శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –10
23–”త్వయా హృత్వా వామం ,వపుర పరి త్రుప్తెన మనసా –శరీరార్ధం ,శంభో ,రపర మపి ,శంకే హృత మభూత్
యదె తత్వ ద్రూపం ,సకల మరునాభ స్త్రినయనం –కుచాభ్యా మానమ్రం కుటిల శశి చూడా ల మకుటం .”
తాత్పర్యం –హిమ గిరి పుత్రీ !నీవు శివ మహా దేవుని శరీరం లో ఎడమ భాగార్ధాన్ని ఆక్ర మించావు .దానితో తృప్తి పడక ,కుడి భాగాన్ని కూడా గ్రహించా వేమో ననే అనుమానం కూడా ఉంది .ఎందు కంటే -నా హృదయ కమలం లో ప్రకాశించే నీ రూపం ,బాల భానుని లేత కేంజాయతో ,మూడు కన్నులు కలిగి స్తన భారం తో, ముందుకు వంగి నట్లు కనీ పిస్తూ ,జాబిల్లి కిరీట మణి గా ఉంచుకొని ప్రకాశిస్తున్నావు .
విశేషం –కౌల సిద్ధాంతం లో శక్తి తత్త్వం ఒక్కటే .శివ తత్త్వం అనేది లేదు .శివత్వం శక్తిత్వం లో అంత ర్భాగమే .దానినే ఉపాసించాలి .శరీరం ఎర్రగా ఉండటం ,స్తన ద్వయం ,త్రాలున్డటం ,వాళ్ళ శివుని శరీరం అపహరించావు అని భావం .అంటే భగవతి యే శివ రూపం .శివుడు శ్రీ దేవీ మయుడు అని అర్ధం చేసుకోవాలి .శివ ,శక్తులు అభేద్యాలు అని గ్రహించాలి .”న శివేన వినా శక్తి ర్నశక్తిరహితః శివః ”శక్తి లేక పోతే శివుడు లేదు .శివుడు లేకుంటే శక్తి లేదని అర్ధం .శ్రీ దేవి రూపం లో యెర్ర దానం శక్తిని కలిగి ఉండ తాన్ని ,కిరీటం సర్వేశ్వరత్వాన్ని ,శశి మకుట మణి ఆనంద మయత్వాన్ని ,మూడు కళ్ళు మూడు కాలాలను ,చనుల భారం సృష్టిలోని జీవుల అన్నమయాది పంచ కోశ పోషణ ద్రవ్య సమృద్ధిని తెలియ జేస్తున్నాయి .ఇదంతా శ్రీ మాత్రు విరాట్ స్వరూపం .
24–”జగత్సూతే దాతే ,హరి రవతు రుద్రః క్షప యతే –తిరస్కుర్వ న్నేనత్ ,స్వమపి ,వపురీ శస్తి రయతి
సదా పూర్వ స్సర్వం ,తదివ ,మను గృహ్ణాతి చ ,శివ –స్తవాజ్నా మాలంబ్య ,క్షణ చరిత ర్భ్రూ లతికయోహ్ ”
తాత్పర్యం –జగన్మాతా !బ్రహ్మ దేవుడు సృష్టి చేస్తే ,శ్రీ హరి రక్షిస్తే ,రుద్రుడు సంహారం చేస్తున్నాడు ..ఈ మూడు తత్వాల లోని మహేశ్వర తత్వ మైన ఈశ్వరుడు అంతర్హితం గా ఉన్నాడు .ప్రళయం జరిగి పోయిన తర్వాతా మళ్ళీ బ్రహ్మాండాన్ని ఉత్పత్తి చేయా లనే తలంపు సదా శివునికి కలిగింది .క్షణ కాలం శ్రీ దేవి కను బొమ్మల ఆజ్న కోసం కాచుకొని ఉండి ,దాన్ని స్వీక రించి బ్రహ్మా విష్ణు రుద్ర రూపం తో ఉన్న తత్త్వం సకల జగత్తును సృష్టించ టానికి సన్నద్ధం అవుతోంది .
విశేషం –సృష్టి ,స్తితి ,ఉప సంహారం తిరోధానం ,అనుగ్రహం అనే అయిదు పనులు బ్రహ్మా విష్ణు ,రుద్రా,మహేశ్వర సదాశివులు చేస్తూంటారు .ఇవన్నీ పరమేశ్వరి అనుజ్న తోనే జరుగుతాయి .బ్రహ్మ ఆమె కు పెద్ద కొడుకు .ప్రపంచోత్పత్తి చేస్తాడు .రెండవ కొడుకు హరి జగత పాలన చేస్తాడు .కాల రుద్రుడు మూడవ వాడు .సంహరిస్తాడు .వీరంతా కాల పురుషులే .బ్రహ్మాదులకు కారణ భూత మైన మహేశ్వరుడు చతుర్ధ పుత్రుడు .ఈ పనులన్నీ దేవీ శక్తి మూల కాలు .”ఆత్మా వై పుత్రా నామాసి ”– ”స ఏవాయుం పురుషః ప్రత్యక్షనోప లభ్యతే ”అన్నది వేదం .
25– ”త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే –భవేత్పూజా పూజా ,తవ చరణ యోర్యా విరచితా
తదాహిత్వా ,త్పాదో ద్వహన మణి పీఠి కస్య నికటే –స్తితా హ్యేతోశశ్వన్ముకు లిత కరోత్తంస మకుటః ”
తాత్పర్యం –శివ వామ భాగ నిలయా !సత్వ ,రజో ,తమో గుణాల వల్ల జన్మించిన బ్రహ్మా, విష్ణు, రుద్రులనే త్రిమూర్తులకు నీ పాదాలకు జరిగే పూజ యే వాళ్ళకూ పూజ అవుతోంది .ఇది సహజమే .ఎందు కంటే -వారు నీ పాదాల ను కలిగిన రత్న పీఠిక కింద ,చేతులు మోడ్చి ,శిరస్సు ల పై గల కిరీటాలతో వినతు లై ప్రార్ధిస్తున్నారు .
విశేషం –శ్రీ దేవికి పూజ చేస్తే విడిగా బ్రహ్మాదులకు పూజ చేయక్కర లేదు .ఆమె పూజ అందరి పూజ ల కంటే విశిష్ట మైనది .”విష్ణు పూజా సహస్రాణి ,శివ పూజా శతానిచ ,అంబికా చరనార్చాయః కాలం నార్హంతి షోడశం ”అంటే అమ్మ వారి పాద పూజే పూజ .మిగిలిన వేవీ పూజలు కాదు అని అర్ధం .”పూజ్య పూజనం పూజా ,నహో అపూజ్య పూజనం ”పూ జ్యు లైన వారికీ చేసిందే పూజ .అపూజ్యులకు చేసే పూజ పూజ కాదని భావం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –28-9-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,009,490 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.3 వ భాగం.3.6.23
- అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.
- గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.6 వ భాగం.3.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .1 వ భాగం.1.6.23.
- డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (505)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు