ఊసుల్లో ఉయ్యూరు — 35 ఆ నాటి లఘు యంత్రాలు

  ఊసుల్లో ఉయ్యూరు — 35 ఆ నాటి లఘు యంత్రాలు

             మా చిన్నతనం లో మెట్ట చేలకు నీళ్ళు పెట్ట టానికి మోట బావులు తవ్వుకొనే వారు .సుమారు పది గజాల కైవారం గల బావులవి. లోపలి దిగ టానికి రాళ్ళ మెట్ల దారి .దాని లో నీరు బాగా ఊరేది .చాలా లోతు గా బావు లుండేవి .అలాంటి బావుల్లో నుంచి నీరు పైకి తోడి, చెరకు ,పసుపు, కంద ,పెండలం దొండ మొద లైనపంట  చేలకు నీరు పెట్టా లంటే చాలా కష్టం .అందు కని  బావికపైన ఇనుప కడ్డీ .లేక లావైన కర్ర కడ్డీ అడ్డం గా ఉండేది .దానికి మధ్యలో పెద్ద గిలక ఉండేది .దీన్ని కప్పీ అంటారు సైన్స్ లో .దాని పై నుండి తాడు తో నీరు బైటికి లాగాలి .అందుకని ఒక పెద్ద దీర్ఘ చతురస్రా కారపు ఇనుప బొక్కెన ఉండేది .దీనికి ఇనుప కొక్కెం ఉండేది . మోకు(లావైన తాడు ) ను ఈ కొక్కానికి కట్టే వారు .కప్పీ మీదు గా తాడును బైటికి పోనిచ్చి, దాన్ని ఎడ్ల కాడికి కట్టే వారు .రెండేడ్లు కాడిని బుజాన వేసుకోనేవి .బో క్కేన నీటిలో మునగాలంటే ఎడ్లు నూతికి దగ్గర గా ఉండాలి .నీటి తో బొక్కెన నిండ గానే ఎడ్ల ను  తోలే వాడు. వాటిని ముందుకు నడుపు తాడు .అప్పుడు నూతి లోంచి క్రమం గా బక్కెట్ పైకి వస్తుంది .అక్కడొక మనిషి ఉండి ఆ నీటిని కింద కుమ్మరిస్తే అవి కాలువ ద్వారా పొలం లోకి చేరేవి .ఎడ్లు ముందుకు వెనక్కు కడ ల టానికి వీలుగా వాటి మార్గాన్ని నూతి నుండి కిందకు స్లోపు గా చేస్తారు .ముందుకు వెళ్ళిన ఎడ్లు వెనక్కి నడ వాలి  .అలా నడిపించ టానికి మనిషి ఎలానూ ఉంటాడు .ఈ విధం గా పగలల్లా ఎడ్లూ మను షులు కష్టపడితే తప్ప చేలు తడిసేవి కావు .బక్కెట్ లో కనీసం ఇరవై కడవల నీళ్ళు పట్టేవి .ఇదే మోట బావి .కప్పీ అంటే ఇంగ్లీష లో ”పుల్లీ” .కష్ట మైన పనిని సులభం గా చేయ టానికి తోడ్పడింది అన్న  మాట .ఇలాంటి వాటినే లఘు యంత్రాలు సింపుల్ మెషీన్స్ అని చిన్నప్పుడు చదువు కొన్నాం .ఆర్కి మిడీస్ ”నాకు సూన్యం లో ఒక స్తిర బిందువు చూపించండి .లీవర్ల తో కప్పీ లతో విశ్వాన్నే ఎత్తే స్తాను ”అన్నాడని చదివాం. గుర్తు ఉండే ఉంటుంది .ఆ తర్వాతా బావికి మోటార్లు పెట్టి నీరు గొట్టాల ద్వారా కరెంటు టో తోడటం ప్రారంభ మైంది .ఆ తర్వాతా భూమిలో బోర్లు వేసి మోటారు తో తోడటం వచ్చి బావులు తీసే షారు .ఇప్పుడు సబ్మెర్సిబుల్ మోటార్లతో నేరు లాగుతున్నారు .

