శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –31
69—‘’గళేరేఖాహాస్తిశ్రో ,గతి గమక ,గీతిక నిపుణా –వివాహ వ్యానద్ధ ప్రగున ,గుణ సంఖ్యా ప్రతి భువ
విరాజన్తే ,నానావిధ ,మధుర రాగా కర భువాం –త్రయాణాం గ్రామానాం స్తితి నియమ సీమాన ఇవతే ‘’
తాత్పర్యం –కైవల్య పద దాయినీ !నీ గళం పై మూడు రేఖలున్నాయి .ఇవి ,వివాహ వేళ వేయబడిన మంగళ సూత్రాలుగా ఉన్నాయి .తల్లీ ! మార్గ ,దేశి అనే సంగీత గతుల యొక్క అయిదు రకాలైన స్వర గమకాల యొక్క గీతాలను పాడటం లో నీవు నిపుణవు..నీ గళం పై ఉన్న మూడు ముడతలు మూడు భాగ్య రేఖలు .వివాహ సమయం లో మంగళ సూత్రం కట్టిన తర్వాత ,వాటి దగ్గర అనేక పేటలతో కలిపి ,పేనిన,మూడు సూత్రాలను జ్ఞాపకం చేస్తున్నాయి .నానా విధ మధుర గానాలకు నిలయ మైన షడ్జ గ్రామ ,మధ్యగ్రామ ,గాంధార గ్రామాల ఉనికిని తెలియ జేయటానికి ఏర్పరచిన సరిహద్దుల్లా ఉన్నాయి .
విశేషం –పతివ్రతలు ,తమ పతి ప్రాణాలను తమ మంగళ సూత్రాలలో ధరిస్తారు .’’బ్రహ్మ విశ్న్వీశ రూపేషు రంద్ర శ్యేతం త్రి తంతుకం –త్రిరత్న ,రుక్మజం ,స్త్రీణాం ,మాన్గాల్యాభరణం విదుహ్ –
సంగీతం లో రాగానికి గతి ,గమకం ,గీతం అనేవి మూడు అంగాలు .రాగం నడక గతి .స్వరాల ఆరోహణావరోహణలు గమకం ,నిర్దుష్టమైన స్వరాల క్రమం గా పాడటం గీ తం .సంగేతానికి షడ్జమ ,మధ్యమ ,గాంధార అనే మూడు గ్రామాలున్నాయి .ఏ గ్రామం లో ప్రారంభిస్తే ముగింపు కూడా ఆగ్రామం లోనే చేయాలి .ఈ రోజుల్లో గాంధారం లో పాడేవారు లేరని చెబుతారు .మాధ్యమంగా పాడే వారు చాలా తక్కువ మంది ఉన్నారని సంగీత విశ్లేషకుల అభి ప్రాయం .
శ్రీ భగవతి మాత్రం మూడు స్తాయిల్లోను ,సంకరం కాకుండా ,గానం చేయ గల నిపుణ .మంగళ సూత్రం అంటే పవిత్ర మైంది .కలంక రహిత మైనది .పరిశుద్ధ మైనది అని అర్ధం .’’పవెహ్ త్రాయతీతి పవిత్రః ==’’పవి అంటే మృత్యువు .మృత్యువు నుండి రక్షించేదే మాంగల్యం –అందుకే పవిత్ర మైనది .మాంగల్య తంతువు (దారాలు )తత్వాలను సూచిస్తుందని దాని వల్ల ‘’బ్రహ్మమఃహ మస్మి’’అనే స్మృతి రూపం లోని మేధస్సు యొక్క ప్రభ జనిస్తుందని భావన అని తెలియ జేశారు బ్రహ్మశ్రీ తుమ్మల పల్లి రామ లింగేశ్వర శర్మ గారు ‘’
70— ‘’మ్రునాళీ మ్రుద్వీనాం తవ భజలతానాం చతుసృనాం—చతుర్భి స్సౌన్దర్యం సరసి భవ స్త్యేతి ,వదనైహ్
నఖేభ్య ,స్సంత్రస్సన్ ప్రధమ ,మదనాదంధక రిపో –స్చాతుర్నాం ,శీర్శనాం సమ మభయ ,హస్తార్పణ దియా ‘’
తాత్పర్యం –కామ కళా రూపా !పూర్వం శివుడు బ్రహ్మ యొక్క అయిదవ శిరస్సు ను తన వ్రేలి గోటి తో ఖండించాడు .అప్పుడు ,మిగిలిన నాలుగు ముఖాలు తమను కూడా ఖండిస్తాదేమో నని భయం తో ,ఈశ్వరుని కోపాన్ని పోగొట్టి ,తమ నాల్గు తలలను కాపాడ టానికి అభయ హస్తం ఇవ్వ మని బ్రహ్మ –తన నాలుగు ముఖా లతో తామర తూడుల్లాగా మెత్త నైన నీ బాహు లతలను గురించి దీనం గా ప్రార్దిస్తున్నాడు
విశేషం –బ్రహ్మ చతుర్ముఖాలతో నాల్గు వేదాలతో స్తుతిస్తున్నాడని భావం .సృష్టించటం వల్ల లభించిన అహంకారమే బ్రహ్మ గారి అయిదవ తల .నాలుగు ముఖాలు ఉంటె ,శ్రీ దేవి బాహువులను అహంకారం వదిలి బాగా వర్ణించ గలడు అని అర్ధం .
గబ్బిట దుర్గా ప్రసాద్