శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –37
84—‘’శ్రుతీనాం మూర్ధానో ,దధతి తవయౌ ,శేఖర తయా –మమాప్యే తౌ మాతఃశిరసి దయయా ధేహి ,చరణౌ
యయొహ్ పాద్యం పాధఃపశు పతి ,జటాజూట తటినీ –యయోర్లాక్షా లక్ష్మీ ,రరుణహరి చూడా మణిరుచిహ్’’
తాత్పర్యం –పాశు హన్త్రీ !వేదాల శిరస్సులు అని పిలువబడే ఉపనిషత్తు లే ,సిగ పూలు గా ధరించబడినవి .పశు పతి జటా జూటం లోని గంగా జలం చేత ప్రక్షాళనం చేయ బడినవీ ,ఎర్రగా ఉన్న శ్రీ హరి కౌస్తుభ మణి కాన్తులే ,లాక్షా రస కాంతి గా కలవీ ,అయిన నీపాదాలను ,నా తల పై ఉంచి నన్ను అనుగ్ర హించు .
విశేషం –ప్రణయ కోపం పొగొట్ట టానికి పశు పతి దేవికి ప్రణుతి చేస్తాడు .ఆయన శిరసు లోని గంగా జలం శ్రీ దేవి పాదాలను కడుగు తుంది .అంటే గంగ ఆమె కు పాడ్యజలం అయి పవిత్ర మైంది అని భావం .ప్రతి రోజు ఉభయ సంధ్యల్లో నమస్కరించే విష్ణువు మకుటం లోని కౌస్తుభ మణి తెల్లగా ఉన్నప్పటికి ,శ్రీ దేవి చరణాలకున్న లత్తుకయొక్క ప్రసాదం వల్ల ఎరుపు రంగుగా ప్రకాశిస్తోంది .
భగవతి పాదాంబుజ ద్వయం వేదాల శిరస్సు లందు ,సదా శివుని శిరస్సు నందు ,విష్ణువు శిరస్సు నందు సంచరిస్తోందని ,మూర్ధ అంటే శిరస్సు పై సంచరం ఆమె పాదాలకు ఉన్నదని ,భావం .అలాంటి పాదాలను తన శిరసు పై ఉంచమని భగవత్పాదులు కోరుతున్నారు భగవతి పాద ప్రక్షాలన జలం తో హరి ,బ్రహ్మ మొదలైన దేవతలు పవిత్రు లవుతున్నారని అర్ధం .ఆ మహిమ తోనే వారు తమ అధికారాలను పొంది ,నిర్వ హిస్తున్నారు .
శృతి శిరస్సు లైన ఉపనిషత్తులకు భగవతి చరణాలు సిగ పూలు గా ఉన్నాయి అంటే ,సమస్త వేదాంత ప్రతి పాదనలు భగవతి చరణాలే అని భావం .’’లోకస్య ద్వారా మర్చి యత్పవిత్రం ‘’అని శృతి అంటోంది .’’యం ,కామయ తం తముగ్రం ,క్రునోతి తం బ్రహ్మాణం ,తమ్రుషిం ,తం సుమేదాం –అహం రుద్రాయ ,ధనురాతనోమి ,బ్రహ్మ ద్విశే ,శరవే ,హంత వా ఉ ‘’భక్తులకు అతి మహత్తు నివ్వ టానికి భగవతి పాదాలే శరణ్యం .శ్రీ దేవి కూడా పశు పతికి ప్రణామం చేయటం వల్ల ఆమె జానువులు భూమికి తాకటం చేత కథినా లైనాయని భావం .వారిద్దరూ సమ ప్రధానులు .సమాన మైన బల ,సత్వాలున్న వారు .సమ ఓజస్సు ,తేజస్సు ఉన్న వారు .కనుక శివుడు కూడా ఆమె కు నమస్కరించటం సమంజసమే నని సమర్ధిస్తారు శ్రీ శంకరులు .’’సమ ప్రదానౌ ,సమ సత్వౌ ,సమౌజసా ,వ్రుభా దాతారా ,విహ సౌభగానాం‘’అని వేదం అంటోంది .
85—‘’నమో వాకం బ్రూమో ,నయన రమణీయాయ పదయొహ్—తవాస్మై ద్వంద్వాయ స్పుట రుచిర సాలక్త కవతే
అసూయత్యత్సంతం ,యదభి హననాయ ,స్పృహ యతే –పశూనా మీశానః ప్రమద వన కంకేళి తరవే ‘’
తాత్పర్యం –మలయా చల వాసినీ !ణీ పాదాల తాడనం చేత పుష్పించిన అశోక వృక్షాన్ని చూసి ,ణీ భర్త ఈశ్వరుడు అసూయ పడుతున్నాడు .ఆ పాదాలు నాయన రమణీయంగా ,తడి లత్తుక తో ప్రకాశిస్తున్నాయి .అలాంటి ణీ పాద ద్వయానికి నమో వాకాలు
విశేషం –ప్రణయ కలహం తో ,అనుగ్రహం గా శ్రీదేవి పాద తాడనం లభిస్తుందేమో నని శివుడు ఎదురు చూసి నిరాశ చెందాడు .అచేతన వస్తుయిన అశోక వృక్షం ఆమె పాదాల తాకుడుకు పుష్పించటం చూసి ఆ చెట్టు పై అసూయ చెందాడు .ప్రణయ కలహం లో కూడా భర్తను పాద తాడనం చేయ లేదు ..కనుక ఆమె పాతి వ్రత్యం చాలా గొప్పది .లక్ష్మీ సరస్వతులకు ఇంత ఘనత లేదని ధ్వని .
అశోక వృక్షం పద్మినీ జాతి స్త్రీల పాద తాడనం వల్ల పుష్పిస్తుంది .’’అశోకశ్చ రణ పాతే జ్ఞాయతే పుష్పవత్తరం‘’దీనినే ‘’దోహదం’’ అంటారు ‘.పరమ శివుడు కూడా శ్రీ దేవి పాద తాడనాన్ని కోరుతున్నాడు .అంటే –మన వంటి వారికి జన్మాంతర సుకృతం లేక పోతే ,ఆమె చరణసేవ లభించ లేదు .అశోకం అంటే శోకం లేనిది .శివుడు శోక రహితుడే .ఆయన పాశ ముక్తుడు ‘’పాశా బద్ధ స్తదా జీవః పాశా ముక్తః సదా శివః –పాశా బద్ధ పశుహ్ ప్రోక్తః పాశా ముక్తః పశు పథిహ్ ‘’
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –3-11-12-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com