వందేళ్ళకు పూర్వమే అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ అమెరికాను ‘’here is not merely a nation ,but ,a teeming nation of nations ‘’అని అమెరికా బహుజాతుల సమాఖ్య అనే విషయాన్ని కవిత్వ పరం గా చెప్పాడు .’’AMERICA IS MADE UP OF MANY PEOPLE ‘’అని వాళ్ళ రాజ్యాంగం లో రాసుకొన్నారు కూడా .
1986 జనాభా లెక్కల ప్రకారం 300 ఏళ్ళ అమెరికా చరిత్ర లో అమెరికా లోని జర్మన్లు ,బ్రిటీష్ వారికంటే ,ఎక్కువ .దాదాపు 44 మిలియన్ల మంది జర్మంలున్నారు .వీరు పద్దెనిమిది శాతం .ఇవాల్టి నలభై నాలుగు మిలియన్ల జర్మన్ అమెరికన్లలో నాలుగు శాతం మాత్రమె జర్మనీ లో పుట్టిన వారున్నారు .1871 కి పూర్వం జర్మని ఒక దేశమే కాదు .డజన్ల కొద్దీ చిన్న రాష్ట్రాలు మాత్రమె .డచేస్ ,రాజ్యాలు ,ప్రిన్సిపాలిటీలు ఉండేవి .ఒక్కో దానికి ఒక్కో రాజు ,సంప్రదాయం ,ప్రాంతీయ యాస భాష ఉండేవి .ఏడు వందల ఏళ్ళు యుద్ధాలు ,తిరుగు బాట్లు ,వలసలు ,మత సంఘర్షణలు చోటు చేసుకొన్నాయి .ఉత్తరమధ్య యూరప్ ,ఉత్తర సముద్రం నుండి ,kaunas ,lidhunia దగ్గర నీమాన్ నది వరకు ఉండేది .జర్మనీ భాష మాట్లాడే వారంతా డెన్మార్క్ ,నెదర్లాండ్ ,బెల్జియం ,లక్సం బెర్గ్ ,ఫ్రాన్స్ ,స్విట్ జేర్లాండ్ ,ఆస్ట్రియా ,హంగేరి చెక్ ,పోలాండ్ ,రష్యాల నుండి వచ్చిన వారే .వీరందర్నీ జర్మన్లు అనే అన్నారు .వీరే మొదటి సారిగా అమెరికా వచ్చిన జర్మన్లు .నిజం గా వీరికి అప్పుడు జర్మనీ స్వదేశమే కాదు .అక్కడ పుట్టిందీ లేదు .కనుక వీరందరినీ ఒకే గాట కట్టేసి జర్మన్లు అన్నారు .
1683 లో ఇంగ్లీష్భాష మాట్లాడని జర్మన్లె అమెరికా రావటం ప్రారంభించారు .,1776 తిరుగు బాటు యుద్ధం నాటికి వీరి సంఖ్య 2,25,000 అయింది అమెరికాలో .ఇరవై వ శతాబ్దం లో వీరంతా ,ఇంటర్ మారేజీలు చేసుకొని అమెరికా అంతా వ్యాపించారు .అమెరికాలో ,యూరప్ లో ని అంతర్యుద్ధాల వల్ల వలసలు తగ్గినా ,జర్మన్లు మాత్రం అమెరికా కు వస్తూనే ఉన్నారు .1830 నాటికి రికార్డు స్తాయిలో జర్మన్లు అమెరికా చేరారు .ఐరిష్ వారి తర్వాతస్తానం జర్మన్ల దే అందుకే వారిని’’largest non English speaking group ‘’ అన్నారు .ఒక్క 1882 లోనే 2,50,000 మంది జర్మన్లు చేరారు .
1816-90 మధ్య వచ్చిన వారికి ,అంతకు ముందు వచ్చిన వారికి తేడా ఉంది .18 వ శతాబ్దం లో వచ్చిన జర్మన్లు విట్టేన్ బెర్గ్ ,రైన్ నది ఒడ్డున పశ్చిమ,ఉత్తర ప్రాంతాల వారు .అయితే ,ఇప్పుడొచ్చిన వారు ‘’సెకండ్ వేవ్ ‘’జనం .వీరు తూర్పు ,ఉత్తర ప్రష్యా ,బవేరియా ,సాక్సనీ ప్రాంతాల వారు .1870 లో జర్మని ఏకీకృతం అయింది .ఈ కాలానికి ముందు వచ్చిన జర్మన్లు తమ రాజ్యానికి విధేయులు .,జర్మనీకి కాదు ..xaxes ,baveria ,,Berlinar లం అని గర్వం గా చెప్పుకొంటారు ఇప్పటికీ .అన్ని రకాల వారు ,అనేక కారణాల వల్ల వలస వచ్చారు .మత దురహం కారం వల్ల ఇబ్బంది పడిన మతాల వారు కూడా చేరారు .19 వ శతాబ్దం లో రాజకీయ అణచి వేత లను భరించలేక పోయిన వారూ అమెరికా చేరారు .వీరంతా బాగా చదువు కొన్న వారు .,రాజకీయ అవగాహన ఉన్న వారూ.
అయితే ,ఆర్ధిక పరిస్తితి మెరుగు పరచు కోవటానికి వచ్చిన వారే ఎక్కువ .వ్యవసాయం అక్కడ గిట్టక ,పొలాలు చాలక ,ఇక్కడికీ ,కెనడాకు చేరుకొన్నారు .అంతర్యుద్ధాలకు ముందే వీరంతా వలస వచ్చారు .సివిల్ వార్ తర్వాత,పారిశ్రామిక ప్రగతి అమెరికా లో బాగా ఎక్కువ అవటం ,రాక పోకలకు స్టీమర్లు రావటం, అక్కడ కూలి జనాలు దొరక్క పోవటం వల్ల వీరందరూ ఇక్కడికి చేరుకొన్నారు .ఇర వైవ శతాబ్దం లో మరో రకమైన వలసలేర్పడ్డాయి .మొదటి ,రెండు ప్రపంచ యుద్ధాల శరణార్ధులు అమెరికా కు రావటం తో సైన్స్ ,బిజినెస్, కళలు లో గణనీయ ప్రభావం కలిగింది .వీరిలో చాలా మంది యూదులు .కాధలిక్కులు ,ప్రోటేస్తంట్లు ,హిట్లర్ దాష్టీకానికి భయ పడిన వారూ కూడా వచ్చేశారు జర్మనీ నుంచి .అమెరికా లో కూడా జనాభా మత ,కుల ,సరి హద్దు లతో విడి పోయారు .జర్మన్ సెటిలర్లు అమెరికా అంతా వ్యాపించారు .చాలా మంది సిటీలు చేరుకొన్నారు .త్వరలోనే ,స్తానికులతో కలిసి పోయారు .వారి బలం అంతా సెయింట్ లూయీస్ ,సిన్సి నాటి ,మిల్వాకీ ,ఫిలడెల్ఫియా మధ్య అట్లాంటిక్ ,పైన ఉన్న మిడ్వెస్ట్ రాష్ట్రాలలో చేరింది వీరు తమ సంస్కృతిని భాషను ,చరిత్రను కాపాడుకొంటున్నారు .పెన్సిల్వేనియా లోని డచ్చులు –అసలు డచ్ సంతతి వారు కాదు –జర్మన్లె .వీరు deuseche’’వారు .ఆ పేరు ను యాన్కీలు డచ్ గా అపార్ధం చేసుకొన్నారని భావిస్తున్నారు .మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతా అమెరికా లో జర్మన్ వ్యతి రేకతాభావాలు వ్యాపించాయి .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-10-12-ఉయ్యూరు