శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –3
5–”హరిస్త్వా మారాధ్య ,ప్రణత జన సౌభాగ్య జననీం –పురానారీ భూత్వా ,పురరిపు మపి క్షోభ మనయత్
స్మరోపిత్వాం ,నత్వా ,రతి నయన లేహ్యన వపుషా–మునీనా మప్యంతః ప్రభవతి ,హి ,మోహాయ మహతాం .”
తాత్పర్యం –శర్వాణీ !సౌభాగ్యాన్ని ఇచ్చే నిన్ను ఆరాధించే ,పూర్వం విష్ణు మూర్తి మోహినీ రూపం ధరించి ,త్రిపుర సంహారకు డైన మహేశ్వరుడిని కూడా మొహం చెందించాడు .శరీరమే లేని మన్మధుడు నీకు నమస్కరించి ,భార్య అయిన రతీ దేవి కన్ను లతో ఆస్వాదించ దగిన శరీరం తో మునీశ్వరులనే మోహ పెడుతున్నాడు .నీ అనుగ్రహం లోకా ద్భుతం గా ఉంది .లలితా దేవిని స్మరిస్తే చాలు ఎంతటి కష్టమైనా పని నైనా చేసే సమర్ధత వస్తుంది అని భావం .
6—”ధనుహ్ పౌష్పం ,మౌర్వీ మధుకర మయీ ,పంచ విశిఖాః–వసంతః సామంతో ,మలయ మరుదా యోధన రధః
తదాప్యేకః,సర్వం ,హిమ గిరి సు తే ,కామపి ,కృపాం –అపామ్గత్తే ,లబ్ధ్వా ,,జగదిద,మనంగో విజయతే ”
తాత్పర్యం -పురాణీ !పూల విల్లు ,తుమ్మెద గుమ్పులే అల్లే త్రాడు ,అయిదు మాత్రమె పుష్ప బాణాలు ,జడుడు, ,సంవత్స రానికి ఒక సారి మాత్రమె కనీ పించే వసంతుడే చెలికాడు గా ,గంధపు కొండ గాలి రధం గా ,చేసుకొని మన్మధుడు ,నీ కడ గంటి చూపు అనే కరుణ తో ,అంతు లేని దయను పొంది ,,ఈ జగత్తు నంతా చేల రేగి జయిస్తున్నాడు .
విశేషం –పుష్పాలు అతి మెత్తనివి సుకుమారమైనవి .తాకితే వాడి పోయేవి .ఎప్పుడూ రోద చేస్తూ ఎగురుతుండే తుమ్మెదలు .ఇవన్నీ సమర్ధ వంత మైనవి కావు .అంటే వీటి పై నమ్మకం పెట్టుకోవ టానికి వీలు లేదు .కాని దేహమే లేని మన్మధుడు ప్రపంచం పై శ్రీ దేవి కరుణా కటాక్షం వల్ల విజ్రుమ్భించి అందర్నీ మోహ పర వశు లను చేయ గలుగు తున్నాడు .కారణం లేకుండానే కార్యం జరిగి పోతోంది .గడ్డి పరక మేరు పర్వతం గా ,మూగ వాడు వాచాలుని గా ,కుంటి వాడిని పర్వతాలను ఎక్కే సామర్ధ్యం కల వానిని గా లలితా త్రిపుర సుందరి చేయ గలుగు తుంది అని భావం .
7—”క్వణత్కాంచీదామా ,కరి కలభ ,కుమ్భస్తన భరా –పరిక్షీణా మధ్యే ,పరిణత ,శరశ్చంద్ర వదనా
ధనుర్బాణాన్ ,పాశం ,సృణీ మపి ,దధానై ,కరతలైహ్ -పురస్తా దాస్తాం నః ,పురమధితు రాహో ,పురుషికా ”
తాత్పర్యం –రుద్రాణీ !మెరిసే మణుల గజ్జల మొల నూళులు ,గున్న ఏనుగు కుంభ స్థలాల వంటి చనులు కలిగి ,సన్నని నడుము తో ,వంగి ,శరత్కాల వెన్నెల వంటి ముఖం తో ,తామర తూడుల వంటి సుతి మెత్తని చేతులతో ,చెరుకు విల్లు ,పూల బాణాలు ,పాశం ,అంకుశం అనే ఆయుధాలను ధరించి ,త్రిపుర సంహారకు డైన ఈశ్వరుని యొక్క అలంకార స్వరూపు రాలైన న శ్రీ దేవి మా ఎదుట సుఖా శీనురా లవుఅవు గాక .
విశేషం –త్రిపురా మంత్ర బీజాలను మదించి ,నవనీతం అంటే వెన్నను తీసే వాడు త్రిపురారి అంటే శివుడు .శ్రీ దేవి స్తూల ఆకారాన్ని ,మంత్ర రూప మైన సూక్ష్మ ఆకారాన్ని ,పరా స్వరూప మైన మాయా కారాన్ని శ్రీ శంకరులు ఇక్కడ సూచించారు .”పరమధితుం ”అనటం లో ఐం ,క్లీ ,సౌహ్ ,అనే త్రిపురా మాతృకా బీజాలను శివుడు ఉద్ద రించి ,లోకాలను ప్రకాశింప జేశాడు అని అర్ధం .అ-అంటే బ్రహ్మ -హ -అంటే శక్తి ఈ రెండు కలిస్తే అహం -అంటే ప్రత్య గాత్మ అయిన పురుషుడు -అదే ”అహో పురిషికా ”అన్న మాటలో భగవత్పాదులు పొదిగారు .గజ్జల మోల నూలు మ్రోత -సాధకునికి ఆజ్ఞా చక్రం తర్వాత విని పించే నాదం అని భావం .సహస్రారం లో పరాశక్తి చంద్ర జ్యోత్స్న గా ప్రకాశిస్తుంది .దానినే ఆది శంకరులు ”పరి ణత శరశ్చంద్ర వదనా ”అనే మాటలో నిక్షిప్తం చేశారు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –21-9-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 978,909 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.22 వ భాగం.31.1.23.
- అరుణ మంత్రార్థం. 7వ భాగం.31.1.23.
- పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవం
- బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-3(చివరి భాగం )
- ముదు నూరులో డా.ఎన్.భాస్కర రావు గారింట్లో జీవిత చరిత్రల గ్రంధాలయ వార్షికోత్సవ 0లో 29.01.2023
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత
- మాఘమాసం సందర్భంగా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్న ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, ప్రభావతి దంపతులు
- ‘’బాపు’’ దర్శన౦ అనే ‘’విధాత తలపు –బాపు ‘-2’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.20 28.01.2023
- అరుణ మంత్రార్థం. 5వ భాగం.28.1.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,920)
- సమీక్ష (1,275)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (300)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (357)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు