కన్ఫూజన్ లేని కన్ఫూసియస్ సిద్ధాంతం

  కన్ఫూజన్ లేని కన్ఫూసియస్ సిద్ధాంతం

 చైనా దేశపు దార్శనికుడు ,వేదాంతి కన్ఫూసియస్ .సుమారు 2,500సంవత్సరాల క్రితం వాడు .ఆయన జీవిత కాలం లో చెప్పిన వాటి నన్నిటినీ శిష్యులు సేకరించి ‘’అనలేట్స్ ‘’పేర రాశారు .చైనా ను పరి పాలించిన రాజు లందరూ ఆయన సిద్ధాంతాలనే అమలు చేశారు .206-220 b.c.కాలం లోను , ఆ తర్వాతా పాలించిన వారికీ ఆయనే ఆదloర్శం .చైనా ను ఏకం చేసిన చాన్కై షేక్ ,క్విన్ వంశపు రాజులకు అతని సిద్ధాంతాల మీదే గురి .1978 లో den xiao ping చైనా ను ఆర్ధిక సామాజిక రంగాలలో ముందుకు తీసుకొని వెళ్లాడు .రాజకీయం గా ,ఆర్ధికం గా చైనా ప్రపంచ దేశాలలో అగ్ర స్థానం పొందింది .1947లో వచ్చిన మావో పాలన నుంచి కాపిటలిస్ట్ భావాలను అదుపు లో ఉంచుకొని అభివృద్ధి చేశాడు .డెంగ్ ది ‘’గెట్టింగ్గ్ గ్ రిచ్నెస్ ఈస్ గ్లోరియస్ ‘’అనే నినాదం .అయితే దీన్ని సాధించినా ,ధనికులకు ,పేదలకు మధ్య దూరం పెరిగి పోయింది ప్రజలు ఒక్క సారి వెనక్కి తిరిగి ఆలోచించారు .కన్ఫ్యూసియాస్ మాత్రమె తమకు శరణ్యం అని భావించారు .

    రెండు వేల ఏళ్ళ క్రితం ‘’హాన్ డై నాస్టీ’’కి చెందిన ‘’వు’’అంత వరకు ఉన్న వంద మంది తత్వ వేత్త లను దూరం గా పెట్టి కన్ఫ్యూసియాస్ సిద్ధాంతాన్నే అమలు పరచాడు .వెయ్యేళ్ళ క్రితం ‘’సాంగ్ వంశానికి ‘’చెందినా జుయావో పు ‘’అనే ప్రధాని‘’కన్ఫ్యుసియాస్ పుస్తకం లో సగ భాగం చాలు ప్రపంచాన్ని పాలించా టానికి ‘’అన్నాడు .అంటే, ఆ దార్శనికుని గొప్పతనమేమిటో తెలుస్తోంది .

   చైనా లో హాట్ స్ప్రింగ్స్ చాలా ఉన్నాయి .అందులో ఒకటి –‘’ask sickness spring ‘ లో స్నానం చేస్తే అన్ని రోగాలు పోతాయి .కీళ్ళ నొప్పుల వాళ్ళు స్నానం చేసి గట్టు ఎక్కే సరికి తీసేసి నట్లు నొప్పులు మాటు మాయం ..’’gastro intestinal problems ‘’ఉన్న వాళ్ళు చేస్తే లోపల ‘’గట్’’అంతా క్లీనవుతుంది .చర్మ వ్యాధులున్న వాళ్ళు చేస్తే ,కొత్త చర్మం వచ్చిన అను భూతి పొందుతారు .పాత చర్మం ఊడి కొట్టుకు పోయి నట్లున్తుంది .పాము కుబుసం విడిచి నట్లు గా ఉంటుందట .ఇవి ఆయన సూచించిన ప్రదేశాలే

     కన్ఫ్యుసియాస్ ఆలోచన సూటిగా ,సరళం గా తేలిగ్గా ఉంటుంది .ఆయనకు వెయ్యి మంది శిష్యులు .అందులో డెబ్భై రెండు మంది ఆయన విజ్ఞానాన్ని ,ప్రతిభను అందరికి చాటి చెప్పారు .అందుకే ఆయన్ను ‘’సేజ్’’అన్నారు .దీని అర్ధం –ఆలోచనలో ,ఆచరణ లో నిర్దుష్టత ఉండి ,ఇతరులను ఆకర్షించే వాడని .దేశాన్ని చూసి స్వర్గం నవ్వాలి అని చెప్పేవాడు .భూమి అనుకూలం గా ఉండాలి .అప్పుడే అది నిలబడి అభి వృద్ధి చెందుతుంది అన్నాడు .మానవాళి ,ప్రకృతి పూర్తీ సామరస్యం తో సాగాలి .ప్రకృతి పై ఆరాధనా భావం ఉండాలి .అది లయాన్వితం గా ఉండాలి .నమ్మకమే దేశాన్ని కలిపి ఉంచుతుంది .gross national productకాదు కావాల్సింది gross national happiness  అన్న మహానుభావుడాయన

          మనిషికి నిర్మల స్వచ్చ ఆంతరిక ఆనందం ఉండాలి దరిద్రం లో ఉన్నా ,మర్యాదగా నవ్వుతు సంతృప్తి తో ఉండాలి .ఆత్మ గౌరవం ,మానసిక సంతృప్తి ఉన్న వారిని Zunzi’’అంటారు .ఇప్పటికీ చైనా లో స్వీయ వ్యక్తిత్వం ఉన్న వారిని ఆ పేరుతోనే పిలుస్తారు .’’our eyes see too much of the world and too little of the heart and soul ‘’అన్న వేదాంతి .’’loving other people is benovolence –understanding others is wisdom ‘’అన్న దార్శినికుడు .ఇవాళ భౌతిక సంపద,అతి వేగ వంత మైన జీవితం వల్ల నిర్ణయాలు త్వరగా తీసుకొంటూ ,ఏది ఉత్తమ మైనదో తెలుసుకొనే తీరిక లేకుండా ఉన్నాం .మన మార్గం నూటికి నూరు శాతం మన మార్గం అవాలి .అప్పుడే సాఫల్యత ..పూర్తిగా ఒంటరిగానూ ,పూర్తిగా జనం లో ను జీవించటం అభిలష ణయం కాదు .’’going too far is as bad as not going far enough ‘’అన్నది ఆ యన మార్గం ఇవాళ చైనా లో జనాలతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు .స్నేహితులకు ,బంధువులకు తగిన స్తానం ఇస్తే ,కొత్త లోకాలు దర్శన మిస్తాయి .తక్కువ మాట్లాడాలి ఎక్కువ చేయాలి .జాగ్రత్త గా మాట్లాడాలి .’’troubles come from mouth ‘’అన్నది చైనా సామెత .అతిగా మాట్లాడితే దాని అర్ధమే నశిస్తుంది అన్నాడు ఆ వేదాంతి .ఏదైనా ఎవ రైనా చెప్పింది వింటే ,అందులోని సత్యాన్ని గురించి విచారించాలి .పని చేసే ముందు ఒక్క క్షణం ఆలో చించి ప్రారంభించాలి .గౌరవం గా ప్రవర్తించాలి అవతలి వారికి గౌరవం ఇవ్వాలి .

       నైతిక శీలాన్ని పెంచుకోవాలి .మంచి విద్యనభ్య సించాలి .విధేయత ముఖ్యం .అప్పుడే మనం చెప్పింది అవతల వారు ఆచరిస్తారు .సత్య నిర్మలత ఉంటె ,ఉత్తాన పతనాలను లెక్క చేయక పోతే ,పూర్తీ సంతృప్తి ఉంటుంది .’’be the first to worry for the worries of the world and the last to take joy in the joys of the world ‘’అన్న గొప్ప సత్య బోధకుడు కంఫ్యుసియాస్ .దేశం అభి వృద్ధే నాకు బాధ్యత అంటే –నీ స్వంత లాభాలను త్యాగం చేయటమే .a man of benevolence never worries ,a man of wisdom is never two minds ,a man of courage is never afraid ‘’అని అతి సూక్ష్మం గా వివరించాడు .అలాగే మనుషుల లోని తార తమ్యాలను గురించి చెబుతూ ‘’the gentle man agrees with others without being an echo –the small man echoes without being agreement ‘’అన్నాడు .

            ప్రతి విషయం లోను ధనాత్మక దృక్పధం ,తగినంత అవగాహన ,పరిమితులతో ఇతరులతో ప్రవర్తించటం చేస్తే అవతలి వారిలో సంతోషం ,ఆనందం కలిగించి , శక్తి వంతులను చేయ గలుగుతారు .సూర్యుని లా ప్రకాశించి ,వెలుగులను నింపాలి .దీని వల్ల కుటుంబం లో ,స్నేహితుల్లో సమాజం లో సఖ్యత ఏర్పడి అందరు సుఖం గా ఉండ గలుగుతారు .ఇదే మనం ముందు చెప్పుకొన్న ‘’జుమ్జి ‘’అది మనతో ప్రారంభం అవాలి .మూడు రకాల స్నేహితులుంటారు .మొదటి రకం వారు సూటిగా ప్రవర్తిస్తారు నిజాయితీ తో ఉంటారు .వీరికి మంచి హృదయం ఉంటుంది .వారి ప్రవర్తన మన పై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది .ధైర్యం కలుగుతుంది .నిర్ణయాత్మకం గా వ్యవహరించేట్లు చేయ గలుగుతారు .రెండో రకం స్నేహితులు –విధేయత కలిగి నమ్మకం గా ఉంటారు వీరిలో నటన ఉండదు .వీరందరూ వెంట ఉంటె స్తిరత్వం రక్షణ ,ప్రశాంతత లభిస్తాయి మనం స్వచ్చత పొంది ఎదగ టానికి వీరు తోడ్పడుతారు .మూడో రకం స్నేహితులు –వీరికి లోక జ్ఞానం ఎక్కువ .అన్నీ తెలుసు .వీరు ప్రపంచాన్ని బాగా చదివిన వారు గా ఉంటారు మనమూ వారితో పాటు లోకజ్ఞానం పొంద గలుగుతాం

    ఇతరులతో పోట్లాడటం కంటే నీ లో నువ్వు ఘర్షణ పడు అప్పుడు పరిష్కారం పొంద గలవు .ఇది నీ అభి వృద్ధికి దారి చూపిస్తుంది .మనకు విస్తృత మైన అనేక రకాలైన కోరికలు లేక కాదు .సరైన దారి లేక పోవటం ,మార్గ దర్శి లేక పోవటం వల్లే కోరికలు తీరటం లేదు .నిజ మైన ‘’జున్ జి ‘’.అంటే ,మాట్లాడటం మానేసి, క్రియా శూరుడయే వాడు .అతని దృష్టిలో శక్తి అంటే పని లోనే కాని మాటల లో శక్తి కాదు .మన ఆలోచనా విధానమే అన్నిటినీ నిర్ణయిస్తుంది .జున్జి లంటే సమాజపు ఆత్మ కు దర్పణం వంటి వారు .’’’’the part of our selves that performs in a social role ,is plainly visible .but often we muffle the voice of our own spirit ‘’అని తెలియ జేశాడు .సమాజ                     బాధ్యత అందరిదీ .సమాజం బాగా ఉంటె దేశం బాగా ఉంటుంది సమాజం బాగా ఉండా లంటే కుటుంబం బాగా ఉండాలి .ఇది ఉండాలి అంటే వ్యక్తీ నిర్దుష్టం గా ఉండాలి .’’success in our professional life is not necessary the heart’s true ambition ‘’మనసు కోరింది సాధించి నప్పుడే తృప్తి .ఉద్యోగం లో పొందిన విజయం నిజమైన ది కాదు .ఇవన్నీ చిన్న విషయాలే అని పించినా నిర్మల స్తిరచిత్తానికి అవసర మైనవే ఇవి .ఇక్కడి నుంచే మన ప్రస్తానం ప్రారంభం అవుతుంది .వ్యక్తీ గా  ఉన్నతి ని సాధించటం స్వార్ధం ఏమీ కాదు .దీనితో వ్యక్తులు సమాజానికి ఇతోధిక సేవ జేసి దాని అభి వృద్ధికి కారకులవాలి .

        చైనా లో బాగా ఉన్నత మేధావి వర్గాన్ని ‘’shit’’అంటారు .అయితే ఎవరు తమ ధర్మాన్ని సక్రమం గా నిర్వ హిస్తు పవిత్ర మైన మనసు కలిగి విలువలకు ప్రాధాన్యత నిస్తూ ,సమాజానికి నిజం గా ఉప యోగా పడతారో ,బయటి ప్రపంచం తో మంచి సంబంధాలను కలిగి ఉంటారో వారే ‘’షిట్’’..చివరగా కన్ఫ్యూసియాస్ వాణిని ఆయన మాటలలో తెలుసు కొందాం –At fifteen ,I set my heart learning –at thirty I took my stand –at forty I came to be free from doubts ,at fifty I understood the Doctrine of Heaven –at sixty my ear is attuned ,at seventy I followed my heart desire without overlapping the line ‘’

‘’The wise find joy in water ,the benevolent find joy in mountains ,.the wise are active ,the benevolent are still .the wise are joyful .the benevolent are long lived ‘’

         చైనా దార్శనికుడు ,వేదాంతి కన్ఫ్యుసియాస్ సిద్ధాంత సారాన్నిYu Dan  అనే మహిళ,associate Dean of school of arts and media in Beizing Normal University 2006 లో చైనా టి.వి. లో చేసిన ప్రసంగాన్ని దాదాపు రెండు మిలియన్ల మంది చూశారు, విన్నారట .అంటే ఇప్పటికి కన్ఫ్యుసియాస్ అంటే చైనా ప్రజలకు ఎంత అభిమానమో తెలుస్తోంది .ఆమె చైనా సాహిత్యం లో డాక్టరేట్ డిగ్రీ సాధించింది .అంతే కాక ఫిలిం అండ్ టి.వి.స్టడీస్ లో కూడా డాక్టరేట్ సాధించిన మహిళ’’యు డాన్’’

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-10-12-ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.