బాలి -కళా కేళి
బాలీ ద్వీపం లో కళలు అద్భుతం గా వర్ధిల్లు తున్నాయి .అవి అక్కడి సంస్కృతి ,ప్రజల మనోభావాలను ప్రతి బిమ్బిస్తాయి .అందులో దేవాలయ శిల్ప కళ ,నాట్యం ,చిత్రకళా ,సంగీతం ,నాటకం అన్నీ చాలా బాగా రాణిస్తున్నాయి .ఈ కళలన్ని భగవ రాధన గా భావిస్తారు .ఇక్కడ యే కళ అయినా రామాయణ ,మహా భారత లే ప్రాతి పదికలు గా ఉంటాయి .తోలు బొమ్మ లాటకూ ప్రాధాన్యత ఉంది .మతమే బాలి లో సంస్కృతికి మూల బీజం .పదహారవ శతాబ్దం నుండి ,ఇరవై శతాబ్దం వరకు క్లాసికల్ కల్చర్ కు తూర్పు బాలి కేంద్రమైంది .ఊబుద్ ఇప్పుడు ఆధునిక కళకు నిలయమైంది .
1920 వరకు సాంప్రదాయ ”కామసాన ”పద్ధతిలో చిత్రకళా సాగింది ఇవి టు డైమెన్షన్ కలవి .వీటిని వస్త్రం లేక చెట్టు బెరడు మీద గీసే వారు .సహజ వర్ణాలను వాడే వారు .తక్కువ రంగులే ఉపయోగించే వారు .1930లో పాశ్చాత్య ప్రభావానికి లోనైంది .కొత్త పదార్ధాలను వాడటం ప్రారంభించారు .అయినా బాలి సంస్కృతికి భిన్నం గా లేకుండా జాగ్రత్త పడ్డారు .దీన్నే” modern traditional Balinese painting ”అని పిలుస్తారు .ప్రపంచం లో చాలా దేశాలలో వీరి చిత్రాలను ప్రదర్శిస్తారు .మ్యూజియమ్స్ లో అలంకరిస్తారు .సాధారణం గా దేవుళ్ళ దేవతల చిత్రాలే ఎక్కువ గా ఉంటాయి .వీరే వారికి స్ఫూర్తి .తమ చిత్రాల ద్వారా భగ వంతుడిని సేవ చేయ వచ్చు నని వాళ్ళ అభి ప్రాయం .
దేవాలయ శిల్ప కళ ఇక్కడ బాగా వర్ధిల్లింది .ప్రాచీన ఆచారాలనే వారు పాటిస్తారు .నిర్మాణమంతా ”హస్త కౌశల కౌశలి ”పద్ధతి లో ఉంటుంది .ప్రతి శిల్పి తన తండ్రి లేక తాత నుంచి వారసత్వం గా ఈ కళను పొందుతాడు .ఇదొక పరమ పవిత్ర కార్యం గా వారు భావిస్తారు .దీనికి డబ్బు ఏమీ తీసుకోరు .అలా దేవాలయనిర్మాణాన్ని చేసే వారిని ”ఉదంగి ”లంటారు .వీరికి ఉదర పోషణకు వేరే వ్యాప కాలుంటాయి. కనుక ధనం ప్రధానం కాదు .అలా తీసుకొంటే తప్పు అని అంటారు ఇన్ని దేవాలయాలను ఇళ్లను కట్టినా ఇందులో చాలా మంది ఉదంగి లకు స్వంత ఇల్లు ఉండడదు .
