అమెరికా లో జర్మన్ హవా –2
పాస్టర్ డేనియల్ పాస్టోరియాస్ అనే ఆయన 1683 లో అమెరికా లోని ఫిలడెల్ఫియా కు బయట ప్రతి ఇంటికి మూడు ఎకరాల భూమి నిచ్చి ,తాను ఆరు ఎకరాలు ఉంచుకొని ,ఒక కాలనీ ఏర్పాటు చేశాడు .అదే ‘’జర్మన్ టౌన్’’అయింది .అది wissa hicon నుంచి wingohocking creeks దాకా వ్యాపించింది .దాని లేఅవుట్ మధ్య యుగ నైరుతి లోని గ్రామాల స్వరూపం గా ఉండేది గ్రామ మధ్యలో అరవై అడుగుల వెడల్పు రోడ్డు ఉండేది .దానికిరుప్రక్కలా ఇళ్ళు ఉండేవి ..ఇంటి వెనక తోట ,పోలాలున్దేవి ..విలియం పేన్ అనే క్వేకర్ గవర్నర్ ఆహ్వానం పై వీరంతా ఇక్కడ స్తిర పడ్డారు .క్వేకర్లు అంటే ‘’సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ ‘’అని అర్ధం .ఈ ఉద్యమం .1640 లో ఇంగ్లాండ్ లో ప్రారంభమై అన్ని దేశాలకు వ్యాపించింది .శాంత స్వభావం తెల్లని బట్టలు వీరి ప్రత్యేకత .పెన్సిల్వేనియా రాష్ట్రం చేరిన తోలి సెటిలర్లు వీల్లే .1681 లో రెండవ చార్లెస్ రాజు పేన్ గారికి ఈ ప్రాంతం అంతా అందజేశాడు .ఆయన అందరికి ఉత్తరాలు రాస్తూ ‘’హోలీ ఎక్స్పేరి మెంట్ ‘’గా దీన్ని వర్ణించి జర్మనీ భాష లోకి తర్జుమా చేయించి ఆ ఉత్తరాన్ని జర్మనీ దేశానికి పంపాడు .చవకగా భూములు రావటం ,మత సామరస్యం ఉండటం ,థో ‘’క్రేఫెల్ద్ ‘’(డచ్బార్డర్ లోని జర్మని టౌన్ )నుంచి ,పద మూడు కుటుంబాలు ,ఫ్రాంక్ ఫర్ట్ అమ్మిన్ నుంచీ వచ్చారు .మొదట్లో చెప్పి నట్లుగా పాస్టోరియాస్ తాను అనుకొన్నట్లు సహాయం చేశాడు .ఈయన పేన్ ఆదేశం పై ఫ్రాంక్ ఫర్ట్ లో november 1682లో వెళ్లి కొద్ది కాలం ఉండి వచ్చాడు .అతని మాటలు నమ్మి వీరంతా ఇక్కడికి చేరారు .కొద్ది మాత్రం ‘’ఇక్కదేముంది బావుకోవటానికి ?’’అని పెదవి విరిచారు కూడా .
పేన్ నుంచి పదిహేను వేల ఎకరాలు ఎకరం పది సెంట్ల కు కొని కాలననీ ఏర్పాటు చేశారు .1517 లో జర్మనికి చెందినా మార్టిన్ లూధర్ కింగ్ చర్చిని సంస్కరించాలని కోరాడు .అతని ప్రభావం పెరిగింది .అదే ‘’ప్రోటేస్తంట్ ‘’ప్రభావం అయింది .’’కాల్వ నిస్టులు అంటే రిఫార్మర్లు ‘’అన బాప్తిస్టులు ‘’అయారు .ముప్ఫై ఏళ్ళ మత యుద్ధాలలో ప్రోటేస్తంట్ ,కేధలిక్ రాజులు తీవ్రం గా కలహించుకొన్నారు .henne berger లో మూడొంతుల జనాన్ని చంపేశారు .రెండు వంతుల ఇళ్ళు తగల బెట్టుకొన్నారు .ఇతర దేశస్తులు ,దొంగలు స్వైర విహారం చేశారు .నరమాంస భక్షణ కూడా (కన్న బాలిజం )కూడా జరిగింది .ఈ గొడవల్లోంచి బయట పడటానికి జర్మనీ నుంచి ఇతర చోట్లకు వలసలు ప్రారంభ మయాయి .జర్మనీ లోనే వివిధ ప్రదేశాలు తిరిగి స్విస్ ,హాలాండ్ కొందరు చేరగా ,మిగిలిన వారు అమెరికాకు వలస వచ్చారు .
పెన్సిల్వేనియా లో పాస్టోరియాస్ తో చేరిన వారు పన్నెండు మంది క్వేకర్లు ,ఇంకొకతను జాకబ్ టేల్నార్ రైన్ నది నుండి రాటెన్ డాం ఇంగ్లీష చానల్ దాటి ,ఇంగ్లాండ్ చేరి అక్కడి నుండి అట్లాంటిక్ సముద్రం దాటి అమెరికా చేరారు .ఇలా వచ్చిన ముప్ఫై నాలుగు మంది సెటిలర్లు ను fore runners of German colonists ‘’అన్నారు .అంతకు ముందే అమెరికా పద మూడు కాలనీ లలో జర్మన్లు చేరినా ,మొదటి జర్మన్ టౌన్ పెన్సిల్వేనియా లోనే ఏర్పాటైంది .ఇదిbirth of the history of Germans ‘’గా గుర్తింపు పొందింది .1700లో పదమూడు కుటుంబాలు ,అరవై నాలుగు కుటుంబాలు అయి , 1790 నాటికి 556 అయి ,మూడు వేల జనాభా అయారు జర్మన్లు అమెరికా రివల్యూషన్ తర్వాత అన్ని రాష్ట్రాల వారు వచ్చారు .అందులో palatine మొదలైన భాషలు మాట్లాడే వారున్నారు .ఈ జర్మన్లు గొప్ప మెకా నిక్కులు .వర్క్ షాప్ లనేర్పరచారు .అప్పుడు ఒక వ్యక్తీ ఎన్ని వృత్తు లైనా చేయ వచ్చు .అప్పుడు రైతుల్ని ‘’husbands men ‘’,’’vine dressers ‘’అనే వారు .1683—1727 మధ్య అమెరికా చేరిన వారందరూ క్వేకర్లె .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-10-12-ఉయ్యూరు