ఊసుల్లో ఉయ్యూరు –33 మంచి ప్రిన్సిపల్సు ఉన్న ముగ్గురు ప్రిన్సి పా ల్సు

     ఊసుల్లో ఉయ్యూరు –33
                                                     మంచి ప్రిన్సిపల్సు  ఉన్న ముగ్గురు ప్రిన్సి పా ల్సు
మా ఉయ్యూరు లో పాలి టెక్నిక్ కాలేజి మూడు రకాల కోర్సులు కలిగి ఎందరో వేలాది విద్యార్ధులకు ఉపాధికి కారణ మైంది .దానికి అను బంధం గా ఉన్న ఐ.టి.ఐ.చిన్న తరగతులు చదివి చదువు కోన సాగించ లేని వారికి ఆసరా గా ఉంది .చదివి పాస్ అయిన వారందరికీ ఎక్కడో అక్కడ ఉద్యోగాలు గ్యారంటీ గా లభించేవి .అందుకే ఆ రెండు కాలేజీలు ఉయ్యూరు కే కాదు చుట్టూ ప్రక్కల గ్రామాలకే కాదు దూరం గా ఉన్న జిల్ల్లాల   వారికీ కూడా ఆకర్షణీయం అయాయి . ఆ నాడు ఉయ్యూరు చదువుల హబ్ అయింది అంటే ఆశ్చర్యం లేదు  .వీటిని ఏర్పాటు చేసి ప్రభుత్వం తన దూర దృష్టిని తెలియ జేశింది .గ్రామీణ వాతా వరణం లో అతి తక్కువ ఖర్చు తో విద్య నేర్వటం ఒక ఆదర్శ ప్రాయం అయి అందుబాటు లోకి వచ్చింది .ఊరంతా కాకి లాగూలు తెల్ల చొక్కాల విద్యా ర్దులతో కళ కళ లాడి పోయేది .స్థానికం గా ఉన్న కే.సి.పి.షుగర్ ఫాక్టరి లో ఉద్యోగాలకు అవకాశాలూ లభించటం దీని విజయానికి కారణం కూడా అయింది .మంచి విద్యా బోధనా తో ,క్రమశిక్షణ గల విద్యా ర్దులతో,అనుభవం కలలెక్చరర్ల తో  కావలసిన సౌకర్యాల తో వీటిని పర్య వేక్షించి ఉత్తమ విద్యార్ధులను తీర్చి దిద్దే సంకల్పం ఉన్న ప్రిన్సి పాల్సు ఉండటం తో కళా శాల మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది .మేము హిందూ పురం నుండి1951 లో ఉయ్యూరు వచ్చేసరికి దాని వైభవం వర్ణించ టానికి వీలు లే నంత గొప్ప గా ఉండేది .నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను చూసిన ముగ్గురు ప్రిన్సిపాల్సు దాన్ని తీర్చి దిద్దిన తీ రు ను జ్ఞాపకం చేసుకోవటమే నేను చేస్తున్నది .
                   శ్రీ వేపా కృష్ణ మూర్తి 
అసలైన ఆంగ్ల దొర లాగా సూటూ, బూటూ, టై ,టోపీ తో శ్రీ వేపా కృష్ణ మూర్తి గారు ఉండే వారు .ఎర్రటి ఎరుపు రంగు ఆదొరతనానికి మరింత వన్నె తెచ్చేది .దీనికి తోడు నోటి లో దొరల పైపు కూడా .కళ్ళకు నల్లద్దాల కళ్ళ జోడు .ఇదీ ఆయన అవతారం .ఆయన్ను తెలుగు వాడు అంటే ఎవరికి నమ్మకం ఉండేది కాదు .ఆయన ఇంగ్లీష్ తప్ప తెలుగు లో మాట్లాడి నట్లు కూడా ఎవరికీ తెలీదేమో .ఆ పర్స నాలిటీ  ని చూస్తె అందరికి వణుకే .ఆయన రాయ ప్రోలు కోదండ రామయ్య గారింట్లో మా ప్రక్క బజార్లో అద్దె కు ఉన్నట్లు జ్ఞాపకం .ఆయన కాలేజీ కి నడిచి వెళ్ళే వాడు .ఆయన వెడుతున్నా ,వస్తున్నా దారిలో ఒక్క విద్యార్ధి కూడా కనీ పించే వాడు కాదు .అందరు అంతకు ముందే కాలేజి కి వెళ్లి పోయే వారు .ఆయన చూస్తుండగా కాలేజి కి విద్యార్ధి వెళ్లటం ఎవరూ చూసి ఉండరేమో .ఊళ్ళో వారు కూడా ఆయన బజార్లో నడుస్తుంటే ఎదురు పడ టానికి జంకే వారు .అంత ఐరన్ డిసిప్లిన్ ఉండేది ఆయన కాలం లో .ఆయన కాలేజి కి చేరిన తర్వాతే విద్యార్ధులు ఫీల్డు వర్కు కు బయటికి వచ్చే వారు .సివిల్ విద్యార్ధులు స్టాఫ్,లెవెల్ ఉన్న స్టాండు లతో రోడ్లను సర్వ్ చేసే వారు .అయినా కూడా రోడ్ల మీద  వాళ్ళంతా చాలా క్రమ శిక్షణ తో ప్ర వర్తించే వారు .వాళ్ళు చేసే పని ఏమిటో మాకు తెలీక పోయినా చాలా ముచ్చట గా ఉండేది చూస్తుంటే . కాలేజి లో అన్ని డిపార్ట్ మెంట్ల లోను సమర్ధు లైన లెక్చరర్లు ఉండే వారు .వారి బోధనా విధానాన్ని విద్యార్ధులు మెచ్చుకోవటం బాగా గుర్తు .ఆచారి గారనే డ్రాయింగ్ టీచర్ ఉండే వారు .నల్ల గా ఉండే వారు .కాని అద్భుత మైన కళ ను ప్రదర్శించే వారు .విద్యార్ధుల్లో డిసైన్లను వేయించటం లో గొప్ప పేరుండేది ఆయనకు .దీనికి తోడు గొప్ప కళా కారుడు కూడా .వార్షి కొత్సవ సమయాలల్లో విద్యార్ధులతో మంచి నాటకాలను వేయించే వారు .ఆయన ఇచ్చే శిక్షణ ముచ్చట గా ఉండేది .అలాగే ఆటల విషయం లో కూడా దానికి సంబంధించిన వారు శ్రద్ధ తీసుకొనే వారు .”చామలి ”అని పిలువా బడే విశాల మైన ఆట స్థలం  ఆడటానికి అనువు గా ఉండేది .అప్పటికి క్రికెట్ కు ప్రాధాన్యత లేదు .వాలీ బాల్, బాడ్ మింటన్ ,చెడుగుడు బాగా ఆడే వాళ్ళు .పరుగు పందాలు ,డిస్కస్ త్రో ,జావేలీన్ మొదలైన వాటిలో విద్యార్ధులు ఆడుతుంటే వెళ్లి చూస్తూ ఉండే వాళ్ళం .కృష్ణ మూర్తి గారి క్రమ శిక్షణ వల్ల  కాలేజి చాలా అభి వృద్ధి సాధించింది .
                  శ్రీ పి.హెచ్.యెన్.బి. శర్మ
వేపా కృష్ణ మూర్తి గారు ఎన్నేళ్ళు పని చేశారో నాకు తెలీదు ,ఆయన అక్కడే రిటైర్ అయారో ఇంకెక్కడి కైనా వెళ్ళారో కూడా నాకు తేలేదు కాని ఆయన తర్వాతా వచ్చిన పి.హెచ్.యెన్.బి.శర్మ గారు మాత్రం జ్ఞాపకం ఉన్నారు .ఆయన దొర అయితే ఈయన ఆంధ్రత్వం తో ఉన్న మనిషి లాగా కనీ పించే వాడు .  సుమారైన విగ్రహం .సూటు ,కోటు మామూలే .టోపీ లేదు . నవ్వు మొఖం తో ఉండే వారు .భారీ విగ్రహం కాదు కాని ఆకర్షణీయ మైన మనిషి .వయసుకు తగ్గ శరీరం .వేపా వారంతటి తీవ్రం గా కానీ పించే వారు కాదు .కాని ఈయన కాలం లో కూడా క్రమశిక్షణ తోనే విద్యార్ధులు ఉండే వారు .బయట తిరగటం ఉండేది కాదు .సర్వే  చేసి నప్పుడు తప్ప ఎవరు బయట కనిపించే వారు .పసుపు రంగు దేహ చ్చాయ .వీరి కాలం లో కాలేజి లో ఇది వరకంటే సాహిత్య ,సాంస్కృతిక కార్య క్రమాలు ఎక్కు వ గా జరగటం జ్ఞాపకం .కవులను కళా కారులను పిలిపించి వారితో కార్య క్రమాలు నిర్వహించే వారు .వార్షికోత్సవాలను ఘనం గా జరి పే వారు .దానికి ముందు విద్యా ర్ధులకు అన్ని విషయాలలో పోటీలు నిర్వ హించే వారు .తెలుగు లో వక్తృత్వం ,వ్యాస రచన పోటీలు పెట్టె వారు .మా నాన్న గారు మృత్యుంజయ శాస్త్రి గారిని ఆహ్వానించి వాటికి న్యాయ నిర్ణేత గా వ్యవ హరింప జేసే వారు .నాటకాలను నేర్పి విద్యార్ధులతో వేయించే వారు .ఆ నాటి విద్యార్ధి నటుల్లో నాకు బాగా జ్ఞాపకం ఉన్న వారు నారాయణ మూర్తి ,సుబ్బ రాయ శార్మలున్నారు .ఆటల పోటీలను ఘనం గా నిర్వహించే వారు .అన్నిటికీ బహుమతులంద జేసే వారు .వీటి నన్నిటిని ఆచారి మాస్టారు ,వెంకటేశ్వర రావు గారు నిర్వహించే వారు .గ్రౌండ్ లో విద్యార్ధులు ఆడు కుంటుంటే భలే గా ఉండేది .చూస్తూ ఆనందించే వాళ్ళం .సాయంకాలాల్లో వెళ్లి చూస్తూ ఉండే వాళ్ళం .శర్మ గారికి మా నాన్న గారికి దోస్తీ బాగా ఉండేది .ఆయన చోడ వరపు చంద్ర శేఖర రావు గారింట్లో అద్దె కు ఉన్నట్లు జ్ఞాపకం .శర్మ గారి పాలన లో కళా శాల అన్ని రంగాలలో ముందుకు దూసుకు పోయి నట్లు గుర్తు .
ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుకు వస్తున్నాయి .అవి చెప్పాలి .కాలేజి లో చదివే బ్రాహ్మణ విద్యార్ధులు కొందరు వారాలు చేసుకొని చది వే వారు .మా నాన్న గారికి చదువు కొనే విద్యార్ధులు అంటే మహా ఇష్టం .వారి చదువు ఆటంకం లేకుండా సాగి పోవాలని వారు కోరుకొనే వారు .కనుక వారానికి ఎంత మంది అయినా విద్యార్ధులకు వారాలు ఇచ్చే వారు .రోజుకు ఒక్కో సారి ఇద్దరు ,ముగ్గురు వచ్చి రెండు పూటలా భోజనం చేసి వెళ్ళే వారు .ముందు రోజే వచ్చి ”రేపు మీ ఇంట్లో నాకు వారం ఉందండి ”అని మర్యాద గా వచ్చి చెప్పే వారు .వారి కాలేజి సమయానికి తగ్గట్లు మా అమ్మ వంట చేసి రెడీ గా ఉండేది. వారు వచ్చి హాయిగా తృప్తిగా భోజనం చేసి వెళ్ళే వారు .వెళ్ళే టప్పుడు కృతజ్ఞత గా నమస్కారం చేసి వెళ్ళే వారు .మమ్మల్ని తమ తమ్ముళ్ళ లాగా మా అమ్మా నాన్న లను వారి తలిదండ్రులు గా భావించి గౌరవించే వారు .మాకు తెలియని లెక్కలు సైన్స్ మొదలైన సబ్జెక్టు లను అందులో మాకు వచ్చిన అను మానాలను తీర్చే వారు .మా కుటుంబ సభ్యులు గా మసలే వారు .అదొక సంతృప్తి గా ఉండేది మాకు .మూడేళ్ళు చదువుకొని ,నిర్విఘ్నం గా వారాలు చేసుకొని తిని తమ చదువులను బాగాచదువు కొంటూ అభ్యుదయం సాధించే వారు .  .జీవితం లో వారు ఉద్యోగం లో స్తిర పడినతర్వాత వీలున్న ప్పుడు ఎప్పు డైనా వచ్చి పలకరించి కృతజ్ఞతలను తెలియ జెప్పే వారు .ఆది వార సంస్కారం .మేము చేసింది గృహస్తులు గా మా ధర్మం నేర వేర్చటం .అంతే . ఇదో వింత అనుభూతి .మా నాన్న గారి తర్వాత మాఅమ్మ ,ఆ తర్వాత నేనూ   ఆ సంప్రదాయాన్ని కోన సాగించాం .మా మామయ్య గంగయ్య గారింట్లో ,చోడవరపు వారింట్లో వారణాసి వారింట్లో కోలచల వారింట్లో ఈ వారాలు ఇచ్చి విద్యార్ధుల చదువులకు ప్రోత్స హించారు .
కాలేజీ కాలేజి సమయం లోనే కాక గంట గంటకు గంటలు కొట్టే వారు .రాత్రి తెల్లార్లు కొట్టే వారు .అదే అందరికి సమయం తెలుసు కోవా టానికి ఉప యోగ పడేది .ఐ.టి.ఐ.వాళ్ళ సుత్తి కొట్టుడు ,మెకా నికల్ వాళ్ళ యంత్రాల చప్పుడు ,సివిల్ వాళ్ళ సర్వ్ లతో కాలేజీ పరిసరాలన్నీ ఆకర్షణీయం గా ఉండేవి .అప్పుడు ఐ;టి.ఐ.నిపెద్దగా గౌరవం గా చూసే వారు కాదు .సుత్తి కొట్టుడు అనే దానికి పేరు .అంత తేలిగ్గా  చూసే వారు .కాని అదే ఆ తర్వాత ఎంతో విలువైన కోర్సు గ ఎదిగి పోయింది .
                శ్రీ నరసింహ మూర్తి   
శర్మ గారి తర్వాతా మా నాన్న గారి హిందూ పురం శిష్యుడు నరా సింహ మూర్తి గారు ప్రిన్సి పాల్ గా వచ్చారు .వచ్చాడు అనచ్చు.అంత పరిచయం ఉంది ఆయనతో .హిందూపూర్ లో మా నాన్న గారు హై స్కూల్ లో సీనియర్ తెలుగు పండితులు గా పని చేస్తున్న కాలం లో నరసింహ మూర్తి అక్కడ చదివాడు .మా ఇంటికి దగ్గర లోనే ఉన్న రాఘ వేంద్ర రావు గారి అల్లుడాయన .రావు గారు నాన్న గారి   స్కూల్ లోసెకండరి టీచర్  గా పని చేసే వారు .ఆయన భార్య గోదా వరమ్మ గారు మునిసి పాలిటీ మెంబర్ కూడా .మంచి పలుకు బడి ఉన్న ఆమె .వారి కుమార్తె సునంద మాతో పాటు ఆడుకోనేది .మా రెండో అక్కయ్య కు క్లాస్ మేట్ కూడా .ఆ సునంద భర్తే నర సింహ మూర్తి .మా నాన్న గారంటే విప రీత మైన గౌరవం .మేము కూడా అక్కడ ఆయన తో చనువు గా ఉండే వాళ్ళం .మమ్మల్ని ఒల్లో  కూర్చో బెట్టుకొని కబుర్లు చెప్పే వాడు .మేము హిందూ పురం నుండి ఉయ్యూరు వచ్చినా గోదావరమ్మ ,వాళ్ళింటి ప్రక్క ఉన్న అన్న పూర్ణమ్మ గార్లు ఉయ్యూరు వచ్చ చూసి వెళ్లారు .మూర్తి సివిల్ పాసై నంద్యాలలో ప్రిన్సి పాల్ గా పని చేసి ఉయ్యూరు కు బదిలీ అయి వచ్చారు .రావటం రావటమే మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు భార్యా భర్తలు .మా ఇంట్లో భోజనాలు చేశారు .అద్దె కు ఇల్లు తీసుకొన్న తర్వాత మమ్మల్ని అందర్ని వాళ్ళింటికి భోజనాలకు పిలిచారు .మా నాన్న గారిని వీలున్న ప్పు డల్లా  వచ్చి కలిసి వెళ్ళే వాడు మూర్తి .కాలేజి లో జరిగే సాహిత్య సాంస్కృతిక కార్య క్రమాలను నాన్న గారి పెద్దరికం తో జరిపించే వాడు .అప్పుడే స్థానం నర సింహా రావు గారిని ఆహ్వానించి ఆయనతో సత్య భామ పాత్రను వేయించారని గుర్తు .విద్యార్ధుల లో బాగా పాటలు పాడే వారుండే వారు .అన్ని రంగాలలో కళా శాల అభి వృద్ధి లోకి వచ్చింది .మూర్తి కూడా క్రమ శిక్షణ కు అధిక ప్రాధాన్యత నిచ్చి ,చదువు శిక్షణ విషయం లో అన్ని జాగ్రత్తలు తీసుకొన్నాడు .ఇలా ముగ్గురు ప్రిన్సిపాళ్ళు ఉయ్యూరు కాలేజిని తీర్చి దిద్ది,దాని అభి వృద్ధికి కారకు లైనారు .వారి సేవలు చిరస్మరణీయం .
ఇంత అభ్యుదయం సాధించిన కాలేజి ఒక్క సరిగా కుదేలు మంది .రాజకీయ నాయకుల స్వార్ధం వల్ల ఉయ్యూరు లో ఉన్న కాలేజిని విజయ వాడకు సాగ నమ్పారు .దీనికోసం చేతులు కాలిన తర్వాతా ఆకు లు పట్టుకొన్నట్లు గా సమ్మెలు ఆందోళనలు నిరసనలు స్తానిక ప్రజలు చేశారు కాని ఫలిత లేక పోయింది .ఉయ్యూరు కుదగ్గర లోని కనుమూరు వాస్తవ్యులు సోషలిస్టు భావాల వ్యక్తీ రైతు శ్రీ కొల్లి రామ కుమార వర్మ గారు నిరవధిక నిరా హార దీక్ష ఛే బట్టారు .దాదాపు యాభై రోజులకు పైగా నే వారు దీక్ష చేసినట్లు జ్ఞాపకం .అప్పటి నూజివీడు కుమారా రాజా ఏం.ఆర్ .అప్పా రావు గారు వచ్చి స్వయం గా చూసి విషయాలు తెలుసు కొన్నా ఏమీ ప్రయోజనం కన్పించలేదు .మళ్ళీ కాలేజి ఉయ్యురుకు వచ్చే ఆశ లేదని తేలి పోయింది .మన్నే శివ రావు వంటి వారు వర్మ గారికి నచ్చ చెప్పి దీక్షను విర మింప జేసి నట్లు గుర్తు .కాని ఈ దీక్ష తో వర్మ గారి ఆరోగ్యం పూర్తీ గా దెబ్బ తిన్నది .చాలా సార్లు ఆయన్ను చూశాను .గడ్డం పెంచి కని పిస్తూండే వారు .ఖద్దరు పైజమా లాల్చీ ఆయన ధరించే వారు .ఒక వెలుగు వెలిగిన ఉయ్యూరు పాలిటెక్నిక్ కాలేజి చీకటి లో చాలా కాలం మగ్గింది .ఆ తర్వాతా చాలా ఏళ్లకు కే.సి.పి..రైతులు అందరు కలిసి ఆ స్థలం లో డిగ్రీ కాలేజి ఏర్పాటుకు కృషి చేశారు .ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులతో మళ్ళీ ఆ ప్రాంగణం అంతా విద్యా వైభవం తో వెలిగి పోతోంది .శ్రీ రాయుడు గారు ప్రిన్సి పాల్ గా ఉన్న కాలం లో కాలేజి ఇన్ఫ్రా స్ట్రక్చర్ బాగా పెరిగింది .నాతో రాయుడు గారు కాలేజి లో డిగ్రీ విద్యార్ధులకు ఇన్నోవేటివ్ లెసన్స్ మూడేళ్ళు చెప్పించారు .మా నాన్న గారి వార సత్వం నాకూ వచ్చి కాలేజి తో అనుబంధం పెరిగింది ”.సరస భారతి” కార్య క్రమాలను రాయుడి గారి సహకారం తో కాలేజి లో విద్యార్ధుల కోసం నిర్వ హించాం .రవీంద్ర ,గురజాడ ల 150 జయంతిని వైభవం గా నిర్వ హించి విద్యార్ధులలో అవగాహన కల్పించాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12-9-12-కాంప్–అమెరికా .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.