అమెరికా డైరీ వీక్లీ రీడింగ్ వీక్

 వీక్లీ రీడింగ్ వీక్ 
సెప్టెంబర్ పది సోమ వారం నుంచి పదహారు ఆది వారం వరకు విశేషాలు –
మేము అమెరికా వచ్చి ఈ పద వ తేదీ కి సరిగ్గా అయిదు నెలలయింది .అన్గలూరు  రాజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేశారు .ఆయన కాలి  ఫోర్నియా వెళ్లి వచ్చి నట్లు  చెప్పారు .ఆది నారాయణ గారి కోడలు అనారోగ్యం గురించి చెప్పి, ఇప్పుడు పూర్తిగా తగ్గి కులాసా గా ఉన్నట్లు తె లియ జేశాను .ఆది నారాయణ తో మాట్లాడ మన్నాను. సాయంత్రం పక్కింటి గాయత్రీ ,రవి దంపతులకు శ్రీ హనుమ కదా నిది ,మా అక్కయ్య పుస్తకాలను ఇచ్చాము .మంగళ వారం మైనేని గోపాల కృష్ణ గారికి ఫోన్ చేసి మాట్లాడాను .మా ఇండియా ప్రయాణం అక్టోబర్ మూడు బుధ వారం అని చెప్పా.బాపు గారి ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉన్నట్లు తెలియ జేశారాయన .బుధ వారం హూస్టన్ నుంచి వావిలాల లక్ష్మి గారు ఫోన్ చేశారు .ఇండియా వస్తే ఎవరింటికి వెళ్ళాలో తెలీయటం లేదన్నారు .”ఉయ్యూరు లో మేమున్నా మని  గుర్తుంచుకోండి .మీరు ఎప్పుడు వచ్చినా వెల్కం” ”అన్నాము .గురు వారం రాత్రి ఆది నారాయణ ఫోన్ చేసి ”విమానం ”గురించిన ఆర్టికల్ చాలా బాగుందని దాన్ని కాపీలు తీసి మిత్రులకు ఇస్తున్నట్లు సంతోషం గా చెప్పారు .రచనకు అంత కంటే పరమార్ధం ఏముంటుంది ?ఆదినారాయణ వాళ్ళ ఇండియా ప్రయాణం ఇరవై రెండు  అయితే ,రాజేంద్ర ప్రసాద్ వాళ్ళది ముప్ఫై న.
          మహాన్న దాత డొక్కా సీతమ్మ తల్లి 
ఆస్టిన్ లో ఆదినారాయణ వాళ్ళ అమ్మాయి వాళ్ళ  ఇంటి ప్రక్క నే ఉంటున్న శ్రీ డొక్కా రామయ్య గారు మహాన్న దాత, భద్రాచలం దగ్గర ఉండేస్వర్గీయ  డొక్కా సీతమ్మ గారి మనుమడు  అని చెప్పారు .చాలా ఆనందం వేసింది .దాదాపు వంద  సంవత్స రాల క్రితం డొక్కా సీతమ్మ గారి అన్నదానం గురించి ఆంద్ర దేశం లో తెలియని వారు లేరు .ఎవరు ఎప్పుడు  యే వేళఇంటికి వచ్చినా అన్నం వండి, వడ్డించి, సంతృప్తి గా భోజనం పెట్టె మహా ఇల్లాలు గా సీతమ్మ గారిని గురించి చెప్పుకొంటారు .ఆమె వదాన్యతకు, దాతృత్వానికి ,అన్న సమరాధనకు చేతు లెత్తి నమస్కరించని ఆంధ్రుడు లేడు .యాత్రికుడు తిన్నాడో లేదో అని స్వయం గా విచారించి ఒక వేళ మోహ మాటం పడితే ”ఒర్ నాయనా ! అన్నం పర బ్రహ్మ స్వరూపం .దాన్ని తిని జీవుణ్ణి తృప్తి చెందిస్తేనే భగ వంతుడు కూడా తృప్తి చెందుతాడు ”అని పిలిచి మరీ అన్నం పెట్టె దొడ్డ ఇల్లాలు .భర్త గారు కూడా అంత సహకారాన్నివ్వ బట్టే ఆమె అన్న సమారాధన నిరంత రయం గా సాగింది .ఖాళీ కడుపు పుతో ఎవరూ వేళ్ళ రాదు అని ఆమె నియమం .సీతా రాముల సన్ని  దా నం లో ఉండబట్టేనేమో, ఆయమ్మ కు ఆ సీతా సాధ్వి సుగుణాలన్నీ వచ్చి ఉంటాయి ”.