ఊసుల్లో ఉయ్యూరు –36 నాన్నా సినిమా! – మామయ్యా సినిమా !!

   ఊసుల్లో ఉయ్యూరు –36
నాన్నా సినిమా – మామయ్యా సినిమా 

ఇదేదో నాన్నా , మామయ్య సినిమా కాదు .మా ఇంట్లో సినిమాకు మేము వెళ్ళాలంటే జరిగే భాగోతం .మా చిన్నతనం లో మేము సిని మాలు ఎక్కువ గా చూసే వాళ్ళం కాదు .అందులో హిందూ పూర్ లో ఉన్నప్పుడు టూరింగు టాకీసులే గతి .దానికి సాయంత్రం ఆటకో ,రాత్రి ఆటకో వేళ్ళ వలసి  వచ్చేది .మంచి నీళ్ళ మర చెంబు, తిన టానికి వేరు సేనక్కాయలు బోరుగులనే మర మరాలు జంతికలు ,  ,కారప్పూస ,పప్పుండలు తీసుకొని వెళ్లి తింటూ కూర్చుని సినిమా చూసే వాళ్ళం .అందరం నేల టికెట్టు కే వెళ్ళే వాళ్ళం .మా నాన్న సిని మాకు ఓ పట్టాన తీసుకొని వెళ్ళే వారు కాదు .దానికి కనీసం పది  ,పదిహేను రోజుల రిహార్సిల్ ఉండేది .నాకు మా నాన్న గారితో చనువు తక్కువే .మా రెండో అక్కయ్య దుర్గ  ,మా తమ్ముడు మోహన్ రోజు సాయంత్రం మా నాన్న స్కూల్ నుంచి న తర్వాత” నాన్నా సినిమాకు వెళ్దాం నాన్నా-తీసికెళ్ళు నాన్నా ”అని బతిమి లాడే వారు .”సరే ఆది వారం వెళ్దాం ”అని ఊర డించే వారు .మళ్ళీ పొద్దున్న అదే రికార్డు .దానికీ అదే సమాధానం .ఇలా రోజులు గడిచి పోయేవి .సినిమాకు వెళ్లటం కుది రేది కాదు . వాయిదాల మీద వాయిదాలు పడేవి .ఊరించి ,ఊరించి ఎప్పుడో పచ్చ జెండాఊపే వారు .ఆ రోజు మాకు కొండెక్కి నంత సంతోషం .ఆయన సాయంత్రం స్కూల్ నుండి రాగానే మేము రెడీ గా ఉండే వాళ్ళం .అప్పుడు సినిమాకు వెళ్ళే వాళ్ళం .ఒక్కో  సారి ఆ యన రాకుండా నే, మా అమ్మ తో మమ్మల్ని పంపించే వారు .ఇదీ హిందూపురం లో సినిమా భాగోతం .అక్కడ మేము చూసిన సినిమా లు సంసారం ,ఘోరా కుమ్భార్ ,వంటివి యే ఐదో, ఆరో ఉన్నాయి .సిన్మా గురించిన కర పత్రాలలో కొద్దిగా కధా, నటుల పేర్లు, నిర్మాత, దర్శకుడు సంగీత దర్శకుల పేర్లుండేవి .ఇతర భాషా చిత్రాలైతే గేటు దగ్గర ఒక మనిషి నుంచొని ఆ సంభాషణలను తర్జుమా చేసి చెప్పే వాడు .అంతా కాక పోయినా భావం అర్ధమయేది .అతను మంచి హాస్య గాడైతే సంభాషనలన రస వత్తరం గా తర్జుమా చేసి చెప్పే వాడు .అదో దసరదా .నేల మీద చాపలు కాని గడ్డి పరచుకు కాని కూర్చునే వాళ్ళం .ఎవరి చాప వారే తెచుకొని కూర్చుండే వాళ్ళం అని బాగా గుర్తు .చిన్న చక్రాల్ మీద అటు ఇటు తడికెలు కట్టి వాటి పై సినిమా కాగి తాలు అంటించి, డప్పులు కొట్టు కొంటూప్రచారం  చేసే వాళ్ళు .ఆ చప్పుడు విన గానే వీధి లోకి పరిగెత్తుకొని వెళ్ళే వాళ్ళం .ఆ కాగితాలు తెచ్చి దాచుకొనే వాళ్ళం .ఎవరి దగ్గర ఎన్ని రకాల సినిమా కాగితాలుంటే వాళ్ళు గొప్ప గా ఫీల్ ఆయె వాళ్ళం .హిందూ పూర్ లో మేమున్న డాబా కు లోపలి నుంచి పైకి మేట్లున్దేవి .కొద్ది మెట్లు ఎక్కిన తర్వాతా అక్కడ గూడు లాంటి దానిలో సినిమా కాగితాలు దాచుకొనే వాళ్ళం .అప్పుడు అదే హాబీ .
1951 మేము ఉయ్యూరు కాపురం పెట్టిన తర్వాత కూడా సినిమాకు ఇదే జాతర .మా కంటే ,మా ఇంటి పక్కన ఉన్న మా మెన మామ గారి అమ్మాయి రాజమ్మ కు మా నాన్న దగ్గర చనువు ఎక్కువ .అందుకని సిని మాకు వెళ్ళాలంటే ఆమ్మాయిని ఎక్కేసే వాళ్ళం ఆమెను ”దాచ్చి ”అనే వాళ్ళం అందరం .దాచ్చి వచ్చి మా నాన్న దగ్గర కూర్చుని ”మామయ్యా సినిమా ”అనేది గోముగా ”వెళ్దాం లేవే  మొన్ననేగా వచ్చింది. సినిమా బాగా రష్ గా ఉంటుంది ”అని వాయిదా వేసే వారు నాన్న .మా అక్కా ,తమ్ముడూ దాచ్చి తో వంత పాడే వాళ్ళు ”నాన్నా సినిమా ”అంటూ .దానితో బాటు మా స్నేహితులు ఆదినారాయణ ,నరసింహం కూడా ”మేస్టారూ సినిమా ”అని గోల చేసే వారు .ఇందరు ఇన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చిన తర్వాత ఎప్పుడో ముహూర్తం కుడి రేది .అప్పుడు వెళ్ళే వాళ్ళం .అప్పటికి మా క్లాసు బెంచీలకు పెరిగింది . .ఆరణాల టిక్కెట్టు .నేల పావలా .అందరం కలిసి కబుర్లు చెప్పుకొంటూ నడిచి సినిమా  హాల్ కు చేరే వాళ్ళం .రాత్రి యేడు తర్వాతే ఆట ఉండేది .అప్పటికి ఒకటే ధియేటర్ .అదే ”ఏకాంబరేశ్వర పిక్చర్ పాలస్ ”.రిజిస్త్రార్ ఆఫీసు వెనక ఉండేది .దాదాపు హాలంతా నిండి తే కాని ఆట మొదలు పెట్టె వారు కాదు .పరభాషా చిత్రాలకు డబ్బింగు చెప్పే వారు .మా పెద్దక్కయ్యలోపా ముద్ర  హిందీ సినిమాలు బాగా చూసేది .ఇంటికి వచ్చి కదా విశేషాలన్నీ కధలు, గాధలుగా చెప్పేది .అరవం కూడా వచ్చు కనుక అరవ సినిమా విశేషాలను వివ రంగా  చెప్పేది .సిన్మా లో తిన టానికేమీ కొనే వారు కాదు .ఏదైనా తింటే ఇంటి దగ్గర తిని వెళ్ళటమే .మళ్ళీ వచ్చిన తర్వాత తినటమే .రిజి స్త్రార్ ఆఫీసు వెనక ఖాళీ స్తలం ఉండేది సాయంత్రం వేళల్లో అక్కడికి వెళ్లి కూచునే వాళ్ళం. ధియేటర్ వాళ్ళు సినిమా పాటల రి కార్డులు , ఘంట సాల భక్తీ గీతాలు, గ్రామ ఫోను రికార్డులు పెట్టె వారు .అవి వింటూ ఒక గంట  కాలక్షేపం చేసి ఇంటికి వచ్చే వాళ్ళం .మాతో బాటు మా దాచ్చి, దాని చెల్లెళ్ళు, మా స్నేహితులు నరసింహం ,ఆది నారాయాణలకు , పాలేరుకు ,కూడా మా నాన్న టికెట్ తీసే వారు .
ఒక్కో సారి మంచి సిన్మాలు మా నాన్న వేసే వాయిదాల వల్ల వెళ్లి పోయేవి. చూసే ఆవ కాశం ఉండేది కాదు .కీలుగుఱ్ఱం చెంచు లక్ష్మి విప్ర నారాయణ ,ప్రహ్లాద ,పాతాళభైరవి లాంటి సినిమాలు చూసాం .మూడు  నెలలకు ఒక సారి సినిమాకు వెళ్తే గ్రేటే .అదీ బతిమి లాడి ,బతిమి లాడి ,ఓపిక  అంతా ఖర్చయిన తర్వాతే .చివరికి విసుగొచ్చి మా దాచ్చి ”మా మయ్యా ! రేపు సినిమాకు తీసికేల్లక పోతే ఇక మీ ఇంటికి రానే రాను ”అని భీష్మించేది . దానికీ, ఉలుకూ ,పలుకూ ఉండేది కాదు మానాన్న దగ్గర .పాపం ఆది మాత్రం  ఏం చేస్తుంది .ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి ”మామయ్యా సినిమా ”అంటూ రికార్డు పెట్టేది .విసుగొచ్చి ఎప్పుడో నాన్న సరే అనే వారు .ఇంత భాగోతం జరిగి తే కాని సినిమా కు వెళ్ళే అవకాశం వచ్చేది కాదు .భోజనాలు చేసి రెండో ఆటకు ఎక్కువ గా వెళ్ళే వాళ్ళం .అక్కడ నిద్ర వచ్చి ఒక్కో సారి సగం సినిమానే చూసే వాళ్ళం .మా రెండో బావ ”వేలూరి వివేకా నందం ”గారు ఉయ్యూరు పాలి టే క్నిక్ లో సి విల్ చది వే వారు .ఆయన అప్ప టికి బావ కాలేదు కాని, చిరివాడ బంధుత్వం ఉంది కనుక తరచు మా ఇంటికి వచ్చే వాడు .నన్నూ మా తమ్మున్నీ  ఒల్లో  కూచో బెట్టుకొని ఎన్నో కబుర్లు చెప్పే వాడు .ఆయన బాగా మాట్లాడే వాడు. హిందీ సినిమాలు చూసి ఆ కదా సంభాషణలు పూస గుచ్చి నట్లు చెప్పే వాడు .మాకు అప్పుడు ఆ సినిమా ల మీద మంచి మోజు ఏర్పడేది .అయినా ఏమి లాభం .?విని ఆనందించటమే ఎక్కువ .. ఆ తర్వాత పుల్లేరు కాలువ కు అవతల వీర భద్ర రావు గారి స్తలం లో వేసవి కాలం లో టూరింగ్ టాకీస్ వచ్చేది .అప్పుడు అక్కడ పెట్టె రికార్డులన్నీ మా ఇంటికి బాగా   విని పించేవి .ఇంట్లో ఉంది బొమ్మను చూడ కుండా సినిమా,విన గలిగే వారం .జన సమ్మర్దం తక్కువ కనుకఆది సాధ్యం అయ్యేది . .అలాగే ఎకామ్బరేశ్వర,వాళ్ళ పాటలూ విని పించేవి .సినిమా వదిలి నట్లు తెలిసేది .వేసవి లో ఒక్కో సారి సినిమా లోని పాటలూ మాటలూ కూడా స్పష్టం గా విన పడేవి .వేసవి లో ఆరు బయట పడుకొనే వాళ్ళం .అందుకే బాగా విని పించేవి .సినిమా హాళ్ల దగ్గర రంగు నీళ్ళు అమ్మే వారు .కొందరు అవి కోని తాగే వారు .మా వాళ్లెవరు మాకుకోని  పెట్టె వారు కాదు .సోడా తాగే వాళ్లమేమో ఎప్పుడైనా .సోడా అర్ధణా .మా ఉయ్యూరు కే.సి.పి గాస్ తో సోడాలు తయారు చేసే వారు .మాంచి ఘాటుగా ఉండేది .తిన్న అన్నం అరిగేది . ఉయ్యూరు సెంటర్ లో బిస్మిల్లావాళ్లషాప్ లో   సోడాకు మంచి గిరాకీ ఉండేది .ఆ తర్వాత నరసింహారావు ఆ తర్వాతఅతని కొడుకు  సోడా మోహన్ లు సోడా బండి తో ఇంటికి వచ్చిసోదాలు అడిగి కొట్టిచ్చే వారు సోడా మోహన్ సి ఆడాను చాలా సేపు సరదా గా శబ్దం వచ్చేట్లు కొట్టటం లో స్పెషల్ .అందుకే అతని సోడా కు గిరాకీ ఎక్కువ . సోడా  లేక పోతీ ”జీడీలు ”కొనుక్కొని తినే వాళ్లమేమో అని జ్ఞాపకం .తెర్మాస్ ఫ్లాస్కు లలో”రంగుల  పుల్ల అయిసు క్రీం లు అమ్మే వారు. ఒక్కో సారి అవి ఇప్పించే వారు .భలేగా ఉండేవి .పీచు మిథాయి గ్లాస్ బండిలో తెచ్చి అమ్మే వారు .చిన్న మెషిన్ తో గుండ్రం గా ఉండే దానిలో పంచదార ఇంకా ఏదో కలిపి తిప్పే వారు. దాని వల్ల ఆ గిన్నె కు లోపల సన్నని రంగు దారాలు లాంటి పంచ దార దారాలు చుట్టలు చుట్టలు గా చుట్టుకోనేవి .దాన్ని తీసి పావలాకు ఇచ్చే వారు .అలాగే ఒక నల్లని సాయిబు గారు ఒక కర్రకుపై చివర రంగుల  పంచ దార పాకం గట్టిగా చేసి  చుట్ట గా చుట్టి తీసుకొని వచ్చే వాడు .మనకు యే ఆకారం కావాలంటే ఆ ఆకారాన్ని ఆ పాకం కొద్దిగా తీసి సన్నగా లాగి బొమ్మ లా తయారు చేసి అమ్మే వాడు .సాధారణం గా సైకిళ్ళు ,గడియారాలు మనిషి బొమ్మలు చేయించుకొని తినే వాళ్ళం. బలే గా ఉండేది .దాని పేరు గుర్తుకు రావటం లేదు .
ఇదంతా మా చిన్నతనంలో .మా అబ్బాయిల కాలం వచ్చేసరికి మార్పు బాగా వచ్చింది .తరచుగా సినిమాలకు వెళ్ళే వాళ్ళం పిల్లలతో .సినిమాకు వెళ్లటం ఒక హాబీ గా మారిన కాలం వచ్చే సింది .కాలం తెచ్చిన మార్పు .వీడియోలు తెచ్చుకొనే రోజులు పోయి ,సిడి ల కాలం వచ్చి, ఇపుడు అవీ అవసరం లేకుండానే యు ట్యూబ్ లో,  నెట్ లో సినిమాలు చూస్తున్నాం .చానళ్ళు  సినిమాలుకుమ్మరిస్తూనే ఉన్నాయి .  .”నాన్నా  సినిమా! మామయ్యా సినిమా !మాస్టారూ సినిమా !” రోజులు పోయి ఇవాళ పిల్లలుయే సినిమాకు ఎప్పుడు వెళ్లి ఎప్పుడు వస్తున్నారో తెలియ కుండా పోతోంది . మనమే ”అబ్బాయ్ సినిమా !,అమ్మాయ్ సినిమా !శిష్యా సినిమా !”అనాల్సిన కాలం  వచ్చింది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-9-12–కాంప్ –అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.