శ్రీ జగ్గీ వాసుదేవ్

 శ్రీ జగ్గీ వాసుదేవ్ 
శ్రీ సద్గురు వాసు దేవ్ ను అందరు” జగ్గ్గీ వాసుదేవ్” అని ,ఆప్యాయం గా పిలుచు కొంటారు .అసలు పేరు జగదీశ్ .అదే జగ్గీ అయింది .జగత్తుకు నాయ కత్వం వహించే లక్షణాలు ఆయన లో ఉన్నందుకే ఆ పేరు పెట్టారట  .ఆయన 3-9-1957  సుశీలా ,డాక్టర్ వాసు దేవ్అనే తెలుగు దంపతులకు కర్నాటక  లోని మైసూర్ లో జన్మించారు .చిన్నప్పుడే గురువు” మల్లాది హళ్లి రాఘ వేంద్ర స్వామి” వద్ద యోగాభ్యాసం నేర్చారు .అప్పటి నుండి అది ఆయనకు నిత్య క్రుత్యమైంది .మైసూర్  వర్సిటి లోఇంగ్లీష లిటరేచర్ లోడిగ్రీ  సాధించారు .మోటారు సైకిల్ పై దేశమంతటా పర్య టించారు .కారునడప గలరు .ఆయనకు రాని విద్య లేదు .  ఆయన మైసూర్లోని చాముండీ హిల్ పై ఒక రాతి మీద కూర్చుని తీవ్ర ధ్యానం లో నిమగ్నమయారు .23-9-1982 వారికి అకస్మాత్తుగా దివ్య దర్శనం అయి, జ్ఞానోదయం అయింది. మంచి యోగా కేంద్రాన్ని స్తాపించ మని  గురువు ఆదేశించారాయన్ను .తగిన స్థలం కోసం తీవ్రం గా గాలించారు .చివరకు తమిళ్ నాడు లోని కోయంబత్తూర్ కు నలభై కిలో మీటర్ల దూరం లో ప్రశాంత వాతా వరణం లో ‘వెళ్ళిం గిరిమౌంటేన్”  వద్ద మంచి ప్రదేశం లభించింది .అక్కడ ఒక ఆశ్రమాన్ని  నిర్మించి ,యోగా ను నేర్పుతున్నారు ”.ఈశా ఫౌండేషన్ ” ను స్తాపించి ఎన్నో సేవా కార్య క్రమాలను నిర్వ హిస్తున్నారు .”ఈశా ”అంటే ఆయన ”నిర్గుణ పర బ్రహ్మ ”అని అర్ధం చెప్పారు .ఇక్కడే” యోగిక్ టెంపుల్” ను నిర్మించి ధ్యానానికి కేంద్ర బిందువు గా ”ధ్యాన లింగాన్ని” ప్రతిష్టించారు .అక్కడ అన దారు యే భేదం లేకుండా ధ్యానం చేసుకో వచ్చు .సర్వ జన సన్నిహితుడు ఆయన .ఆ కేంద్రం లో అన్నీ నేర్పుతారు .అయన కు అన్ని ఆటలు వచ్చు .హాకీ కూడా ఆడతారు .తమిళ్ నాడు  ,కర్నాటక రాష్ట్రా లలో తరచు భారీ ”సత్సంగాలు ”నిర్వ హిస్తారు .ఆయనకు ఆరు ఖండాలలో, అనేక దేశాలలో శిష్య పరంపర ఉంది .   .పర్యటనలు చేస్తూ వారిని ఉత్తేజితులను చేస్తూంటారు .
