకు అంతటి విలువ ఏర్పడుతుంది .ఈ నవల అందరి దృష్టిని ఆకర్షించింది .దీని ఫలితం కూడా కనీ పించింది .అక్కడి పారిశుద్ధ్యం పై ప్రభుత్వం శ్రద్ధ తీసుకొన్నది .మాంసం పాక్ చేసే విధానం లో ఎన్నో జాగ్రత్తలు వహించేట్లు చేయ గలిగారు .నవల కు ఇంతటి కన్నా కావాల్సిన దేముంది ?
1906-14కాలం లో సిన్క్లైర్ ఆయన ఉద్యోగ విషయాలలో మార్పులు వచ్చాయి .న్యు జెర్సి లోని హేలికాన్ హాల్ లో అందరు కలిసి జీవించే విధానాన్ని ప్రయోగాత్మ కం గా అమలు చేశాడు.అయితే ఆ భవనాన్ని ధ్వంసం చేశారు గిట్టని వాళ్ళు .ఆయన వివాహ జీవితం కూడా ఒడిదుడుకులకు లోనైంది .ఆరోగ్య రహస్యాల మీద రచనలు చేశాడు .ఉపవాసం చాలా మేలు చేస్తుందని చాలా జబ్బులను దూరం చేస్తుందని  తెలియ జేశాడు .1908లో ”the metro polis ”,the money changers ”మంచి ద్రుష్టి తో రాసినా గొప్పవిగా  పేరు రాలేదు .1910లో రాసిన ”samuel the seeker ”నవల ఒక యువకుడు సోషలిజం ను స్వీకరించే ముందు అనేక మతాల లో ఉండి ఏవీ నచ్చక పోవటాన్ని వివ రించాడు .చివరికి సోషలిజం అతన్నేమీ ఆకర్షించక రాజ కీయ బాధితుడవటం చివరలో చూపిస్తాడు .ఇందులో సిన్క్లైర్ కూడా భౌతిక మానసిక సంచారం చేసిన తీరు కనిపిస్తుంది .తర్వాత వచ్చిన నవల ”love’s pilgrimage ”లో తన మొదటి వివాహం దాని అనుభవాలు వివ రిస్తాడు .అందులో పెళ్లి అయిన మహిళకోరుకొనే జీవితాన్ని గురించి చెప్పాడు దీనిలో ఆయన మహిళా పక్ష పాతి అని పిస్తాడు .1913లో సుఖ వ్యాధుల పై రచనలు చేశాడు .మన ”లవణం ”అని పిస్తాడు .
రెండో పెళ్లి ఆయనకు కొంత సుఖ శాంతులనిచ్చింది .సౌత్ కెరొలినా లో నివాసం ఉన్నాడు .బొగ్గు గనుల కార్మికుల సమ్మె తీవ్రం గా ఉంది. స్వయం గా వెళ్లి వాళ్ళ సమస్యలను పరిశీలించి తెలుసుకొన్నాడు .కొలరాడో దాకా వెళ్లి గని యజ మానులతో సంప్రదించి పరిష్కార మార్గానికి ప్రయత్నించాడు .ఈ అనుభవాలను ”king coal ”లో వర్ణించాడు .తర్వాతా అమెరికా మొదటి ప్రపంచ యుద్ధం లో పాల్గొన టాన్ని వ్యతి రేకించాడు .ఆయన లో స్తిరమైన అభిప్రాయాలు లేవని కొన్ని సందర్భాలలో తెలుస్తుంది .1918లో బోల్షెవిక్ రివల్యూషన్ ను అమెరికా సైన్యం అణచి వేయటానికి చేసే ప్రయత్నాన్ని నిరశించాడు .దీన్ని అంతటిని ”jimmie higgins ” లో నవలాత్మకం గా చిర్తించాడు .ఇప్పటి నుంచి ఇరవై మూడేళ్ళు అనేక పుస్తకాలను ఫామ్ఫ్లేట్ల ను రాసి ప్రచురించాడు .వీటిలో విద్య గురించి ,తప్పుడు దేశ భక్తీ గురించి ,అమెరికా లోని కాపిటలిజం గురించి ,జర్నలిజం గురించి ,మంచి ఆర్ధిక స్తితి గతుల గురించి ,కళా సాహిత్యాల గురించి అమెరికా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న అనేకానేక అంశాల గురించి పుంఖాను పపుంఖం గా  పున్ఖం గా ఎడా ,పెడా రాసి అవతల పారేశాడు .
