మొదటి విమానం మనమే తయారు చేశాం
నేపధ్యం
భారద్వాజ మహర్షి విమాన శాస్త్రాన్ని రాశాడుఅని అందరు చెప్పిన విషయమే .మనకు ఇద్దరు ముగ్గురు భారద్వా జులున్నారు .సప్తరుషు లలో ఒక భరద్వాజుడున్నాడు .అత్రి ,వసిష్ఠ ,విశ్వా మిత్ర ,గౌతమ ,జమదగ్ని ,అగస్త్య భరద్వాజ వారి పేర్లు .ఋగ్వేదం ఆరో మండలం అంతా భారద్వాజునిదే .అందులో 75 మంత్రాలున్నాయి .చక్ర వర్తి భరతుని సమకాలికు డు .రామాయణ కాలం లో ఉన్న భరద్వాజుడు బృహస్పతి మహర్షి కుమారుడు .ఈయనకు ప్రయాగ లో ఒక ఆశ్రమం ఉండేది .ఇప్పటికి అక్కడ ఉంది .శ్రీ రాముడికి, భరతుడికి గొప్ప విందు నిచ్చిన వాడు ఈయనే .ఇందులో యే భరద్వాజుడు రాశాడో కాని వైమానిక .శాస్త్రం ఆయన పేర లోకం లో ఉంది .ఇదే ప్రపంచం లోని విమాన యానానికి దారి చూపింది అని అందరి నమ్మకం .
డాక్టర్ కోలచల సీతా రామయ్య ఉవాచ
కృష్ణా జిల్లా ఉయ్యూరు కు చెందిన కోలాచల సీతా రామయ్య గారు చిన్నప్పుడే రష్యా వెళ్లి అక్కడిఆయిల్ శాస్త్రాన్ని అధ్యయనం చేసి డాక్టరేట్ ను సంపాదించారు .అక్కడి రష్యా ఆమ్మాయినే వివాహం చేసుకొని స్తిర పడి పోయారు .ఆయన్ను గురించి మా చిన్నప్పుడు కధలు గాధలుగా చెప్పుకొనే వారు .చాలా కాలానికి ఆయన మాతృదేశం భారత దేశానికి వచ్చారు .అప్పుడు ఉయ్యూరు లోని ప్రజలందరూ వారికి బ్రహ్మ రధం పట్టారు .పౌర సన్మానం చేశారు .చాలా సాదా సీదా గా ఉండే వారాయన .మంచి తెలుగు లో మాట్లాడారు .ఆయన దగ్గరి బంధువు మా ఇంటికి ఎదురు గా ఉండే వంగల కృష్ణ దత్త శర్మ గారింట్లో ఉన్నారు .అక్కడ వారిని మేమందరం కలిసే వాళ్ళం .ఆయన తో మాట్లాడే వాళ్ళం .భేషజం లేకుండా మాట్లాడే వారు .ఏదైనా ప్రశ్నిస్తే చాలా వివరం గా సమాధానం చెప్పే వారు .ఆయన తో జరిగిన సంభాషణల్లో ‘విమాన శాస్త్రం ”గురించి వచ్చింది .అప్పుడు ఆయన విమాన శాస్త్రాన్ని భరద్వాజ మహర్షి రచించాడని, దాన్ని జెర్మనీ వారు తీసుకొని వెళ్లి ,మన సంస్కృత పండితులతో అర్ధం చెప్పించుకొని వివరాలన్నీ సేకరించి జర్మన్ భాష లోకి అనువదింప జేసుకోన్నారని చెప్పారు .తాను రష్యా లో ఉన్నాను కనుక పబ్లిక్ గా ఈ విషయాలు చెప్ప రాదనీ ఇది అంత రంగిక సమా వేశం కనుక చెప్పానని నవ్వుతూ చెప్పారు .నేను ఆ సమావేశం లో ఉన్నాను ,విన్నాను .కానీ మన దేశీయు లెవ్వరు ఆ శాస్త్రాన్ని పట్టించుకోలేదని ,దాని పై రిసెర్చ్ చేసే సదుపాయాలూ కూడా మన దేశం లో లేక పోవటం బాధా కరమనీ చెప్పారు .ఇదీ విమాన శాస్త్రానికి నేపధ్యం .అంటే’ థీరీ” అంతా మనదే .practicals మాత్రం ఇతర ఆదేశాల వారివి అని తెలుస్తోంది .కానీ ఇదీ నిజం కాదు అని అన్నిటిలోనూ మనమే ముందు న్నాము అని ఆ తర్వాత తెలిసింది .
వైమానిక శాస్త్రం
భారద్వాజ మహర్షి రాసిన ”వైమానిక శాస్త్రం ”మాత్రమె ఇవాల్టి ”airo dyanamics ;” కు ఆధారం .1860-1940లో ఉన్న జి.ఆర్ .సుబ్బరామ శాస్త్రి వైమానిక శాస్త్రాన్ని సంస్కృతం లో రాశాడని తెలుస్తోంది .ఆయన చెప్పిన దాని ప్రకారం భరద్వాజ మహర్షి ఆయన కు ఆ శాస్త్రాన్ని స్వయం గ చెప్పాడని ,దాన్ని ఆయన రాశాడని తెలుస్తోంది .1918-23కాలం లో డిక్టేట్ చేస్తే రాసి నట్లు కన బడుతోంది .దీనిలో 3000శ్లోకాలు ,ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి . దీన్ని 1959 లో హిందీ లోకి అనువాదం చేశారు .1973 లో ఇంగ్లీష్ లోకి అనువాదం పొందింది .ఇందులో విమాన శాస్త్ర రహస్యా లన్నీ ఉన్నాయి .1974లో బెంగళూర్ లోని indian Aeronautics సంస్థ ఈ పుస్తకాన్ని సమగ్రం గా అధ్యయనం చేసి అందులో పనికి వచ్చే విలువైన సమాచారం ఏదీ లేదని చెప్పింది .కాని అందులో వర్ణించ బడిన ”రుక్మ విమానం ” గురించి మాత్రం చాలా గొప్ప వివరాలున్నాయని ప్రశంశించింది .దానికి పొడవైన ,నిలువైన ”ducts with fans on the top ” ఉన్నానయనీ, అవి గాలిని పీల్చి కింద ఉన్నducts కు పంపుతాయని ,దాని వల్ల విమానం పైకి గాలి లోకి లేస్తుందనీ చెప్ప్పారు .
ఈ పుస్తకాన్ని International Academy of sanskrit research కు చెందిన వ్యవస్తాపక డైరెక్టర్ అయిన శ్రీ G.R. Joshyer ఇంగ్లీష లోకి అనువాదం చేసి మైసూర్ కారోనేషన్ ప్రెస్ లో ముద్రించి మహోప కారం చేశారు .ఆయన పెట్టిన పేరు Vaimaanika shaastra by Bhardvaaja Maharshi –yantra sarvasva –”science of aeronautics” .అదీ దీని పూర్వ గాధాలహరి .మరి దీని మీద ఏమైనా పరిశోధనలు జరిగాయా అంటే ఎవరు పెదవి విప్పలేదు .ఎందుకంటె ”రైట్ సోదరులు ”మొదటి విమానాన్ని తయారు చేసి గాలిలోకి ఎగిరారని రూధి అయి పోయింది కదా .ఇక ఎవరు చెప్పినా నమ్మరు అనే భావన నెల కొని ఉంది .కాని సూర్యరశ్మి ని చేతులతో ఆపలేము కదా .
ప్రపంచం లోనే మొదటి విమానం ”మారుత సఖి ”
భారత దేశానికి చెందినవారు , పైనఅంతా వివరం గా తెలుసుకొన్న శ్రీ టి.సుబ్బరామ శాస్త్రి గారే ప్రపంచం లో మొదటి విమాన నిర్మాత .అదీ రైట్ సోదరులు నిర్మించిన కాలం కంటే ఆరేళ్ళ కు ముందే నిర్మించారని చెబితే ముక్కు మీద వేలు వేసుకొంటారు పాశ్చాత్యులు .మనమూ అంతే గా .కాని ఆది యదార్ధం .బెంగళూర్ జిల్లా లోని అనేకాల్ తాలూకా కు చెందినా మహర్షి టి.సుబ్బరామ శాస్త్రి గారు ,బొంబాయి కి చెందిన శివ కర్ తాల్పుడే గారు కలిసి ఈ విమానాన్ని నిర్మించి మొదటి సారి బొంబాయి లో గాలి లోకి యెగిరించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచారు .శాస్త్రి గారు వేద విజ్ఞాన నిధి .తాల్పుడే గారు ఆధునిక విజ్ఞాన శాస్త్ర వేత్త .వీరిద్దరి కలయిక ప్రగతికి మెట్లు అయాయి .
బొంబాయికి చెందినా ప్రముఖ పారిశ్రామిక వేత్త పూన్జీ లాల్ గిరిధర్ బెంగళూర్ వచ్చి శాస్త్రి గారి వద్ద రెండు వారాలు ఉండి విమాన రహస్యాలను ఎన్నీటి నో తెలుసుకొన్నారు .బొంబాయి వెళ్లి అక్కడి విమాన శాస్త్ర పరిశోధకుడైన డాక్టర్ తాల్పుడే గారికి శాస్త్రి గారు ప్రత్యేకం గా చెప్పిన విషయాల పై పూర్తీ అవగాహన కల్పించాడు .ఆ తర్వాతా తాల్పుడే గారు శాస్త్రి గారిని కలిసి చర్చించారు .తాను తెచ్చ్చిన విమానాల నమూనా లను శాస్త్రి గారికి చూపించారు .ఇద్దరూ వేరు వేరు చోట్ల ఉండి పని చేస్తే ముందడుగు వేయ లేమని గ్రహించారు .శాస్త్రి గారు సదాచార సంపన్నులు .ఆయన నియమ నిష్టలకు యే మాత్రం భంగం కలుగ కుండా శాస్త్రి దంపతులను తాల్పడే గారు బొంబాయికి తీసుకొని వచ్చారు .తాల్పుడే గారి భార్య కూడా విజ్ఞాన శాస్త్ర వేత్త కావటం తో గొప్ప సహకారం లభించింది .ఈ ప్రయత్నానికి వెనుక ఉండి ఆర్ది క, హార్దిక సహకారాన్ని అందించిన వాడు పూన్జీ లాల్ గారు .ఈ ముగ్గురి మేధా ఫలితంగా ఆవిర్భ వించిన తొలి విమానమే”మారుత సఖి ” .
1895లో బొంబాయి నగరం లో ఉదయాన”చౌపాతి ”వద్ద స్వదేశీ విమానం అయిన ”మారుత సఖి ”ఆకా శం లో విహారం చేయ టానికి సర్వం సిద్ధం చేశారు .విమాన యంత్రాన్ని పాదరసం, సూర్య రశ్మి ,ఆవిరి తో నింపారు .అందరు ఆసక్తి గా విమాన విహారాన్ని వీక్షించటానికి ఆకాశం వంక చూస్తున్నారు .బరోడా మహా రాజు సయాజ్ దేవ్ గైక్వాడ్ ,న్యాయ మూర్తి మహాదేవ్ గోవింద రేనడే మొదలైన ప్రముఖులందరూ విచ్చేశారు .శాస్త్రి గారి పాదాలకు నమస్కారాలను అత్యంత భక్తీ తో చేసి డాక్టర్ తాల్పుడే గారు విమానం వద్దకు వచ్చి సూర్య దేవుడికి నమస్కరిస్తుండగా వేద మంత్రోచ్చాతన విను వీధిని విని పిస్తుండగా ,ముహూర్త సమయానికి ప్రపంచ తొలి విమానం”మారుత సఖి ” బొంబాయి చౌపతి నుండి గగనానికి ఎగసింది .అశేష జన సమూహం ఆనందాతి రేకం తో జయ జయ ధ్వానాలు కరతాళధ్వనులు చేసిపులకించిన చారిత్రాత్మక ఘట్టానికి శుభం పలికారు .తాల్పుడే దంపతులు ఆనంద బాష్పాలు రాలుస్తుండగా సుబ్బరామ శాస్త్రి గారు ధ్యాన నిమగ్ను లయారు .మారుత సఖి ఆకాశం లో దేదీప్య మానం గా విహరిస్తోంది .1500అడుగుల ఎత్తుకు చేరి, అక్కడా విహరించింది ,అక్కడ చేరిన బ్రిటీష గూద చారులు ,అధికారులు ఆశ్చర్యానికి లోనై భయ భ్రాంతులు కూడా అయారు .
భారతీయులందరూ దేశాభి మానం ఉప్పెన గా పొంగి రాగా ”భారత మాతా కు జై ”అని నినదించారు .వేలాది మంది విమానం కిందికి దిగ గానే చూడ టానికి తాకి అనుభవించటానికి పరుగులు తీశారు .తొక్కిస లాట జరిగింది పోలీసులు కొద్దిగా లాఠీ చార్జి చేయ వలసి వచ్చిందట కూడా .ఇంత దిగ్విజం గాభారతీయులు స్వంత సామగ్రి తో విమానాన్ని తయారు చేసి నడప టాన్ని జీర్ణించుకోలేని ఆంగ్ల ప్రభుత్వం,ఈ వార్తను పేపర్ల లో రాకుండా నిషేధించింది .అందుకని ఈ విషయం ఎవరికీ తెలియ లేదు .ఆ తర్వాత కొంత కాలానికి డాక్టర్ తాల్పుడే గారి భార్య ,ఆ తర్వాత తాల్పుడే గారు మరణించారు .కొంత కాలం తర్వాత తాల్పుడే బంధువులు ”మారుత సఖి ”విమాన యంత్రాన్ని ”రాలీ బ్రదర్స్ ”అనే విదేశీ సంస్థకు అమ్మి వేశారు .
అనేకల్ టి.సుబ్బరామ శాస్త్రి గారు విషాదం తో స్వంత గ్రామానికి చేరుకొన్నారు .ఈ విమాన విజ గాధ ను యే పత్రికా వేలువరించక పోవటం మన దురదృష్టం .అయితే 1895 లో లోక మాన్య బాల గంగాధర తిలక్ గారు తమ ”కేసరి ”పత్రిక లో ”మారుత సఖి ”విమాన విజయాన్ని ప్రచురించి లోకానికి ఎరుక పరిచారు .ప్రముఖ చారిత్ర క పరి శోధకు డైన ivan Kopsatica ”విమాన యంత్రాన్ని మొట్ట మొదట తయారు చేసిన వాడు బొంబాయికి చెందిన డాక్టర్ తాల్పుడే అని రాశాడు .
డాక్టర్ తాల్పుడే వద్ద ఎప్పుడూభారద్వాజ మహర్షి రచించిన విమాన శాస్త్ర గ్రంధం ఉండేదట ”.Stefen Pyaav”అనే పరిశోధకుని ప్రకటన మేరకు తాల్పడే విమాన యంత్రానికి పాద రసాన్ని ఇంధనం గా ఉపయోగించాడనితెలిసింది .తాల్పడే గారు విమాన శాస్త్రానికి చెందిన సకల విషయాలూ సంస్కృత గ్రంధాల నుండి సేకరించి దాచుకొన్నారు .అంతే కాక సుబ్బరామ శాస్త్రి గారు ఆచార్య నారాయణ ముని రచించిన ”విమాన బిందు ”,మహర్షి దండి రాజ రచించిన ”విమాన జ్ఞానార్ధ ప్రకాశికా ”మొద లైన గ్రంధాలనుండి విషయాలను తాల్పడే గారికి తెలియ జేసి ఆ శాస్త్రం లో ఆయన కు పూర్తీ ఆవ గాహన కల్పించారు .అనేక గ్రంధాలలో శ్రీ శాస్త్రి ,శ్రీ తాల్పుడే గార్ల కృషి గురించిన వివ రాలు చాలా కన్పిస్తాయి . .
ప్రపంచం లోనే తొలి విమానం ”మారుత సఖి ” ని తయారు చేసి ,గగనం లో విహరింప జేసిన ఘనత భారతీయ శాస్త్ర వేత్తలైన శ్రీ సుబ్బ రామ శాస్త్రి, శ్రీ తాల్పుడే గార్లకే దక్కు తుంది అన్నది నిర్వివాదాంశం .జై బోలో భారత్ మాతా కీ జై .
ఈ వ్యాసానికి ఆధారం– కడప లోని బ్రౌన్ లైబ్రరి వ్యవ స్తాపకులు, సలహా దారు, నిరంతర రచనా శీలి, పండిన జ్ఞాన, విజ్ఞాన ఫలం అయిన శ్రీ జాను మద్ది హను మత్సాస్త్రి గారి రచన ”ప్రపంచం లోనే తొలి విమానం –మారుత సఖి ” ..
.శ్రీ హనుమచ్చాస్త్రి గారికి కృతజ్ఞతలతో —
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –13-9-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 821,648 hits
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
- మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-2(చివరి భాగం )
- మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-1
- మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -3(చివరిభాగం
- మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -2
- సంగీత సద్గురుత్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం
- మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి
- నీలాచలేశ్వర స్తవం
- సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కవితా స్రవంతి
- ఆంధ్రా జాకీర్‌హుస్సేన్- డా.హుస్సేన్ అహ్మద్
భాండాగారం
- జనవరి 2021 (25)
- డిసెంబర్ 2020 (49)
- నవంబర్ 2020 (38)
- అక్టోబర్ 2020 (72)
- సెప్టెంబర్ 2020 (48)
- ఆగస్ట్ 2020 (78)
- జూలై 2020 (87)
- జూన్ 2020 (72)
- మే 2020 (80)
- ఏప్రిల్ 2020 (61)
- మార్చి 2020 (48)
- ఫిబ్రవరి 2020 (45)
- జనవరి 2020 (60)
- డిసెంబర్ 2019 (50)
- నవంబర్ 2019 (53)
- అక్టోబర్ 2019 (36)
- సెప్టెంబర్ 2019 (44)
- ఆగస్ట్ 2019 (66)
- జూలై 2019 (54)
- జూన్ 2019 (68)
- మే 2019 (60)
- ఏప్రిల్ 2019 (36)
- మార్చి 2019 (47)
- ఫిబ్రవరి 2019 (68)
- జనవరి 2019 (61)
- డిసెంబర్ 2018 (46)
- నవంబర్ 2018 (47)
- అక్టోబర్ 2018 (53)
- సెప్టెంబర్ 2018 (50)
- ఆగస్ట్ 2018 (51)
- జూలై 2018 (58)
- జూన్ 2018 (30)
- మే 2018 (29)
- ఏప్రిల్ 2018 (28)
- మార్చి 2018 (33)
- ఫిబ్రవరి 2018 (37)
- జనవరి 2018 (63)
- డిసెంబర్ 2017 (33)
- నవంబర్ 2017 (22)
- అక్టోబర్ 2017 (28)
- సెప్టెంబర్ 2017 (17)
- ఆగస్ట్ 2017 (69)
- జూలై 2017 (52)
- జూన్ 2017 (65)
- మే 2017 (68)
- ఏప్రిల్ 2017 (55)
- మార్చి 2017 (40)
- ఫిబ్రవరి 2017 (46)
- జనవరి 2017 (81)
- డిసెంబర్ 2016 (51)
- నవంబర్ 2016 (54)
- అక్టోబర్ 2016 (35)
- సెప్టెంబర్ 2016 (24)
- ఆగస్ట్ 2016 (54)
- జూలై 2016 (78)
- జూన్ 2016 (44)
- మే 2016 (42)
- ఏప్రిల్ 2016 (61)
- మార్చి 2016 (44)
- ఫిబ్రవరి 2016 (36)
- జనవరి 2016 (96)
- డిసెంబర్ 2015 (120)
- నవంబర్ 2015 (133)
- అక్టోబర్ 2015 (150)
- సెప్టెంబర్ 2015 (135)
- ఆగస్ట్ 2015 (135)
- జూలై 2015 (129)
- జూన్ 2015 (185)
- మే 2015 (186)
- ఏప్రిల్ 2015 (184)
- మార్చి 2015 (130)
- ఫిబ్రవరి 2015 (158)
- జనవరి 2015 (147)
- డిసెంబర్ 2014 (209)
- నవంబర్ 2014 (135)
- అక్టోబర్ 2014 (152)
- సెప్టెంబర్ 2014 (170)
- ఆగస్ట్ 2014 (129)
- జూలై 2014 (110)
- జూన్ 2014 (84)
- మే 2014 (79)
- ఏప్రిల్ 2014 (81)
- మార్చి 2014 (76)
- ఫిబ్రవరి 2014 (74)
- జనవరి 2014 (92)
- డిసెంబర్ 2013 (112)
- నవంబర్ 2013 (102)
- అక్టోబర్ 2013 (101)
- సెప్టెంబర్ 2013 (104)
- ఆగస్ట్ 2013 (53)
- జూలై 2013 (70)
- జూన్ 2013 (55)
- మే 2013 (27)
- ఏప్రిల్ 2013 (98)
- మార్చి 2013 (95)
- ఫిబ్రవరి 2013 (62)
- జనవరి 2013 (101)
- డిసెంబర్ 2012 (110)
- నవంబర్ 2012 (95)
- అక్టోబర్ 2012 (55)
- సెప్టెంబర్ 2012 (75)
- ఆగస్ట్ 2012 (63)
- జూలై 2012 (55)
- జూన్ 2012 (54)
- మే 2012 (60)
- ఏప్రిల్ 2012 (50)
- మార్చి 2012 (61)
- ఫిబ్రవరి 2012 (93)
- జనవరి 2012 (85)
- డిసెంబర్ 2011 (68)
- నవంబర్ 2011 (77)
- అక్టోబర్ 2011 (51)
- సెప్టెంబర్ 2011 (15)
- ఆగస్ట్ 2011 (26)
- జూలై 2011 (45)
- జూన్ 2011 (68)
- మే 2011 (55)
- ఏప్రిల్ 2011 (37)
- మార్చి 2011 (37)
- ఫిబ్రవరి 2011 (15)
- జనవరి 2011 (2)
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (25)
- అమెరికా లో (203)
- అవర్గీకృతం (154)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (5)
- ఊసుల్లో ఉయ్యూరు (75)
- కవితలు (146)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (26)
- నా డైరీ (8)
- నా దారి తీరు (129)
- నేను చూసినవ ప్రదేశాలు (105)
- పుస్తకాలు (2,414)
- సమీక్ష (781)
- మహానుభావులు (272)
- ముళ్ళపూడి & బాపు (59)
- రచనలు (904)
- రాజకీయం (59)
- రేడియో లో (53)
- వార్తా పత్రికలో (2,143)
- సభలు సమావేశాలు (316)
- సమయం – సందర్భం (765)
- సమీక్ష (10)
- సరసభారతి (8)
- సరసభారతి ఉయ్యూరు (446)
- సినిమా (48)
- సేకరణలు (302)
- సైన్స్ (44)
- English (6)
ఊసుల గూడు
Sarasabharati
https://www.youtube.com/watch?v=vLPfYIme-os
1927 may 20న ‘’లిన్దెర్బెర్ఘ్ ‘’విమానం ఉదయం 7-54 కు న్యూయార్క్ నుండి పారిస్ బయల్దేరింది .ముందుగా అట్లాంటిక్ సముద్రం పై 150 అడుగుల ఎత్తున నడిపాడు .ఎప్పటికప్పుడు కంట్రోల్ రూం తో సంప్రదిస్తూనే ఉన్నాడు .కళ్ళు మూసుకు పోతున్నాయి .చార్టులు తిరగేస్తున్నాడు .అలసట పెరిగి పోయింది .ఎనిమిది గంటల తర్వాతా భూమి కని పించింది .అది అమెరికా ఉత్తరాన ఉన్న ‘’నోవా స్కాటియా’’మొదటి రోజు రాత్రి 10,500అడుగుల ఎత్తున తుఫాను కన్పించింది .వెనక్కి తిరిగి వెళ్ళాల్సి వస్తుందేమో నని భయ పడ్డాడు ..విమానం పై మంచు దుప్పటి లాగా పరుచుకోండి .రెక్కల పై మంచు చేరితే ప్రమాదం .వెంటనే విమానం తిప్పి దూరం గా వెళ్లి ఊపిరి పీల్చుకొన్నాడు .