జనవేమన -29 వేమన స్తుతి మాల

 జనవేమన -29
                                        వేమన స్తుతి మాల 

జన వేమన ప్రజా దరణ పొందిన పద్యాను ముక్తకాలుగా చెప్పి తెలుగు సరస్వతికి మౌక్తికా  భి షేకం చేశాడు .అలాంటి వేమన గురించి ప్రముఖులు ప్రశంశలు పలికి నీరాజనాలంద జేశారు .అందులో కొన్ని టిని తెలుసుకొందాం .”కవులు అని పేరు సంపాదింప ని కవు లలో చేరిన కవి వేమన ”అన్నారు రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ గారు .’ఉల్లేఖాలన్కారానికి వేమన ఉజ్వల మైన ఉదాహరణం .ఆయన లోక కవి ,ప్రజా కవి ,విశ్వ కవి ,నాద యోగి ”అన్నారు”మన వేమన ”లో  ఆచార్య కొర్ల పాటి శ్రీ రామ మూర్తి .సమగ్రాంధ్ర సాహిత్యం లో ఆరుద్ర ”పామరుల దృష్టి లో వేమన కవి కాదు ,అవతార పురుషుడు .పండితులు ,సాహిత్య కారులు ఆయన్ను మహా కవి గా గుర్తిన్చనే లేదు .ఆయన్ను కవి గా గుర్తించిన వారు ఆధునికులే .కొమర్రాజు వారు ఇల్లు అలికారు ,కట్ట మంచి వారు ముగ్గు పెట్టారు ,వంగూరి వారు పీట వేశారు .వేటూరి వారు, బండారు వారు ,శేషాద్రి రమణ కవులు ప్రస్తు తించారు .రాళ్ళ పల్లి వారు మహా కవి గా గుర్తించారు ”అని కీర్తి కిరీటం పెట్టాడు .అన్నాడు ఆరుద్ర.”వేదాలు లిఖితాలు కాదు ,వేమన కవిత్వమూ అంతే .సన్య సించిన తర్వాత గోచీ తో పాటు గంటాన్నీ విసరి వేసిన వాడే .సందర్భాన్ని బట్టి ఆశువు గా చెప్పిన పద్యాలు జనం నాలుక పై నిలిచి పోయాయి .లేఖక పాథక ప్రమాదాలు వేమన్న కున్నంత గా ఇంకెవరికీ లేవు .నోటి ప్రచారం తర్వాత తాటాకు ల పైకేక్కాయి .నిరక్షరుల నోట ,ఇంటా అవి బతికాయి ”అన్నారు ”విశ్వ దాభి రామ ,వినుర వేమా ”లో త్రిపుర నేని వెంకటేశ్వర రావు .
”ముక్తకం వ్యంగ్య పూరితం .దాన్ని వినటం ప్రారంభించ గానే వినే వాడిలో ఉద్బుద్ధంఅయ్యే కుతూహలాన్ని పద్యం ముగిసే లోగా తృప్తి కలిగించాలి .దానికి క్లుప్తత అందం .ఈ సంక్షిప్తతే అనవసర మైన విషయ వివరణ అనే దోషం అంట కుండా కాపాడు తుంది .పై ముక్తక లక్షణాలు చాలా మటుకు వేమన పద్యాలకు వర్తిస్తాయి ”అని ఆచార్య యెన్ .గోపి తన ”ప్రజా కవి మేమన ”లో ప్రస్తు తించారు .”తనకు తోచిన అంశాన్ని వస్తువు గా గ్రహించి శతక పద్యా లను చెప్పిన వారి లో వేమన ఆద్యుడు ”అని ”ఆంద్ర శతక సాహిత్య వికాసం ”లో డాక్టర్ కే.గోపాల కృష్ణా రావు అన్నారు .