సిన్క్లైర్ రాసిన ”oil ”,”bostan ”నవలల  తర్వాతాదాదాపు ఇరవై ఏళ్ళు ప్రభావం చూప గల రచనలేమీ చేయ లేక పోయాడు .మెంటల్ టేలి పతి విషయం పై ”mental radio ”రాశాడు ప్రొహిబిషన్ ను తేవాలని కోరాడు .1934లో ”  గవర్నర్  అఫ్ కాలిఫోర్నియా ”,”హౌ ఐ ఎండెడ్ పావర్టి ” నవలల తర్వాత రాజ కీయాలపై ఆసక్తి బాగా పెరిగింది .కాలి ఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గా డెమొక్రాటిక్ పార్టి టికెట్ లభించింది .ఆయన ప్రచారం ఏమిటో తెలుసా” E.P.I.C.”అంటే”end poverty in california ” అని .పాపం ఓడి పోయాడు .కాని దీని ఫలితం మాత్రం కనీ పించింది .ప్రెసిడెంట్ రూస్ వెల్ట్ కార్మికుల అంటే లెఫ్ట్ వింగ్ వారి డిమాండ్లను తీర్చటానికి ముందుకు వచ్చి ఆసరా గా నిల బడ్డాడు .కాలిఫోర్నియా రాజ కీయాలను చర్చిస్తూ ”co-op ”అనే నవల 1936లో రాశాడు .తర్వాతి ఏడాది లో ”the flivver king ”అని హెన్రీ ఫోర్డ్ ఆయన కార్మిక వ్యతి రేకత  పై నవల రాస్తూ అందులో కార్మిక సమస్యలను చర్చించాడు .”లిటిల్ స్టీల్ ”అనే నవల లో స్పానిష్ సివిల్ వార్ పై రాశాడు .1938లో ”the steel ”నవల లో ఇనుము ,స్టీల్ కంపెనీ లలో కార్మిక యూనియన్ల నిషేధాన్ని గురించి రాశాడు .ఆ తర్వాతా పద కొండు చారిత్రాత్మక నవలలు రాశాడు .అందులో 1913 -50కాలం లో పశ్చిమ దేశాల చరిత్ర ను గురించి రాశాడు .అందులో పాత్ర పేరు ”లాన్నీ బడ్డీ ”.అందుకని వీటిని ”లానీ బడ్ సిరీస్ ”అంటారు .
1950 లో సిన్క్లైర్ ఎనభై వ పడి లో పడ్డాడు .ఇక రచనకు స్వస్తి చెప్పే ఆలోచన కు వచ్చాడు . ఇప్పటి దాకా రాసిన వాటిల్లో ఎక్కువ భాగం స్వీయ చరిత్రలే అని పిస్తాయి .1950లో రాసిన ”another pamela ” ను 1740-42కాలం లో samuel richardson ”రాసిన ”పమేలా ”కు ఆధునిక విధానం లో  రాసి ప్రాముఖ్యత చేకూర్చాడు .1954లో ”what didimus did ?”నవల లో కాలిఫోర్నియా లో జరిగిన అసంపూర్ణ సాంఘిక సంస్కరణలను  చర్చించాడు .1964 వచ్చిన ”the auto biographyof upton Sin clair ”అనేది ఆయన ”అమెరికా పోస్ట్ ”లో ఇది వరకు రాసిన దానికి పూరణే.ఇందులో అభ్యుదయ భావ రచయిత గా ఆయన దర్శనమిస్తాడు .ఆయన తల్లి కి నిశ్శబ్దం అంటేఇష్టం .తాగుడుకు ఆమె వ్యతి రికి గొప్ప డిసిప్లినీర్ .ఇవేవి నచ్చక సిన్క్లైర్ తల్లికి దూరం గా 35 ఏళ్ళు గడిపాడు .”time ”మేగ జైన్  సిన్క్లైర్  గురించి ”a man with every gift except humor ”అని రాసింది .ఆయన25-11-1968 న 90 ఏళ్ళు నిండు జీవితాన్ని అనుభవించి ప్రజా రచయిత గా అందరి ప్రశంశలను పొంది  మరణించాడు .ఒక ఉన్నత భావాల వ్యక్తిగా, మంచి వాడుగా ,పెద్ద మనిషి గా,  ఆధ్యాత్మికతను ,రాజకీయాన్ని, సాంఘిక విషయాలను, శాకా హార అవసరాన్నితెలియ జెప్పిన వాడిగా  సామాజిక సమస్యల పై పోరా ట దృక్పధాన్ని కనపరచిన రచయిత గా సిన్క్లైర్ చిర స్మర ణీయుడు .ప్రజా హృదయ పీఠం పై మకుటం లేని మహా రాజు అప్ టాన్ సిన్క్లైర్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –11-9-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.