సుమనం

  సుమనం 

సుమన్ పేరు చెబితే ఈ టి..వి.గుర్తొస్తుంది ఈ టి.వి అనగానే సుమన్ జ్ఞాపకం వస్తాడు .ఆ లోగో చూస్తుంటే ,ఆ సీరియల్ల ప్రారంభం పాటలు వింటుంటే ఆ సీరియల్ రియల్ గా నే హిట్టవుతుందని నమ్మకం కలుగు తుంది .తీసే ప్రతి సన్నీ వేశం లో పెర్ఫెక్షన్ కన్పిస్తుంది .మొదట్లో డబ్బింగు సీరియల్లకే ప్రాధాన్యం ఇచ్చినా క్రమ క్రమంగా స్వంత  వాణీ బాణీ తెచ్చిన వాడు సుమన్ .అతను ఒక గొప్ప చిత్ర కారుడు అవటం గొప్ప ఎస్సెట్ .అతని చిత్రం తో సీరియల్ మొదలవు తుంటే దానికో నిండుదనం కన్పిస్తుంది .సీరియల్ కు ఈ .టి.వి.లో గొప్ప స్తానం కల్పించిన వాడు సుమన్ .మరీ బజారు పోట్లాటలు ,అసహ్య సన్నీ వేశాలు పిచ్చి వేషాలు లేని సీరియల్ల కు పెట్టింది పేరు అన్నట్లు తీశాడు సుమన్ .ఎందరో నటులకు నటీమణులకు అతని ప్రోత్సాహం ఉత్తేజితుల్ని చేసి ,వారి లోని ప్రతిభను రా  బట్ట గలిగాడు .అచ్యుత్ అందులో మంచి పేరు పొందాడు అశ్విని ,కిన్నెర ,యమునా మొదలన స్త్రీ కళా కారులు తమ సత్తా చాటారు .పాటలను దాదాపు ఆయనే రాశాడు .వందలాది పాటలు రాసినా అందులో ఎంతో వైవిధ్యం కన్పిస్తుంది .వాసూరావు , ,మాధవ పెద్ది సురేష్ వంటి సంగీత దర్శకులకు అదొక ఆస్థానం .ఆ స్తానం శాశ్వతం గా ఉండేట్లు వాళ్ళందరూ ఆ యన నేతృత్వం లో పని చేశారు .గాయకులూ నీహాల్, మనో కౌసల్యా మొదలైన వారు  తమ స్వర సంతర్పణ చేశారు ఈ చానెల్ లో .ఒక కొత్త ప్రక్రియ ”పాడుతా తీయ గా ”లాంటి వాటికి స్థానం కల్పించి వర్ధ మాన గాయకులేన్దరికో ప్రోత్సాహం కల్పించారు .తండ్రి రామోజీ రావు గారు తన పై పెట్టిన బాధ్యత ను అతి సమర్ధ వంతం గా నేర వేర్చి తండ్రికి ముదాన్ని చానెల్ కు ప్రజాదరణను ప్రేక్షకులకు వినోదం తో బాటు విజ్ఞానాన్ని పంచి పెట్టాడు .ఈ నాడు సినిమాలకు కూడా ప్రత్యేకత ఉంది .మంచి సిని మాలు ఆ నాటివి, ఈ నాటివి కలిపి ప్రేక్షక హృదయ రంజనం చేయటంఈ చానెల్ ప్రత్యేకత  .ఒకే వర్గానికో కుటుంబానికో సంబంధించిన సిని మాలు వేసి వేసి బోర కొట్టించక పోవటమూ హర్షణీయం .
పంచ తంత్రం సీరియల్ తో గొప్ప సంచలనాన్ని సృష్టించారు .పిల్లలకు ఎంతో వినోదాన్ని పంచారు .భాగవతం ప్రారంభించ టానికి ఎంత గ్రౌండ్ వరకు చేశారో చూస్తె ఆశ్చర్యమేస్తుంది .చివరికి బాపు రామణలను వదిలేసినా సీరియల్ ను రక్తి కత్తించటం లో  లో కృత కృత్యు లయారు .సుమన్ లో మంచి మనసు ఉంది అని అతని తో పని చేసిన కళా కారు లందరూ ఆ నాడూ చెప్పారు ఈనాడూ చెప్పుతున్నారు .అతనిది” వర్కహాలికతత్వం” అని అందరు అంటారు .తనకు కావలసినదేదో ఆర్టిస్టు ల నుంచి రా బట్టు కొనే దాకా విశ్రాంతి తీసుకోడని అందరి అభిప్రాయం .అంత పెద్ద చానల్ కు అది నేత గా ఉంటూ తన ఆర్టిస్టులతో భేషజం లేకుండా ప్రవర్తించి వారి మనసుల్ని దోచుకొన్నాడు .నిరంతర కఠోర శ్రమ ఆయన ఆరోగ్యం పై ప్రభావం చూపిందేమో నని పిస్తుంది .లేక పోతే నలభై అయిదేల్లకే అతను అమరుడవటం బాధా కరమే .అతని లో  తపన, ధ్యేయం, సాధన, నిరంతర కృషి ఉండటం అభినందించాల్సిన విషయం .తోటి వారి లో ఒకడు గా ఉంటూ తన లక్ష్యాన్ని నేర వేర్చుకొన్న ఘనుడు సుమనుడు .
సుమన్ లో దైవ భక్తీ రాశీ భూతమై ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి  పై వేయి  అన్ని సందర్భాలకు సంబంధిన పాటలు రాసి సుస్వరం గా స్వర పరిపించి మంచి గాయకులతో పాడించి సహస్ర గేయ స్తోత్ర మాల గా ఆ బాలాజీ కి సమర్పించిన భక్తీ భావ బందురుడు .ఒక రకం గా తన ఆత్మా సమర్పనే చేశాడు .చిన్న చిన్న మాట లతో గంభీర భావాన్ని పొడగతం సుమన్ ప్రత్యేకత . .అతని ప్రతి మాటకు ప్రతి పాటకు ఒక నిర్దుష్ట భావన ఉంటుంది ..బయట ఈ సభల్లోనూ కనీ పించటం అరుదే .తన చానల్, తన పని, దాని విశిష్టతకై కృషి అదే అతని కార్య క్రమం .మహిళలకు  వంటా, వారి సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించటం అతను తొక్కిన కొత్త బాట .”మార్గ దర్శి” ఈ నాడు కు యేన లేని కీర్తిని తెచ్చి పెట్టింది .ఎందరెందరో మహాను భావులను వారి సేవా నిరతిని సమాజానికి వారు చేసిన సేవలను వెలుగు లోకి తెచ్చే అద్భుత కార్య క్రమం ఇది .నిజం గా నే మిగిలిన చానెళ్లకు కూడా మార్గ దర్శి గా కన్పిన్స్తుంది .ప్రేరణా స్ఫూర్తి కల్గిస్తుంది .అలాగే డిటెక్టివ్ కధలు తీసిచూపే నేర్పు ముచ్చట గా ఉంది .ఒక వ్యక్తీ ఇన్ని కొణాల లో ఆలోచించి దాన్ని ప్రదర్శించి దాంతో ప్రజాహృదయాలను చూర గోనటం ఆషా మాషీ కాదు .
2004ఎన్నికల ముందు తర్వాతవచ్చిన ”మాయా బజార్”అనే రాజకీయ సీరియల్ ఒక ఊపు ఊపింది .ఎన్నో ఆలోచనలను తేరపైకి తెచ్చింది .ఎక్కడ ఏమి జరుగుతోందో జనానికి తెలిసింది .ఇలా ఆనాడు తీయటం  సాహసమే .ఇలాంటివి ఉండాలి అనే భావం రావటం ఒక గొప్ప విషయం .హాస్యానికి సమ ప్రాధాన్యం ఉంది .అన్నిటి కంటే ఈ నాడు వార్తలు అంటే ”గప్పూ గాసిప్పు కాదు ”అసలు సిసలైన వార్తలు అని పించటం ఈ చానల్ ప్రత్యేకత .ఏదో సంఘటన జరి గింది కదా అని కెమెరా అక్కడే పెట్టి తీసి తీసి చూపి చూపి జనం సహనానికి పరీక్ష పెట్టక పోవటం దీని ప్రత్యేకత . న్యూస్ న్యూస్ గానే ఉంటుంది ”వ్యూస్ ”గా ఉండదు. రామోజీ రావు గారికి సుమన్ కూడా ఈ క్రెడిట్ దక్కు తుంది అనుకుంటా .ఇంకో విషయం వార్తలు చది వే వారు తీసుకొనే గొప్ప శ్రద్ధ .స్త్రీలు  లు మాత్రం సాంప్రదాయ వేష ధారణ లో వార్తలు చదివి తప్పులు లేకుండా రక్తి కట్టించటం ఆ మహిళా మణు లను చూస్తె చేయెత్తి నమస్కరించాలి అని పిస్తుంది .ఇది ఈ చానల్ ప్రత్యేకత . .దీన్ని అందరు మెచ్చాల్సిన విషయం .
భాష విషయం లో ఎన్నో కబుర్లు చెప్ప  వచ్చు .కాని ఆచరణ లో పెట్టటం గొప్ప సవాల్ .ఆ సవాల్ ను అధిగ మించి ”తెలుగు వెలుగులు ”శీర్షిక ను ప్రారంభించి అన్ని రకాల ప్రక్రియ లకు ప్రాధాన్యం ఇచ్చి తెలుగు భాష లో లబ్ధ ప్రతిష్టులైన వారందరినీ రప్పించి ,వారితో భాషా సౌందర్యాన్ని తెలుగు గొప్ప దనాన్ని విన్పించి మన చమక్కులు సామెతల ఆమెతలు అంటే విందు భోజనాలు ఏర్పాటు చేసి తెలుగును చానెల్ లో భక్తీ గా ఊరేగించటం అభి నందనీయం .దీనికి ఈ టి.వి.ని అభి నందించాలి .సుమన్ మరణం తో ఆంద్ర సాహితీ లోకం ఒక సాహితీ బాన్ధవుడిని కోల్పోయింది .సుమన్ ఉంటె చానెల్ మరిన్ని విషయాలలో ముందంజ వేసేది. పాపం అతని హఠాత్ మరణం తండ్రి రామోజీ రావు  గారికే కాదు, ఈ నాడు టీ వీ వారికి, దాని నభి మానించే లక్షలాది ప్రేక్షకులకు ఆశని పాతమే .”సుమం” తో సమాన మై న సున్నిత   సుమనస్కుడు అయిన సుమన్ అమర రహే -”.సు మనం” అంటే మంచి మనసు అని ఈ పాటికి గ్రహించే ఉంటారు .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –16-9-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

2 Responses to సుమనం

  1. చక్కగా ఉంది మీ సమీక్ష. ఆ సుమనుడి మనస్సులో( మహాకవి జాషువా పేర్కొన్నట్లు) ‘ ఈ లోకమ్మున వృద్ధి కాదగిన ఏ విద్యలల్లాడునో ?’ మరి !!!– ఇంత చిన్న వయస్సులోనే అమరుడయ్యాడు.
    –ముత్తేవి రవీంద్రనాథ్.

    • gdurgaprasad says:

      మీ సహృదయ స్పందనకు నమస్కారాలతోకృతజ్ఞతలు – దుర్గా ప్రసాద్

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.