బాలి దీవి లో పదహారవ శతాబ్దం లో నిర్మించబడిన” Ubud palace court yard ”అనేది నాట్యానికి గొప్ప వేదిక .ఇక్కడే డాన్సు ,డ్రామా లను ప్రదర్శిస్తారు .బాలి మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న ప్రదేశం .ఈ కళను చూసి యాత్రికులు పరవశిస్తారు .వీటికోసమే వచ్చే వారు చాలా మంది ఉంటారు .హైస్కూల్ లో ప్రాధమికం గా అందరికి నృత్యం నేర్పిస్తారు .వీటికి తోడు ప్రైవేట్ విద్యాలయాలున్నాయి .వీటిని ”సంగార్ ”అంటారు .ఇవి సంస్కృతీ రక్షక నిలయాలు .పాశ్చాత్య సంస్కృతి వల్ల తమ కళల కేమీ ప్రమాదం లేదని వీరి ధీమా .ప్రతి ఏడాది ”బాలి ఆర్ట్ ఫెస్టివల్ ”జూన్ ,జులై లలో నిర్వహిస్తారు .అందుకని ఇది ప్రదర్శన కళ గా బాగా రాణించింది దీని ఆత్మ అంతా హిందూ ధర్మమే నంటారు వాళ్ళు .అక్కడ దేవాలయానికి కాని వివాహాది శుభ కార్యాలకు కాని ఉత్స వాలకు కాని అందరు సాంప్రదాయ దుస్తులనే ధరించి వెళ్ళాలి .అలానే వెళ్తారు కూడా .కళలు వినోదానికి మాత్రమె కాదని భగవంతునికి నివేదన అని వారు ద్రుధం గా నమ్ముతారు .
రిథం కు ప్రాధాన్యం .వీరి సంగీతం లో metallo phones ,gongs , ,xylophones ,ను బాగా ఉపయోగిస్తారు .వీరి సామ్ప్రదాయమైన వాయిద్యం వెదురు తో చేసిన బూరా దీన్ని ”ఆన్క్లుంగ్ ”అంటారు .రెండు తీగల ఫిడేల్ వంటి ”రేబాబ్ ” వీరికి చాలా ఇష్టం .వీరి డాన్సు లో బోరాంగు డాన్సు ముఖ్య మైనది .ఇందులో దేవుడు దుష్ట శక్తులను అణచటం ఉంటుంది .దుష్ట శక్తుల్ని పరి మార్చటం కాదు కాని, సంస్కరణ వీరికి ఇష్టం .ఈ డాన్సు చాలా సంక్లిష్టం గా ఉంటుంది .పాద విన్యాసాలు చాలా కష్టం గా ఉంటాయి .అయినా కష్ట పడి సాధన చేస్తారు .ఇది రాజ దర్బారుల్లో ప్రదర్శించే దైవీ కళ .దీన్ని ఆడపిల్లలే చేస్తారు రజస్వల కాని పిల్లలే చేయాలి .అయిదేళ్ళ లోపు పిల్లలకే తీవ్రం గా నేర్పటం ప్రారంభిస్తారు .ఈ డాన్సు చేసిన వారికి ఉన్నత ఉద్యోగాలు, పదవులు ,రాజ కుటుంబీకుల తో వివాహాలు జరుగు తాయి .”kecak ”డాన్సు కూడా ముఖ్యమైనదే .ఇది రామాయణం లో కోతి మూక మాట్లాడటం (monkey chat ).150 మంది గుండ్రం గా కూర్చుని సంబంధిత దుస్తులు ధరించి చేసేది. తమాషా గా వింత ధ్వని తో ”కాక్ ”అని ఆయుధాలు పడేస్తారు .ఇదిరామ రావణ యుద్ధం లో హనుమంతునికి సంబంధించిన కధ .వీరికి చాలా ఇష్టం .పపేట్ షో కూడా అమితం గా ఇక్కడ ప్రదర్శింప బడుతుంది నూనె దీపాల వెలుతురు తో దీన్ని రామాయణ ,మహా భారత గాధలను ప్రదర్శిం ఛే వారు .ఇప్పుడు కరెంటు దీపాలోచ్చాయి .
చిన్నప్పటి నుంచే పిల్లలకు డాన్సు నేర్పుతారు .ఉయ్యాల్లో ఉండగానే సంగీతానికి ప్రాధాన్యత నిస్తారు తల్లి అభినయ ముద్రలను పిల్లలకు నడక రావటాని కంటే ముందే నేర్పిస్తుంది .ఎంతో మంది గురువులు గ్రామాలలో సంగీతం నాట్యం నేర్పుతారు .వారికి తగిన పారి తోషికం లభిస్తుంది .సంప్రదాయం సంస్కృతి ల మీద అభి రుచే వీరిని ముందుకు నడి పిస్తోంది .ఇలా కళలకు కాణాచి గాఉండి బాలి- కళా కేళితో కళ కళ లాడుతోంది .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –21-9-12-కాంప్–అమెరికా