పునరుత్పాదక ఇంధన శక్తి

పునరుత్పాదక ఇంధన శక్తి 

అణు రియాక్టర్లు గుండెల పై కుమ్పట్లనీ అణు విద్యుత్తు చౌక   కాదని అణు ధూళిప్రమాదకరమని అన్నాం . .నిజమే .మనకు సంప్రదాయ ఇంధనాలున్నాయి అవే బొగ్గు, ఖనిజ తైలం ,సహజ వాయువు .వీటి వల్ల విద్యుత్తు ను తయారు చేసుకొంటూనే ఉన్నాం .జల విద్యుత్తు సరే సరి .అయితే చాలా కాలం గా జలాశయాలు కళ తప్పాయి .అందులోంచి వచ్చే విద్యుత్తు బోటా బోటీ గా ఉంది .తెర్మల్ విద్యుత్తు కు ఫాక్టరీలు పని చేసే గంటలకు కరెంట్ సప్ప్లై ఉండాలి .అంత సేపు విద్యుత్తు ఇచ్చే దమ్ము మనకు లేదు .ఇటీవలి కాలం లో రోజుకు నాలుగు గంటలు కూడా రైతులకు ఇవ్వ లేక ప్రభుత్వం చేతు లేత్తేసింది .ఇక ఫాక్టరీల గోడు వినే దేవడు ?కేంద్రం కూడా ఏమీ చేయలేక ”మీ ఎడుపేదో మీ రేడ  వండి మా కు చెప్పకండి ”అనే స్తితి లోకి వచ్చింది .ఈ మధ్యనే భారత దేశపు అన్ని రాష్ట్రాలూ చీకటిలో మగ్గి పోయిన సంఘటన మనకు తెలిసిందే .మన రాష్ట్రం సంగతి అంతా ”దైవా దీనం మోటారు సర్వీసు” లా ఉంది .ఇది వరకు ప్రజలు ”అన్నమో రామ చంద్రా ”అనే వారు .ఇప్పుడు ”కరెంటో క (కి)రుణ కుమారా!”అంటున్నారు .వసతులు పెంచుకోన్నాం .వాడకం పెరిగింది .యంత్రాలు పెరిగాయి .సుఖాలు పెరిగాయి .వీటన్నిటికి కావలసిన విద్యుత్తు ఉత్పత్తి కావటం లేదు .ఇదేదో మన సమస్య మాత్రమె కాదు ప్రపంచం లో చాలా దేశాల పరిస్తితి ఇంతే .ఉన్న బొగ్గు అంతా తవ్వి తీసేస్తున్నాం ..దీనికి తోడు పర్మిషన్ తీసుకొన్న దాని కంటే ఎక్కు వ బొగ్గు తవ్వి రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాల కళ్ళు కప్పి విదేశాలకు ఎగు మతి చేసి బిలియనీర్లై” నల్ల చక్ర వర్తులై” మన ముందే పళ్ళు ఇకిలిస్తున్న వారిని చూస్తున్నాం .అట్లాగే దొంగ విద్యుత్  వాడకం దారులను అరి కట్ట లేక పోతున్నాం.సహజ వాయువు పై అనేక ఆంక్షలు ఉన్నాయి . .అదీ ప్రైవేట్ పరమై శూన్యం అయింది .ఈ సమస్యలకు పరిష్కారం తెలీక ఇంజినీర్లు శాస్త్ర వేత్తలు తల పట్టు కుంటున్నారు .ఈ సహజ వనరులన్నీ ఖాళీ చేస్తే మళ్ళీ కొత్త వాటిని మనం సృష్టించలేము .ఇవి పునరుత్పాదకాలు కావు .అందుకని పునరుత్పాదక లేక  సాంప్ర దాయేతర  ఇంధనాల పై దృష్టి సారించారు .అందులో సోలార్ ఎనర్జీ, తరంగ శ, గాలి మరలు, భూగర్బ్ఘ విద్యుత్తు వంటివి అనేకం ఉన్నాయి .వీటి పై సరిగ్గా దృష్టి పెడితే అవన్నీ తరగని సంపద లా మన అవసరాలను తీరుస్తాయి. వాటిని గురించే ఇప్పుడు మనం తెలుసు కో బోతున్నాం .
                           గాలి శక్తి ( విండ్ పవర్ )
గాలి మరల నుండి శక్తిని యూరప్ లో చాలా దేశాలు తయారు చేసి వినియోగించుకొంతున్నాయి .ఈ శక్తి కాలుష్య రహితం .ఆర్ధికం గా బాగా గిట్టు బాట వు తుంది .ఇది చాలా సాధారణ టెక్నాలజీ తో పని చేయటం ఒక ఆకర్షణ .సంక్లిష్ట న్యూక్లియర్ రియాక్టర్ల నిర్మాణం కంటే బాగా గాలి వీచే ప్రాంతా లలో వీటిని నేల కొల్పటం తేలిక .ఖర్చు బాగా కలిసి వస్తుంది .ఒక అధ్యయనం ప్రకారం 2000 వ సంవత్సరం లో వాడిన మొత్తం విద్యుత్తు కంటే నలభై రెట్లు అధిక విద్యుత్తు అంటే సుమారు 72టెర్రా వాట్ల విద్యుత్తు అన్ని ఖండాల  లోని 8000గాలి మరల వల్ల  లభించి రికార్డు సాధించింది .ఇది ఇరవై శాతం .దీనినే మనం సాధించ గలిగాము అంటే ,  ,ప్రపంచం మొత్తానికి కావలసిన శక్తిని సాధించ గలం అనే నమ్మకం కలుగు తోంది అంటారు శాస్త్ర వేత్తలు ఒక టెర్రా వాట్ విద్యుత్తు100 వాట్ల బల్బులను   10 బిలియన్  లను వెలిగించే సామర్ధ్యం కలిగి ఉంటుంది .ఈ శక్తి వనరులు యూరప్ లోని ఉత్తర సముద్ర ప్రాంతంలో ,అమెరికా లోని గ్రేట్ లేక్స్ ప్రాంతం లో దక్షిణ అమెరికా దక్షిణ భాగం లో ను ఉన్నాయి .గాలి వల్ల   వచ్చే విద్యుత్తు ఏటా 34 %పెరుగు తోందని లెక్క వేశారు .గత పదేళ్లు గా దీని ఉత్పాదన వేగ వంత మైంది .అయితే ప్రపంచ విద్యుత్తు తో పోలిస్తే ఇది ఒక అర శాతమే ఉంది .
1970 లో ఆయిల్ సంక్షోభం వచ్చిన సంగతి మనకు తెలుసు .అప్పుడు డెన్మార్కు దేశం గాలి శక్తిని ఉపయోగించే ప్రక్రియను ఉధృతం చేసింది .1988 చేర్నోబిల్ ప్రమాదం తర్వాత ,ఆ ప్రభుత్వ న్యూక్లియర్ పవర్ ప్లాంటు లను నిర్మించ రాదనీ చట్టం చేసింది .ఇప్పుడు డెన్మార్క్ నాలుగవ జెనెరేషన్ విండ్  ట ర్బైన్లను నిర్మించి అందరికి ఆదర్శ వంతం గా ఉంది .దీని టెక్నాలజీ బాగా తెలిసిన దేశం గా గుర్తింపు పొందింది .అక్కడి ఒక పౌరుడు  ”I wanted my children to have five fingers .,we made a choice -no nucear energy ”.అని స్పష్టం గా చెప్పాడట .ఇంకో విషాదకర విషయం ఏమి టంటే డెన్మార్కు లోని ఆహారపదార్ధాలలో  లో ఇంకా రేడియో ధార్మికత ఉంది ట .పాతిక సంవత్స రాలైనప్పటికీ ఆ రేడియో ఆక్టివ్ దెయ్యం వదలక పీడిస్తూనే ఉంది పాపం .
అమెరికా లో విండ్ పవర్ బాగా ప్రాచుర్యం లో ఉంది .రాకీ పర్పర్వతాలు మిస్సి సిపి మధ్య ఉన్న భాగాన్ని ”soudi arebia of the wind ”అని ముద్దు గా పిలుస్తారు .ఈ ప్రయరీ ప్రదేశం లో గాలులు ధారాళం గా ,నిరంతరం గా వీచటమే దీనికి కారణం .టెక్సాస్ ,కాన్సాస్ ,నార్త్ డకోటా కలిసి అమెరికా కు కావలసిన విద్యుత్తు ను నూటికి నూరు శాతం అందించ గలవు .అయితే గ్రేట్ లేక్స్ ,ఉత్తర ,ఈశాన్య ప్రాంతాలలో ఇంకా విండ్ పవర్ ను టాప్ చేయటం తక్కువ గానే ఉంది .1990 నుండి మిన్నే సోటా  రాష్ట్రం లో వందలాది గాలి టర్బైన్లు పని చేసి పవర్ తయారు చేసి రైతులకు బాగా అందిస్తున్నాయి .పెద్ద పెద్ద కార్పో రేషన్లు రైతులకు రెండు వేల నుంచి అయిదు వేల దాలర్లవరకు ధన సహాయం చేసి వింద మిల్స్ ను ఏర్పరుస్తున్నాయి .కొందరు రైతులు తామే వీటిని తయారు చేసుకొని ఉప యోగించటం ఒక ముందడుగే .విండ్ టర్బైన్లున్న వ్యవ సాయ క్షేత్రాలను ”combines in the sky ”అని పిలుస్తారు .దీని వల్ల  పంటలు బాగా పండుతున్నాయి కాలుష్యం దూర మైంది .అందుకే దీన్ని ”గ్రీన్ ఎనర్జి ”అంటారు .అయితే వీటి వల్ల  తయారయ్యే విద్యుత్తు గ్రిడ్ లకు చేరాలంటే కష్టం గా ఉంది .గ్రిడ్లు వీటికి చాలా దూరం లో ఉంటున్నాయి .ఇంకో శుభ వార్త ఏమిటంటే ,జాన్ డీన్ కా ర్పోరేషన్ దీనికి కావలసిన పెట్టు బడి పెట్ట టానికి సిద్ధం గా ఉంది .దీనితో నాణ్యమైన శుద్ధ విద్యుత్ లభిస్తుంది .
చైనా దేశం లో విద్యుత్ వాడకం ఎక్కువే .దీని కోసం విండ్ పవర్ ను ఉప యోగిస్తున్నారు .ప్రభుత్వం అన్ని రకాల సాయం అందిస్తోంది ”.huitengxile” అనే మంగోలియా ప్రాంతం లో 68 మెగా వాట్ పవర్ ల  విండ్ ఫారం ను ఏర్పాటు చేశారు .ఇది 2008 నాటికి 400మెగా వాట్ల ను తయారు చేసింది .జన సంఖ్య బాగా ఎక్కువ ఉన్న ప్రాంతాలలో వీటి సంఖ్యను బాగా పెంచింది. ఆ దేశం లో బొగ్గు నిల్వలు చాలా ఎక్కువ గా ఉండటం తో దాని వల్ల  ఉత్పత్తి అయ్యే విద్యుత్తు202౦ నాటికి 20 000మెగా వాట్ల కు చేరి అవసరాలు తీరుతాయని భావిస్తున్నారు .విండ్ పవర్ తయారు చేసే వారికి పన్ను రాయితీ లను ప్రభుత్వం కల్పిస్తోంది .సాంప్రదాయేతర ఇంధనాల నుండి  వచ్చే విద్యుత్తు ను కోనా లను కొన్న రాష్ట్రాలకు ఆర్ధిక సాయం చేస్తోంది
                                        సౌర శక్తి (సోలార్ ఎనేర్జి )
ఇరవై ట్రిలియన్ వాట్ల విద్యుత్తు ను ఫోటో వోల్టాయిక్ సేల్స్ నుండి తయారు చేస్తున్నారు .అయితే ఇది ఇంకా అభి వృద్ధి చెందటానికి కావలసిన యంత్ర సామగ్రి అందరికి అందు బాటు లో లేదు .వీటి వాళ్ళ నాన్య మైన విద్యుత్తే వస్తోంది .ఆ సెల్లు ల జీవిత కాలం ముప్ఫై ఏళ్ళు మాత్రమే ..ఇది తయారు చేసే విద్యుత్తు వల్ల  98శాతం కాలుష్య రహితం ,ఆరోగ్య కరం .వీటిని అమర్చ టానికి తగిన ప్రదేశం కావాలి అదే దీని తో వచ్చిన చిక్కు .అంతే కాక దీని పై తగిన సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అందుబాటు లోకి పూర్తిగా రాలేదు .అమెరికా లోని సిలికాన్ వాలీ లో” క్లీన్ టేక్ ”పేరుతో సోలార్ శక్తిని నీటి శుద్ధికి ,ఇతర ఆటోమోటివ్ ఇంధనాలను వాడుతున్నారు .ఇది ఒక గొప్ప బై ప్రాడక్ట్ గా భావిస్తున్నారక్కడ .వీటికోసం ప్రభుత్వాలు సబ్సిదీ లనిస్తున్నాయి .మూడు లక్షల ఇళ్ళ లో   సౌర శక్తిని విని యోగిస్తున్నారని అంచనా .వాటి సామగ్రి 500 మిలియన్ డాలర్ల అమ్మకం చేసింది .ఇది గతం కంటే28 % ఎక్కువట .అయినా  దీన్ని నేల కొల్పతా నికి ఖర్చు చాలా అవుతోంది .అమెరికా లోని న్యు జెర్సి లో దీనికి 50 వేల డాలర్లు ఖర్చు అవుతుంది .ప్రభుత్వం ప్రతి వాట్ కు అయిదున్నర డాలర్లు ఇస్తుంది .ఇది ముప్ఫై అయిదు వేలు అవుతుంది .మిగిలిన పది హీను వేల డాలర్లను బిల్లులు కట్టి తీర్చుకొంటారు .
ఇప్పుడు జెర్మని కధ తెలుసు కొందాం .2025 నాటికి జెర్మని న్యూక్లియర్ పవర్ కు స్వస్తి చెప్పాలని నిర్ణ యించు కొన్నది .కనుక ఇతర శక్తి వనరు  ల పై దృష్టి పెట్టింది .ఇప్పుడు ఎనిమిది శాతం విద్యుత్తు  ను విండ్ పవర్ తో సాధించింది .2050 కి తన అవసరాలకు సరి పడ ప్రత్యా మ్నాయ ఇంధన శక్తిని విని యోగించాలి తీర్మానించు కొంది .అప్పటికి కార్బన ఉద్గారాలను అయిదు శాతం మాత్రమే ఉండేట్లు చేసుకొనే ఆలోచన లో ఉంది ..ఇంగ్లాండ్ కూడా ఇదే ధోరణి లో ఆలోచిస్తోంది .2005 లో అమెరికా ఆఫ్గనిస్తాన్ ఇరాక్ యుద్ధాల కోసం 50 బిలియన్ డాలర్లను కేటాయించింది .దీనికి కారణం ఆయిల్ సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవటమే .ఆయిల్ ను విపరీతం గ వాడటం  వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందని ఆ డబ్బు లో సగ మైనా విండ్ పవర్ ,,సోలార్ పవర్ మీద పెట్టు బడి పెడితే జనానికి భద్రత ,ఆర్ధిక వెసులు బాటు కలుగు తుందని నిపుణుల అభి ప్రాయం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –15 -09 -12 -కాంప్ -అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.