శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -29
69—‘’రాణే జిత్వా ,దైత్యా ,నప హృత శిరస్త్రైహ్ కవచిభిహ్ –ర్నివ్రుత్తి ,స్చండాం శ ,త్రిపుర హర నిర్మాల్య విముఖై
విశాఖేన్ద్రో పేన్ద్రై శ్శశి విశద ,కర్పూర శకలా –విలీయన్తే ,మాతస్తవ ,వదన ,తాంబూల కబళః‘’
తాత్పర్యం –త్రిదగ్ని కుండసంభూతా !యుద్ధం లో రాక్షసులను జయించి వచ్చి ,తల పగాలను విడ దీసి ,కవచాలను ఇంకా ఉంచుకొని, చండుడు అనే ప్రధముని చేతఅనుభవించ టానికి వీలైన ‘’హరుని నిర్మాల్యం వద్దు ‘’అన్న కుమారాస్వామి –దేవేంద్ర ,ఉపెంద్రుల చేత చంద్రుని లాగా ,స్వచ్చందం గా ,నిర్మలం గా ఉన్న కర్పూరపు పలుకులు గల ,నీ వదన తాంబూలం యొక్క తమ్మలు కాజేయ బడుతున్నాయి .
విశేషం –కుమారస్వామి ,దేవేంద్రుడు ,ఉపెంద్రుడు ,యుద్ధం లో రాక్షసుల్ని జయించి ,శ్రీ దేవికి పాదాభి వందనం చేయ టానికి తల పాగాలు తీశారు .ఆమె ప్రసన్నం గా నవ్వింది .అప్పుడు ఆమె నోటి నుండి కర్పూర పలుకుల తో కూడిన తమ్మల కబళాలు (తాంబూలం యొక్క ఉమ్మి )కింద పడ్డాయి .ఆ ముగ్గురూ వాటిని గ్రహించి ,మింగారు .అందులోని కర్పూరం మెత్తగా మారి కలిసి పోయింది .జగన్మాత అయిన భగవతికి కుమారులపై అంత ప్రేమ ఉండి అని భావం .కుమారా స్వామి కి ఇది మామూలే .ఇంద్ర ,ఉపెంద్రులకు అప్పుడప్పుడు జరిగే సంఘటన .
శివ నిర్మాల్యం ‘’చండుడు ‘’అనే ప్రధముడి కే దక్కాలి .ఇతరులకు దక్క కూడదు .శివునికి అభి షేకం చేసే ముందు నిర్మాల్యం తీసేసి ‘’వచ్చందేశ్వరాయ నమః ‘’అంటారు .అందుకని కుమారస్వామి మొదలైన వారు అమ్మ దగ్గరకే వచ్చారు .మాతృ రూప ఉపాసనం క్షిప్ర ఫలదాయకం అని చెబుతారు .
యుద్ధం నుంచి తిరిగి వచ్చిన వారికి ,శ్రమ పోగొట్టటానికి శ్రీ దేవి వదన కర్పూర మిశ్రిత తాంబూల శకలాలు ఉపయోగ పడినాయి అని అర్ధం .మహాదేవుని శిరస్సు పై ఉన్న చంద్రుణి వెన్నెల కూడా శివ నిర్మాల్యమే .దానిని కూడా వదిలి ,వీరు అమ్మ తాంబూల కబళాలు స్వీక
రించారని భావం .దీని వల్ల ఆమె ముఖ సౌభాగ్యం స్తుతింప బడింది ..
అమ్మ మాటల గొప్పదనం
66—‘’విపంచ్యా గాయంతీ ,వివిధ మపదానం పశు పతే –స్త్వయా రబ్దే ,వక్తుం ,చలిత ,శిరసా ,సాధు వచనే
త్వదీయై ర్మాదుర్యై రపలసిత ,తంత్రీ కల రవాం ,–నిజాం వీణాం వాణీ ,నిచుళ యతి చోళేన నిభ్రుతం .’’
తాత్పర్యం –శివ కుటుంబిణీ !నీ ముందు కూర్చుని సరస్వతీ దేవి శివుని వీర గాధలు ,అంటే త్రిపుర సంహారం ,దక్ష యజ్న ధ్వంసం ,హాలాహల భక్షణం ,జలంధర వధ ,గజాసుర వధ లను వీణ తో గానం చేస్తోంది .అప్పుడు నీ మనస్సు సంతోషం తో నిండి ,అనుగుణం గా శిరస్సును ఊగిస్తూ ,మధుర వచనా లతో ప్రశం సిస్తున్నావు .నీ వచో మాధుర్యం ముందు సరస్వతి వీణా గాన మాధుర్యం నవ్వుల పాలైంది .ఆమె సిగ్గు పడింది .అప్పుడామే తన వీణ ను పై ముసుగు తో కప్పేస్తోంది ..
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26-10-12-ఉయ్యూరు