”శాప గ్రస్తుడైన జీవి ,విరక్తి మార్గం పడ తాడు .పర మార్ధాన్ని ఆకాన్క్షిస్తాడు . .వేమన జీవితం ఇదే మార్గాన్ని పట్టింది .యవ్వనం లో మోహిక భోగాలను భ వించాడు .అందులో అర్దార్ది సంబంధం తప్ప ,పరమార్ధం కన్పించలేదు .కాంచనం వంచనం రక్తి మార్గం లో ముళ్ళ పొదల్లా కన్పించాయి .దాన్ని వదిలి భక్తీ మార్గం పట్టాలి .భక్తికి విశ్వాసం ముఖ్యం .వివేకాన్ని నమ్మినంతగా విశ్వాసాన్ని నమ్మ లేదు .అందుకని భక్తుడు కాలేక పోయాడు .కాని ,భగ వంతుని చేరే మార్గా లన్నిటిని పరా మర్శించాడు .బహిర్ముఖ జీవితం పై కోపం వచ్చింది .అంతర్ముఖుడై తన లోనే భగ వంతుడిని చూసుకొన్నాడు .జీవితం నేర్పిన గుణ పాథంఇది .నీలోనే నిజం ఉంది తెలుసుకో .అని చివరకు పాథం నేర్పింది .అందుకే కవిత్వం ”ఆత్మాశ్రితం  ”అయింది .అదే దాని అంతర్లీన శక్తి ”అని ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు ”వేమన యోగి ,పద్యం ప్రక్రియ మకుటం ముద్ర ”అన్న వ్యాసం లో అద్భుత విశ్లేషణ చేశారు .”వేమన దృష్టి లో మనిషే దేవుడు .ఆయన తత్త్వం మానవతా వాదం .ప్రబోధం తో పాటు సంస్కరణ అవసరం అని భావించాడు .మానవుడే మాధవుడని చెప్పిన జ్ఞాన యోగి .అందుకే ఆయనది వేద వాక్కు .ఆయన్ను సమాజ కవి గా ,నాధ సంప్రదాయ కవి గా ,భావించారు .ఆయన వాక్కు ప్రజల గుండెల్లో సరాసరి ప్రవేశించి నిలిచే శక్తి కలిగి ఉంది .వేమన తో కలిసి పాడటం ,వేమన వలె స్వంతం గా పద్యం పాడటం అప్పటికి ఇప్పటికి కళే .వేమన పద్యాలు అనే ప్రసిద్ధి .మకుటం వల్ల  శతకం అన్నారు .మకుటం పెట్టటం వల్ల  ”పద కవితా సాంప్రదాయం ”కూడా వచ్చింది .శతక పద ప్రక్రియను మకుట ముద్ర తో యోగించి యోగి అయ్యాడు .అతని పద్యం ఒక ప్రక్రియ .అతని మకుటం ఒక ముద్ర .పదానికి ,పద్యానికి ఒక విచిత్ర సంబంధం కలిపాడు .తత్త్వం లా పాడాడు .వేమన తనువు చాలించినా అతని పద్యం జీవితం చాలించ లేదు .పాట రాని పద కర్తలు వేమన పద్యాల అనురక్తులు .పదం భక్తీ లో మునిగింది .పద్యం బతుకు లో ఈదింది ”అని మహా విమర్శక శిఖామణి మూలాల లోతులు తరచే ఆచార్య గూడ వెంకట సుబ్రహ్మణ్యం గారు (జి.వి.)పరమాద్భుత మైన విశ్లేషణ చేసి వేమనను చిరంజీవిని చేశారు ..
”ఆధ్యాత్మిక సంకర భావ మూధా చారాలను భస్మీ పటలం గావించే విప్లవ మహాగ్ని జ్వాల గా విశ్వ కవి వేమన ,ఆయన పద్యాలు జరామరణం ఎరుగని చెదపట్టని చింత నిప్పులు ,చిలుం పట్టని స్వరాక్ష రాలు ,కుల మత చాందసుల కత్తులకు అవి అ  గ్రాలు ” అని విప్ల వాభి వందనం చేస్తారు వేమన భావాలను అనేక కోణాల్లో ఆవిష్కరించిన బత్తిన గురు మూర్తి గారు తమ ”వేమన పద్య సందేశం ”లో .వేమన గారు జీవితం లో బంగారం చేశారో లేదో కాని ఆరుద్ర మాత్రం బంగారం లాంటి మాటలు ఆయన్ను గురించి చెప్పాడు .ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి వేమన గారి వంద పద్యాలు సంస్కృతం లోకి తర్జుమా చేసి నివాళు లర్పించారు .ఈ అను వాదాన్ని బందరుదగ్గర చిట్టి గూడూరు సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ ఎస్.టి.జి.వరదా చార్యులు చేయటం అద్భుత మైన విషయం .గద్వాల ఆస్థాన కవులు శతావ ధాని గంధం శ్రీ రామ మూర్తి ,ఇర్రింకి నరసింహ మూర్తి గార్లు ”వేమన గీత ”పేరు తో అనుష్టుప్ శ్లోకాలుగా అనువదించి నట్లు ఆరుద్ర పేర్కొన్నారు .వేమా అనే మకుట పదం ఎక్కడో ఒక చోట వచ్చేట్లు అనువాదం చేశారట .
చార్లెస్ యి గోవర్ దొర వేమన సూక్తుల్ని ఇంగ్లీష్ పద్యాను వాదం చేసి ఆంగ్ల సాహిత్య రంగ ప్రవేశం కల్పించారు .వేమన్న ను ఘనం గా నే పద్య కవులు శ్లాఘించారు శ్రీ వెంకట పార్వతీశ్వ ర కవులు వేమనను -”సకల మతముల నొక త్రోవ జరిపి నావు –నిఖిల జాతుల నొక ఇంట నిలిపి నావు –అఖిల శక్తుల నొక చోట కలిపి నావు –పరమ యోగేంద్ర వేమ భూపాల చంద్రా ”అని కవి రాజునే చేశారు .శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ”ఏమేని పఠింప కే ,సముదితాహీన పబోధంబునన్ –సామాన్య ప్రజా కేని ,యశ్రమకర స్పష్టా ప భోగం బు గా –వేమారున్ మననంబు సేయ దగు ,నవ్వేదాంత సిద్దాన్తముల్ –వేమా రెడ్డి రచించే పద్య ఫణితిన్ ,విశ్వాభి రామంబుగాన్ ”అని మనోహరం గా మెచ్చుకొన్నారు .వేమన కాలానికి సంబంధించిన వివాదం లోకి తాను ప్రవేశించనని ”నీ వాచా మాధురి ,నీ నిరర్గల కవిత్వాస్పూర్తి గీర్తిన్చేదన్ ”అని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి కీర్తించారు .ఆయనే మళ్ళీ –”అభిరామాక్రుతులైన నీకృతుల నవ్యత్వాభి రామంములై –ప్రభుతం గన్నవి యావదాంధ్ర జన హ్రుత్పద్మ్మమ్ములన్ భాను స –న్నిభ ,యుష్మత్కవితా రుణ ప్రభలు నిండెన్ ,గేహ గేహాల –యభి వాదమ్ములు గొమ్ము వేమన కవీంద్రా కర్మ యోగీశ్వారా ”అన్నారు .
”ఒక్క పొల్లు మాట లేకుండా మర్రి విత్తనం అంత చిన్న పద్యం లో మహా వ్రుక్షమంత అనుభవాన్ని ఇవ్వ గలిగిన వాడు మహా కవి .మాటలు పొదుపు గా వాడటం అనే సుగుణం మన సాహిత్య ప్రక్రియ లో ”కవిత్రయం ”వారి తో కరు వై పోయింది .ఆ ముగ్గురి తర్వాతా వెదికితే వేమన గారు తప్ప కను చూపు మేర లో ఇంకెవరూ కనీ పించారు .కవిత్రయం లో లేని ఇంకో గొప్ప గుణం వేమన లో కన్పిస్తుంది  ఆది -పుస్తకాలలోని పదాలు కాక ,జీవితం లోని పదాల ను వాడటం ”అన్నారు ఆరుద్ర .వేమన ప్రభావం తో కవిత్వం రాసిన వారి లో కూచి మంచి తిమ్మన ,కను మార్తి అచ్చయ్య ,కూచి మంచి జగ్గన ఉన్నారు .”తల్లిదండ్రి మీద దయ లేని పుత్రుండు ”అన్న పద్యం తంజావూర్ లోని శివాజీ రాసిన యక్ష గానం లో ముఖారి రాగం లో ఒక పద్యం ఉన్నట్లు ఆరుద్ర చెప్పారు .ముద్దు పళని కూడా వేమన ప్రభావానికి లోనై రాసింది .18శతాబ్దపు చాలా మంది కవుల పై వేమన ప్రభావం ఉంది .
దేశ సర్వతోముఖాభి వృద్ధికి ఎన్ని ప్రణాలికలు రచించినా ,ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రజల మధ్య ఐక్యత లేక పోతే నిత్యం రావణ కాష్టమే .నిర్బంధమే ,అనుమానాలే .సంఘ బలం తో కదిలి తేనె ,పునర్నిర్మాణం సాధ్యం .”ఐక మత్య మొక్క టావస్యకం బెపుడు –దాని ,బలిమి నెంత యైన కలుగు -గడ్డి వెంటి బెట్టి కట్టావా యేనుంగు “‘అని స్పష్టం గా ఆనాడే వేమన చెప్పాడు .విశ్వ కుటుంబ భావన ఉంటె ఎప్పుడూ మంచే జరుగు తుంది .ఈ భావం నిలిస్తే వేమన చిరంజీవే ..ప్రపంచమంతా సచ్చిదానందమే .ఇది వేమన్న సమగ్ర దర్శనం కాక పోయినా సమ్యక్ దర్శనం ,సదానందమే .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –16-9-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు, మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.