జన వేమన –27 ధనం -దరిద్రం

  జన వేమన –27
                                         ధనం -దరిద్రం 

దరిద్రం లో ఉంటె మాన వత ఉండదు అన్న భావానికి వేమన విలువ నివ్వ లేదు .డబ్బు తోనే ఆది లభిస్తుందన టానికి వీలు లేదు కూడా .ధనం కావాల్సిందే’ ఆత్మ సంస్కారం విషయం లో డబ్బుకు విలువ లేదు .ధన వ్యామోహం పతనానికి దారి తీస్తుంది .”ధనము చూచి నపుడే దగులు మనసు -కూలి నప్పుడరయ కుసులేల్ల విరుగును –”అని ధన ప్రభావం చెప్పాడు .ధన స్వభావం నశ్వరమే .మాన వ ప్రయోజనానికి ఉప యోగించే ధనం విలువైనది .”కలిమి కలిగే నేని కరుణ లేకున్డినా –కలిమి  యేల నిలుచు కర్ములకును ”ధనం ఉన్న వాడికి కరుణ ,దయా, సాను భూతి ,సహవేదనా ఉంటేనే ఆధనం రాణిస్తుంది .అర్హులకు ,ఆర్తులకు ధన వంతుని ధనం చేరాలి .ధన వంతుడు ధనానికి trustyమాత్రమె నని గాంధీ గారు టాటా బిర్లా లకు చెప్పిన విషయం మనకు తెలుసు .”దాన మిచ్చు నపుడే తనకు దక్కే ”అంటాడు .ధనాన్ని బడుగు జనానికి అందించ మన్నాడు .అయితే ధనం లేక పోతే మనో నిశ్చలత ఉండదని ఆయనకు తెలుసు .ఆధ్యాత్మిక శక్తి అనే ధనం ముందు లౌకిక ధనం వేల వేల బోతుంది .”ధైర్య మొదవ దేని ధనము లేదు -”అనీ చెప్పాడు .ధనానికి మేలు చేసే శక్తి ఉందనితెలిపాడు .సంపద వల్ల ధన వంతులు చెడి పోతారు .కనుక జాగ్రత్త గా ఉండాలి .
లోకం రీతి తమాషా గా ఉంటుంది .డబ్బున్న వాడు వికారం గా ఉన్నా మన్మధుడి లాగా కనీ పిస్తాడు .దరిద్రుడైతే మదనుడైనా మాల గా చూస్తాడు .అందుకే ”గోనమే (గుణం )ప్రధానం అన్నాడు .”గోనమే మూలము స్త్రీ లకు -మనమే మూలంబు ముక్తి మహిమ కు వేమా ”అన్నాడు .ఇచ్చే వారి వారి సంపద హెచ్చేదే కాని లేమి ఎలా కలుగున్ ?”అని ప్రశ్నిస్తాడు .సద్విని యోగమైన ధనం సంపదను పెంచుతున్దంటాడు .ఎటు వంటి కోరికా లేకుండా ప్రతి ఫలా పేక్ష లేకుండాసద్విని యోగం  చేసే దానం శోభిస్తుంది .మనిషి ధనానికి బానిస కారాదు .”ధన మిచ్చిన మన మెచ్చును -ధన మిచ్చిన దుర్గునంబు మానక హెచ్చున్ –ధన ముడిగిన మన ముడుగును –మన ముడిగిన దుర్గునంబు మానుము వేమా ”అంటాడు .అని ”డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ” సూత్రం చెప్పాడు .మానవుల మధ్య సత్సంధాన కర్త గా డబ్బు ఉపయోగ పడాలి .దానం, ధర్మం ఆముష్మిక ప్రాప్తికి మార్గాలు .ధన సంపద త తో ధర్మ సంపదను దానం చేయాలి .మానవ కళ్యాణమే ధనం ధ్యేయం .గర్వంతో ప్రవర్తిస్తే వినాశనమే .సంపద్గర్వం పతన హేతువు .