గింజల నుండినూనె  తీయా లంటే ఆకాలం లో గానుగ లుండేవి .కొబ్బరి, నువ్వులు, వేరు సెనగ ,ఆము దం నూనె లను గానుగ ల ద్వారా తీసే వారు .కొయ్య తో చేసిన పోడ వాటి లోతైన రోలు ఉంటుంది .దాని లో ఒక నిలువు లావైన కర్రను ఉంచు తారు .ఇది నున్నగా గుండ్రం గా అంటే స్తూపా కారం గా ఉంటుంది .దీనికి పైన గొలుసు తో కత్తి ఉంచు తారు .అక్కడి నుండి పోడ వైన లావైన కడ్డీ ఒకటి ఉంటుంది .దానికి చివర ఎద్దు కొమ్ముకు కడ తారు .ఎద్దు గుండ్రం గా ఆ ఇరుసును ఆధారం గా చేసుకొని తిరుగు తుంది .ఆ రోటిలో వేరుసెనగ గింజలో, నువ్వులో, కొబ్బరి ముక్కలో, ఆ ముదపు విత్త నాలో పోస్తారు .పోడ వైన కర్ర మీద మనిషి కూర్చుని ఎద్దును ఆది లిస్తే ఆది తిరగటం ప్రారంభిస్తుంది .రోటి లోని పప్పు నమ్మది నెమ్మదిగా ముక్కలై నలిగి అందులో నుండి నూనె బయటకు వస్తుంది .ఆ నూనెను గానుగ నుండి వేరు చేసే  రంధ్రం ఉంటుంది .దాని ద్వారా వచ్చిన నూనె ను డబ్బాల లో పడ తారు .నూనె వచ్చిన తర్వాత  అ గింజల చెక్క గుండ్రటి రోలు చుట్టూ అతుక్కొని ఉంటుంది .  .దానిని వేరు చేసి అమ్ముతారు .ఎద్దు కంటికి గంత కడ తారు .ఆది అదే దారిలో గుండ్రం గా తిరుగు తూనే ఉంటుంది .అందుకే ఎదుగూ బొదుగు లేని జీవితాలను గాను గెద్దు జీవితం అంటారు .గానుగ మనిషి ఒళ్లంతా నూనె అంటుకొని మహా జిడ్డుగా ఉంటాడు .మా చిన్నప్పుడు నూనె గానుగ, కాపుల వీధిలో రామాలయం దాటి మెయిన్  రోడ్డు మీద కు వెళ్ళే దారిలో ఉండేది .మంచి నంబర్ వాన్ నూనె కావా లంటే గానుగ దగ్గరే తెచ్చు  కొనే వాళ్ళం .అయితే కొంచెం మడ్డి గా ఉండేది .దాన్ని శుద్ధి చేసి  అమ్మే వారు .గానుగ తిరుగు తుంటే తమాషావింత  శబ్దం వచ్చేది .దాన్ని వింటూ కూర్చునే వాళ్ళం .
ఆకాలం లో సిమెంట్ కంటే గానుగ సున్నాన్ని బాగా వాడే వారు. బాగా చవక కూడా .ఇళ్లను దాని తోనే కట్టే వారు .అయితే కొంత కాలానికి చవుడు రాలేది .దాబాలు కూడా తారస రాయి, గానుగ సున్నం తో కట్టే వారు .సున్నపు గానుగ కు కొంచెం విశాల మైన ఆరు బయటి స్తలం కావాలి .సుమా రు ముప్ఫై  గజాల కైవారం లో ఒక అడుగు లోతు గుంటను చుట్టూ తీస్తారు .దాని అంచు ను రాతి తో కడతారు చుట్టూ .దాని మధ్య భాగం లో ఒక కొక్కెం లాంటిది ఉంటుంది .దీన్ని భూమిలో పాతిన మేకుకు కట్టేస్తారు .ఆ గాడి లో బాగా లావైన ఆ  తిరిగే  వీలున్న రాతి చక్రం ఉంటుంది .దానికి మధ్యలో రంధ్రం ఉంటుంది .దాని లో నుంచి ఒక ఇనుప కడ్డీ చక్రం రెండు వైపులా కు వచ్చేతంత  పొడవు గా ఉంటుంది .చివర్లలో రంద్రాలఉంటాయి వీటికి తాళ్ళు కట్టి  రెండు ఎడ్ల మీది కాడికి రెండు వైపులా కడ తారు .అప్పుడు ఎడ్లు కదిలితే రాతి చక్రం గాడిలో చుట్టూ తిరుగు తుంది .ఆ గాడి లో ఇసుక ,సున్నం లను వేసి సమ పాలల లో నీరు కలు పు తారు .ఎడ్లు తిరుగు తుంటే సున్నం, ఇసుక, నీరు కలిసి బాగా నలిఫ్  పాకం లా తయారవు తుంది .తగి నంత పాకం వచ్చే దాకా ఎడ్లను త్రిప్పు తారు .మధ్య మధ్యలో చిన్న పారల తో  సున్నాన్ని కలిపి బాగా కలిసి పోయే ట్లు చేస్తారు .అవసర మైతే నీళ్ళు పోస్తారు . గానుగ సున్నం మంచి పాకానికి తేవటం ఒక కళ .దాన్నిబట్టే నాణ్యత ఉంటుంది .తయారైన సున్నాన్ని గానుగ కు బయటికి తీసి కుప్పలుగా పోస్తారు .ఇది ఎండి పోయినా నీళ్ళు కలిపి వాడుకో వచ్చు .అవసర మై నంత  గానుగ సున్నాన్ని   కొనుక్కొని తెచ్చుకొంటారు .లేదా బండ్ల మీద తోలు కొంటారు .ఇప్పుడీ అవస్థ లన్ని తప్పాయి సిమెంట్ వచ్చిన తర్వాత .విజయ వాడ లో అలంకార్ ధియేటర్ యజ మాని సున్నం వీరయ్య  సున్నపు వ్యాపారం తో లక్షాధి కారి అయాడని చెప్పుకొనే వారు .స్ గానుగ సున్నాన్ని ఇంగ్లీష్ లో ”మోర్టార్”అంటారు .
కాలువ దగ్గర గా ఉన్న చేలకు నీరు పెట్ట టానికి వెదురు తో చేసిన బుట్టలున్దేవి .దానికి రెండు చివర్లా తాడు కట్టి ఇద్దరు మనుష్యులు కాలువ లోని నీటిని  బుట్టలో నింపి చేల  ల్లోకి గట్టు పక్కనుండి విసిరే వారు. దీన్ని ”గూడ వెయ్యటం ”అనే వారు .ముఖ్యం గా వేసవి లో నారు  పోయ టానికి ఈ పద్ధతి వాడే వారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-12-కాంప్ –అమెరికా –
Gabbita Durga Prasad

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

1 Response to ఊసుల్లో ఉయ్యూరు — 35 ఆ నాటి లఘు యంత్రాలు

  1. బాగుంది.అప్పట్లో కట్టడాలు గట్టిగా, మన్నికగా ఉండడానికి గానుగ సున్నంలో తాటి కల్లు కూడా కలిపేవారని విన్నాను.తాటి కల్లులో ఉండే బాక్టీరియా సున్నానికి బాగా పట్టు ఇస్తుందట. కోటలు కట్టే పాటి మట్టిని కూడా
    తాటి కల్లు పోసి బాగా తోక్కేవారట. దీని వెనకున్న శాస్త్రీయ మర్మం ఏమిటో మరి ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.