ఊసుల్లో ఉయ్యూరు –41
కాటా కుస్తీలు
మా ఉయ్యూరు లో రెండు మూడేళ్ళు జోరుగా కుస్తీ పోటీలు జరిగాయి .వీటికి వేదిక రాజా గారి కోట .అక్కడ జనం కూర్చోవ టానికి ,కుస్తీ గోదా కు స్థలం బాగా ఉండేది .అందుకని అక్కడ నిర్వ హించే వారు .వీటిని కాటా కుస్తీలని పిలిచే వారు .ఎక్కడెక్కడ నుండో పహిల్వానులు వచ్చే వారు .వాళ్ళను చూడటం మాకు ముచ్చటగా ఉండేది .అపర భీమిడిలా ఒక్కోరు కనీ పించే వారు .కుస్తీ చూడా లంటే డబ్బు పెట్టి టికెట్టు కొనుక్కోవాల్సి వచ్చేది . రేట్లు పాతిక నుంచి కిందకు ఉండేవి .కుర్చీలు ,బెంఛీ లు, నేల మీదా కూర్చుని చూసే వారు .కుస్తీ పోటీ రంగాస్తలాన్ని” గోదా ”అనే వారు .దాని చుట్టూ గట్టి స్తంభాలతో సరుకు బాదులతో జనం లోపలి తోసుకు రాకుండా బందో బస్తు చేసే వారు . .టికెట్లు అమ్మటానికి ఒక ఏర్పాటు ఉండేది .మైకుల్లో ఓ నెల రోజుల ముందు నుంచే బాగా ప్రచారం చేసే వారు .కుస్తీ జరిగే కాలం లో బజార్లన్నీ సందడి గా ఉండేవి .అంతా కుస్తీ ల గురించే మాట్లాడు కొనే వారు .ఎక్కడో బస్తీ ల లో జరగాల్సిన పోటీలు ఉయ్యూరు లాంటి పల్లె టూరి లో జరగటం వింత గా చెప్పుకొనే వారు .అదో జాతర .ఇవాళ క్రికేట్టుకు ఎంత క్రేజు ఉందొ ,ఆనాడు కుస్తీలకు అంతటి క్రేజు ఉండేది .ఆడా ,మగా అందరు ఆ విషయమే మాట్లాడుకొనే వారు .ఇదంతా పోటీలకు నేపధ్యం .మగ్గాళ్ళేకుస్తీ పోటీలు చూసే వారు .
కుస్తీ ఫహిల్వాన్లకు మహా ఫాలోయింగు ఉండేది .పేరు మోసిన ఫహిల్వన్ ఊళ్లోకి వస్తే బాజా భజంత్రీలతో అభి మానులు స్వాగతం చెప్పి తీసుకొని వచ్చే వారు .వారి మీద గులాం, పూలు చల్లుతూ జైలు కొడుతూ హడా విడి చేసే వారు .వారంతా గాల్ల లున్గీలే కట్టుకొనేవారు .కొందరు ఫహిల్వానులను ఆహ్వానించి ముందు నుంచే వారికి వసతులు కల్పించే వారు .మా ఇళ్లకు దగ్గర లో ఉన్న వంగల వారి సందులో వంగల సూర్యం ఇంటి వెనక కోమటి సాంబయ్య గారి బావ గారి పెంకు టిల్లుండేది .అక్కడ ఫహిల్వానులకు మకాం ఏర్పాటు .ఫహిల్వానులకు రోజూ పాలు, బాదం పప్పు ,పిస్తా పప్పు, జీడి పప్పు లతో తిండి పెట్టి తయారు చేసే వారు .వేట మాంసం ,గుడ్లు సరే సరి .బలిసిన గొర్రెలు మేకలు అక్కడ కట్టేసి ఉండేవి .వంట చేసే వాళ్ళుండే వారు .ఫహిల్వానులకు అన్ని సపర్యలు చేసే సేవకులను లేదా చోటా ఫహిల్వానులను ఏర్పాటు చేసే వారు .గురువు గార్ల గురించి శిష్యులు మహా గొప్పగా చెప్పుకొనె వారు .ఒళ్లంతా నూనె తో మర్దనా స్నానం సాంబ్రాణి పోగా సెంట్లు అత్తరు లతో వాసనేసి పోయే వారు . .వాళ్ళను పందెం కోళ్ళను ను మేపి నట్లు మేపే వారు .వారు కండ పట్టి బలే నిగా నిగా లాడే వారు .కండలను ప్రదర్శించే వారు .కుస్తీ లంగోటీ ని కట్టివ్యాయామం చేసే వారు .దానికి ప్రత్యెక కర్ర సాధనాలున్దేవి .పరిగెత్తే వారు .బస్కీలు తీసే వారు .మాకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్లి వాళ్ల సాధన చూసే వాళ్ళం .అదో సరదా కాలక్షేపం .
కుస్తీపోటీలు సాయంకాలం అదీ ఆది వారం నాడు జరిగేవి . .అప్పటికే బజారు నిండా జనం నిండి పోయే వారు .ఎవరు గెలుస్తారని పందాలు కాసే వారు .కొన్ని పోటీలు రంజు గా జరిగే వని చెప్పుకొనే వారు .మేమెప్పుడు టికెట్ కోని చూసిన జ్ఞాపకం లేదు .బందో బస్తు బాగా ఉండేది .ఫ్రీ గా లోపలి ఎవరినీ పోనిచ్చే వారు కాదు .పోలీసులు కూడా మోహరించే వారు .వాళ్లను మచ్చిక చేసుకొని కొందరు లోపలి దూరే వారు .కుస్తీ పోటీ కి రిఫరీ ఉండే వాడు .గోదాం లో అడుగున ఇసుక పోసే వారు .పోటీ దార్లు ఇద్దరి చేత రిఫరీ షేక్ హాండ్ ఇప్పించే వాడు .ఒంటికి నూనె రాసుకొని రంగుల లంగోటీ తో గోదా లోకి దిగే వారు .చాలా తీవ్రం గా నె పోట్లాడు కొనే వారు .గెలుపోటముల నిర్ణయం రిఫరీదే .దానికి అందరు బద్ధులవాల్సిందే.గెలిచినా వాడిని డప్పు లతో ఊరంతా త్రిప్పి అభిమానాన్ని చాటుకొనే వారు .ఓడిన వాడు విచారం తో వెళ్లి పోయే వాడు .
ఒక్కో సారి బాగా దున్న పోతు లాగా బలిసిన ఫహిల్వాను అంత బలం లేని ఫహిల్వాన్ చేతిలో ఒడి పోవటం ఆశ్చర్యం గా చెప్పుకొనే వారు .అప్పుడే ”లాలూచి కుస్తీ ”అనే వారు .దీనికి బలిసిన ఫహిల్వానుకు బక్క ఫహిల్వాను ముందే డబ్బిచ్చి ఒడి పోయే పట్లు పట్టించే వాడన్న మాట .అదీ రహస్యం .మొదటి రెండేళ్లు బాగా సరదాగా పోటీలు జరిగేవి .ఆ తర్వాత తర్వాత లాలూచీ ఎక్కు వైంది .అందుకని పోటీలకు జనం వెళ్లటం తగ్గించారు .మా ఉయ్యురుకు చెందిన ఒక ముస్లిం ఫహిల్వాన్ ఉండే వాడు .ఆయన మా అత్తరు సాహేబు గారి కొడుకు .గల్ల లుంగీ కట్టి జబర్దస్తీ గా ఉండే వాడు .ఆయన కూడా పోటీలలో పాల్గొనే వాడు .అయితే అయన గెలిచిన దాఖలా లేదని జ్ఞాపకం .కుస్తీ పోటీలను డబ్బున్న షావుకార్లు ఖర్చు పెట్టి నిర్వ హించే వారు .మొదట్లో వారికి డబ్బులు బాగానే గిట్టు బాటు అయేవి . .క్రమంగా తగ్గింది .జనానికి వ్యాపకాలు కూడా పెరిగి పోయాయి .దాని మీద ఆరాటం తగ్గింది .మరీ లాలూచీ కుస్తీలు అంటే ఇవాళ మనం అనుకొనే ”మాచ్ ఫిక్సింగులు ”ఎక్కువ అవటం తో గిరాకీ బాగా పడి పోయింది .లోపల జనాన్ని సర్దు బాటు చేయటం చాలా కష్టం గా ఉండేది .అందుకని నిర్వాహకులు కొందరు రౌడీలను మేపి తమ మనుష్యులు గా ఉంచుకొని పోటీ సక్రమం గా జరి గె టట్లు, బెవారసు జనం లోపలి రాకుండా చేయ టానికిఉప యోగించు కొనే వారు ..
కోట బయట అన్ని రకాల దుకాణాలు వచ్చేవి .మిథాయి కోట్లు ,సోడా కోట్లు, డ్రింకు షాపులు, సిగరెట్ బీడీ, చుట్టా అన్నే అమ్మే వారు .జనం బాగా మందుకొట్టి వీరంగం వేసే వారు .మధ్యాహ్నం నుంచే చాలా హడా విడి ఉండేది .చివర్లో జనం గేట్లు తోసుకు లోపలి వెళ్ళే వారు .లేక పోతే ప్రక్క దొడ్ల లోంచి గోడ దూకి వెనుక వైపు నుండి వెళ్ళే వారు .మాకు ఈ విషయాలన్నీ మా మిత్రుడు ఆది నారాయణ చెప్పే వాడు .అతను విషయ సేకరణ లో భలే ముందుండే వాడు .కోమటి సాంబయ్య గారి స్థలం లో కూడా కొన్ని పోటీలు జరిగిన గుర్తు .అయితే స్థలం చిన్నది .ఇక్కడే” రక్త కన్నీరు” నాటకాలు నాగభూషణం ఆడారు .ఆ డైలాగులు మాకు విని పించేవి .దానికి ప్రచారం గా ఆయన డైలాగుల రికార్డులు పెట్టె వారు ”గోపాలం ఏమిటి తప్పాలం లాగా -గోపాల్ కాదు ఓన్లీ పాల్ ”అనే డైలాగు ఎవరూ మరిచి పోనిది .ఆ నాటకం లో ఆయన స్థానిక విషయాలను చొప్పించి సందర్భానికి తగి నట్లు అల్లి, జనం చేత చప్పట్లు కొట్టించు కొనే వాడు .ఆది ఆయన స్పెషాలిటి .నాజర్ కూడా బుర్ర కధలో ఊరి రాజకీయాలను ఏకి పారేసే వాడు .కుస్తీల నుంచి ,నాటకం దాటి, బుర్ర కధలోకి ప్రవేశించాం . .అదీ మా ఉయ్యూరు కోట ,సాంబయ్య గారి గొడ్ల దొడ్డి మహాత్మ్యం .
ఉండ్రాళ్ళ తద్దె గాంధీ, జయంతి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –2-10-12-కాంప్ –అమెరికా
వీక్షకులు
- 995,045 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.11వ భాగం.25.3.23.
- రీ అణుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.28వ భాగం.న్యాయ దర్శనం.25.3.23
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.10వ భాగం.24.3.23
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.27వభగం.న్యాయ దర్శనం .24.3.23.
- హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,952)
- సమీక్ష (1,307)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (386)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు