అణు కేంద్రా లంటే- గుండెల మీద నిప్పుల కుంపట్లే
అన్ని రకాల విద్యుత్తు కన్నా అణు విద్యుత్తు చవక అనే అభి ప్రాయం తో అణు రియాక్టర్లను ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసి మురిసి పోతున్నారు .చేర్నోబిల్ మొదలైన ప్రమాదాలను గమనించి కూడా వ్యామోహం పెరుగుతూనే ఉంది కాని తగ్గటం లేడు .ప్రజలు సాంఘిక సేవా కార్య కర్తలు శాస్త్ర వేత్తలు నెత్తిన నోరెట్టు కొని గగ్గోలు పేడు తుంటే ఇప్పుడిప్పుడే కొంత ఆలోచన చేసి వెనక్కి తగ్గుతున్నారు .సునామీ ల ఉపద్రవాల వల్ల రియాక్టర్ల భవిషత్తు మరీ దారుణం గా ఉంది .ఒక రకం గా చెప్పా లంటే అణు రియాక్తర్లంటే గుండెల మీద మండుతున్న నిప్పుల కుమ్పట్లే .
ఎన్నో అధ్యయనాల తర్వాతా తేలిందేమి టంటే అణు విద్యుత్ చాలా ఖర్చు తో కూడింది అనీ .దాన్ని భరించటం కష్టం అనీ .ఇవి టెర్ర రిస్తులకు లక్ష్యాలు అయితే మరీ ప్రమాదం.అవి పేలితే జెనెటిక్ వ్యాధులు ప్రబలి దీర్ఘ రోగాల పాలై జన జీవితం చిద్రమవుతుంది.రియాక్తర్లను రక్షించే వ్యవస్థ చాలా బలహీనం గానే ఉందని బాగా అభి వృద్ధి చెందినఅమెరికా లోను అదే పరిస్తితి ఉందని తెలుస్తోంది ..న్యూక్లియర్ పవర్ ప్లాంటులు అంటే అటామిక్ బాంబు ఫాక్తరీలే అని గ్రహించటం లేదు . 1000మెగా వాట్ సామర్ధ్యం ఉన్న రియాక్టర్ 500పౌన్ల ప్లుటోనియం ను సంవత్స రానికి ఉత్పత్తి చేస్తుంది .ఆటం బాంబు కు పది పౌండ్ల ప్లుటోనియం ఇంధనం గా సరి పోతుంది .ఒక చిన్న ఆటం బాంబు ఒక పెద్ద సిటీ ని విధ్వంసం చేసే సమర్ధత కలిగి ఉంది .కనుక నిత్యం ప్రమాదం అంచున ఉన్నట్లే .
2005లో వచ్చిన ”గ్రీన్ పీస్ ”రిపోర్ట్ ప్రకారం సోలార్ శక్తి చాలా చవక గా లభిస్తోంది ..వంద మిలియన్ల జనానికి సరిపడ సోలార్ శక్తిని విని యోగించుకొనే ప్రాజెక్టులున్నాయి వాటి వల్ల 54 వేల మంది జనానికి ఉపాధి లభిస్తుంది .ఖర్చు కేవలం ఇరవై బిలియన్లె .బ్రిటన్ లో మరైన్ ఎనెర్జీ తో ఇరవై శాతం జనం లాభ పడుతున్నారు కాలుష్య వాయువుల ప్రమాదం లేదు .అలాగే మిగిలిన పునరుత్పాదక శక్తి కల ఇంధనాలను ఉపయోగించుకొని అణుభారాన్ని వదిలించు కోవాలని నిపుణుల సలహా .అమెరికా లో ఆయిల్ బిల్డింగ్ లకు ఉష్ణాన్ని కల్పించ టానికి వాడుతున్నారు .దీన్ని ఎలెక్ట్రిక్ పవర్ గ్రిడ్ లకు పవర్ కోసం వాడటం లేదు .ఆయిల్ తో రెండు శాతం మాత్రమె పవర్ ఉత్పత్తి అవుతోంది .
