శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –38

 శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –38

86—‘’మృషా కృత్వా ,గోత్రస్ఖలన మధు వైలక్ష్య నమితం –లలాటే భర్తారం ,చరణకమలే ,తాడయతి తే

    చిరా దంత శ్శల్యం దహన కృత ,మున్మూలిత వతా –తులా కోటి క్వానైహ్ కలి కిలిత మీశాన రిపుణా‘’

      తాత్పర్యం –విశ్వ మాతా !పోరపాటులో అకస్మాత్తుగా ,నీ ఎదుట ,నీసవతి పేరు చెప్పి ,తన తప్పు తెలుసుకొని ,ఏమీ చేయటానికి పాలు పోక ,నీకు నమస్కరించే నీభర్తనుపశు పతి నాదుడిని నీవునీ చరణ కమలం తో నుదుట తాడనం చేస్తే ఆ శివ వైరి యైన మన్మధుడు శివ లలాటాగ్ని బాధతో చాలా కాలం గా బాధ పడుతూ ఇప్పుడు సమయం దొరికింది కదా అని మంజీరధ్వని రూపం గా కిల కిలా రావాలను మన్మధుడు చేసి నట్లుగా ఉంది,నీ మంజీర ధ్వని .

         విశేషం –పోరా పాటున వేరొక స్త్రీ పేరు చెప్పటాన్ని గోత్ర స్కలనం అంటారు .అలా శివుడు చేసి నందుకు పర మేశ్వరుడు అని కూడా చూడ కుండా జగదీశ్వరి పాద స్పర్శ విధి చేసింది .ఆయన కోరుకోన్నదీ అదే .ఇక తన బోటి వారికి ఆమె చరన కమలాలే కదా గతి అని శ్రీ శంకరుల భావం .అది కూడా పూర్వ జన్మ సుకృతం వల్ల మాత్రమె లభించాలి .

        తను చేసిన పొరబాటుకు లజ్జితుడై శివుడు దేవి ముందు తల వంచుకొన్నాడు .గోత్రస్ఖలన ప్రభావం శ్రీ దేవి చరన ప్రహార సౌభాగ్యమే అని భావించాడు .అందుకే వంగి వంగి నమస్కరిస్తున్నాడు .మన్మధుడు చాలా కాలం గా ఉన్న హృదయ శాల్యాన్ని (శల్య తుల్య మైన వైరాన్ని )వెల్ల దించాడు .ఇదీ వీర ధర్మమే .అతనికిది ఉచిత సమయం కూడా .

 శ్రీ దేవి శివుని లలాతాన్ని తాడనం చేసింది అక్కడ ఉన్నది ‘’ఫాల నేత్రాగ్ని ‘’.శ్రీ దేవిని ఆశ్ర యించి ఉన్న మన్మధుడు శత్రువుల దర్పం అణచి వేసేట్లు సింహ నాదం చేశాడని అర్ధం .ఇంతకు ముందున్న శ్లోకం లో శివుడు శివానీ యొక్క పాద తాదనాన్ని కోరాడు .ఈ శ్లోకం లో దాన్ని తీర్చారు శంకరా చార్యస్వామి .

     ‘’గాన్త్రాయతే ఇతి గోత్రం ‘’అంటే ఇంద్రియ సంయమనమే గోత్రం .గోత్ర స్ఖలనం అంటే ఇక్కడ ఇంద్రియ సంయమనం జారి పోవటం .అంటే తగ్గినా ఇంద్రియ సంయమనాన్ని ,తిరిగి పరి పుస్తం చేసుకోవటం దీనినే ‘’వై లక్ష్య నమితం‘’అంటారు అంటే –లక్ష్యం తో కూడిన దృష్టి .కిందికి జారటం అని భావం .యోగా శాస్త్రం లో దీన్ని ‘’శాంభవీ ద్రుష్టి‘’అంటారు .అంటే శాంభవీ ముద్ర సందర్భ ద్రుష్టి .’’అంతర్లక్ష్యం బహిర్ద్రుస్తిర్నిమేషోన్వేష వర్జితా ,సా ఏషా ,శాంభవీ ముద్రా సర్వ తంత్రేషు గోపితా ‘’బయటి ద్రుష్టి లక్ష్యం పై ఉండదు .కన్నులు తెరచి ,అర మోడ్పు గా ఉంటాయి .అప్పుడు జాలన్ధర బంధనం లో శిరస్సు ముందుకు వంగుతుంది .గడ్డం కంతం లోని గుంత వరకు దిగి పోతుంది .ద్రుష్టి నేలకు ఒరుగుతుంది .ఇదే వై లక్ష్య నమితం అంటే .అప్పుడు కుండలినీ శక్తి జాగ్రుత మై ,శీఘ్రమే ఆజ్ఞా చక్రాన్ని ప్రవేశించి ,శివ లలాటం లో కాలు పెట్టి ,సహస్రా దిశా గా పైకి పరుగు తీస్తుంది

          దేహాన్ని భరించే వాడు భర్త .అంటే దేహాభి మాని .ఆజ్ఞా చక్రం వరకు సాధకునికి దేహ స్మృతి ఉంటుంది .దాటగానే ఉన్మనీ స్తితికి అభి ముఖం గా సంచారం జరుగుతుంది .అప్పుడు దేహ స్మృతి ఉండదు .దేహాభి మానం మాయ మవుతుంది ఇదీ ఇందులోని రహస్యం అని వివ రించారు శ్రీ తుమ్మల పల్లి రామ లింగేశ్వర శర్మ గారు .శ్రీ శంకరా చార్యుల వారు శ్రీ దేవి అంగ ప్రత్యంగా వర్ణన లో కామదేవుడిని సహయోగం గానే చెప్పారు .అంటే చని పోయిన మన్మదుడికి ,అనంగ రూపంతో పునర్జన్మ శ్రీ దేవి కరుణ వల్లనే లభించింది .ఆమె కృప తో లోకాలను జయిస్తు ,తన పని చేస్తున్నాడు .అంటే కాముడు ఉపాశించి ఆమె తో సాయుజ్యం పొందాడు .అందుకే కామదేవుని రూపం అమ్బికయే అని చెప్పారు శర్మ గారు .

  శ్రీ దేవి పంచ దశాక్షరీ మంత్రం అంటే ‘’కాదివిద్య ‘’లో మొదటి అక్షరం ‘’క ‘’కారమే .ఈ అక్షరం గొప్ప తనాన్ని ‘’త్రిపుర తాపిన్యుపనిషత్తు ‘’చాలా బాగా వివ రించింది

 ‘’స ఎకో దేవః శివ రూపే ద్రుష్యత్వే న వికాసతే –యతిషు ,యజ్ఞేషు ,కామయతే ,కామం జాయతే –స ఏష నిరంజనో ,కామత్వే నో జ్జ్రుమ్భతే అ క చ ట ప –యశాన్ సృజతే తస్మాదీశ్వరేహ్ కామో భి ధీయతే –తత్పరి భాషయా  కకారం వ్యాప్నోతి ‘’

దీని భావం –ఆ ఒక్క దైవమె శివుడు గా కనీ పిస్తున్నాడు .యతులలో ,యజ్ఞం లో ,యోగులలో ‘’కామన ‘’చేస్తున్నాడు .అందుకే కాముడు అని పిలువబడుతున్నాడు .నిరంజనుడు ,కామ రహితుడు అయిన ఆ శివుడే విజ్రుమ్భించి అ,క,చ ,ట,త ,ప ,య ,శ,,వ ,ర వర్ణ సమామ్నాయాన్ని సృష్టిస్తున్నాడు .కనుక ఈశ్వరుడే కాముడు .-అంటే కామేశ్వరుడు .అంటే క కారం వల్ల వెలిసే వాడు

        సృష్టించే సృజన శక్తి కామ శక్తే .ఇచ్చ అంటే ‘’కామన ‘’యే .సృజన చేయాలన్న ‘’ప్రజనన వాసన ‘’ను కామ వాసన అంటారు .ఇది సృజనాభి ముఖ మైన శివ శక్తి .ఇది ప్రసవ భావం తో ‘’శివా ‘’అవుతుంది .సృష్టి అంటే ప్రభవం,లయం దాని విపరీత భావనలు పరస్పర విరుద్ధం గా ఉంటాయి .

     సమాధి సమయం లో శివుడు కాముడిని శత్రువు గా భావించి జయిస్తునాడు .సృష్టి కార్యాచరణ సమయం లో కాముడు శివుని అర్ధాంగి గా మారి సృష్టి కార్యానికి సహ యోగిఅవుతున్నాడు .సమాధి వేళ తన ప్రజ్ఞా నేత్రాగ్ని చేత కాముని దహిస్తే ,సృష్టి వేళ వాడే పరిహాస ముఖు డవుతున్నాడు . అంటూ విశేశార్ధాలను విస్పష్ట పరచారు రామ లింగేశ్వర విజ్ఞులు .

 87—‘’హిమానీ హంతవ్యం ,హిమగిరి నివాసైక చతురౌ –నిశాయాం ,నిద్రాణం,నిశిచ పర భాగే చ ,విశదౌ

     పరం లక్ష్మీ పాత్రం ,శ్రియ మతి,సృజన్తే సమయినాం –సరోజం త్వత్పాదౌ ,జనని ,జయ ,తశ్చిత్ర మిహికిం ‘’

     తాత్పర్యం –శివ శక్త్యై క రూపిణీ !మంచు కొండ పై నివసించి ,నడిచే నేర్పు కల వీ ,అన్ని వేళలా ప్రసన్న మైనవీ ,సమయాచారు లైన నీ భక్తులకు సౌభాగ్యాన్ని కల్గించేవి అయిన నీ పాదాలు మంచు వల్ల నాశనం పొందేవీ ,రాత్రి ముడుచుకొని పోయేవీ ,లక్ష్మీ దేవికి పీథమైనవీ ,అయిన కమలముల కాంతులను మించి అతిశయిస్తున్నాయి .

     విశేషం –రాత్రులు తమస్సుకు ప్రదానాలు .నీల కాంతి కలవి .పాదాలేమో అరుణాలు ఈ రెండు రంగుల మిశ్రమం గొప్పది .దేవీ  చరణ భక్తీ భావం తో కూడిన శాస్త్రం ‘’సమయ మతం ‘’అంత రంగిక పూజ కు విలువ నిచ్చేది .హృదయం లో భగవతిని ఉపాసించే వారికీ అంటే సమయాచారులకు సర్వ వితర్క విలయ పూర్వకం ,ఐశ్వర్యం సృష్టి ప్రకాశమైన దాన్ని భగవతి సృజిస్తుందని భావం .అంబ స్తవం లో ఇలా అని ఉంది–

 ‘’యావత్పరం ,పద సరోజ యుగం ,త్వదీయం –నాంగీ కరోతి హృదయేశు ,జగచ్చరన్యే –           తావద్వికల్ప జటిలః కుటిల ప్రాకారా –స్టార్క గ్రహాఃసమయినాం ,ప్రళయం న యాతి ‘’

సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-11-12- ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.