అమెరికా డైరీ — వీడ్కోలు వారం

అమెరికా డైరీ —
వీడ్కోలు వారం 

సెప్టెంబర్ ఇరవై నాలుగు  సోమ వారం నుండి ,ముప్ఫై ఆది వారం వరకు విశేషాలు 
ఇరవై నాలుగు సోమ వారం మేసీస్ లో ఆపిల్ స్టోర్సు లో ఐ పాడ్ చూశాం .వాల్లవీ ఫ్రీ బుక్స్ డౌన్ లోడ్ చేసుకొనే వీలు ,మాక్లిన్ బెర్గ్ లైబ్రరి లో పుస్తకాలను ఆన్  లైన్ లో చదువు కొనే వీలూ కల్పించారు .లైబ్రరి పై అంతస్తు నుంచి మెట్లు దిగుతుంటే కుడి మోకాలు కొద్దిగా పట్టు తప్పింది .తూలి పడ బోయాను .వెంటనే సర్దుకుంది .మంగళ వారం సాయంత్రం పిల్లల్ని జిమ్నాస్టిక్సు క్లాస్ లో దింపి ,మేం ముగ్గురం” ఓల్డ్ టైం పాటరి ” (పాత కాలపు పెంకులు )కి వెళ్లి ఒక సారి అన్నీ తిరిగి చూశాం .ఫోటోలు తీసుకొన్నాము .ఇంటికి వచ్చిన తర్వాత ఉషా ఫోన్ చేసింది .శని వారం శ్రీ సత్య నారాయణ వ్రతం చేయిన్చుకొందామను కొంటున్నామని ,లిస్టు చెప్పమని అడిగితే చెప్పా. .బుధ వారం హైదరా బాద్ కు ఫోన్ చేసి మా అక్కయ్యా ,బావ గార్ల తో మాట్లాడాము .మేము మాట్లాడటం ఆయనకెంతో బలం గా ఉందని పించిన్దన్నారు బావ .గురు వారం ఈ నాడు నెట్ లో చదువు తుంటే ,పిన్నమ నేని కోటేశ్వర రావు గారు 84ఏళ్ల వయసులో కేన్సర్ తో బాధ పడుతూ మరణించారని తెలిసింది .ఆయన కృష్ణా జిల్లా పరిషద్ చైర్మన్ గా మూడు సార్లు ,ముదినే పల్లి శాసన సభ్యులుగా రెండు సార్లు పని చేసి విద్యా రంగానికి ఎంతోసేవ చేశారు .ఎన్ని పదవుల్లో ఉన్న ఆయన్ను అందరు ”చైర్మన్ పిన్నమ నేని ”అనే ఆప్యాయం గా పిలుస్తారు .అదీ ఆయన సాధించిన విజయం .దీని పై ”చైర్మన్ కోటేశ్వర రావు గారు ”అనే ఆర్టికల్ రాశానుచైర్మన్ కోటేశ్వ ర రావు గారు

.
గురు వారం మధ్యాహ్నం నాగ మణి ఇంట్లో భోజనం .రాత్రికి రవి గాయత్రి దంపతుల ఇంట్లో విందు .మేము ,శీతల్ ,ప్రశాంత్ దంపతులు ,ముక్కామల దుర్గ గారు అతిధులం .చపాతీ బంగాల దుంప కూర ,మామిడి కాయ పప్పు ,బీన్సు కూర ,ఉల్లి చట్ని ,అన్నం సాంబారు ,పెరుగు ల తో మంచి భోజనం .అదనంగా ”జున్ను ”అన్నీ బాగున్నాయి .ఇది వరకో సారి రాలీ దంపతులు వ చ్చి నప్పుడు ఉదయం టిఫిన్ కు పిలిచి అన్నిటి తో బాటు” జున్ను” కూడా పెట్టారు .సరదా గా కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేశాం .వాళ్ళు ఏర్పాటు చేసుకొన్నా హోమ్ధియేటర్ చూపించాడు రవి .వాళ్ల తలిదండ్రులు రాఘ వేంద్ర రావు ,కామాక్షి గార్లు సరదా, మర్యాదా ఉన్న మనుసులు .నాకు ఆయన తో ,మా ఆవిడకు వాళ్ళావిడ తో రోజూ కబుర్లు బానే ఉంటాయి .
శుక్ర వారంమధ్యాహ్నం ఎల్లా వెంకటేశ్వర రావు గారి అమ్మాయి ,గాయిత్రి ఆన్ లైన్ లో కూచి పూడి నాట్యా చార్యులు పసు మార్తి గురు వు గారి వద్ద మా ఇంట్లో ప్రాక్టీసు చేశారు .ఎల్లా అక్టోబర్ చివర్లో ఇక్కడికి వస్తారు .అప్పుడు ఒక నృత్య రూపకానికి ఇది రిహార్సిల్ .గురువు గారికి లైన్ లోనే నమస్కారాలు చెప్పాము ”.మేము వచ్చే దాకా మీరు శార్లేట్ లో  ఉండరా ?”అని మేం ఇండియా వెళ్తున్నామని తెలిసి అన్నారు పసు మర్తి వారు .సాయంత్రం  పిల్లలను  ఆర్టు క్లాస్ లో దించి రాం కీ ఇంటికి వెళ్లి బంతి పూలు ఇచ్చి వచ్చాం .క్లాస్ ఆవ గానే అటునుంచే ఎయిర్ పోర్టు కు వెళ్ళాం .అల్లుడు ఆవ దాని ఇండియా నుండి దుబాయ్ న్యూయార్కుల మీదుగా వచ్చారు .ఇంటికి వచ్చే సరికి ఎనిమిదిమ్బావు అయింది .ఈ రోజు మా ఇంట్లో భజన .మా మనవడు శ్రీ కేత్ ఏర్పాట్లు చూశాడు .వర కుటుంబం  ,జగదీశ్- లక్ష్మి కుటుంబం ,పవన్ దంపతులు వచ్చారు .గంట సేపు భజన జరిగింది .చివర్లో నేను ”శార్లేట్ లోని సాయి సెంటర్ వారి తో ఈ ఆరు నెలలు చక్క గా గడిచి పోయాయి .మా ఇద్దర్నీ మీ కుటుంబ సభ్యులు గా భావించి ఎంతో పెద్దరికం ఇచ్చారు .వచ్చే బుధ వారం సాయంత్రం మా ఇండియా ప్రయాణం .అందరికి వీడ్కోలు ”అని కృతజ్ఞతలు తెలిపాను .అందరు చాలా బాధ పడ్డారు మేం వెళ్లి పోతున్నందుకు .ఆది వారి సౌజన్యానికి గుర్తు .అంతే .
 మళ్ళీ శ్రీ సత్య నారాయణ స్వామి వ్రతం 
ఇరవై రోజుల కిందట నేను ప్రియా దంపతుల ఇంట్లో శ్రీ సత్య నారాయణ వ్రతం చేయించానని తెలిసి నప్పటి నుంచి రాంకీ ఉషా దంపతులు వాళ్ళు కూడా వ్రతం చేసుకోవాలనే సంకల్పానికి వచ్చారు .ఈ శని వారమే దాన్ని చేయిన్చుకోవాలను కొన్నారు .మేమిద్దరం ఉదయం అయిదు గంటలకే లేచి నిత్య కృత్యాలు ,సంధ్యా ,పూజ అయి, రెడీ గా ఉన్నాం .రాంకీ తొమ్మిదింటికి వచ్చి కారు లో మా ఇద్దర్నీ తమ ఇంటికి తీసుకొని వెళ్లాడు .అక్కడ ఏర్పాట్లు దాదాపు నేను చెప్పినట్లే చేశారు .ఉషా వాళ్ల అమ్మా నాన్న ,రాంకీ ఉషా దంపతులు కూర్చుని చేసుకొన్నారు .మొదలు పెట్టె సరికి పదిన్నర అయింది .వ్రతం ,శ్రీ వెంకటేశ్వర దీపారాదనను శాస్త్రోక్తం గా చేయించాను .అంతా అయేసరికి ఒంటి గంట అయింది .దాదాపు యాభై మందికి పైగా అతిధులు వచ్చారు .అందరు సాయి సెంటర్ లో పరిచయం ఉన్న వాళ్ళే .పూజా విధానం చూసి అందరు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని పొందారు .ఇంత వరకు ఎవరు ఇంత నిర్దుష్టం  గా చేయించ లేదని అందరు అన్నారు .ఆది స్వామి కృపా ,సరస్వతీ దేవి కటాక్షం .అంతే .ఆ తర్వాతా విందు. రెండు ఆకు కూరలు ,ఆలూ కూర,బెండ కాయ కూర ,చట్నీ ,పాయసం ,పులిహోర అప్పడం సాంబారు ,పెరుగు ,మాంగో లస్సీ ల తో,మంచి విందు ఏర్పాటయింది.అందరు హాయిగా కమ్మగా భోజనం చేశారు .నేను ,ఎందుకో  తిన లేక పోయా .నాకు షర్టు ,మా శ్రీమతికి శాలువ ,ఫోటో ఫ్రెం ,దక్షిణ గా నలభై డాలర్లు తాంబూలం ఇచ్చారు .జగదీశ్ ఎప్పుడు కుటుంబం తో మాకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవటం అలవాటు .వారంతా మా ఇద్దరికీ నమస్కరించి ,తాంబూలం లో యాభై ఒక్క డాలర్లు పెట్టి అంద జేశారు .ఆ తర్వాత ఆడ వాళ్ళు శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ చేశారు ‘.రాంకీ ఉషా ల ఆనందానికి అంతు లేదు .”మీరు చేయిస్తారని తెలిస్తే చాలా మంది మీతో వ్రతం చేయించుకొనే వారు .ఈ సారి ట్రిప్ లో దీనికి సిద్ధం చేస్తాం ”అన్నారు సంతోషం గా ఉషా రామ్కీలు .నవ్వి’ మేము దీని నిమిత్తం రాలేదు. మా ఇంట్లో మేము ఎప్పుడూ చేసుకోన్నట్లే మీకూ చేయించాం .అంతే ”అన్నాను . .’ఇంటికి వచ్చే సరికి సాయంత్రం అయిదున్నర దాటింది .
ఒకే రోజు మూడు భోజనాలు 
శని వారం రాత్రి మా ఇంటికి దగ్గర్లో ఇల్లు కొనుక్కున్న శీతల్ -ప్రశాంత్ దంపతులు సరదాగా భోజనాలు ఏర్పాటు చేసి మిత్రుల్ని మమ్మల్నీ ఆహ్వానించారు .వీళ్ళ గృహ ప్రవేశ ముహూర్తం నేనే పెట్టాను . .చాలా పదా ర్దాలు చేయించి హోటల్ నుండి తెప్పించారు .మేమిద్దరం రెండేసి సమోసాలు మాత్రమె తిన్నాం .కడుపు నిండింది .మిగతా వాటి జోలిలి వీల్లలేదు .వాళ్లకు బై చెప్పి వచ్చాం ‘
అక్కడ నుండి వల్లం నర సింహా రావు  దంపతుల కుమార్తె రేణు దంపతుల నూ తన గృహ ప్రవేశ సందర్భం గా విందు ఏర్పరచారు .వల్లం దంపతుల వివాహ యాభై వసంతాల పండుగ కూడా రేణు ఇది వరకు నిర్వ హిస్తే వెళ్ళాం .అప్పటినుంచి  వారి తో పరిచయం .వీళ్ళు బాగా హడా విడి చేశారు .వందమందికి పైగా అతిదులోచ్చారు .ఎన్నో పదార్ధాలు చేయించారు .కాని మేమేమీ తిన లేదు .మంచినీళ్ళు త్హ్హాగి కొద్దిగా కెరట్ హల్వా తిన్నాం .అంతా ఆయె సరికి రాత్రి పదిఅయింది .
ఈ విధం గా ఈ శని వారం ఉదయం రాంకీ ఇంట్లో ,రాత్రికి శీతల్, రేణు ఇళ్ళల్లో మూడు విందు భోజనాలు చేసి నట్లు .ఇంతకు ముందు గురువారం నాగలక్ష్మి ,గాయత్రి ఇళ్లలో విందులు .ఇవన్నీ మా మీద ఉన్న ఆప్యాయతకు నిదర్శనం గా వాళ్ళందరూ ఏర్పాటు చేసిన వీడ్కోలు విందులు .మంచి మిత్ర బృందం ఇక్కడ ఉండటం ఆనంద దాయకం .
ఆది వారం రాత్రికి పవన్ రాధా దంపతుల ఇంట్లో భోజనం .పప్పు ,వంకాయ కూర ,ఆవ కాయ ,పచ్చడి ,సాంబారు అన్నం పెరుగు ల తో విందు .మేము వేళ్ళ గానే అందరికి వేడి వేడి పకోడీలు వేసి పెట్టింది రాధ .అవి పూటుగా లాగించాం .ఇంకా అన్నం ఏమి లోపలి కి వెళ్తుంది ? ఏదో కతికామని పించాం  .నాకు షర్టు ,తల్లీ కూతుళ్ళకు చీర, జాకెట్ లు పెట్టి పవ న్ దంపతులు తమ సంతోషాన్ని వ్యక్త పరచారు .ఈ వారం అంతా ఇలా సందడి సందడి గా గడిచి పోయింది .మూడవ తేదీ బుధ వారం రాత్రి ఫ్లైట్ కు అ ఇండియా కు తిరుగు ప్రయాణం .సరిగ్గా వారం తక్కువ ఆరు నెలలు అమెరికా లో ఉన్నట్లు .చాలా వేగం గా కాలం గడిచి పోయింది
మా ఈ నాల్గవ అమెరికా పర్య టన సాంస్కృతిక పర్య టన అని పించి, మిగిలిన వాటికి భిన్నం గా జరిగింది .వచ్చిన దగ్గర నుండి ఎల్లా వారితో ,ఈల శివ ప్రసాద్ గారితో పరిచయాలు .ఆ తర్వాతా అలబామా లో మైనేని వారింట్లో కొలువు .అక్కడి ద్రోణవల్లి వారు, కాకాని సోదరులతో పరిచయం ,హెలెన్ కెల్లర్ ఇంటి సందర్శన ,ఆ పిమ్మట అట్లాంటా  పర్యటన ,అక్కడ దేవాలయ సందర్శనం ,రాలీ పర్యటన .అక్కడ బాలాజీ దేవాలయం, శివాలయ సందర్శనం .మౌంట్ సోమా సందర్శనాను భూతి ఎంతో త్రుప్తినిచ్చాయి .ఇక్కడి హిందూ సెంటర్ కార్య క్రమాలు, సాయి సెంటర్ భజనలు ,త్రిమూర్తి దేవాలయం లో ఉత్సవ విగ్రహ  ప్రతిష్ట ,ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ,అన్నీ అన్నే .ముహూర్తాలు పెట్టడం రెండు అ సత్య నారాయణ వ్రతాలు గృహ ప్రవేశం ఎంతో  మానసిక ఆనందాన్నిచ్చాయి . .కల కాలం గుర్తుంచుకో దగిన పర్యటన గా ఉంది .దీనిలో మాకు హార్దికం గా సౌజన్యాన్ని చూపిన వారందరి పేరు పేరునా కృతజ్ఞతలు .
 అక్టోబర్ రెండు మంగళ వారం  గాంధీ జయంతి సందర్భం గా అందరికి శుభా కాంక్షలు .
మీ —గబ్బిట దుర్గా ప్రసాద్ –1-10-12-కాంప్ –అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.