ఆంద్ర దేశపు మరో కాశీ అన్న పూర్ణ” మన డొక్కా సీతమ్మ తల్లి .అ మహా త్యాగ మూర్తికి ఎన్ని నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియ జేసినా ఆమె  ఋణం తీర్చు కో లేము .కలిగి, సిరిఉండి  అన్న దానం చేయటం వేరు పెద్దగా ఏమీ లేకుండా నే ఆ గొప్ప బుద్ధి కలగటం దాన్ని ఆచరణ సాధ్యం చేయటం ఆమె కే సరి పోయింది సీతమ్మ గారు 1841 లో జన్మించి 1909 లో మరణించింది .భర్త మరణం తర్వాత ఆమె సాంప్రదాయానికి విరుద్ధం గా అందర్నీ ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టటం ఊళ్ళో బ్రాహ్మలకు అసూయ ,కోపం తెప్పించాయి .ఆమె ను చాలా అవమానించారు .కానీ  కర్తవ్య పరాయణు  రాలై న ఆమె వాటిని పట్టించు కో కుండా తన పని తాను చేసుకొని పోయింది .ఎవరి బెది రిమ్పులకు ఝడవ లేదు .అన్న సమారాధన కోసం ఆమె ఎకరా లన్నీ అమ్మింది. చివరకు ఆమె కు మిగిలింది ఉన్న ఇల్లు ,అతి కొద్ది పొలం మాత్రమే .అయినా చలించ లేదామే .నిరతాన్న దానాన్ని కొన సాగించింది ..చివరికి ఆమె లో ఓపిక నశించి కాశీ వెళ్లి అక్కడే మరణించాలని అనుకొంది  .ఏరోజు కా రోజూ ఇదే ఆఖరి రోజూ రేపే కాశీ ప్రయాణం అను  కొంటు నలభై ఏళ్ళు గడిపింది .అతిధి సేవ ,అన్నం పెట్టటం అంటే ఆమెకు అంత ఇష్టం దీనికోసం కాశీ విశ్వేశ్వర దర్శనాన్నే వాయిదా వేసుకొన్న అన్న పూర్ణమ్మ ఆమె .
చివరికి తెగించి ఒకఎడ్ల బండీ  మాట్లాడు కోని,కాశీ  ప్రయాణానికి బయల్దేరింది .గతుకుల రోడ్డు మీద ప్రయాణం చేసి అలిసి పోయి ఒక సత్రం లో పడుకొంది  .అర్ధ రాత్రి ఆ సత్రం లో నుండి ,  తండ్రీ తల్లి  కొడుకుల  మాటలేవో విని పించాయి .పిల్లలు ఆకలికి అలమటిస్తున్నారు .తల్లీ తండ్రీ ”ఒరే నాయన లారా కొన్ని గంటలు ఓపిక పట్టండి .మనం డొక్కా సీతమ్మ గారింటికి చేరా బోతున్నాం .అక్కడ ఆ మహా ఇల్లాలు వంట చేసి సిద్ధం గా ఉంచు తుంది .మనల్ని పిలిచి అన్నం పెడు తుంది ”ఒక పిల్లాడు ”సీతమ్మ గారిన్టికే ఎందుకు వెళ్ళాలి ”? అని ప్రశ్నించాడు .దానికా తలి దండ్రులు ”సీతమ్మ గారు మర్యాద గా పిలిచి గౌరవం గా కడుపు నిండా భోజనం పెడుతుంది .అలాంటి ఇల్లాలు ఈ పరగణా లోనే లేదు ”అన్న మాటలు విన్నది .అంతే ఆమె కు నిద్ర పట్ట లేదు .వెంటనే బండీ వాణ్ని నిద్ర లేపి బండీ కట్టించి వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లి పోయింది .అర్ధ రాత్రి సమయం . సత్రం లోని వాళ్ళు నెమ్మది గా సీతమ్మ గారింటికి వచ్చారు .తలుపులు తీసి ఉండక పోవటం వల్ల ఆమె లేదను కొన్నారు .రెండు నిమిషాలలో కమ్మని పప్పు కూరా పులుసు ల  వాసన లు నాసికలకు  సోకాయి .ఆమె వీరిని ఆప్యాయం గా లోపలి ఆహ్వానించి అడిగి అడిగి మరీ వడ్డించి భోజనాలు పెట్టి త్రుప్తిచెందింది .ఇక ఆమె కు కాశీ వెళ్ళే ఆలోచన విరమించుకొంది . .
..  .ఆదినారాయణ వల్ల ఆ సాధ్వి సీతమ్మ గారిని ఈ రూపం గా స్మరించే అదృష్టం నాకు దక్కింది .రామయ్య గారు ఆస్టిన్ లో తెలుగు ను బోధిస్తూ ,చిన్న పిల్లలకు తెలుగు లో పద్యాలు మొదలైన వి నేర్పిస్తూ శ్లోకాలను అభ్యాసం చేయిస్తూ పోటీ పరీక్షలు నిర్వహించి బహుమతు లంద జేస్తూ ”అమెరికా ఉన్న  ఆంద్ర తేజం ”అని పిస్తున్నారు .వారిని గురించి సమగ్ర సమాచారాన్ని నాకు అంద జేయ మని ఆదినారాయణ కు మెయిల్ చేశాను .వస్తే వారి గురించి అందరికి తెలిసే ఒక మంచి వ్యాసం రాయాలని ఉంది .అలాగే ఆస్టిన్ లోనే ఉన్న మరో దేశీయభి మాని శ్రీ ఆచార్యుల వారు కూడా చాలా కాలం గా సంస్కృతాన్ని నేర్పుతూ గీర్వాణ భాషా గౌరవాన్ని విద్యార్ధులకు తెలియ జేస్తూ ,అభి రుచి కల్గిస్తూ భాషా సేవ చేస్తున్నట్లు ఆది నారాయణ నాకు ఇది వరకే ఫోన్ లో చెప్పారు .వీరి గురించి కూడా వివరాలు నాకు పంపమని చెప్పాను .
శుక్ర వారం రాత్రి మా అమ్మాయి వాళ్ళింట్లో భజన .ఎనిమిది నుండి తొమ్మిది దాకా జరిగింది .వల్లం దంపతులు సుబ్బు ఫామిలీ ,రాహుల్ కుటుంబం వచ్చారు .
                 వీక్లీ రీడింగ్ క్లాసులు 
మా అల్లుడు ఎప్పటి నుంచో ప్లాన్ చేసిన ”వీక్లీ రీడింగ్ క్లాసులు ”ఈ శని వారంసాయంత్రం  నుండి ప్రారంభించాడు .నాగమణి భర్త సహాయం చేశాడు .పది మంది వచ్చారు .ఆరోక్లాసు లోపు వారికే .ఇందులో ముగ్గురు మా మన వళ్ళు .పవన్ కూతురు, ప్రియా ఇద్దరు కూతుళ్ళు ,నాగమణి కొడుకు వగైరాలు .ఇంకొందరు తరువాతి వారం నుండి వచ్చే అవకాశం ఉంది .మా మన వళ్ళకు ఇది వరకే ఈ క్లాసులు, ఆ రీడింగ్ మెటీరియల్ చేయటం అలవాటే .ఈ క్లాసుల కోసం కుర్చీలు టేబుల్లు ,బోర్డు సిద్ధం .
శని వారం ఉదయం సత్యా సౌమ్య ల అమ్మాయి హాపీ బర్త్ డేని స్కేటింగ్ హాల్ లో జరిపితే మా అమ్మాయి మన వళ్ళు వెళ్లారు. బాగా ఎంజాయ్ చేశారు .అందరికి గిఫ్టులు ఇ చ్చారట .
ఆది వారం మా అల్లుడి ఇండియా ప్రయాణం .పన్నెండు రోజుల trip .మళ్ళీ ఇరవై యేడు బయల్దేరి ఇరవై ఎనిమిది కి ఇక్కడికి వస్తాడు .ఉదయం ఏడున్నర ఫ్లైట్ కు నేను మా అమ్మాయి ఆయన తో వెళ్లి ఎయిర్ పోర్ట్ లో దింపి ఇంటికి వచ్చాం .
లైబ్రరీ పుస్తకాలన్నీ చదవటం పూర్తీ అయింది .కొత్త పుస్తకాలు తెచ్చే ఆలోచన లేదు .ఈ సారి పుస్తకాలన్నీ విలు వై న వే .వీటిలోని విషయాలను చాలా భాగం ఆర్తికల్సు గా రాసేసి మీ కు అందించాను .మిగిలినవాటి  విశేషాలను నోట్సు రాసుకోన్నాను .వీలు వెంబడి వాటిని అంద జేస్తాను .
అందరికి  ” శ్రీ  వినాయక చవితి శుభాకాంక్షలు ”.రేపటి నుండి కొత్త ఆధ్యాత్మిక ధారా వాహిక ప్రారంభం అని గుర్తు ఉండే ఉంటుంది కదా .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-9-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.