”   ప్రముఖ భారతీయుడు” గా అనేక పత్రికలనిర్వ హించిన అభిప్రాయాలలో  స్తానం సంపాదించారు .ఆయన అంత గా భారీ కార్య క్రమాలను నిర్వ హించిన వారు అరుదు .క్రిందటి ఏడాది  మద్రాస్ లో ”ఆనంద్ అలై”(A wave of Bliss) అనే పేరున   ” భారీ సత్సంగ్ ను నిర్వ హిస్తే, లక్షా యాభై వేల మంది పాల్గొని,”న  భూతో ”అని పించారు .ఆయన చాలా సాధారణం గా ఉంటారు .ముఖం లో ది వ్య తేజస్సు వెలుగుతూ ఉంటుంది .చక్కని గడ్డం,.. జుట్టుకు, గడ్డానికి రంగులు వేసుకోరు .ప్రాచీన మహర్షి ఆయన లో దర్శనమిస్తారు .ఈశా ఫౌండేషన్ గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది .తమిళ్ నాడు లో ఆయన ఆధ్వర్యం లో ఒకే రోజు 80,000మొక్కలు 27జిల్లాలలో నాటి, రికార్డు సృష్టించారు .ఆ సంస్థ గ్రామీణ ఆర్ధిక విధానాన్ని ,ఆధునిక  అభి వృద్ధి మార్గాలు చేబట్టింది .ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వ హిస్తోంది .సంచార విద్యాలయాల ద్వారా 4,200గ్రామాలకు సేవ లందిస్తున్నారు .వీటి వల్ల 70 లక్షల మంది వైద్య సదు పాయాన్ని పొందుతున్నారు .అమెరికా లోని టెన్నిసీ రాష్ట్రం లో కంబర్లాండ్  లో mc Minvilleiలో  1200ఎకరాల స్థలం లోIsha Foundation ”isha institute of inner sciences ”2006 లో నిర్మించి, సేవ లందిస్తున్నారు .ప్రపంచ శాంతి, సుహృద్భావం, సమాజ పరి రక్షణ ,అందరికి విద్యా ,ఆరోగ్యం, సాంకేతిక వినియోగం, స్త్రీ విద్యా ,శిశు సంరక్షణ కోసం అవి రళ కృషి చేస్తున్నారు . ఏది బోధించినా తేలిక మాటలతో హృదయం లో నిలిచి పోయే టట్లు చేసే శక్తి సద్గురువు లది . వారి వాసుదేవ వాణి ని విందాం  .
                  సద్గురు వాసు దేవ  వాణి 
మాన వాళి కేవలం జీవించటం అనేదాన్ని అధిగ మించింది .ప్రతి మనిషి  లో మేధస్సు ఉంది .దాన్ని తెలుసుకొని సాధన లోకి తెచ్చు కోవాలి. దాన్ని తిండికో, విలాస  జీవితానికో ,ధన సంపాదనకో ఖర్చు పెడితే ప్రయోజనం లేదు .మనిషి మానసిక పరిస్తితిని వృద్ధి చెందిచాలి. సమానత్వం అనేది” ఒకే రకం గా ఉండటం ”అను కొంటె పోర బాటే .అలా అయితే రెండో వారి అవసరం లేదు కదా .సమానత్వం అంటే సమాన అవకాశాలు .నువ్వు ఇష్ట పడే వ్యక్తీ నీతో సమానం కాదు .అతనెప్పుడూ నీ కంటే పైనే ఉంటాడు .మనం ఇవాళ విలువలను కోల్పోతున్నాం .అన్నీ డబ్బు, హోదా లతో ముడి పెడుతున్నాం .స్త్రీ కూడా సమానత్వాన్ని కోరుతోంది .అంటే పురుషుని తో సమానం గా సంపాదించాలని మాత్రమె భావించ రాదు .ఆమె కు గృహ బాధ్యతలుంటాయి .కుటుంబాన్ని ఉన్నత స్తితికి తీసుకు రావాలనే తపన ఆమె లో ఉంటుంది .సాంకేతికత పుణ్యమా అని మార్పు అనేది చాలా వేగ వంతం గా జరిగి పోతోంది .
ఈ నాటి చిన్న పిల్లలు ఆరు బయట స్తలాల్లో ఆడు కోవటం తక్కువ గా ఉంది .వాళ్ళు ఇప్పుడు” ”గెలాక్సీల మధ్య” ఆడుకొంటున్నారు . అంటే కంప్యూటర్ లో ఆడుకొంటున్నారు .కృత్రిమ మ ఆటలు ఆడుతున్నారని అర్ధం .ఇరుగు పొరుగు వారితో ఆటలాడే తీరిక వారికి లేకుండా పోయింది .సాంకేతికత మనకు అన్నీ తెచ్చి అరచేతుల్లో పేడు తోంది .మరి సమస్య ఏమిటి ?ఉన్న ప్రతి దానితో మనమే సమస్యలను అనంతం గా సృష్టించు కొంటున్నాం .మనం వాడే సెల్ ,కంప్యూటర్ వగైరా లన్నీ మాన వ మెకానిజం కంటే గోప్పవేమీ కావని గ్రహించాలి .మీరు చెప్పిన మాట మీ పిల్లలు వినటం లేదు అంటే ,చెప్పే నైతిక విలువ ను మీరు  కోల్పోయారు అని అర్ధం .అధికారం తో వారిని శాసించ లేము .నువ్వు వారి నుండి గౌరవం ,మర్యాదా కోరు కొంటె ఆది ”వేళా కోళం” అవుతుంది .వారికి అందు బాటులో ఉన్న వన్నీ తెలిసేట్లు చేయండి .సలహా ఇస్తున్నట్లు గా మీ రు చెప్పేది వాళ్లకు అని పించాలి .అప్పుడు వాళ్ళు వినటమే కాదు ,ఏది ఎలా చేయాలని మిమ్మల్ని తరచు వచ్చి అడుగుతూ ఉంటారు .అప్పుడే మీరు చేప్పే దాని మీద వారికి గురి ఏర్పడుతుంది .