1980-85కొత్త అణు రియాక్తర్లేమీ అమెరికా లో రాలేదు .రియాక్టర్ నిర్మాణానికి బోలెడు ఇనుము ఉక్కు సిమెంట్ అవసరం అయి తడిసి మోపెడవుతోంది .దానికి తగిన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయటం కష్టమైంది .రియాక్టర్ ను చల్ల బరచ టానికి ఉప యోగించే నీరు త్రిటియం ,రేడియో యాక్టివ్ హైడ్రోజెన్ కార్బన్ 14వల్ల కలుషితమై పోతోంది .ఇవి వాతావరణం లోకి ప్రవేశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి .ఈ నీరు సముద్ర జలాల్లో కలిస్తే ,తాగు నీటిలో చేరితే చెప్ప లేని ఉపద్రవమే .ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం న్యూక్లియర్ ఎనెర్జీ తయారవటానికి కిలో వాట్ అవార్ కు సుమారు ఒకటిముప్పావు సెంట్లు అవుతుందని .గాస్ తో తయారవుతే సుమారు అయిదున్నర సెంట్లు అని .కాని ఇవి నిజమైన లెక్కలు కావని తేలింది న్యూక్లియర్ ఎనెర్జీ కి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి చాలా ఎక్కువ .ఆది లెక్కలో చూపించరు .
d.n.a నిర్మాణం పైన కూడా న్యూక్లియర్ ప్లాంట్ ప్రభావం పడుతోందని అధ్యన నివేదికలు తెల్పుతున్నాయి. ముఖ్యం గాకళ్ళకు హాని కల్గు తోంది .రేడియో ఆక్టివ్ waste నుసరిగ్గా భద్ర పరచక పోతే దాని వల్ల వచ్చే నష్టం అంతా ఇంతా కాదంటున్నారు .పునరుత్పత్తి చేసే జీన్ల పై ప్రభావం చూపి జెనెటిక్ వ్యాధులు సంక్రమిస్తాయని హెచ్చ రిస్తున్నారు .iodine 131అనేది పాలలో చేరి థైరాయిడ్ గ్రంధికి చేటు తెస్తుందట .దీన్ని రక్తం స్పంజి లాగా పీల్చుకొంతుంది .అలాగే స్ట్రాన్షియం 90ఎముకలలోకి చేరి బోన్ కేన్సర్ కలిగిస్తుంది .లుకేమియా కూడా వచ్చి బాధ పెడుతుంది సీజియం 137కండరాలలో చేరి కందర కాన్సర్ కు కారణమవుతుంది .
సునామీ లు భూ కంపాలు వస్తే -ఇవి సముద్రాల దగ్గరే నిర్మింప బడి ఉంటాయి కనుక మరీ ప్రమాదం .ఆ సమయాలలో రేడియో యాక్టివ్ ఉద్గారాలు సముద్రం పాలైతే కొన్ని శతాబ్దాల పాటు మానవ జంతు జీవ వినాశనం జరుగు తుందని హెచ్చరిస్తున్నారు .అవి మెల్ట డౌన్ ఆయె తప్పుడు రక్షణ సరిగ్గా లేకుంటే ప్రమాదం ముంచుకొని వస్తుంది. దాన్నిఅరికట్టటం అసాధ్యం అవుతుంది . .చుట్ట ప్రక్కల వందలాది మైళ్ళు ఈ ప్రభావానికి గురి అవుతాయి .అక్కడి జీవావరణం అంతా నాశనమే .రియాక్టర్ లలో ”స్పెంట్ ఫ్యుయేల్ ”మరీ డేంజర్ .వీటిలో హై లెవెల్ రేడియో యాక్టివ్ వేష్టుఉంటుంది .అమెరికా లో103 కంమేర్శియాల్ రియాక్తర్లున్నాయి .అవి 65 చోట్ల 31రాష్ట్రాలలో ఉన్నాయి .వీటిలో 34boi ling waatar riaactor” .లు .69ప్రేజరైజేడ్ వాటర్ రియా కటార్లు 14,కమ్మర్శియాల్ రియాక్టర్లు .వీటిని ఈ మధ్యనే మూసే శారు .వీటి కూలింగ్ వల్ల వచ్చే వేష్టు నుఎక్కడ నిల్వ చేయాలో తెలీక చాలా కాలం బుర్ర పగల కొట్టు కొంది ప్రభుత్వం .చివరికి జిమ్మీ కార్టర్ ప్రేసిడేన్సి లో నెవెడా లోని యూకా మౌంటేన్ లో రంధ్రం చేసి అక్కడికి తర లించాలని నిర్ణయించారు .అక్కడి స్తానికులు అడ్డు చెప్పారు .దానితో ఆగి పోయింది వీటిని రీ పాక్ చేసే టప్పుడైనా ఓవర పాక్ జరిగినప్పుడైనా పెద్ద ప్రమాదాలే జరిగి పోతాయని హెచ్చరిస్తున్నారు .స్పెంట్ ఫ్యుఎల్ పూల్ చాలా విధ్వంసాన్ని సృష్టిస్తుంది .ఇందులో యాభై శాతం రేడియో యాక్టివ్ పదార్ధాలు పదేళ్ళ దాకా సజీవం గా ఉండేవి ఉంటాయట .ఇవి చేసే అనర్ధం లెక్కకు మించిందే .కనుక ఇప్పుడు ప్లాంటుల దగ్గరే కొంచెం ఎత్తు మీద వీటిని నిర్మించి రక్షణ చర్యలు తీసుకొంటున్నారు .
ఈ రియాక్తర్లు నాలుగు దశలలో నిర్మించారు .ఒక దానికంటే ఒకటి ఖర్చు పెంచిందే కాని తగ్గించలేదు అవే జెనెరేషన్ వన్ ,టు, త్రీ ఫోర్ లు .ఇవన్నీ సంతృప్తిని ఇవ్వక బ్రీడర్ రియాక్టర్ లను తయారు చేశారు .వీటిని లిక్విడ్ సోడియం తో చల్ల బరుస్తున్నారు .కాని ఫాస్ట న్యూట్రాన్లను తగ్గించ లేక పోతోంది .అంతేకాక సోడియం కు అంటుకొని మండే స్వభావం బాగా ఉంది .అదీ అనర్ధమే .నాల్గవ జెనెరేషన్ రియాక్టర్ లు చాలా ఖరీదైనవి .వీటి నిర్వహణ కు ఏదేశం లోను నిపుణులు లేరు .నిర్మాణం కూడా కష్టం, క్లిష్టం అవు తోంది .వీటి నిర్మాణం పూర్తీ కావటానికి ఇంకా పది హేను నుంచి ముప్ఫై అయిదేళ్ళు పట్టవచ్చు అని అంచనా .ఆర్ధికం గా కష్ట సాధ్యమే .అభి వృద్ధి చెందు తున్న దేశాలకు మరీ భారం .
న్యూక్లియర్ ఆయుధాలు కలిగిన దేశాలను”rogue nations” అంటారు .అమెరికా బ్రిటన్ రష్యా ,ఫ్రాన్స్ ,చైనా ,ఇండియా ,పాక్ ,ఇస్రాయిల్ ఉత్తర కొరియా ఇరాన్ లు ఈ జాబితా లో చేరాయి .పోటీ తత్త్వం పెరిగి పక్క దేశాలకు పక్కలో బల్లెం గా ఉంటున్నాయి .ఏదేశమైనా మొండిగా అణ్వాయుధం ప్రయోగిస్తే వినాశనమే .ఆపే శక్తి ఉండదు . .కనుక అణు శక్తి చవక కాదని నిత్య ప్రమాద భరితమని,రియాక్టర్లను ప్రోత్స హించ రాదనీ అందరు తెలుసు కోవాలి .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –14-9-12-కాంప్–అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com
వీక్షకులు
- 928,474 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం.4వ భాగం.17.8.22
- శ్రీమద్ధయ వదన (శ్రీమత్ హయ వదన )సంస్కృత శతకం
- హైదర్ జంగ్ ,యయాతి,విశ్వామిత్ర నాటక తులసీ జలంధర ,మయసభ ఏక పాత్రాభినయంఫేం ,’’చిల్డ్రన్ నటశిక్షణాలయ’’స్థాపకుడు,హంస అవార్డీ –ఆచంట వెంకటరత్నం నాయుడు
- అకళ౦క దేశభక్తుడు గాంధేయవాది ,మహోన్నత మానవతావాది ,ఆంధ్రా ఏకైక గదర్ వీరుడు ,కధకుడు చిత్రకారుడు,నేనూ నాదేశం రచయిత –దరిశి చెంచయ్య
- త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం -3(చివరిభాగం)
- భారతీ నిరుక్తి .34వ భాగం.17.8.22
- సరోజినీ నాయుడు భర్త ,,నిజాం సైన్య వైద్యాధికారి ,వైద్య సంఘ ఉపాధ్యక్షుడు –డా.ముత్యాల గోవింద రాజులు నాయుడు
- శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారి జీవితం 3వ భాగం
- త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం -2
- భారతీ నిరుక్తి .33వ భాగం.16.8.22
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (37)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,795)
- సమీక్ష (1,155)
- ప్రవచనం (8)
- ఫేస్బుక్ (76)
- మహానుభావులు (301)
- ముళ్ళపూడి & బాపు (59)
- రచనలు (966)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (329)
- సమయం – సందర్భం (815)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (490)
- సినిమా (322)
- సేకరణలు (313)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు