– దర్శ నీయ దేవాలయాలు –2
కొదండ రాముని దర్శించిన కొందరు ప్రముఖులు –పోతన
భాగవతాన్ని మందార మకరంద మాదుర్యాలోలికే టట్లు తెలుగులోకి అనువ దించిన బమ్మెర పోతనా మాత్యుడు ఇక్కడి వాడే .ఆయన ‘’అల వై కుం థ పురంము లో ‘’పద్యానికి ఇదే నేపధ్యం .పద్యం మధ్యలో ఆగి పోతే ,శ్రీ రాముడే స్వయం గా వచ్చి దాన్ని పూర్తీ చేసింది ఇక్కడే .ఆయన ఇల్లు ,పొలాలు అక్కడి చెరువు దగ్గరే ఉన్నాయి కాల గర్భం లో అవి కలిసి పోయి ,కనీ పించటం లేదు .ఆ ప్రదేశాన్ని దేవాదాయ శాఖ యాత్రికుల సౌకర్యార్ధం సత్రాలకు ఉపయోగిస్తోంది .ప్రతి ఏడాది పోతన సాహిత్య పీథం పోతన జయంతిని శ్రీ రామ నవమి నాడు జరిపి ఘనం గా ఆయన్ను స్మరిస్తుంది .
అన్నమయ్య
వెంకటేశ్వర స్వామికి అనన్య భక్తుడు ,పద కవితా పితా మహుడు తాళ్ళ పాక అన్నమా చార్యులు కడప జిల్లాలో తాళ్ళ పాకకు చెందిన వాడు .అది దీనికి ముప్ఫై కిలో మీటర్ల దూరం లోనే ఉంది.అన్నమయ్య ఒంటి మిట్ట కు వచ్చి కోదండ రాముడిని దర్శించి కీర్తన ల తో కీర్తించాడు .
వావికొలను సుబ్బా రావు
ఆంద్ర వాల్మీకి అని పిలువబడే వావి కొలను సుబ్బా రావు గారు వాల్మీకి రామాయణాన్ని తెలుగు లోకి అను వాదించారు .రామాయణానికి ‘’మంధరం ‘’అనే వ్యాఖ్యానం రాసిన మహాను భావుడాయన .ఆలయాన్ని అభి వృద్ధి చేయటానికి ఇంటింటికీ తిరిగి ధనం సేకరించిన పుణ్యాత్ముడు మూల విరాట్ కు బంగారు కవచం చేయించారు సేకరించిన ధనంతో .’’భక్త సంజీవని ‘’అనే ఆధ్యాత్మిక మాస పత్రికను దేవాలయం తర ఫున నిర్వ హించారు .వీరినే ‘’వాసు దాసు‘’గారు గా గౌరవం గా పిల్చు కొంటారు /
సద్గురు సమర్ధ నారాయణ మహా రాజ్
సద్గురు సమర్ధ రామ దాస స్వామి పద కొండవ పీథాది పతి అయిన శ్రీ శ్రీ సద్గురు సమర్ధ నారాయణ మహా రాజ్ ఇక్కడే లక్షలాది మందిక ‘’రామ తారక మంత్రం ‘’ను ఉపదేశించి అన్నదానాలను నిర్వ హించారు .ఆయన్ను అందరు ఆంజనేయ స్వామి అవతారం గా భావిస్తారు .1961-లో సద్గురువు లు ,పద కొండు రోజులు లక్షలాది జనానికి అన్నదానం నిర్వ హించిన మహా భక్తుడు .అఖండ రామ నామాన్ని అందరి చేత జపింప జేస్తూ ,ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నం గా కొన సాగించారు .గాలి గోపురాన్ని పునరుద్ద రించారు .స్పటిక లింగాన్ని వేద మంత్రాల తో భూమి నుండి బయటికి తీసి దాన్ని ప్రతిష్టించారు .ఇవాల్టికీ ఈ లింగాన్ని మనం దర్శించు కొ వచ్చు .కోదండ రామ స్వామి సేవలో జీవితాన్ని పండించు కొని ముక్తి పొందారు స్వామి .
నంద గురు విజయ రాఘవా చార్యులు
నంద గురు వీర వెంకట రాఘ వా చార్యులు గారిని వాసు దాసు గారు ఆలయ ప్రధాన అర్చకులు గా నియ మించారు .యోగి పుంగవులు ,రామ నామ భక్తీ ప్రచారకులు ,కవి ,రచయిత ,ఆధ్యాత్మిక శేఖరులు అయిన ఆచార్యుల వారు మహు ముఖ ప్రజ్ఞా శీలి .ఆయుర్వేద ,జ్యోతిష ,పంచ రాత్ర ,అగమాలలో నిష్ణాతులు .వీరి కుమారులు విజయ రాఘవా చార్యులు కూడా అంతటి ప్రజ్ఞా దురంధరులే .వీరు ‘’శ్రీ రాఘ వెంద్రసుప్రభాతం ‘’రచించారు .దీన్ని ఒంటి మిట్ట కోదండ రామ స్వామికి అంకిత మిచ్చారు .
సాయైన్ వరద దార్న్
వీరు కొండ మాచు పల్లి గ్రామస్తులు .ఇది సిద్ధ వటం తాలూకా లో ఉంది .సత్యాగ్రహ ఉద్యమం లో పాల్గొన్న రాజకీయ నాయకులు .’’కోదండ రామామ్రుతం ‘’.రాసి ఆ కోదండ రామునికి అంకితమిచ్చిన కృతి కర్త సన్యాసం స్వీకరించి మోక్షాన్ని పొందారు .
బహ వన సాయి మాల ఓబన్న
శ్రీ రాముని మీద నిత్యం పాటలు రాసి ఆలయం బయటి నుంచే స్వామికి విని పించే వాడు ఓబన్న .ఆయన అంట రాని వాడు అన్న నెపం తో అర్చకులు ఆలయ ప్రవేశానికి అంగీక రించ లేదు .కోదండ రామ స్వామి తూర్పు ముఖం గా ప్రతిష్టించి ఉన్నాడు .కాని ఈ భక్తు నికి నిరాదరణ చూసి స్వామి తన భక్తుడు ఓబన్న నిలిచి ఉన్న పశ్చిమ దిశకు తిరిగి దర్శన మిచ్చి అందర్ని సంభ్ర మాశ్చర్యాలలో ముంచెత్తాడు .దీన్ని గమనించిన అర్చకులు తమ తప్పుకు చెంప లేసుకొని ఓబన్న భక్తిని మెచ్చి ఆలయ ప్రవేశం చేయించి తప్పు దిద్దు కొన్నారు అప్పటి నుండి నిత్యం ఆలయం లో కి వచ్చి స్వామి పై కేర్తనలు పాడి విని పించే వాడు ఆ తర్వాతస్వామి మళ్ళీ తూర్పు ముఖమై కొలువున్నాడు .అదీ భక్తుని గొప్ప దనం .అనన్య భక్తీ కి కులం ,మతం అడ్డంకి కావు అని భక్త ఓబయ్య నిరూపించాడు .2001లో ముఖ్య మంత్రి చంద్ర బాబు ఒంటి మిట్ట ను దర్శించి అక్కడి అస్ప్రుస్యత ను రూపు మాపే కార్య క్రమం లో పాల్గొన్నారు .ఓబయ్య కధను పూజారి గారి ద్వారా తెలుసుకొని విభ్రాంతికి లోనైనారు .
ఇమాం బేగ్ నవాబు .
కోదండ రాముని అభిషేకానికి ఇక్కడ బావి తవ్వించిన ముస్లిం భక్తుడు ఇమాం బేగ్.న వాబు గారు సిద్ధ వటం కోటకు వెళ్తూ ఇక్కడ విశ్రమించారు అక్కడి కోనేటి నీటిని త్రాగి తన గుర్రానికి కూడా తాగించారు అప్పుడు అనుకో కుండా కోదండ రాముడు ఆయన్ను పేరు పెట్టి పిలవటం విని నిర్ఘాంత పోయారు .స్వామి మహాత్మ్యాన్ని అర్ధం చేసుకొన్నారు .అప్పుడే వెంటనే బావి త్రవ్వించి అభిషేకానికి విని యోగించే ఏర్పాటు చేశారు .
వర కవాల్ అనే ఆయన కోదండ రామ శతకాన్ని రాశాడు .అందులో ఆ నాటి రాజకీయ సంక్షోభాన్ని వివ రించాడు .దీన్ని వెంకటేశ్వర విశ్వ విద్యాలయం వారు భద్ర పరిచారు .నెల్లూరు జిల్లాలో వర కావై పూడి అనే గ్రామం ఉంది.మత్తిరాజులు ఆలయ నిర్మాణం లో పాలు పంచు కొన్నారు .దశరధ రామ శతకాన్ని ఉప్పు గుండూరువెంకట కవి రాసి స్వామికి అంకిత మిచ్చాడు .అయ్యల రాజు రామ భద్ర కవి ’’రామాభ్యుదయం ‘’కావ్యం రాశాడు .చిన్నతనం లో ఆయన్ను ఆలయం లో వదిలేసి తలుపు లు వేసి వెళ్లి పోతే ,గుక్క పట్టి ఏడుస్తుంటే సీతా దేవి ఆయనకు స్తన్యం ఇచ్చి ఆకలి తీర్చింది . అయ్యల రాజు తిప్ప రాజు అనే కవి శ్రేష్టుడు ‘’రఘు వీర శతకం ‘’రాసిన ఒంటి మిట్ట నివాసి .ఆయనే శ్రీ నాదుడికి కనకాభి షేకం చేశాడు .ఈయన్నే త్రిపురాంతకుడు అంటారు .
ఇంత మంది కవులు ,పండితులు ,రాజులు నవాబులు ఒంటి మిట్ట కోదండ రామ స్వామిని దర్శించి ఆయన పై శతకాలు ,కావ్యాలు రాసి ,అంకిత మిచ్చి జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు .స్వామికి ఇంత వైభవం రావ టానికిమూల కారణం అయిన బంది పోటుదొంగలు ఒంటడు మిట్టడు అందుకే చిరకాలం గా మనకు స్మరణ లో ఉండి పోయారు .జీవితాలను ధన్యం చేసుకొన్నారు .
సంపూర్ణం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 5-11-12- ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com