ధనం కావాల్సిందే కాని అదే యావ పనికి రాదు .దరిద్రం అవసరాలను చెడ గోడుతుంది.”ధనము లేమి యనెడి దావానలంబు -తనను చేర్చు దరిదాపు జెరచు –ధనము లేమి చూడ దలచనే పాపంబు ”అని బాధ పడతాడు .ఆ పరిస్తితి లో దరిద్రుడికి మంచి మాట చెప్పినా రుచించదు .అతని ఇంద్రియ వ్యాపారం దెబ్బ తింటుంది .అప్పుడతనికి సాయం ,సాను భూతి,దయా  అవసరం .”ధనము లేమి  ఎవరికి తాలికై యుండదు ?”అన్నాడు .వారిని ఉద్ధరించాలని కోరాడు .ధనం లేక పోతే కులం,శుచి   శుభ్రం ఉండవు .గౌరవం రాదు .ఈనిన పులి ళా  ఖాండ్రు ఖాండ్రు మంటాడు . .మానవత్వం చేసిన మహా పాపమే దరిద్రం .”పేదను పొగడగను వాడున్ –కాదని ,శవ మనుచు జూచు గదరా వేమా “‘అంటాడు .దరిద్రుడు శవం తో సమానం గా సంఘం లో చూడ బడు తున్నాడని ఆవేదన చెందు తాడు .”శవం -శివం ”కావాలి .దరిద్రం భిక్షా పాత్రను చేతి కిస్తుంది .భిక్షా వ్రుత్తి కూడా దరిద్రం లా గా హీన మైనదే .కనుక వారి పట్ల ఔదార్యం చూపాలి .”బడుగు నేరుగా లేని ప్రాభావంబడి ఎల ?”ఆకలి కన్నా వారికి అన్నం పెడితే -హరున కర్పితముగా నారా గించు ”అని చెప్పాడు .అదే దారిద్ర నారాయణ సేవ .అలాంటి పనులన్నీ యజ్న యాగాదులంతటి పవిత్ర మైనవి అలాంటి ఫలాన్నే ఇస్తాయి .దారిద్ర సమస్యకు సమాజం బాధ్యత వహించాలి .”పెట్టి నంత ఫలము ,పెక్కుమ్గ్రకుపహతి –జేయ కున్న దాను చెరుప కున్న –పెండ్లి చేయు నట్టి పెద్ద ఫలంబురా ”అని దరిద్రునికి చేసే సేవా ఫలం కన్యా దాన ఫలం కన్నా గోప్పదన్నాడు .దీనులకు దయ తో దాన మిచ్చిన వాడే పుణ్య జనుడన్నాడు .దరిద్రుడిని ఉద్ధరించటానికి అవతలి వాడిని చెయ్యి చాచి అడిగి అయినా సాయం అందించాలి .దిక్కు లేని ప్రపంచపరిత్యాగం మాన వ సంస్కారాన్ని పెంచదు .అలా చేస్తే వారంతా యాచకులే అవుతారు .బాహ్య సన్యాసం వదలి ఆంతరిక సన్యాసం స్వీక రించాలి .ప్రపంచం లోని శాంతిని వదిలి ఎక్కడో ముక్కు మూసుకొని జనానికి దూరం గా ఉండ వద్దు అని చెప్పాడు .”తలలు బోడు లైన తలపులు బోడులా ”అని ప్రశ్నించాడు .
దారిద్ర నిర్మూలనకు ప్రభుత్వం ప్రజలు అందరు కలిసి కట్టు గా పని చేయాలి .లోభగుణాన్ని వదిలి ఆపద్బాన్ధవులు గా ఉండాలి ఉద్ధరణ అందరి ధ్యేయం కావాలి సమాజోద్ధరణకు దారిద్రాన్ని రూపు మాసేట్లు చేయాల్సిందే .సమ సమాజం కావాలి అని చెప్పే సోషలిస్టు భావాలకు వేమన ఆనాడే పునాది వేశాడు .వేమన కంటేపెద్ద  సోష లిస్టు ఉండడు
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ — 14-9-12-కాంప్ –అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

1 Response to జన వేమన –27 ధనం -దరిద్రం

  1. sreedhar అంటున్నారు:

    chala bavundi mee post

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.