శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –36
81—‘’గురుత్వం ,విస్తారం ,క్షితి ధర పధిహ్ పార్వతి నిజా –న్నితంబా ,దాచ్చిద్య త్వయి ,హరణ రూపేనా ,నిదధే
అతస్తే ,విస్తీర్ణోగురు రాయ మశే షాం వసు మతీం –నితంబ ,ప్రాగ్భారః శ్తగాయతి లఘుత్వం నయతిచ ‘’
తాత్పర్యం –ప్రాణ దాత్రీ పార్వతీ దేవీ !కొండ ల రాజైన నీ తండ్రి హిమ వంతుడు తన నితంబ ప్రదేశం నుంచి కొంత గురుత్వాన్ని ,వైశాల్యాన్ని తీసి ,నీ వివాహ సమయం లో తాను కుమార్తె కిచ్చే ,కానుక గా నీకు సమర్పించాడు .నీ పిరుదుల అతిశయంచాలా గొప్పదీ ,వెడల్పైనదీ అయి ,భూమి నంతా ,కప్పుతోంది .భూమి దీనితో చులకన అయి పోయింది .
విశేషం –భగవతి పిరుదులు భూమిని తిరస్కరిస్తున్నాయి .అంటే –భూమి ఆమె కు పీ థమైంది .శ్రీ దేవి ప్రకృతి స్వరూపం .భూమిని ఆశ్రయించిన శోభ అంతా ప్రకృతి శోభే ఆమె శోభ .ప్రాకృతిక శోభకు గిరి పుత్రిక లైన నదులే ఉదాహరణలు .
ఆమె నితంబ సౌభాగ్యం ముందు సకల భూ బింబం చులకన అవుతుంది,వేల వేల బోతుంది .ఆమె పాదాక్రాంత మైన భూమి ఇలా అవటం లో తప్పేమీ లేదని సమర్ధిస్తున్నారు శ్రీ శంకరులు .మార్కండేయ పురాణం లో ‘’సదదర్శ ,తతో దేవీం ,వ్యాప్య ,లోకత్ర్తయం ,త్విపా — దాక్రాన్త్య ,నత భువం ,కిరీటోల్లిఖితాంబరాం –క్షోభి తాశేష పాతాలం ,ధనుర్జ్యానిహ్ స్వనేన తాం –దిశో భుజ సహస్రేణ సామంతా ,ద్వాప్య సంసిద్ధతాం ‘’అనేది దీనికి నిదర్శనం
82—‘’కరీన్ద్రానాం ,శుం డాన్,కనక కదళీ ,కాండ పటలీ—ముఖాభాం ,మూరుభ్యాముభాయ మపి నిర్జిత్య భవతే
సువ్రుత్తాభ్యాం ,పత్యుహ్ ప్రణతి కతథినాభ్యాం ,గిరి సుతే –విదిజ్నే ,జానుభ్యాం ,విబుధ ,కరి కుంభ ద్వయ మసి‘’ ,
తాత్పర్యం –వేద విజ్ఞాత్రీ !వేద ధర్మాన్ని చక్క గా అనుష్టించే గిరికన్యవు .నీ తొడల అందం దిగ్గజాల తొండాలను ,బంగారు అరటి స్తంభాలను మించి ఉంది.శోభనం గా ,వర్తులం గా ఉంది .సదా శివుడు నీకు మొక్కే తప్పుడు భూమిని స్ప్రుశించటం వల్ల ,కాయలు కాచిన మోకాళ్ళచేత ,ఐరావతం యొక్క కుంభ ద్వయాన్ని కూడా జయించి ప్రకాశిస్తున్నావు .
విశేషం –భగవతి సర్వ సౌభాగ్య లక్షణాలు కల మహా పతివ్రత .జగాలను కానిదీ ,ధరించేడీ .ప్రళయ కాలం లో మేల్కొని ,ఉండేది భగవతి .’’సుతే జగంతి భగవతీ భవతీ ,భిభర్తి ,తత్ క్షయ కృతే భవతీ భవానీ ‘’అని కాళి దాస మహా కవి చెప్పాడు .లలితా సహస్ర నామాలలో కూడా ‘’కామేష జ్ఞాని సౌభాగ్య ,మార్దవో రుద్వయాన్వితా ,మాణిక్య మకుటా కార జాను ద్వయ విరాజితా ‘’అని ఉంది
83—‘’పరాజేతుం ,రుద్రం ,ద్విగుణ ,శర గర్భౌ గిరిసుతే –నిషం గౌ జమ్ఘేతే ,విషమ ,విశిఖో బాద ,మక్రుత
యదగ్రే ,ద్రుశ్యంతే ,దశ ,శర ఫలాఃపాద యుగళీ—నఖాగ్రచ్చ ద్మాన ,స్సుర మకుట శానైక నిశితా
తాత్పర్యం –రుద్రాణీ !‘’రుద్రుని జయించ టానికి మన్మధునికి ,తన దగ్గరున్న అయిదు బాణాలు చాలనే లేదు .అందుకని ,పది బాణాలు గా చేయ దలచి ,నీ పిక్కలను అమ్ముల పొదిగా ,,కాళి వ్రేళ్ళను బాణాలుగా ,వ్రేలి గోళ్ళను బాణాల చివర పదును పెట్టి ఉంచిన ఉక్కు ముక్కలుగా ,చేసుకొన్నాడు .నీకు నమస్కరించే దేవతల కిరీటాలలో ఉన్న మణులు అనే ఒరిపిడి రాళ్ళ పై నఖాగ్రాలు అనే ములుకులు పదును పెట్ట బడ్డాయి .
విశేషం –మదనుడు పది బాణాలను సంపాదించుకొన్నాడు .ఇది రుద్ర విజయ సాధనార్హత వల్లనే అని భావం .లలిత లో ‘’ఇంద్ర గోపా పరిక్షిప్త ,స్మర తూణాభ జమ్ఘికా ‘’అని ఉంది .శ్రీ దేవి జం ఘలు మదన తూణీరాల వలె ,అతి లోక రమ్యాలు అని అర్ధం .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –.2-10-12-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com