శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –39
88—‘’పదం తే ,కీర్తీనాం ,ప్రపద మపదం దేవి ,విపదాం—కదం నీతం సద్భిహ్ కతిన కమతీ కర్పూర తులాం
కధంవా ,పాణిభ్యా ,ముపయ మన కాలే పురభిదా –యదాదాయ న్యస్తం ద్రుషది ,దయా మానేన ,మనసా ‘’
తాత్పర్యం –కౌలమార్గ తత్పర సేవితా భవానీ !సత్కీర్తులకు నిలయమై ,ఆపదలను తొలగించే ,నీ మీగాలు (అడుగు పై భాగం )ను ,కవులు ఆడు తాబేలు వీపు చిప్పతో పోలుస్తున్నారు .దయా పూర్ణ మనస్సుగల శివుడు ,మీ వివాహ సమయం లో నీ పాదాలను కథిన శిల యైన సన్ని కల్లు రాయి మీద ఉంచటానికి మనసు ఎలా ఒప్పిందమ్మా ?
విశేషం –దయామయుడైన శివుడు శ్రీదేవి పాదాన్ని ఎలా ఉంచ గలిగాడు ?పూర్వ కవులు తో బాటు ,పురభేది కూడా వివేకం లేకుండా ప్రవర్తించారు .వివాహ సమయం లో సప్తపది క్రియ లో వధువు పాదాన్ని వరుడు సన్ని కళ్ళు పై ఉంచటం ఆచారం .’’గూడ గుల్ఫా ,కూర్మ పృష్ట ,జయిష్ణు ప్రపదాన్వితా ‘’అని లలితా సహస్ర నామాలున్నాయి .సప్త పడిలో ‘’అతిష్టే మమ శ్మాన ,మష్మే వత్వం ,స్తిరాభవ ‘’అన్న మంత్రం చదువుతారు .అంటే సన్నీ కళ్ళు లాగా మనసు ద్రుధంగా ఉంచుకోవాలని భావం ..
89—‘’నఖి ర్నాక స్త్రీణాం ,కరకమల ,సంకోచ శశిభిహ్ –స్తరూణందివ్యానాం ,హసత,ఇవ ,తే చండి చరణౌ
ఫలానిస్వస్తేభ్యః కిసలయ ,కరాగ్రేణ,దదతాం –దరిద్రేభ్యో భద్రాం శ్రియ ,మనిశ ,మహ్నాయ దదతౌ ‘’
తాత్పర్యం –అమ్మా చండీ దేవీ !సకల సంపదల చె ,తుల తూగే స్వర్లోక వాసు లైన దేవతలకు మాత్రమె ,చిగురు తాకులు అనే హస్తాలతో కోర్కెలను తీర్చే కల్ప వృక్షాలను దరిద్రులకు కూడా ,సర్వ లోకాల్లో తరుగు లేని సంపదలను శీఘ్రం గా ఇచ్చే నీ పాదాలు –శచీ దేవి మొదలైన దేవతా స్త్రీల కర పద్మాలను ముకుళింప జేసే గోళ్ళు అనే చంద్రుల చేత పరిహాసం చేస్తున్నాయేమో అన్నట్లున్నాయి .
విశేషం –స్వర్గ లోక దేవతలకు కోరిన కోరికలను దేవి చరణాలు నెమ్మది గా టీరుస్తున్నాయి .కాని ,అన్ని లోకాలలోని ,దీనులకు తిరుగు లేని ,మంగళ కర మైన సంపదలను వెంటనే ఇస్తున్నాయి .
కల్ప వృక్షాలు కరాగ్రాలతో స్వర్గ లోక వాసులకు కొద్ది రోజుల్లోనే అనంత సంపదల నిస్తున్నాయి .భగవతి చరణాలు ఐహిక ,ఆముష్మిక సుఖ ,సంతాన ,సముల్లలిత సంపదను వెంటనే ఇస్తాయి .అందుకే నఖాలు నవ్వుతున్నాయి అని చమత్కరించారు భగవత్పాదులు .
గోళ్ళను చంద్రుని గా చెప్పటం అవి అతి తెల్లదనం కలవని చెప్పటమే .శ్రీ దేవి పాద కమలాల ముందు కల్ప తరువు న్యూనత చెందినదట .అవి చేతులతో చెయ్య లేని దాన్ని శ్రీదేవి పాదాల తో చేస్తోందని అన్నారు శంకరులు .
సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –5-11-12-ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com