భలే బాలి

          భలే బాలి 

ఎన్నో ప్రత్యేకతలు సంత రించుకొన్న ద్వీపం బాలి .కొత్త సంవత్స రానికి చాలా ప్రాముఖ్యత ఉంది .మిగతా దేశాలలో లాగా ఇక్కడ కొత్త ఏడాది వస్తుంటే టపాకాయలు కాల్చటం తెల్లార్లూ మేల్కొని హాపీ న్యు యియర్ చెప్పటం అర్ధ రాత్రి పన్నెండు కు ముందు కౌంట్ డౌన్లు లెక్కించటం ఉండదు .వీరి దృష్టిలో ప్రతి కొత్త సంవత్సరం మనలోని కల్మశాల్ను విసర్జించుకొని ,శుద్దులవటానికే నని భావిస్తారు .కొత్త సంవత్స రాది నాడు సమ్పూర్ణ మౌనాన్ని పాటించటం బాలీ ప్రత్యేకత .మొత్తం దీవి అంతా నిశ్శబ్దం తాండ వీస్తుంది .వీరికి రెండు రాకా లైన కేలన్దర్లున్నాయి .అందులో” pawukon ” అనే కేలండర్ ప్రకారం ఏడాదికి 210 రోజులే .రెండవది ”saka ”కేలండర్ సూర్య ,చంద్ర గమనం ఆధారం గా ఉంటుంది .దీని ప్రకారం” nyepi”అంటే కొత్త సంవత్స రాన్ని గణిస్తారు .2012లో ఇది మార్చి నెల 23న వచ్చింది .ఈ పండుగ తో కొత్త సంవత్సరం ప్రారంభ మైనట్లు గా భావిస్తారు .ఇది వసంత రుతువు ప్రారంభం లో మార్చి ఏప్రిల్ మధ్య లో వస్తుంది .మనకూ అంతే .
కొత్త సంవత్సరం కు ముందు రోజు అందరు సముద్రపు బీచి ల వద్దకు చేరుకొంటారు .అందమైన దుస్తులు ధరిస్తారు .ఈ రోజున ”melaasti ”అనే సంబరం జరుపుతారు .దీని భావం ఏమిటంటే సముద్రానికి , భూమి కి  అధి దేవత దేవుడే అని తెలియ జేయటం .సముద్ర తీరాన ఉన్న దేవాలయాలలో పూజలు నిర్వ హిస్తారు .దేవతలకు నైవేద్యాలు పెడతారు .వరుణ,విష్ణు  దేవుల ప్రసాదం గా నీటిని భావించి దాన్ని ”అమృతం ”అని పిలుస్తారు .ఆ నీటితో శరీరాన్ని శుద్ధి చేసుకొని బాహ్య, అంతర శుద్ధి పొందుతారు .తీర్ధం గా గ్రహిస్తారు .ఆ తర్వాతా రోజు ను భూత యజ్న దినం గా చేస్తారు .సంవత్సరం లో చేసిన పాపాలు ,తప్పులకు పశ్చాత్తాపం ప్రకటించుకొంటారు .తమలోని వ్యతి రేక భావాలను విసర్జిన్చుకొంటామని ప్రతిన పూను తారు .ఇది దేవుడికి మనిషికి, ప్రకృతికి ,మధ్య సమతుల్యతను సాధించటమే .ముందు రోజు స్థానిక హిందువు లంతా గ్రామం అంతా తిరిగి వెదురు దీపాలతో వీలైనంత పెద్ద పెద్ద శబ్దాలను చేస్తారు .దీనితో చెడ్డ భావాలు చెడ్డ దేయ్యాలు వ్యతి రేక శక్తులు లు పారి పోతాయని భావన ,.దీన్ని”ngerupuk ”అంటారు .దీనితో బాలి లోని చెడు అంతా తరిమి వేయ బడిందని అనుకొంటారు ..
ఈ పని అయి పోగానే ద్వీపం అంతా నిశ్శబ్దం అలము కొంటుంది .దీన్నే” nyepi ”.లేక ఉగాది అంటారు .ఉదయం ఆరు గంటల నుండే నిశ్శబ్దాన్ని పాటించటం ప్రారంభిస్తారు .ఇరవై నాలుగు గంటలు పాటు పాటిస్తారు .దెయ్యాలను తరిమేశారు చెడు తలంపులు దూరం అయాయి .అందుకని అంతా ప్రశాంతం అని అర్ధం .అసలు ద్వీపం లో మనషులు ఉన్నారా అన్నంత నిశ్శబ్దం ఏర్పడు తుంది .ఆది ఒక్క బాలి లోనే సాధ్యం .ఈ రోజున స్వీయ భావ పరావర్తనం గా అనుకొంటారు .స్థానిక సెక్యురిటీ వాళ్ళు నల్ల యుని ఫాం వేసుకొని బజార్ల వెంట తిరుగుతూ పర్య వేక్షిస్తారు .యే వాహనాన్ని అనుమతించారు .కాలి నడకా ఉండదు .ఇళ్ళ దగ్గర యే పనీ చేయరు .దాదాపుగా అందరు ఇళ్ళల్లో ఉపవాసం ఉండి పూజాదికాలు నిర్వ హిస్తారు .అగ్ని ప్రజ్వలన ఉండదు .విద్యుద్దీపాలార్పెస్తారు .వీధి దీపాలు వెలిగించరు .రేడియో ,టెలివిజన్ వగైరా లేమీ ఉండవు .రతి కార్యమూ  బందే .విశేషం ఏమిటి అంటే కొత్త సంవత్సరం రోజున కుక్కలు కూడా మొరగవు .గప్ చిప్  .ఇలాంటిది యే దేశం లోను సాధ్యం కాదు .నిజం గా ఇది హిందువుల పండుగ అయినా ,ముస్లిములు, క్రిస్టియన్లు కూడా దీన్ని శ్రద్ధ గా మౌనాన్ని పాటించటం గొప్ప సంగతి .బాలి లోని విమానాశ్రయాన్ని కూడా మూసి వేస్తారు .ఈ విషయాలు ముందే తెలుసుకొని యాత్రికులు జాగ్రత్త పడ తారుదీని తర్వాత రోజున మళ్ళీ జీవితం యదా ప్రకారం మొదలవు తుంది .ఈ రోజును” ngembak geni ”అంటారు . .
ఇక్కడ ఆవు మాంసాన్ని కూడా తింటారు .ఆవు వారికి ”హోలీ”(పున్యమైనది ) యే కాని సేక్రెడ్(పవిత్రమైనది ) కాదని అంటారు .హోలీ అంటే గౌరవింప తగినదని సేక్రెడ్ అంటే అలాంటి దాన్ని తాకను కూడా తాకరాదని అర్ధం చెబుతారు .ఇది భలే గా ఉంది కదూ .అదే భలే బాలి అంటే .ప్రతి వంద ఏళ్లకొక్క సారి ”ఏకా దశ రుద్రఉత్సవం ”చేస్తారు .ఆ రోజున 200 రకాల జంతువులను బలి ఇస్తారు .సాధారణ గృహస్తు ఏడాదికి రెండు నుండి అయిదు డజన్ల జంతువులను బలిస్తాడు. .
ముందే చెప్పుకొన్నాం బాలి లో ఎవరైనా చని పోతే ఆది సమాజం అంతా బాధ్యత గా నిర్వ హిస్తుందని .మేళ తాలతో బాజా భజంత్రీ లతో పెద్ద అట్ట హాసం గా శవాన్ని ఇంటి నుంచి శ్మశానానికి వేడుక గా తీసుకొని వెళ్తారు .ఎవ్వరూ ఏడ వరు నవ్వుతూ ,తుళ్ళుతూ పండుగ లాగా ప్రవర్తిస్తారు .సంగీతం పాడిస్తారు, డాన్సులు చేయిస్తారు .”ఎందుకిలాగా ”? అని మనం సుబ్బరాయ శర్మ లాగా ప్రశ్నిస్తే ”చని పోవటం అంటే దేవుడి దగ్గరకు వెళ్లటం .మనం ఆయన దగ్గర్నుంచే వచ్చాం కదా .మళ్ళీ అకడికి వెళ్తుంటే సంతోషం వ్యక్తం చేయాలి కాని ఏడుపు లెందుకు “‘అని వేదాంత రహస్యాన్ని అద్భుతం గా ఆవిష్కరిస్తారు నిజం గా ఆ విషయం మనకూ తెలుసు .కాని ఏడవ కుండా ఉండలేము. మనం మాటలు మాత్రం చెప్ప గలం .బాలీయులు చేతల తో వేదాంతాన్ని అనుష్టించి చూపిస్తారు .అందుకే భలే బాలి అన్నాను .అంతే కాదు శ్మశానాల దగ్గర కొనుక్కోవ టానికి దుకాణాలు చాలా ఉంటాయి .హాయిగా కొనుక్కొని తింటూ శవ యాత్ర లో పాల్గొన వచ్చు చావును వేడుక గా ,పండుగ గా నిర్వ హించే బాలీయులు భలే వారు .ఆడ వాళ్ళు కూడా చక్కగా శవ యాత్ర లో వెంట వెడతారు నవ్వుతూ తుళ్ళుతూ వెళ్తారు .శవాన్ని మోసుకు వెళ్ళే బండీకి ముందు ఒకటే చిన్న చక్రం ఉంటుంది .ఇదో తమాషా .మనం శవాన్ని పెట్రోల్  తో ,కిరోసిన్ తో కాల్చం .కాని వారు వెంటనే దహనం అవ్వాలని వాటిని సమృద్ధి గా వాడేస్తారు .ఇదీ భలే .
ఇక్కడ దహన సంస్కారం మనిషి చని పోయిన వెంటనే చేయరు .మంచి రోజు చూసి చేస్తారు .ఒక్కో సారి వారం పట్ట వచ్చు నెలలు కూడా పట్టా వచ్చు .రెండు రకాల క్రియలుంటాయి ఒకటి వక్తి గతమైనది ,రెండోది సామూహిక మైనది .ధన వంతులు మంచి రోజు వచ్చే దాకా శవాన్ని ఇంట్లోనే ఉంచుతారు .సాధారణ ప్రజలు స్మశానం లో వెంటనే పూడ్చి మంచి రోజు వచ్చిన తర్వాతా త్రవ్వి తీసి వందా ,రెండు వందల శవాలను ఒక్క సారే సామూహికం గ అ ఖననం చేస్తారు .ఆ రోజున హడా విడి ఎక్కువే .బాజాలు భజంత్రీలు. ఉంటాయి పల్లకీ లో వూరేగిస్తారు .పూజారులు పవిత్ర మంత్రాలు చదువుతుండగా కార్య క్రమాన్ని చేస్తారు .దీనితో అయి పోలేదు ఆ తర్వాతా తంతులు చాలా ఉంటాయి .ఇవన్నీ చేసే సరికి చాలా ఖర్చు అవుతుంది .
మనకు లాగానే అక్కడా పూర్వపు గ్రంధాలన్నీ తాళ పత్రాలలో లిఖించ బడి ఉన్నాయి వీటిని” లోన్తార్” ల పై రాసే వారు .ప్రాచీన 50.,000 లోన్తార్తార్ గ్రందాలున్నాయని అంచనా .అందులో పురాణాలు ,ఇతి హాసాలు ,వేదాలు ,ఆగమాలు ,భూమి రికార్డులు ,మత గ్రంధాలూ వైద్యానికి సంబందినవి ,మాజిక్ కు చెందినవి ,వంశ చరిత్రలు .శిల్పశాత్రం , ,చిత్ర లేఖనం ,కోడి పందాలు నిబంధనలు ఒకటేమిటి సమస్తం అందులో ఉన్నాయి .ప్రతి ఇంట్లో లోన్తార్ గ్రంధాలలో ఏదో ఒకటి ఉంటుంది .చాలా భాగం ”కావి ”భాషలో అంటే ప్రాచీన జావా భాష లోను , కొన్ని సంస్కృతం లోను  ఉన్నాయి .రామాయణ ,మహా భారతాలు సంస్కృతం లో నుంచి కావి భాషలోకి అను వదించి రాసుకొన్నారు .ఇవి పల్లవుల నుండి లభించాయి .కొత్త లాంతార్ గ్రంధాలు” అక్షర బాలి లిపి” లో ఉన్నాయి .ఇది15 శతాబ్దం లో ఇక్కడికి చేరింది .మజా పెహిత్ రాజ్యం ధ్వంసం అవగానే ,ముస్లిములు తమ తో బాటు ఇండో నేషియా కు జావా ,నుండి దీన్ని తెచారు .ఇప్పుడు వీటిని భద్రం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు డిజిటల్ గా మార్చే ప్రయత్నాలు ముమ్మరం అయాయి .అసలు లోన్తార్ అంటే ఏమిటో  తెలుసు కొందాం .ఇది పురాతన జావా మాట .రోన్ అంటే ఆకు .అని ,తాల్ అంటే తాళ వృక్షం అని అర్ధం .అంటే తాటి ఆకు. అదే తాళ పత్రం .రఅనేది  ల గా కాల క్రమం లో మారి పోయింది వీటిని తగిన పరి మాణం లో కత్తి రించి చివరి భాగం లో మూడు రంధ్రాలు చేసి కట్టగా కడతారు .వీటిపై రసాయన పదార్ధాలు బాలీ లోని ఔషధాలు పూసి శుద్ధి చేస్తారు .వాటిపై గంటం తో రాస్తారు .ఇవి అమూల్య పత్రాలుగా ప్రభుత్వం భావించి సంరక్షిస్తోంది .లోన్తా ర్గ్రందాలలో ఎక్కువ శివుని గురించినవే ఉంటాయి .శైవ ఆగమాలు ఎక్కువ .వీటిని డిజిటల్ గా మార్చటానికి సాన్ ఫ్రాన్సిస్కో సహాయం చేస్తోంది .ఇప్పుడు ఆం లైన్ మీద ఇవి లభిస్తున్నాయి ఇదీ భలేగా ఉంది .కొబ్బరి ఆకులను ఎక్కువగా పూజా సమయం లో వాడుతారు చదరం గా ఉన్న అరటి ఆకు లో పదార్ధాలను పెట్టి దేవుడికి నైవేద్యం చేస్తారు .రక రకాల పూలు ,పండ్లు ఉపయోగిస్తారు . ఈవిధం గా బాలీ ద్వీపం హిందూ సంస్కృతిని పరి రక్షించుకొంటు, ప్రాచీన ధర్మ మార్గం లో నడుస్తూ ఆ సంస్కృతిని నిత్య జీవితం లో అవలంబిస్తూ తర తరలకు అంద జేస్తోంది .బాలీ ప్రజలు తమ ప్రత్యేకతను కాపాడుకోవటానికి తీసుకొంటున్న శ్రద్ధ అందరికి  ఆదర్శ ప్రాయం .బాలీ అంటే” జాలీ ”కాదు. బాలీ అంటే కర్తవ్య నిర్వహణ ,సనాత ధర్మ  పరి రక్షణ ,సాంప్రదాయ  రక్షణ .బోలో బాలీ కీ జై .
సమాప్తం                     మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –21-9-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s