అమెరికా ఊసులు –24 డైలీ అమెరికా

 అమెరికా  ఊసులు –24
డైలీ అమెరికా
డైలీ అమెరికా అంటే అమెరికా లో మేమున్న ఆరు నెలలు మా నిత్య కృత్యం ఎలా జారి గిం
దని   తెలియ జేయటమే

.ఉయ్యూరు  లో రోజు ఉదయం అయిదున్నర ఆరు మధ్యలో లేచే వాళ్ళం .ఇక్కడ రోజు యేడు ,ఏడున్నర మధ్యలో లేచాము .లేవాగానే పళ్ళు తోముకొని వాళ్ళం .నేను ఒక చెంచాడు మెంతి పిండి ఒక చిన్న గ్లాసు నీళ్ళలో కలుపు కోని తాగే వాడిని .ఆవిడ ఆపాటికి కార్య క్రమాలైన తర్వాత మార్నింగ్ మీల్సు అంటే మందులు వేసుకోనేది .ఇద్దరం కాఫీలు తాగే వాళ్ళం .ఆ తర్వాతనేను స్నానం చేసే వాడిని .తర్వాతా పట్టు బట్ట కట్టుకొని సంధ్యా వందనం ,పూజా చేసుకొనే వాడిని సుమారు ముప్పావు గంట .అప్పుడు శ్రీ రామ కోటి రాసి, భగవద్గీత కొద్దిగా పారాయణం చేసే వాడిని .అప్పుడు టిఫిన్ రెడీ చేసి ఉంచేది మా అమ్మాయి విజ్జి .ఇడ్లీ ,దోసె ఉప్మా, గారే లేక పోతే స్సేరియల్సు తినే వాల్లం.మళ్ళీ రెండో రౌండు కాఫీ కొద్దిగా తాగే వాడిని .ప్రతి మంగళ ,శని వారాలలో శ్రీ ఆంజనేయ స్వామి సహస్రనామా లతో పూజ చేసే వాడిని .గురు వారం రాఘవేంద్ర సాయి బాబా అస్తోత్తరాలు స్పెషల్ .ఆవిడ కూడా స్నానం చేసి టిఫిన్ చేసేది .నేను అప్పుడు మందులు వేసుకొనే వాడిని. ఇదంతా అయేసరికి ఉదయం తొమ్మిదిన్నర ,పది అయ్యేది  .
అప్పుడు ”కంప్యూటర్ ఎక్కే వాడిని ” .నాకోసం ఒక డెస్కు టాపు సిద్ధం గా ఉంచారు .పిల్లలకు స్కూళ్ళు కనుక పోటీ లేదు .అయినా వాళ్లకు ఐ పాడ్ ఉంది .అందుకని పెద్దగా నా జోలికి వచ్చే వారు కాదు .నేను ఉదయం పదింటి నుంచి పన్నెండున్నర వరకు కనీసం రెండు ఆర్తికల్సు రాసే వాడిని .ఆ తర్వాతా భోజనం .లైబ్రరీ నుండి తెచ్చిన పుస్తకాలు చదువు కొనే వాడిని .మధ్యాహ్నం నిద్రకు ప్రయత్నించినా వచ్చేది కాదు మూడింటి దాకా మంచం మీద దోర్లుడే .అప్పుడు చదివిన పుస్తకాలలో నోట్సు రాసుకో వలసినవి ఉంటె రాసుకొనే వాడిని .లైబ్రరి పుస్తకాలకు గడువు ఇరవై ఒక్క రోజులు .నేను వెళ్లి నపుడల్లా ఇరవైకిపై గా పుస్తకాలుతెచ్చుకొనే వాడిని .వాటిని పది రోజుల్లో పూర్తి  చేసే వాడిని .సాయంత్రం మా మన వాళ్ళు శ్రీ కేత్ ,ఆశు తోష్ ,పీయూష్ లు నాలుగుమ్బావుకు స్కూలు  నుండి బస్ లో వచ్చే వారు .ఇంటి దగ్గరే స్టాపు .వీలైతే వెళ్లి తీసుకొచ్చే వాడిని .వాళ్ళు తిఫినో, తిండో  తిని కంప్యూటర్ కోసం ఎగ బడే వారు .నేను అప్పుడు ఏదైనా రాసుకొనె వాడిని . మా పెద్ద మనవడు శ్రీ కేత్  ”తాత్ గారు ఎప్పురూ కంప్యూటర్ ఎప్పురూ ఎప్పురూ ”అని వచ్చీ రాని తెలుగులో అనే వాడు .మా ఇద్దరికే కంప్యూటర్ విషయం లో తగాదా .వాళ్లకు ఇచ్చి మళ్ళీ నేను పుస్తకం చదువు కొనే వాడిని .పిల్లలు బడి నుంచి వచ్చే లోపు మా అమ్మాయి మమ్మల్ని ఎక్కడి కైనా షాపింగులకు తీసుకు వెళ్ళేది .పిల్లలోచ్చే సమయానికి ఇంటి దగ్గర ఉండే వాళ్ళం .సాయంత్రం అయిదింటికి టీ తాగే వాళ్ళం .నేను కాసేపు బయట నడక సాగించి వచ్చే వాడిని .సాయంత్రాలు వాళ్ళు జిమ్నాస్తిక్సుకో ఆర్టు క్లాస్ కో లైబ్రరీ క్లాసులకో వెళ్తే నేనూ వాళ్ళతో వెళ్ళే వాడిని
మా ఆవిడ సాయంత్రం ఆరు గంటల నుండి మా టి.వీ .చూసేది .అందులో వసంత కోకిల ,చిన్నారి పెళ్లి కూతురు బాగా ఇష్టపడి చూసేది ,నేను చిన్నారి పెళ్లి కూతురు చూసే వాడిని .మిగతా చానేల్లెప్పుడు చూడా లని పించేది కాదు .రాత్రి తొమ్మిదింటికి ఈ టి.వి .లో వార్తలు చూడటం అల వాటు . రాత్రి ఎనిమిదింటికి భోజనం చేసే వాళ్ళం .మళ్ళీ చదువు .నా చదువు అంతా మంచం మీద పడుకొనే .రాత్రి పదిన్నర దాటి తె మా ఆవిడ ఇక చాలనేది .అయినా పదకొండున్నర వరకు చదువు కొనే వాడిని  .పుస్తకాలే నాకిక్కడ నేస్తాలు .మా అమ్మాయి పనులన్నీ పూర్తీ చేసుకొని పదిన్నరకో పదకొండింన్తికో మా దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేది .అప్పుడే ఇండియా కు ఫోన్లు చేయటానికి వీలుండేది .మా అల్లుడు రోజంతా ఇంట్లో నె ఉండి పని చేయటం ,ఎప్పుడూ ఫోన్లలో కాన్ఫరెంసులలో బిజీ గా ఉండటం వల్ల వీలయ్యేది కాదు .
ఉయ్యూరు నుండి మా మనవడు చరణ్ స్కైప్ప్ లోమధ్యాహ్నం పన్నెండు  కు  చక్కగా పది హేను రోజుల కోసారి మాట్లాడే వాడు .అక్కడ రాత్రి తొమ్మిదిన్నర అయ్యేది .పాపం కళ్ళు వాలి పోతున్నా కూర్చుని మాట్లాడే వాడు .మిగతా వాళ్ళంతా మేము చేస్తేనే .వచ్చిన మొదటి నెలలో సాయి సెంటరు వాళ్ళ భజనలకు బాగానే వెళ్ళాము .అవి రాత్రి పూట ఉండేవి .ఆ తర్వాత తగ్గించాం .ప్రక్క ఇంటి గాయత్రి వచ్చి పలకరించి పోతుంటుంది .ఆమె అత్తగారు ,మామ గారు వచ్చిఅన తర్వాతా వారితో పరిచయం బానే ఉంది .నాగమణి తన పని ఉంటె వచ్చి వెడుతుంది .ఇక్కడి కుటుంబాలలో పవన్ ,రాంకీ జగదీశ్ కుటుంబాలతో చాలా సన్నిహితం గా ఉండే వాళ్ళం .వాళ్ళకూ మా మీద గౌరవం బానే ఉంది .మా పెద్ద మనవడు శ్రీ కేత్ భజనలు ఐ పాడ్ నుండి నేర్చుకొని పాడే వాడు .మా చిన్నమనవాళ్లు తెలుగులో మాట్లాడటం తక్కువే .అమ్మా అని అంటారు తండ్రిని డాడీ అంటారు ” కాలికి దెబ్బ తగిలితే  ”కాల్నోప్”అంటారు .”ఐ డిడ్ స్నానం ”అంటారు కలగా పులగం గా .పప్పు ,కూరా చట్నీ అంటారు ”.బుజ్జి ముండలు” అల్లరి చేయ కుండా ముగ్గురు హాయిగా ఆడుకొంటారు .అందులో పీయూష్ నా పోలికే .నేను పిలిస్తే దగ్గరకు వెంటనే వస్తాడు .వాళ్ల అమ్మమ్మ పిలిస్తే రాడు .నేను ముద్దు పెట్టుకొంటే ,వాడూ పెట్టుకొంటాడు .లేక పోతే ”యు డూ ”అంటాడు .ఆశుతోష్ మాత్రం వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు బానే వస్తాడు ,ముద్దులిస్తాడు .రాత్రి తొమ్మిదిన్నరకు ఆశుతోష్ మా దగ్గరకు వచ్చి పడుకొంటాడు .ఒకో సారి ఇక్కడే .పీయూష్ మాత్రం రాడు.కాని వాడు మా దగ్గర పడుకొంటే వీడు  సహించలేడు .ఎలా గైనా వాడిని అప్ ష్ట యిర్ కు తీసుకు పోతాడు పోట్లాడయినా .ఆటలు లేక పోతే కంప్యూ టర్, లేక పోతే, టివి.తప్ప ఇంకే ధ్యాసా లేదు .వాళ్ల తో గడపటం మహా దానందం గా ఉంది .అప్పుడే ఆరు నెలలు అయిందా అని పిస్తోంది .
ఇక్కడికి వచ్చిన దగ్గరనుండి సరస భారతి 30,000మందిని ఈ ఆరు నెలల్లో పలకరించింది .అంటే నేలకు అయిదు వేల మందిని స్పర్శించింది .అంటే రోజుకు సరస భారతిని నూట ఏభై మంది చూశారు .నేను ఈ ఆరు నెలల్లో 370ఆర్తికల్సు రాశాను .అంటే నేలకు అరవై.అంటే రోజుకు సరాసరి రెండు .ఒక సాహిత్య సంస్థకు ఇంత కంటే గొప్ప ప్రచారం ఏమి ఉంటుంది .అందరు చదివి ,ఆనందిస్తున్నారు ఆదరిస్తున్నారు .సాహితీ సేవ విదేశీ గడ్డ మీద ఇలా జరగటం సరస భారతికి ముందడుగే .అందరికి అభి నందనాలు .అమెరికా లో ఎన్నో కార్య క్రమాలలో పాల్గొన్నాం .ఎల్లా వారు, ఈల శివ ప్రసాద్ ,మణి శర్మ .మైనేని వారి హన్త్స్ విల్ ,అట్లాంటా ,దేవాలయాల సందర్శనం, ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వగైరా .అన్నీ ఆనందాన్ని తృప్తినీ ఇచ్చాయి అమెరికా లోని భారతీయ మిత్రులకు వీడ్కోలు పలుకుతున్నాము .మాది ఈ సారి నిజం గా సాంస్కృతిక యాత్రే  . ఎవరైనా నన్ను ఇక్కడి వాళ్ళు మీరు ఎలా కాలం గడుపుతున్నారు ? అని అడిగితే నేను నవ్వుతూ ”కంచం ఖాలి -మంచం భర్తీ ”అనే వాడిని .కాని అలా చేయలేదని మీరు గ్రహించే ఉంటారు .గుడ్ బై అమెరికా —
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –3-10-12-కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

1 Response to అమెరికా ఊసులు –24 డైలీ అమెరికా

  1. Madiraju Siva Lakshmi says:

    first welcome to India for my heartly wel wisher and Our Sarasa Bharathi President Sri & Srimati
    Gabbita Durga Prasad Gariki. Memu Eee Roje net connect chesamu. First mana Sarasa Bharathine Chustunnamu. Ee Aaru nelalu meetho matladaledane badha vunna eeroju netlo mee America tour gurinchi chadivaka chala santhosamga vundi. Ikkada vunna andaru Amerika gurinchi thelusukunela chesaru. Chala Santhosam. India ragane mee assisulu thisukuntanu. Namasthe. Siva Lakshmi, 04-10-12

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.