అమెరికా డైరీ –శ్రీ వినాయక చవితి వారం

అమెరికా డైరీ –శ్రీ వినాయక చవితి వారం 

సెప్టెంబర్ పది హేడు సోమవారం నుంచి ఇరవై మూడు ఆదివారం వరకు విశేషాలు

సోమ వారం సాయంత్రం లైబ్రరీ లో పుస్తకాలన్నీ ఇచ్చేసి గుడ్ బై చెప్పాను .పద్దెనిమి సెప్టెంబర్ మంగళ వారం   మా శ్రీ మతి పుట్టిన రోజు .మా అమ్మాయి బొబ్బట్లు చేసింది .హోమ్ డిపో లో మంచిచేమంతి పూల కుండీలు రెండు కొన్నాం .సాయంత్రం ప్రక్కనున్న రవి  కుటుంబం ,నాగ మణి కుటుంబం లను పిలిచి మా అమ్మాయి వాళ్ళ అమ్మ పుట్టిన రోజు వేడుక జరి పింది .బొబ్బట్ల నే కేక్ గా భావించి కట్ చేయించింది .అందరికి బొబ్బట్లు పెట్టింది .బిస్కట్లతో సహా .  .గాయత్రి కొడుకు క్లారినెట్ తో ”హేపీ బర్త్ డే” పాట వాయించటం విశేషం .ఆది హేపీ బర్త్ డే,పాట అని మా ఆవిడ చెప్పే దాకా నాకు తెలీదు. రవి తలిదండ్రులు రాఘవేంద్ర రావు గారు సుగుణ కామాక్షి గారు రావటం నిండు దనాన్నిచ్చింది .మా అల్లుడు హైదరాబాద్ కులాసా గా చేరాడు .ప్రేమ చంద్  గారుఫోటోలు చూసి ప్రభావతి జన్మ దిన శుభా కాంక్షలు పంపారు .
   శ్రీ వినాయక చవితి .
పందొమ్మిది బుధ వారం శ్రీ వినాయక చతుర్ధి .మనకు తొలి పండుగ .ఇండియా లో ఉన్నట్లుగా ఇక్కడ హడా విడి ఉండదు .మా మన వళ్ళు పొద్దున్నే స్కూల్ కు వెళ్ళే లోపలే నేను లేచి స్నానం చేసి మామూలు పూజ చేసి ,వాళ్ళతో దేవుడికి పత్రీ వేయించి ప్రార్ధన చేయించి పంపాను .ఆ తర్వాతప్రభావతి మా దొడ్లో కాసిన సోర కాయ ,దోస కాయ ,బీర కాయ ,చమ్మ కాయ ,టమేటా లతో అద్భుతం గా శ్రీ గణేష్ విగ్రహాన్ని చేసిందిమా గార్డెన్ గణేశ (అమెరికాలో .దానికి పాల వెల్లికట్టి ,దొడ్లో పూసిన పూలు ,పత్రీ తో ఉదయం పదింటికి పూజ మొదలు పెట్టి శాస్త్రోక్తం గా చేశాని .మా అమ్మాయి ఉండ్రాళ్ళు ,పాల కాయలు, పాయసం వడపప్పు ,పానకం తయారు చేసింది .నైవేద్యం పెట్టి కధాక్షిన్తలు అందరికి వేసి పూజ పూర్తీ చేశాను .మామిడి కాయ పప్పు ,వంకాయ కూర, సాంబారు, బొబ్బట్ల తో భోజనం .ఈ రోజు నుంచే” సౌందర్య లహరి” పై ఆర్తికల్సు ప్రారంభించాను .కొత్త పంచ ,లాల్చీ కట్టుకోన్నాను .సాయంత్రం పవన్ వాళ్ళింట్లో భజన .సుమారు ఇరవై మంది వచ్చారు . అక్కడ విందు .పవన్ ఇండియా వెళ్లాడు .ఇరవై ఆరున  వస్తాడు .వంకాయ కూర ,ఆలూ కూర ,చట్ని ,ఆవకాయ ,పులిహోర ,పాయసం ,మినప సున్ని ,ఉండ్రాళ్ళు సాంబారు అన్నం, పెరుగు లతో పవన్ భార్య రాధ మంచి విందే ఇచ్చింది .
శుక్ర వారం ఆది నారయణకు ఫోన్ చేశా .వాళ్ళ ప్రయాణం శనివారం హేపీ జర్నీ చెప్పా . సాయంత్రం .మైనేనికి ప్రేమ చంద్ గారికి మా తిరుగు ప్రయాణం గురించి రాశా .మైనేని బెస్ట్ విషెస్ రాశారు .డాక్టర్ యాజికి కూడా తెలయ జేశా .అతనూ వెంటనే స్పందించాడు .రాత్రి మా ఇంట్లో భజన .ఇక్కడి సాయి సెంటర్ వాళ్ళందరూ  రాలీ లో మెడికల్ కాంప్ కు వాలంటరీ చేయ టానికి వెళ్లటం తో భజనకు ఎవరు రాలేదు .మా అమ్మాయి , మా మనవడు శ్రీ కేత్ ఒక పావు గంట భజన గీతాలు పాడి అయిందని పించారు .అంతా అయినతర్వాత రాధా  ,పిల్లలు వచ్చారు .
ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 
ప్రతి ఏడాది శార్లేట్ లో బాంక్ ఆఫ్ అమెరికా సౌజన్యం తో ఫెస్టివల్ ఆఫ్ ఇండియను సెప్టెంబర్ లో నిర్వ హిస్తారు. లేబర్ డే లాంగ్ వీకెండ్ రో జుల్లో.ఈ సారి అధ్యక్షుడు ఒబామా ఇక్కడ డెమొక్రాటిక్ పార్టీ కన్వెంషన్  లో ఆ సమయం లో పాల్గొనటం వల్ల వాయిదా పడి, ఈనెల22 ,23 శని ,ఆది వారాలలో నిర్వ హించారు .ఇది 18  వ ఫెస్టివల్ .దీనితో బాటు ”బాలీ వుడ్ ”ఏర్పడి 180 సంవత్సరాలు అయిన సందర్భం గా కూడా దీన్ని ఘనం గా నిర్వ హించారు .పాటలు ఆటలు డాన్సులు ప్రదర్శన లతో మోత మోగించారు .భారతీయత ఈ రెండు రోజుల్లో కళ్ళకు కట్టించారు .సౌత్ tryon  వీధిలో దీన్ని నిర్వ హించారు .
 అమెరికా లో చిత్ర కళా ” ఆనంద్ మ్ ”  
బాంక్ ఆఫ్ అమెరికా ,వేల్స్ ఫార్గో బాంకుల సమీపం లో ఈ కార్య క్రమం జరిగింది .ఔత్సాహికులైన చిత్ర కారుల చిత్ర కళా ప్రదర్శన ను ఏర్పాటు చేశారు .”knight theater ”పైన ఉన్న హాలులో ప్రదర్శన జరిగింది .హైదరా బాద్ నుండి మా బావ మరది బ్రహ్మానంద శాస్త్రి ఉరఫ్ ఆనంద్ చిత్రించిన” తెలంగాణా ”చిత్రాలను ఆరింటిని శని వారం ఉదయం నేను, మా అమ్మాయి, నాగ మణి భర్త తీసుకొని వెళ్లి స్టాండు లపై ఏర్పాటు చేసి వచ్చాం .మొత్తం నలభై మంది ఆర్టిస్టులు పాల్గొన్నట్లు, తొంబై యేడు చిత్రాలు ప్రదర్శించి నట్లు తెలిసింది .

This slideshow requires JavaScript.

మర్నాడు ఆది వారం మేమందరం వెళ్లి అక్కడ విశేషాలు చూసి సాయంత్రం అయిదింటికి ముగిసే సమయానికి మా చిత్రాలు మేము ఇంటికి తెచ్చుకోన్నాం .మొత్తం ఆరు చిత్రాలకు కలిపి మూడు వేల డాలర్లు అమ్మకానికి పెట్టాం. ఏదీ అమ్ముడు పోలేదు .”బాగా కష్ట పడి వేశారు చాలా బాగున్నాయని మెచ్చుకోన్నారట” కాని ఎవరూ కొనే సాహసం చేయ లేదు .పాపం మా అల్లుడు వీటిని ఇండియా నుండి షిప్పింగ్ లో తెప్పించి ,అమ్మి పెడదామని ప్రయత్నించాడు .మూడేళ్ళ నుండి ఇక్కడే మూలుగుతున్నాయి . ఈ సారి పెట్రోలులు ఖర్చు, పార్కింగ్ చార్జీలు కలిసి ముప్ఫై డాలర్లు పైనే అయాయి. నిరాశ మిగి లింది .మొత్తం మీద అయిదు చిత్రాలే అమ్ముడు పోయి నట్లు నిర్వాహకురాలిని అడిగితే చెప్పింది .అవీ యాభై ,అరవై డాలర్ల మధ్య ఉన్నవే .ఏమైనా ఆర్టిస్టులకు మంచి అవకాశం .తమ ప్రతిభను ప్రదర్శించ టానికి మంచి వేదిక లభిస్తోంది .మంచి వైవిధ్యం ఉన్న చిత్రాలు వచ్చాయి ఊహాత్మికం గా నూ ఉన్నాయి .సంప్రదాయ బద్ధం గా ఉండి చూపరులను ఆకర్షించాయి .ఆడా, మగా చిత్రకారులు పాల్గొన్నారు ..నిర్వాహకులు శ్రద్ధగా నిర్వహించారు .ఫెస్టివల్ అంతా డౌన్ టౌన్ లో నిర్వహించారు .ఈ రూ పెణా,డౌన్ టౌన్ చూసే వీలు కల్గింది .డ్యూక్ ఎనెర్జీ వారి పెద్ద బిల్డింగ్ ,వేల్సు ఫార్గో వారి బిల్దిగు ,బాంక్ ఆఫా అమెరికా వారి బిల్ల్దింగు అన్ని అక్కడే ప్రక్క ప్రక్కన .ఈ ఉత్సవం కోసం రోడ్లు మూసేశారు .శని ,ఆది సెలవలె కనుక అందరు పండగ కు వచ్చి నట్లు వచ్చారు .
వస్త్ర ప్రదర్శన నగల ,పుస్తకాల బొమ్మల ప్రదర్శన కూడా ఉన్నాయి .వస్త్ర వ్యాపారం బాగానే జరిగి నట్లు కనీ పించింది . .
  పాటలు నృత్యాలు 
నైట్ థియేటర్ లో శని ,ఆది వారాలు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్విరామం గా పాట్లు నృత్యాలు ప్రదర్శించారు .తలి దండ్రులు తమ పిల్లలకు సాంప్రదాయ వస్త్ర ధారణా తో తీసుకొని వచ్చి కూచి పూడి,రవీంద్ర ,కేరళ,  బావ్రా ,మొదలైన నృత్యాలను ప్రదర్శించారు .తెలుగు తమిళ బెంగాలీ పంజాబీ మహారాష్ట్ర గుజరాతీ దాన్సులను చేయించారు .శార్లేట్ లోని సుమారు డజన్ నృత్య విద్యాలయాల విద్యార్ధులు తమ అభినయ కౌశలాన్ని చక్కగా ప్రదర్శించారు .కర తాళ ధ్వనులు మారు మ్రోగాయి .అమెరికా లో ఉన్నా ,సాంప్రదాయ నృత్యాన్ని వదల కుండా నేర్చుకొని ప్రదర్శించటం చాలా ముచ్చటగా ఉంది. నేర్పిన గురు వరే న్యులు మరీ అభి నందనీయులు .ఎప్పుడూ ధియేటర్ జనం తో కిట కిట లాడింది .మంచి ప్రోత్సాహం చూపి ప్రేక్షకులు, గొప్ప సహకారం అందించారు .మా ఇంటి దగ్గరున్న ముసునూరు అమ్మాయి నీలిమ కూతురు కూడా డాన్సు చేసింది .
ధియేటర్ లోనే కాకుండా ,ఆరు బయట వేదిక నిర్మించి అక్కడ కూడా పాటలు పాడించి ,చేయించారు .ఇక్కడ పంజాబీ మరాఠీ గుజరాతీ నృత్యాలు చేసి జనం మెప్పు పొందారు .మా ఇంటి దగ్గరున్న గుజరాతీ ఆవిడ ,మిగిలిన వాళ్ళ తో కలిసి గుజరాతీ నృత్యాన్ని అద్భుతం గా చేసింది .వయసు లో ఉన్న వాళ్ళే కాదు, వయసు పై బడిన వారు కూడా ఎక్కడా ఉత్సాహం కోల్పోకుండానృత్యం చేసి , విజయ వంతం చేశారు .చిన్న పిల్లల ప్రదర్శన చూడ ముచ్చటేసింది .థియేటర్ లోకి వెళ్లి చూడ టానికి అయిదు డాలర్ల టికెట్ పెట్టారు .అక్కడే బాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు తిరిగే చక్రాన్ని పెట్టి ఆడించారు .పాయింటర్ ఆగిన చోటును బట్టి బహు మతులిచ్చారు .మా మన వళ్ళు ఆశుతోష్ష్ ,పీయూష్ లు యెర్రని మంచి శాలువాలు గెలుచుకొన్నారు .చాలా మందికి వచ్చాయి .ఇవి అ బాంక్ ఆఫ్ అమెరికా బహు మతులు .
భారతీయ తిను బండారాల స్తాల్సుల్సు జనం తో నిండిపోయాయి .పూరీ ,చపాతీ, దోసె, ఇడ్లీ ,కాఫీ టీ, మాంగో లస్సీ చోలీ కూర, సాంబారు, పాన్ పూరీ  అందర్నీ ఊరించి తినిపించాయి .రెట్లు చాలా తక్కువే .మషాలా దోసె,పాన్ పూరీ పూరీ,ఇడ్లీలు    నాలుగు, కాఫీ ,లస్సీ వగైరా రెండు డాలర్లే .ఆది వారం జనం విశేషం గా వచ్చారు .
  అమెరికా లో అగస్త్య రాజు వారి కలయిక 
ఉయ్యూరు లో మా ఇంటి వద్ద ఉండి కే.సి.పి.లో పని చేసిన,” లండన్ రాఘవ  రావు”అణి పిలువా బడిన    అగస్త్య రాజు రాఘవ రావు గారు మంటాడ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు .వారి అబ్బాయి రామ మోహన రావు గారు కూడా అందులోనే పని చేసి తండ్రి మరణాంతరం దేవాలయాన్ని నిర్వ హించారు .ఆయన భార్య భారతీ ,ఆయనా  మాకు బాగా తెలుసు .క్వార్టర్ల లో ఉంటారు .అనుకో కుండా  ఈ ఆది వారం నాడు ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో వారు కలిశారు .వారమ్మాయి  శార్లేట్ లోనే ఉందట .అమ్మాయి మనుమ రాళ్ళు కూడా కనీ పించారు .మా శ్రీ మతే ముందు గా వాళ్ళను గుర్తు పట్టింది .కాసేపు మాట్లాడుకోన్నాం .ఇలా యాదృచ్చికం గా ఉయ్యూరు వాళ్ళు కలవటం తమాషా గా ఉంది .వారు అక్టోబర్ మధ్యలో ఇండియా వెళ్తారు .
చిన్నపిల్లలకు కాలక్షేపం గా రబ్బరు ,గాలితో నింపిన రెండు ప్లే హౌస్ లున్నాయి .పిల్లలు అందులో బౌన్సింగ్ ఆడి హడా విడి చేసి కాల క్షేపం చేశారు .తలిదండ్రులు చక్కగా వారిని ఆడించారు .
 అమెరికా లో రైతు బజారు  
శని వారం ఇంటికి వస్తు డౌన్ టౌన్ కు దగ్గర లో ఉన్న” ఫార్మేర్ మార్కెట్” కు వెళ్ళాం. ఆంధ్రా లో మార్కెట్ యార్డులున్నట్లే షేడ్ల లో రైతు బజారు నిర్వహిస్తున్నారు .చేతి పరిశ్రమలకు  కూర గాయాలకు ఒక షెడ్డు, పూలు ,చెట్లు  ఇంకో షెడ్డు ఉండి చవక గా తాజాగా లభిస్తాయని అందరు ఆరాట పడి వస్తారు .శని ఆది వారాలే ఉంటుంది ఉదయం పది నుండి రెండు వరకు .జనం వాల్లాడి పోయారు .
 త్రిమూర్తి దేవాలయ ఉత్సవ విగ్రహ ప్రతిష్ట 
డౌన్ టౌన్ లోనే కొద్ది దూరం లో ”త్రిమూర్తి దేవాలయం ”కడు తున్నారు .యెన్ .సి .జగన్నాధం గారు అనే textile వ్యాపారం చేసిన తమిళాయన పది హేను ఏక రాల స్థలం కోని దేవాలయం నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు .మొత్తం ఖర్చు అంతా ఆయనదేనట .గణేశ, బాలాజీ, లక్ష్మి, పద్మావతి దేవుల ఉత్స విగ్రహాలను చేయించి వాటికిఆగమ యుక్తం గా హోమాదులతో ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు .భట్టర్ గారు అనే వారి ఆధ్వర్యం లో మూడు రోజుల కార్య క్రమాన్ని నిర్వ హించారు ఆరు మంది కి పైగా రుత్విక్కులున్నారు ..మేము శని వారం సాయంత్రం వెళ్ళాం .అప్పటికి హోమాలు, అధి వాసాలు, అయి పూర్ణాహుతి జరిగింది .స్వామి వారలకుపవళింపు  సేవలో  నీలాంబరి రాగం లో ”కస్తూరి రంగ రంగా ”అనే కీర్తనను ఒకావిడ మహా శ్రావ్యం గా ఆల పించి అందరి అభిమానాని సంపాదించింది .కొందరు పిల్లలు భక్తీ గీతాలు పాడారు .ప్రసాదం గా పులిహోర,ఉప్మా ,కేసరి, మైసూర్ పాక్ ,సామ్బారన్నం పెరుగన్నం పెట్టారు .
ఆది వారం సాయంత్రం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అ యిన  తర్వాతా మళ్ళీ దేవాలయం దగ్గరకు వచ్చాం .కార్య క్రమాలు పూర్తీ అయి యాజ్నీకులకు సంభావనలు అంద జేస్తున్నారు .మూర్తులను వేదిక పైన ఉంచి ప్రసాదం నైవేద్యం పెట్టి మంగళ హారతి పాడారు .తిరుమల నుండి వచ్చిన ఆలయ పూజారి భగవద్ రామానుజుల వారు రచించిన ”చూర్నిక ”ను శ్రావ్యం గా పాడారు .తిరుమల లో వీరే పాడతారట .ప్రత్యేకం గా పిలి పించారు .ఆ తర్వాతా మూర్తులను అక్కడే ప్రక్కన  నిర్మించిన భవనం లోకి మేళ తాళాలతో తీసుకొని వెళ్లి లోపల ఉన్న వేదిక పై ఉంచారు .ఈ మూర్తులకే ఇక రోజూ పూజా పునస్కారాలు చేస్తారు .రెండేళ్ళ లో ఆలయాన్ని నిర్మించి అసలు విగ్రహాలను చేయించి అప్పుడు ప్రతిష్ట చేస్తారు .అందరికి ప్రసాదం గా చక్ర పొంగలి ఉప్మా ,రవ్వ కేసరి ,సాంబారు అన్నం ,పెరుగన్నం పెట్టారు .అవి స్వీకరించి తిని ఇంటికి వచ్చేసరికిరాత్రి  పది అయింది .ఈ విధం గా అమెరికా లో ఒక ప్రతిష్టాపనా కార్య క్రమాన్ని కూడా చూసి ధన్యులమయాం .ఇదే హైలైట్  మా అమెరికా యాత్రకు అని పించింది .
  శిశిరానికి రెడ్ సిగ్నల్ 
అక్టోబర్ వస్తే అమెరికా లో చెట్లు ఆకులన్నీ ఎరుపు రంగు లోకి మారుతాయి .ఆ తర్వాత ఆకులు రాలి పోతాయి .అప్పుడే దాని ప్రభావం కనీ పిస్తోంది .కొన్ని చెట్ల ఆకులు యెర్ర బడి పోతున్నాయి .శిశిరానికి ”రావద్దు ”అని యెర్ర జెండాలు ఊపు తున్నట్లని పించాయి .ఆ శిశిర వేదన భరించలేక తమ సర్వస్వం అయిన ,జీవపూత  మైన ఆకులను రాల్చేస్తున్నాయా అని పిస్తున్నాయి .దీన్నే వీళ్ళు ”ఫాల్ ”అంటారు .”what a fall my dear leaves of the  trees !”
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –25-9-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.