                భగవద్గీత పై వ్యాఖ్యానం 
భగవద్గీత ఆన్నది రాజకీయ బోధ కాదు .ఆది ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని బోధించేది ఆది రాజకీయమే అయితే కృష్ణుడు అందరికీ చెప్పే వాడు కదా.తన ఆత్యంత అంత రంగికుడైన  అర్జునుడికి ఒక్కడికే ఎందుకు చెప్పాల్సి వచ్చింది ?భగవాన్ శ్రీ కృష్ణుడు అర్జునునికి గీత ను బోధించిన తర్వాతా36 ఏళ్ళు అర్జునుడు జీవించే ఉన్నాడు .కాని దాన్ని ఎవరికీ చెప్ప లేదే ?.అసలా విషయాన్ని ఎవరి వద్దా  అతను ప్రస్తావనకు తీసుకు రాలేదే .ఆది నారా నారాయనులిద్దరి మధ్య ఉన్న రహస్య విషయం .బయటి నుంచి ఎవరూ వినను కూడా లేదు . అదంతా అతని స్వయం నిర్ణయం ,అనుభవానికి సంబంధించిన విషయం .భగవద్గీత హిందువులకుమాత్రమే అనుకోవటం పోర బాటు .ఆది అందరిదీ .జ్యూ అయిన న్యూటన్ గురుత్వాకర్షణసిద్ధాంతాన్ని కనీ పెట్టాడు కనుక ఆది యూదులకు మాత్రమె వర్తిస్తుందంటే వెర్రి తనం కాదా .సనాతన ధర్మం అంటే విశ్వ నిబంధన, చట్టం ధర్మం,న్యాయం . (యూని వరసల్ లా,).కృష్ణుడు బోధించి నప్పుడు ఆయన హిందువు అని అనుకో లేదు .ఆయనేమీ హిందూ మతాన్ని సృష్టించ లేదు .కృష్ణుడు గుర్తు చేసింది ”స్వధర్మం ”నే .స్వధర్మం అంటే హిందూ ధర్మం అని కాదు .స్వీయ మైన ,వైయక్తిక మైన ధర్మం అని అర్ధం ..గీత ఒక చక్కని డిబేట్ .సందేహాలకు సమాధానాలు .ఈ గ్రంధం ఇలా చెప్పింది ,ఆ గ్రంధం అలా చెప్పింది అని శంకలు పనికి రావు .అవన్నీ చిన్న టాంకుల లో ఉన్న నీరు లాంటివి ..అసలు అనంత నీటి ప్రవాహమే వస్తే ,వీటి ఉనికే ఉండదు కదా .
నేను చెబుతున్న వన్నీ ,నేను అనుభవ పూర్వకం గా తెలుసుకోన్నవే .మీ స్వధర్మమే అన్నిటి కన్నా ఉన్నత మైనది, ఉత్తమ మైనది అని మర్చి పోరాదు .అంతశ్సో ధన చేసుకోండి .మిమ్మల్ని అప్పుడు మీరే నడి పించుకో గల సామర్ధ్యాన్ని పొంద గలుగుతారు .ముందుగా దానికి అర్హత సంపాదించాలి .ఆది ఎలా ఉంటుందంటే చిన్న పిల్లాడు ఐన్ స్టీన్ గారిE=mc 2సూత్రాన్ని బట్టీ పట్టి తనకు సాపేక్ష సిద్ధాంతం అర్ధం అయింది అని చెప్పటం లా ఉంటుంది .గీత లోని మాటలకు అర్ధ తాత్పర్యాలు తెలిసి నంత మాత్రం చేత గీత నీకు ఆవ గాహన అయి నట్లు కాదని తెలుసుకోవాలి .నీకు నీ స్వధర్మం -అంటే స్వీయ ధర్మం (లా ఆఫ్ ది సెల్ఫ్ )తెలియాలి అప్పుడే ఆది అర్ధము అయినట్లు .
టెక్నాలజీ నిన్నేమీ ”నన్ను ఉపయోగించుకో ”అని కోరటం లేదే .ఆది అందు బాటు లో ఉంది నువ్వుదాన్ని నీ సౌకర్యం కోసం  వాడుకొంటున్నావు .ఇక్కడ సమస్య ఏమిటి అంటే -నీ శరీరం తో ఎలా పని చేయించుకోవాలి ,నీ మెదడు మనసు లతో ఏవిధమైన పనులు చేయించు కోవాలో నీకు తెలియదు .అలాగే నీ భావోద్రేకాలను, నీ శరీర ధర్మాన్ని ఎలా నియంత్రించు కోవాలో తెలీని మూర్ఖత్వం లో ఉంటున్నావు .అందుకని నీ చుట్టూ ఉన్న ప్రతి దాని పైనా ఫిర్యాదులు చేస్తూండటం నీకు అలవాటై పోయింది .ఆధ్యాత్మికత్వం అంటే మింగుడు పాడనీ పదార్ధం అనుకొని పోర బడుతున్నావు .అవసరం వచ్చి నప్పుడు సాంకేతిక సహాయం తీసుకో .మిగిలిన  కాలాని ధ్యానం లో గడుపు .అప్పుడు అంతా స్వచ్చం గా కనీ పిస్తుంది .టెక్నాలజీ ని వాడ వద్దని ఎవరూ చెప్పరు .అవసరానికే విని యోగించు .జీవితాన్ని అధ్యయనం ,పరిశీలనా చేయాలి లేక పోతే బురద లో కూరుకు పోతాం .ఆన్ లైన్లో అన్నీ చేసుకో .ఇబ్బందేమీ లేదు .
ప్రపంచం లో అందరికీ అన్నీ చాలటం లేదని ఫిర్యాదు ఉంది .విషయాలను సమర్ధ వంతం గా పరిష్కరించే ఆలోచన చేయక పోవటమే లోపం .నువ్వు నిర్మించిన ఇంజినీరింగ్ వస్తువులను గురించి గొప్ప గా పొగుడు కొంటావు .కాని నీ లోని ఇంజినీరింగ్ శక్తిని గూర్చిన ధ్యాసే లేకుండా పోయింది .మేము ఇప్పుడు ”ఈశా క్రి యా ” అనే సులభ పద్ధతిని ఉచితం గా అందరికి అందిస్తున్నాం .ఇండియా లో దీని ని 12మిలియన్ల d.v.d.లనుచేసి  పంచి పెట్టాం .అమెరికా లో కూడా  వీటిని అందించే ఆలోచన లో ఉన్నాము .ఇది నెట్ లో లభించే టట్లు చేశాం .దాని ప్రకారం రోజుకు కేవలం 12 నిమిషాలు ధ్యానం చేస్తే చాలు .అదే మిమ్మల్ని సరైన మార్గం లో ఉంచు తుంది .ఇంకా ఎక్కువ సమయం కేటా ఇంచే అవకాశం ఉంటె అలానే చేయ వచ్చు .”మేము బిజీ ,మాకు సమయం లేదు ”అను కొనే వారికే ఈ ”ఈశ క్రియ ”.ఇది క్రియ అని ఎందుకు అన్నాము అంటే దీనిలో ఉండటం ,శ్వాసించటం ,వికసించటం (be ,breatheand  blossom )అనేవి ఉన్నాయి కనుక .దీన్ని అందరు హాయిగా తేలిగ్గా చేయగలరు చేస్తున్నారు ప్రయోజనం పొందుతున్నారు కూడా .ఇది సరైన మార్గం లో పడ టానికి అతి తేలికైన మార్గం గా రుజువైంది .హాయిగా,తీరిగ్గా   కుర్చీ లో కూర్చుని చేయచ్చు .ధ్యానం మీద ధ్యాస పెట్టండి .అంతా చక చకా అదే జరిగి పోతుంది.స్విచ్ వేస్తె, బల్బు వెలిగి కాన్తినిచ్చి నట్లు .అదే మీకు మార్గ దర్శకత్వం చేస్తుంది .ఇందులో తెలీనిది అంటూ ఏమీ ఉండదు .నష్ట పోవటం జరగదు .ఏమి చేయాలన్న సందేహాలే మీ దేహానికి రావు .ప్రతి క్షణం లోను మిమ్మల్ని ముందుకు దారి చూపి నడిపిస్తుంది .
The Githa song
” The hollow bamboo can turn the passing wind into a sweet song
one filled with its own sap will be mute and dumb
when all of creation laughs and sings
if the hum of life’s sweet song has to be heard empty
Empty your self of your self
The sweetness ,the melody ,and the fragrance of the Divine Song shall be you
when you let yourself be absorbed in to the divine will ”–     Sadguru Vasu Deva
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-9-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

1 Response to శ్రీ జగ్గీ వాసుదేవ్

 1. krishnamohan says:

  http://www.logili.com/home/search?q=vasudev

  jaggi gari book unnavi..
  అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ విజిట్
  http://www.logili.com/

  మీకు నచ్చిన పుస్తకాల మీద మీ రివ్యూ లను పంపండి.
  review@logili.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.