శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –35
79—‘’నిసర్గ క్షీణస్య స్తన తట భరేణ క్లమ జుషో –నమన్మూర్తే ,ర్నారీ తిలక,శనకై స్స్తుట్యత ఇవ
చిరంతే మద్యస్య ,త్రుటిత తటినీ తీర తురుణా –సమానస్తాస్తే మ్నోభవతు కుశలం శైల తనయే
తాత్పర్యం –కపర్దినీ !నారీ తిలకమైన నువ్వు స్వభావ సిద్ధం గానే బాగా కృశించి ,సన్నదైనదీ ,స్తన భారం తో బడలిపోయి ,వంగినదీ ,మేళ మెల్లగా తెగి పోతుందేమో అన్నట్లు ఉండేదీ ,ఒడ్డు విరిగిన ఏటి గట్టు పై ఉన్న చెట్టు లాగా ఉన్న ,నీ నడుము చిరకాలం మాకు సౌఖ్యాన్నివ్వాలి .
విశేషం –నడుము చాలా సన్నగా ఉండి ,పది పోతుందేమో అన్నట్లున్నా ,శరీరం నిలిచే ఉండి .నడుము క్రుశించినా శ్రీ దేవి మహాదేవుని భాగ్య వశం తో నిల్చి ఉండి అని భక్తీ రాసొంమేశితం అయిన హాస్యోక్తి .ఆమె నడుము విరిగితే ,సకల లోకాలకు విలయమే .జగత్ క్షేమం కోసం ఆమె నడుం చిర కాలం ఉండాలి .నడుము అతి సూక్ష్మ మైనదీ ,అతి సారవత్వ మైనది అని భావం .
80—‘’కుచౌ సద్య స్స్విద్యత్తట ఘటిత ,కూర్పాసభి దుశౌ—కషంతౌ దోర్మూలే,కనక కలశాభౌకలయతా
తవ త్రాతుం ,భంగా దలమితి వలగ్నం తను భువా –త్రిధా నద్ధం ,దేవి ,త్రివలి లవలీవల్లి భిరివ
తాత్పర్యం –ముక్తి నిలయా !ప్రకాశ స్వరూపం గల తల్లీ !చెమట తో పార్శ్వాలను అంటుకొన్న రవికను ,పిగులుస్తున్నవి ,బాహుమూల సమీప ప్రదేశాలని ఒరుచు కుంటున్నవీ ,బంగారు కలశాల సౌందర్య సౌభాగ్యాలతో కూడినవీ ,అయిన నీ స్తనాలను నిర్మిస్తున్న మన్మధుడు ,వాటి బరువుకు నడుము ఒంగి పోకుండా ఉండటానికి ,ఏలకి లత చేత మూడు చుట్లు చుట్టాడా అన్నట్లు నీ ఉదరం పై మూడు ముడతలు కన్పిస్తున్నాయి .
విశేషం –నడుము వంగి పోకుండా మహాదేవుని అనుగ్రహం పొందటానికీ , మన్మధుడు మూడు కట్లు కట్టాడు .అతడు తను భవుడు .అంటే శరీరం లో నిత్యం ఉండే వాడు .దేహ యోగాక్షేమాదులను నిత్యం గమనిస్తాడు మన్మధుడు .స్వస్థాన పరి పాలనా దక్షుడు .లలితా సహస్ర నామాలలో ‘’స్తన భార లసన్మధ్య పట్టభందవలిత్రయా ‘’ అన్నదానికి ఇది కవిత్వీకరణ. బిగి చన్నులు ,సన్నని నడుము ,మూడు ముడుతలు ఉత్తమ స్త్రీల లక్షణాలు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 1-11-12- ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com