మన విజయ వాడ పై విరిసిన కవితా ఇంద్ర ధనుస్సు

మన విజయ వాడ పై విరిసిన  కవితా ఇంద్ర ధనుస్సు 

  యువకుడు, మిత్రుడు ,సాహిత్యోపాసకుడు ,రస రమ్యం గా రమ్య భారతి ని తీర్చి దిద్దుతున్న వాడు చలపాక ప్రకాష్  రమ్య భారతి ఆధ్వర్యం లోవివిధ కవులు ‘’మన విజయ వాడ ‘’పై రాసిన కవితలను  కవితా సంకలనం గా తీసుకొచ్చారు .పుస్తకం విజయ వాడ అంత అందం గా ,వైవిధ్యం గా ,ముచ్చటగా ఉంది .సుమారు సంవత్సరం క్రితం జరిపిన కవి సమ్మేళనం లోని కవితలే ఇవన్నీ .అందులో నేను ప్రత్యక్షం గా భాగస్వామి అయి ,ఆ కవిత లను విన్న అదృష్ట వంతుడిని .ఆ నాడు పాల్గొన్న కవుల కవితలే కాకుండా ,విజయ వాడ లోని లబ్ధ ప్రతిష్టు లైన కవుల కవితలనూ అడిగి రాయించి ఇందులో చేర్చటం ప్రకాష్ చొరవ ,ఆసక్తి ,నిర్దుష్టం గా,సమగ్రం గా పుస్తకం ఉండాలన్ని తపన కన పడుతోంది .దీనికి చలపాక పూర్తిగా అభి నంద నీయుడు .పదహారు మంది మహిళా కవులు తమ అమూల్య కవితలను అందించి ,నిండుదనం చేకూర్చారు .పద్య కవులూ తమ సత్తా చూపటం హర్ష దాయకం ..విజయ వాడ పై తమ అభిప్రాయాలను విస్పష్టం గా ,నిర్మోహ మాటం గా చెప్పారందరూ .విజయ వాడ సాంస్కృతిక ,ఆర్ధిక ,సామాజిక ,రాజకీయ ఆధ్యాత్మిక కళా సాహిత్య వేదిక గా ఎలా విలసిల్లిందో కవిత్వీకరించారు .ఇక్కడి పెద్దలను ,ప్రదేశాలను చారిత్రిక వైభవాన్ని మన ముందుంచారు .అన్ని షేడ్స్ ఆఫ్ ఒపినియన్ లు ఉన్నందున ఇది విజయ వాడ పై విరిసిన ఇంద్ర ధనుస్సు అని పిస్తుంది ..ముచ్చ టై న ముఖ చిత్రం ,వెనుక కనక దుర్గమ్మ వారు తో బాటు కళా కేంద్రాల ఫోటోలుండి కను విందు చేసింది ..ఒక నగరం పై ప్రత్యేకం గా కవి సమ్మేళనాన్ని నిర్వ హించటం ఆ కవితలను పుస్తక రూపం లోకి తీసుకు రావటం ఇదే ప్రధమం అను కొంటాను .ఆ ఘనత విజయ వాడకు దక్కింది .ఆ కీర్తి లో పాలుపంచుకొన్న వారందరూ ధన్యులు .దీని సూత్ర దారి చల పాక కృషి చాలా ఉంది అభినంద నీయుడు .

      ‘’నగర పంజరం లో ఎగర లేని మానవ హృదయ విహంగం అలానే చచ్చి పోయింది –భూమాత రొమ్ము మీద వ్రణాల్లా మనుషులు పట్టని పాకలు ‘’అన్నారు పెద్దిభొట్ల సుబ్బరామయ్య .నగరం లోని నిరుపేదల పక్షాన నిలిచి .’’ఇక్కడి మనిషి మనసుకు ప్రశాంతత లేదు గావున ‘’ప్రసాదులు ‘’కిక్కిరిసి ఉంటాయి ‘’ అని చమత్కరించారు .కనకదుర్గమ్మ గర్భ గుడి లో నిరంతరం బందీ అని అంటూ ,ఆమె లేవా లేదు తరాలెన్ని గడిచినా ఈ నగరమూ లేవా లేవదు ‘’అని నిస్పృహ ను వ్యక్తం చేశారు .కవి పువ్వాడ తిక్కన సోమయాజి పద్య కవిత లో ‘’మేధా సుధా రాసి వేదాద్రి మధి యింప,పొంగి పోర్లేది భావ పున్జమనగా ‘’అన్నారు .క్క్రిష్ణ వేణివారికి ‘’విజ్ఞాన తృష్ణ ‘’లాగా కని పించింది .కృష్ణ ను ప్రేమికుల విహార భూమి కావాలని పిరికి పందలను పైకి ఉరక నియ్యద్దని వేడారు .అవధాని పాల పర్తికవి ‘’బ్రాహ్మీ మయ మూర్తి బిడ్డడయి నాడన్నట్టి విఖ్యాతి ,ఉజ్వల వేణీ రమణీయ వాహినికి కృష్ణా మాత కున్నట్లుగాన్ ‘’అని విశ్వ నాద బాణీ లో కృష్ణమ్మ గొప్పతనం గంగకు ,గౌతమి కి లేదు అని ధంకా బజాయించారు .’’మమతల కోవెల ,విశ్వనాధ నడయాడిన నేల ,బాల మురళి గానం తో పరవశించిన వాడ బెజ వాడ ‘’అన్నారు కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ .మోఘల్రాజ పురం ‘’రాజరికం ,ఆ నాటి దర్పం వాడి పోని పూల దండ ‘’గా కనీ పించింది స .శ్రీ కి .’’పెద్దిభొట్ల కదల నగరం భమిడి పాటి జగన్నాధ రావు మువ్వల సవ్వడి ‘’విని పించింది ఆయనకు ..పూర్ణ చందుకు ‘’ఫణి పడగమీద వెలుగు లీనే మణిభాషోద్యమం ‘’అని పించింది .’’సిరలు ,ధమనుల్లా ప్రవహించే జంట కాలువలు సమర్పించే జల నైవేద్యం ‘’దర్శన మిచ్చింది పాటి బండ్ల రజనీకి .’’విశ్వ నాద కవి కల్ప వృక్షం గా విస్తరించిన నేల కదూ ‘’అని కీర్తించింది .’’జామ తోటల ,గులాబీ తోటల ,పున్నమ్మ తోటల ,చెట్ల బజారుల ‘’చిరునామా ఎక్కడుంది ? అని ప్రశ్నించారు మందరపు హైమ వతి .వెన్నా వల్లభ రావు కు ‘’నిత్య వేసవి గా మారిన నిప్పుల వాడ ‘’కని పించింది,అని పించింది .చల పాక ‘’రెండు ప్రాంతాల మనసులు కలిపే వారధి కావాలి ‘’అని ఆశ ను వ్యక్త పరిచాడు . తన శక్తియుక్తుల కదే అలంకార వరం –అలం ‘’కర‘’వాలం ‘’అన్నాడు తన పెన్ను కత్తిఅని చెప్పకనే చెబుతూ .

     ‘’ ఈ నాడు అక్షర సాక్షి గా వెలుగుతున్న ఆంద్ర జ్యోతి ఈ విజయ వాడ ,అంద చందాల సొగసరి విజయ నగరి ఆంద్ర జాతి కి తర’’గని ‘’సిరి ‘’అని శ్లేషించారు సాయి ప్రసన్నఅనే  సింగ్ జీ .కావూరి సత్య వతికి ‘’సాహిత్యానికి ఎక్సు రే కిరణం ‘’గా అని పించింది ఎక్స్ రే సాహితీ సంస్థ ను జ్ఞాపకం చేసుకొంటూ .ముట్నూరి ,పట్టాభి ని గుర్తు చేసుకొన్నారు వై ఎస్ లక్ష్మి .’’లత పరిజ్ఞానం’’ జ్ఞాపకం చేసుకోవటం బాగుంది .’’జ్ఞాన పీథం  వరించిన సాహితీ భూమి గా ,గ్రందాలయోద్యమానికి ఊపిరు లూదిన అయ్యంకి వారి పుట్టినిల్లు ,గా ,కాకానికి ఆట స్తలం గా ‘’కనీ పించింది లక్క రాజు సరోజినీ కి .’’ఈ నగరం ప్రియురాలు కాదు –తల్లి నీడ ‘’అని కైమోడ్పు నిచ్చారు అరస విల్లి కృష్ణ మహా గొప్పగా .

       ‘’జాతి పతాకకు మువ్వన్నె లద్దిన మూర్తి ‘’పింగళి వెంకయ్య ను స్మరించారు సర్వ జిత్ ‘’కృష్ణమ్మ పారుతున్నా ,ఎండే గొంతుల ఆక్రందనలు ‘’విని పించాయి సర్వ జిత్ కు ‘’మా బాణీ ఆకాశ వాణి’’అని మురిసి పోయింది విజయ వాడ రేడియో కేంద్రాన్ని చూసి మురిసిన అమూల్య .విష్ణు భోట్లకు ‘’ఆముక్త మాల్యద జన్మ స్తలం ‘’అని పించింది కోపూరి పూషా దేవి కి ‘’రాష్ట్రానికి సాంస్కృతిక రాజ దాని ‘’అని నిజం గానే అని పించింది ‘’ఇక్కడి ఆయుర్వేద వైద్య శాల కోస్తాకే తల మానికం ‘’అన్నారు రావెళ్ళ .గుమ్మా  ‘’ప్రజల్ని చైతన్యం గావించే పత్రికలన్నీ పురుడు పోసుకొన్న ది మన బెజ వాడ లోనే ‘’అన్నాడు .అంతే కాదు ‘’ప్రాచీనాదునికతల –సమ్యక్ సమ్మేళనం ‘’గా బెజ వాడ దర్శన మిచ్చింది .’’బెజ వాడ రౌడీయే ‘’అంటూ ,యుద్ధ మల్లుని బెజ వాడ శాస నాన్ని ,ఆంద్ర పత్రిక  రాసిన అమ్రుతాన్జనాన్ని పార్ధుని పశు పతాస్త్రాన్నిస్పురణ కు తెచ్చారు .అందరు జగజ్జట్టీలే కనుక బెజ వాడ రౌడీలకేంద్రం అన్నారు వేలూరి కౌండిన్య .

     ఉమా మహేశ్వరి ఆయ్యదేవర గారి పద్మ భూషణ పురస్కారాన్ని గుర్తు చేసుకొని ‘’గుజరాతీ ,రాజస్తానీ ,సిక్కు ,మలయాళీ ,తమిళ బెంగాలీ సంస్కృతుల విరి జల్లుల వాడ ‘’అని సంస్మరించింది .తెలుగు శాత వాహనుల ప్రయాణ ప్రాంగణాన్ని దక్షిణ మధ్య రైల్వే కేంద్రాన్ని గుర్తుకు తెచ్చు కొని ,ఎన్విరాన్ మెంటల్ సస్టైనబుల్ అవార్డు పొందిన నందుకు విజయ వాడను అభి నందిన్చింది .పద్మా వతి శర్మ కు మాచవరం ఆంజనేయస్వామి  ,భవానీ ద్వీపం ,జంధ్యాల దక్షిణామూర్తి వైద్యం గుర్తుకొచ్చాయి .క్షేత్రయ్య కళాక్షేత్రం ,ఘంటసాల సంగీత కళాశాల ,హనుమంత రాయ గ్రంధాలయ వైభోగం పై స్పందిన్చారామే .విజయవాడ నగరం అంటే ‘’రెండు రోడ్లే కాదు –ఒక కార్ల్ మార్క్సు –ఒక మహాత్మా గాంధీ ‘’అన్నారు చిత్తలూరి సత్య నారాయణ .’’చైతన్యం సంత రించుకొన్న వాడ ‘’గా విజయ వాడ కన్పించింది కోకా విమల కుమారికి .విజయ వాడ లోని  అక్షరాలతో విశేషాలను తెలిపి డమరుకం మోగించాడు .పాణి గ్రాహి రాజ శేఖర్ కు ‘’కొండల పై ఎగబ్రాకె జనం ‘’కని పించారు ‘’చరిత్ర పుటల కెక్కిన అమరుల త్యాగం ‘’గోచరించింది .

         ‘’వెలిదండ్ల వారి వేదిక ,సర్వోత్తమం గా తీర్చి దిద్దిన ‘’స్వరాజ్యం ‘’మన సొంతం ‘’అంటూ ,’’హాస్యానికి భాష్యం చెప్పిన నండూరి సుబ్బారావు ,సాహితీ పరి మళాలను గుబాళించిన రజనీ గంధం  ఉషశ్రీ ప్రసంగ ఝరి ‘’జ్ఞాపకం చేసుకోన్నారు రాధిక .రెజీనా కు కళాశాలలలో ‘’శారద గీర్వాణ నిక్వణ స్వరాలు ‘’విని పించాయి .దివి కుమార్ కు‘’విలువలు ,అగాధాల అంచులు –చీల్చుకొని దిగజారు తున్న చోట –అరవై ఏళ్లుగా నడక కుంటుతున్న చోటు‘’కనిపించింది .బృందావన రావు కు ‘’బీసెంట్ రోడ్డు డీసెంటు రోడ్డు గా’’ కనీ పించలేదు .అక్కడ ఆగర్భ శ్రీ మంతులకు–అడుక్కునే అంగ వికలురకు ఉచిత ప్రవేశమే ‘’నని దేప్పాడు .’’అందాలు కను విందు జేసే మందార పూగుత్తి ‘’గా అని పించింది బీసెంట్ రోడ్డు .’’విశాలాంధ్ర తెలుగు జనులదని వాక్కా ణిస్తున్న వాడ –దమ్మున్నోల్ల,సోమ్మున్నోల్ల కలయిక ఈ వాడ ‘’అన్నారు హాజరయ్య గుప్తా.

          అందరికి భిన్నం గా వలి వేటి –కమ్మని గీతాన్ని రాసి బెజవాడకు సమర్పించాడు ‘’నేటికాలపురాజకీయం –నేటి కాలపు చలన చిత్రం –నేటి కాలపు విజ్ఞాన యంత్రం –నేటి కాలపు సుజ్ఞాన ప్రాంతం ‘’గా విజయ వాడ కను విందు చేసింది వలి వేటికి .

  విజయ వాడ లోని కవుల కవితల తర్వాత ,శివారు ప్రాంత కవుల కవితలనూ  చేర్చటం హర్ష ణీయం ఎక్కువ కవితలలో కవిత్వం తక్కువ గా ఉండటం విచారకరం కోటబుల్ కోట్స్ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది .లిష్టులే రాశారు కొందరు మరీ దారుణం గా .

         లో బ్రిడ్జి ,మామిడి పళ్ళ సీజన్ ,కాళేశ్వర ,కేదారేశ్వర మార్కెట్ లు ,భావానీ  పురం సొరంగం ,పాల శేతల కేంద్రం ,రాయన పాడు వాగన్ వర్కింగ్ ,కొండపల్లి బొమ్మలు ,వన్ టౌన్ ఇరుకు రోడ్డు రద్దీ ,బంగారు ,వెండి నగల తయారీ ,మల్లేశ్వర స్వామి దేవాలయం నుంచి బెజవాడ పట్టణ శోభా దర్శనం ,ప్రకాశం బారేజి ,గుణదలమేరిమాత ,ఎస్ఆర్ఆర్ కాలేజి ,లయోలా ,లితో వర్కింగ్ ,సినీ సైన్ బోర్డు హోర్డింగుల కళా ప్రతిభ ,సినీ డిస్ట్రిబ్యూషన్ ,జిమ్ఖానా క్లబ్ ,తంగిరాల వారి వితరణ ,రాఘవయ్య పార్కు ,రెహ్మాన్ ,అన్సారి పార్కులు ,చుండూరు వెంకట రెడ్డి ,డాక్టర్ తెన్నేటి చల పతి రావు చలం తిరుగాడిన నేల ,అమెరికన్ హాస్పిటల్ ,డాక్టర్ల నిలయ మైన నక్కల రోడ్డు ,డోర్నకల్ రోడ్డు ,భారతీయ సంస్కృతికి అద్దం పట్టిన దుర్గా కళా మందిరం ,పాశ్చాత్య సినిమాలయం లీలా మహల్,మారుతీ ,సరస్వతి ,అలంకార్ టాకీసులు,సత్యనారాయణ పురం గేటు దాని దగ్గర పాలు పెరుగు అమ్మకం ,గణ పతి నవరాత్రి ఉత్సవాలు ,శ్రీ రామ నవమి పందిళ్ళ సందడి ,రామకోటి పందిళ్ళు రామా టాకీసు ,వినోదా టాకీసు ల దగ్గర రాత్రి పూట జరిగే చీకటి వ్యారం   అన్నీ బెజ వాడ ప్రత్యేకతలే .చరిత్ర భాస్కర కోట వెంకటా చలం గారు ప్రాతస్మరణీయులు .భారత జాతి చరిత్ర నంతా ఒక్క చేత్తో రాసి అసలైన మన చరిత్రను తెలియ జెప్పిన మహాను భావుడాయన .ఆ నాటి కవి సమ్మేళనం లో నేను వెంకటాచలం గారి గురించి చెప్పి, ఆయన పై ఒక కవిత రాసి విని పించాను .దాన్ని నెట్లో మర్నాడే ప్రకాష్ కు పంస్తూ ఒక కాపీ ని  వారి కుమారుడు డాక్టర్ నిత్యా నంద శాస్త్రి గారికి పోస్ట్ లో పంపాను .కాని అది ఈ సంకలనం లో చోటు చేసుకో లేక పోయింది .ఎవరిని మరువ రాదని అనుకోన్నామో వారినే  మరిచి పోయాం .గతం గతః

         ఇంత మంచి సంకలనాన్ని తీసుకొచ్చిన చల పాక ప్రకాష్ ను , పాల్గొన్న కవులను మరో మారు అభి నందిస్తున్నాను .ఇది అందరికి ఆదర్శం కావాలని ,అన్ని నగరాల పై ఇలాంటి పుస్తకాలు రావాలని ఆశిస్తున్నాను

       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-10-12—ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.