జన వేమన –26
వేమన కవిత్వం లో మానవతా విలువలు
మానవుడు వర్గం ,కులం ఉచ్చు లో చిక్కు కొని నిత్యం బతుకుతుంటాడు .దీన్ని అధిగామించలేని స్తితి .జాతీయ భావం అతనికి సాధ్యం కావటం లేడు .మానవ పతనానికి సంఘమే కారణం .కనుక కొత్త సాంఘిక జీవితానికి పునాదులు పడాలి .సంఘాన్ని మార్చాలి అని వేమన తల చాడు .అప్పుడే వ్యక్తీ చైతన్యం వస్తుంది .అతని స్వాతంత్రానికి అడ్డు పడ కూడదు .మాన వ జీవిత స్వాతంత్రమే అతని వజ్ర కవచం .దీనికి వర్గ కులాల భావం పోవాలి .”సాను జాత మయ్యే సజ్కల కులము –హెచ్చు తగ్గు మాట లెల్ల లేరున్గా వచ్చు ”అని ప్రశ్న ను సంధించాడు .అందుకే ;;ఎరుక గలుగు మనుజుడే జాతి కల వాడు ”అని తీర్మానించాడు .దీని పై ఆవేశం తో ”కూడదేమి చేసేకుల మేమి చేసెను -భూమి ఏమి చేసే బొంది కత్తి -నరుడు పాడేది పాట్లు నగు బాట్లు చూడగా ”అన్నాడు .కులం ,గోత్రం ,విద్య చేత విర్ర వీగే వారంతా ”పసిడి గల్గు వాని బానిస కొడుకులు ”అని తిట్టే శాడు .సంపద ఉన్న వ్యక్తీ ఎంత లోప భూయిష్టు డైనా ,వాడికి సంఘం లో అతి గౌరవం ఉంటుంది .కులం కంటే ధనం బలీయ మై పోయింది .”కులము కన్నా మిగుల కలిమి ప్రధానంబు ”అన్నాడు .”అందరోకత గల ,యన్న దమ్ము లే గదా ”అని సమానత్వాన్ని చెప్పాడు .మానవ గౌరవం సమానత్వం .ఆది గాలిలో కలిసి పోరాడు .ఆ సమానత్వం రావాలి అంటే ”ఉర్వి వారి కెల్లా నొక్క కంచము పెట్టి –పొట్టు గుడిపి ,కులము పోలియ జేసి -తలను చెయ్యి బెట్టి తగు నమ్మ జెప్పరా ”అని చాప కూడు తింటే కాని అంతా ఒక్కటే నాన్న భావం రాదు అని తేల్చేశాడు .ఇవాళ మన రాజ కీయ నాయకుల ప్రచార ఆర్భాటాలలో ఇలా కతుకు తున్నారని మనం చూస్తూనే ఉన్నామ్.సమానత్వం చూపిస్తున్నట్లు నటన .అంతే .హృదయం లోంచి మార్పు రావాలి .నినాదాల వాళ్ళ ,శుష్క విధానాల వల్ల రాదు .మనస్పూర్తి గా ఆచరణ లోకి తేవాలి .అని ఆనాడే వేమన చెప్పాడు .ఆయన చెప్పింది పరమ సామాజిక సత్యం ,సూత్రం .
అస్పృశ్యత ను అసహ్యిన్చుకొన్నాడు వేమన .”ముట్టు ముట్టనుచు ముట్ట రాదందురు –ముట్టు కుదిరి ఏమి మూల మేమి ?-నవ బిలము మురికి నరుల కందరకును –పుట్ట గానే పుట్టు ముట్టుపుటక భేదం తో సంబంధం లేని మానవ పవిత్రత ను వేమన కోరాడు .శూద్రుడు ,అని ,అస్పృశ్యుడు అని వేరు చేస్తే వేదన చెందాడు వేమన .మానవుడి లో భగవద్విషయ మైన తేజస్సు ఉంటె ,అందరి మాన వుల్లోను ఉన్నట్లే కదా అని తెలియ జేశాడు .అలాంటి మాల మాదిగ లలో ”వాని లోన బల్కు వాని కులంబేది ?”అని శంకరా చార్యుల వారిని మాల వాని రూపం లో ఉన్న శివుడు ప్రశ్నించి నట్లు ప్రశ్నించి -మనల్ని నిరుత్తరులను చేశాడు .”మాట మార్చిన వాడే మాల ”అని నిర్ధారించాడు .”మాట నిలుప లేని మనుజుండు చండాలుడు ”అని తీర్పు ఇచ్చాడు .ఇంతేనా ?”వాక్సుద్ధి లేని వాడు చండాలుడని ,ఆత్మ మీద మనసు నిలిపిన వాడు మాల కాదు అని ,”మనసు నిల్ప కున్న మహి మీద మాలడు ”అనీ తేల్చాడు .కనుక మానవుడి గా పుట్టటమే కాదు ,తనను తాను మానవుడి గా సంస్కరించు కోవాలి .ఆత్మ సంస్కారం లో ఉన్న తేడాయే మానవుల మధ్య భేదం .అందుకే ”మంచి గుణము లేక మరి ద్విజు డేట్లగు ?”అని నిల దీశాడు .కులానికంటే గుణానికే ప్రాధాన్యం అని చెప్పాడు .”అరిది గిట్టు వేళ నడుగు ద్విజత్వంబు ”అంటే చచ్చిన తర్వాత కులాలు లేవు ,మతాలు లేవు .మంచి జీవన విధానాలను అను సరించిన వారంతా మానవులే .ఒక్కటే .అదీ” వేమనీయం ”.
జీవిత భ్రాంతి
మానసిక క్రమ శిక్షణ లేకుండా ఆత్మ సంస్కారం రాదు .కర్మ కాండలు ,యజ్న యాగాలు మనిషిని ఒక వైపుకు లాగుతూ ఉంటాయి .వాటిని వదిలి పెట్టె ధైర్యం ఉండదు .అందులో ఏదో విశేషానికి ఆకర్షణ కలుగు తుంది కాని అందులోని మర్మం తెలీదు .కోరికలు ,శకునాలు ,ప్రశ్నలు ఇవన్నీ మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి .మానవ జీవితం లో శరీర తత్వం తో బాటు ఆధ్యాత్మిక తత్త్వం కూడా పెన వేసుకొనే ఉంది .ఆ శక్తిని జాగృతం చేయాలి .శరీరానికి ఆత్మ కు ఉన్న సంబంధాన్ని తెలుసు కోడు మానవుడు .నిజ మైన జ్ఞానం కలిగితే ఉన్నతం గా ప్రవర్తిస్తాడు ఆధ్యాత్మిక ప్రకాశం లేని భౌతిక జీవితం ఎంత గొప్ప దైనా నిరర్ధక మైనదే .ఈ దేహం కోసం ఎన్నో పాట్లు పడతాడు మానవుడు ”.మాయామేయ జగం ఇది” అని గుర్తించడు .”మాయ బ్రతుకు కింత మాయ గప్పిస్తివి ”అని మాయలో పడ వద్దని హెచ్చ రిస్తాడు .సంసారం అంటే నీటి మీద రాత లాంటిది .నేనేమి కావాలి ?అని ప్రశ్నించు కోవాలి .”వచ్చేదిని ,పోయేదిని -చచ్చేదిని గనగ లేక సహజము లను చుం –విచ్చల విడి గా దిరుగుట -చిచ్చున బడి నట్టిమిడుత ర వేమా ”అని విశృంఖలత్వం తగదు అన్నాడు .శాంతిని గురించి ఆలోచించాలి .చిత్త శాంతి చాలా ముఖ్యం .నిత్యా నందం ఉంటె దుఖమే ఉండదు. ”మాయను చెరసాల ,మనసను గొలుసును -భేద మనెడు బొంద బెరసి యుండు –ఇట్టి బద్ధ జీవి కెన్నండు మోక్షంబు “”?అని మాయ చేత బంధింప బడిన వారికి మోక్షం రాదు .ఆ మాయా బంధాన్ని చేదించుకోవాలి అప్పుడే ముక్తి .జీవిత భ్రాంతి పోతే అన్నీ వాటంనంతటికవే సిద్ధిస్తాయి అన్న పరమ సత్యాన్ని చెప్పాడు వేమన .
వీక్షకులు
- 994,264 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
- శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం.
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.6వ భాగం.21.3.23.
- శ్రీ అనుభవానందస్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. వైశేషిక పూర్తి,న్యాయ దర్శనం ప్రారంభం.24వ భాగం.21.3.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,952)
- సమీక్ష (1,307)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (382)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు