అమెరికా లో జర్మన్ హవా –5
1821లో మిసోరీ డెబ్భై వేల జనాభా తో స్టేట్ అయింది ‘’ద్యుడేన్ ‘’అనే ఆయన ఇవాల్టి వారం కౌంటీ వద్ద 270ఎకరాల స్తలం కొని కమ్యునిటి ఏర్పాటు చేశాడు .పన్నెండేళ్ళ తర్వాత Gielsen Emigration Society ఏర్పడింది .వీరు కర పత్రాలు ముద్రించి జెర్మని కి పంపి ఇక్కడి భూలోక స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు .’’A free german state in North America ‘’అని ఆశ పెట్టారు .అయిదు వందల మంది వచ్చారు .వీరందరూ ‘’లాటిన్ ఫార్మర్స్ ‘’అయారు .ద్యూడేన్ చెప్పిన స్వర్గం కనీ పించ లేదు ‘’the American axe is more difficult to wield than the pen ‘’అని విసుక్కొని మోసపోయామని బాధ పడ్డారు .కాని ఆ తర్వాతా ద్యూడేన్ మాట కు స్పందించి యాభై వేల మంది జర్మన్లు వచ్చి చేరారు .వీరు లైబ్రరీలు ,స్కూళ్ళు ,వార్తా పత్రికలూ స్తాపించారు .1837లో జర్మన్ ఫిలడెల్ఫియా సెటిల్ మెంట్ సొసైటీ అనేది గాస్కోనేడ్ కౌంటీ లో పన్నెండు వేల ఎకరాలను కొన్నది..క్ర్సమంగా హీర్మాన్ ,మిస్సోరీ లకు వలసలు ఎక్కువైనాయి .హీర్మాన్ పరిసర ప్రాంతాలు పళ్ళ తోటల ల తో కళ కళ లాడింది .సారా పరిశ్రమ పెంపొందింది
1840 లో జర్మన్లు మూడు రెట్లు చేరారు .అమెరికా లోని జర్మన్ ఇమ్మిగ్రెంటు లకు సాయం చెయాలనే కోరిక కలిగింది .కాని అప్పటికి అక్కడ కేంద్ర ప్రభుత్వం లేదు 1838 లో ‘’జేర్మేనియా సొసైటీ ఆఫ్ న్యు యార్క్ ‘’ఏర్పడి ,జర్మన్లు టెక్సాస్ లో ఉండటం క్షేమం అని భావించింది .జర్మని లోని ఉత్తర రాష్ట్రాల నుంచి జనం టెక్సాస్ వచ్చారు .ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ,సార వంత మైన నేల వారిని ఆకర్షించాయి .మిసోరీ కి చేరిన వారి కంటే ఇక్కడికి చేరిన వారి సంఖ్య తక్కువే .
1843 లో జర్మనీ రిపబ్లిక్ టెక్సాస్ వెళ్ళే వారిని ప్రోత్స హించింది .new father land beyond sea ‘’అని పేరు పెట్టారు .ఒక్కొక్కరికి 120 డాలర్లు ,ఉచిత ప్రయాణం ,మధ్య పశ్చిమ టెక్సాస్ లో నలభై ఎకరాల భూమి ఇస్తామని జేర్మేనియా సొసైటీ వాగ్దానం చేసింది .1844 నాటికి మూడు ఓడలలో జనం టెక్సాస్ చేరారు .1847 లో సొసైటీ దివాలా తీసింది .అంతకు ముందు 1845 లో టెక్సాస్ కు మెక్సికో కు యుద్ధం జరిగింది .ఈ సమయానికి సొసైటీ మళ్ళీ పుంజు కొంది .వచ్చిన వారిలో వెయ్యి మంది కామ్పుల్లో ఉండి చని పోయారు .’’prince Frederick of prushya ‘’పేరు మీద మొదటి మొదటి వైట్ సెటిల్ మెంట్ టెక్సాస్ లో ఏర్పడింది .మరో అయిదేళ్ళలో రెండు వేల మంది అయారు .ఇక్కడికి చేరిన వారు జర్మనీ లోని బంధువు లకు ఉత్తరాలు రాస్తూ ‘’జర్మనీ లో పని చేసే దానిలో సగం పని అమెరికా లో చేస్తే చాలు హాయిగా జీవితం వెళ్లి పోతుంది .అంతకు మించి స్వాతంత్ర్యం ఉన్దిక్కడ .ఇక్కడి ఇండియన్ల వల్ల ప్రమాదం లేదు .వాళ్ళు మాకు గుర్రాలను ,మాంసాన్ని అంద జేస్తున్నారు ‘’అని సంతృప్తి కరం గా వారికి తెలియ జేశారు .సివిల్ వార కు ముందు టెక్సాస్ లో జర్మన్లు ముప్ఫై వేలు .1857 లో గాల్వస్టేన్ అంతా జర్మన్ల తో నిండి పోయింది .అయితే అక్కడ‘’న్యు జర్మని ‘’అనే మాట మాత్రం రాలేదు .
పనితనం ఉన్న కూలీలను విస్కాన్సిన్ ఆహ్వానించింది browing ,tanning ,పని వారికి రైతులకు స్టోర్స్ వచ్చాయి సెయింట్ లూయీస్ జర్మన్ల సాంస్కృతిక కేంద్రం అయింది సాధారణ కూలీలు మిడ్ వెస్ట్ చేరారు అక్కడ చేతి నిండా పని దొరికింది న్యు యార్కు న్యు ఆర్లియన్ల రోడ్లు ప్రయాణానికి బాగా అనుకూలించాయి .నదుల పై ప్రయాణం ఎక్కువైంది 1830—40 కాలం లో ఇవే ‘’హై వే‘’లని పిలువ బడినాయి .1825 లో ‘’ఈరీ కెనాల్ ‘’వాడుక లోకి వచ్చి ,ప్రయాణాన్ని మరింత సుఖం చేసింది 1851రైల్రోడ్ వచ్చి మరింత సౌకర్యం కలిగించింది . 1850 లో చికాగో లో ఎనిమిది శాతమే జర్మంలుండేవారు మరో పదేళ్లలో నాలుగో వంతు అయారు .చికాగో మిడ్వెస్ట్ కు మంచి కేంద్రం .ఒహాయో, సిన్సినాటి లలో జర్మన్లు పెరిగి పోయారు .1841 లో జర్మన్లు 28%సిన్సినాటి ని ‘’క్వీన్ సిటీ ఆఫ్ ది వెస్ట్’’అంటారు .ఇక్కడ జర్మన్లు జనాభాలో సగ భాగం అయారు .
1847-55 లో ఎక్కువ మంది యూరోపియన్లు వచ్చారు .అందులో జర్మన్లు ఎక్కువగా విస్కాన్సిన్ చేరుకొన్నారు .ఇది 1848 లో యునియన్ లో కలిసి పోయింది .మిలాక్వీ నది లేక్ మిచిగాన్ లో కలిసే చోటు మహా ఆకర్షణీయం గా ఉంటుంది .ఎనిమిది వేలకు పైగా జర్మన్లు 1850 లో చేరి 1860 కి 45వేల మంది అయారు .జర్మన్లు అందరు ఒకే చోట ఉండే వారు .ఐరిష్ వారు వేరుగా ఉండే వారు .సిన్సినాటి లో జర్మనులున్న ప్రాంతాన్ని ‘’over the rhine ‘’అని ముద్దుగా పిలుచుకొన్నారు .
జర్మని నుంచి చాలా మంది యూదులు వచ్చారు .1840 జ్యూయిష్ కమ్మ్యునిటి పది హేను వేలు మాత్రమె .1880 నాటికి జ్యూలసంఖ్య 2,50,000 అయింది వీరందరికీ వ్యాపారం ఇష్టం .డిపార్ట్ మెంట్ స్టోర్లను ఏర్పాటు చేశారు .న్యూయార్క్ లో బాంకులు పెట్టారు .lehman ,loeb కుటుంబాలు వీటిలో ప్రసిద్ధులు ‘’డ్రై గూడ్స్ స్టోర్స్ ‘’ప్రారంభించారు .అదే ఆ తర్వాతా ‘’zean empire ‘’అయింది .అంటే అమెరికా లో జీన్ల ప్రవేశం వీరి వల్లే జరిగింది .ఇలా అమెరికా అంతా క్రమం గా వ్యాపించి అక్కడి వ్యాపార ,ఉద్యోగ సాహిత్య కళావిద్యా సంస్కృతిక రంగా లలో స్తిర పడిపోయారు .అప్పుడు అమెరికన్లకు వీరి పై క్రమంగా అసూయ ప్రారంభ మైంది.
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com