శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి 23
53—‘’విభక్త త్రైవర్న్యం ,వ్యతికరిత ,లీలాన్జన తయా –విభాతి ,త్వన్నేత్ర ,త్రితయ మిద నదయితే
పున స్శ్రుష్టుం ,దేవాన్ ,ద్రుహిణహరి ,రుద్రానుపరతాన్ –రజస్సత్వం ,బిభ్రత్తమ ,ఇతి గుణానాం త్రియ మిద ‘’
తాత్పర్యం –ఈశాన ప్రియే !దేవీ !ఈ దీనుని వైపు చూసే ,నీ మూడు నేత్రాలు ,,వాని పై అర్ధ వలయాకారం గా తీర్చి దిద్దిన కాటుక కలవై ,తెలుపు ,నలుపు ,ఎరుపు అనే మూడు రంగులు కలవై ,జరిగి పోయిన జల ప్రళయ సమయం లో ,నీలో లీన మై,బ్రహ్మా ,విష్ణు ,రుద్రులను ,మహనీయ దేవతలను ,మళ్ళీ ఈ ,బ్రహ్మాండం లో సృష్టించ టానికి సత్వ ,రజస ,తమో గుణాలను ధరించాయేమో అన్నట్లు ప్రకాశిస్తున్నాయి .
విశేషమ –దేవి మూడు నేత్రాల్లో మూడు గుణాలున్నాయి .అవి –సృష్టి ,స్థితి ,లయాలకు కారణమవుతున్నాయి .కుడి కన్ను రజో ప్రధానం .ఎడమ కన్ను సత్వ ప్రధానం .ఫాల నేత్రం తమో గుణ ప్రధానం కలవి .భగవతి నేత్రాలు అనే ఉత్పలముల వల్ల ,బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వరులను సృష్టిస్తోంది .అంటే ,వీరిని సృష్టించే త్రిగుణాలు ,ఆమె నేత్రా లలో నిత్య నివాసం గా ఉన్నాయని భావం .
54—‘’పవిత్రీ కర్తుం ,నః పశు పతి ,పరాధీన హృదయే –దయా మిత్రైర్నేత్ర ,రారున ధవళ ,శ్యామ రుచిభిహ్
నద స్శోనో,గంగా ,తపన ,తసయేతి ,ధ్రువ మయం –త్రయాణాం ,తీర్దానాం ముపనయసి,సంభేద మనఘం .’’
తాత్పర్యం –అపర్ణా !అజ్ఞాన ప్రాణులను కాపాడే పశు పతి హృదయ పత్నీ !దయా రసం చేత తడుప బడి ,మెత్తని ,ప్రసన్నాలైన యెర్రని ,తెల్లని ,నల్లని కాంతులు గల నీ కనులు మూడింటి చేత ,బంగారు రంగు నదీ ప్రవాహమైన శోణభద్రా ,తెల్లని రంగు గల గంగా ,నీలపు రంగు కల యమునా ,నదుల సంగమమైన స్థానమైన త్రివేణీ సంగమం గా ,పాపులను పవిత్రులను చేయటం కోసం మాకు లభిస్తున్నాయి .
విశేషం –దేవి నేత్రాలకు స్వభావ సిద్ధ మైన తెలుపు ,నలుపు ,ఎరుపురేఖలు గంగా ,యమునా ,షోనా నదుల కూడలి గా చెబుతున్నారుశంకర భగవత్పాదులు .ఇది ప్రయాగ సంగమం కాదు .అక్కడ సరస్వతి నది అంతర్వాహిని గా ఉంటుంది .కానీ బీహార్ చేరిన గంగ లో షోనానది (సోన్)
కలుస్తుంది .ఈ మూడు నదుల కలయిక మనకు కనిపించదు .మనల్ని కనిక రించ టానికి ,త్రివేణీ సంగమం లాగా ,అందిస్తోంది .భక్తులపై ఆమె దయా దృష్టి చాలా గొప్పది .అసంభవమైన దాన్ని సంభవం అఎట్లు దేవి చేస్తోందని భావం .
ఆమె కన్నులలో మూడు రంగులున్నాయి .ఎరుపు రంగు రక్త రాజిలో ,తెలుగు అపాంగం లో ,నలుపు నల్ల గ్రుడ్డు లో ,కనీ పించి ,శోభాయ మానం గా ఉన్నాయి .శోన-హిరణ్య బాహువు ,హిరణ్య వాహిని .’’శోనో హిరణ్య బాహుహ్ స్యాత్ ‘’అని శ్రుతి .వో అనఘాదేవీ ! పాప సంహారిణీ ,నీ చరణాలను సేవిన్చె భక్తులకు ,నీకు వ్యతి రేకం గా ,తీర్ధ యాత్ర సేవ వ్యర్ధం అని అంత రార్ధం .ఆమె చరణాలే అన్నీ ఇస్తుంటే ,వేరే తీర్ధ యాత్రలు అనవసరం అని అర్ధం
సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –.20-10-12—ఉయ్యూరు