కాపు –రెడ్డి
‘’జన వేమన’’ అన్న నా వ్యాస పరంపరను చదివిన ఒక చదువరి తాను ఎక్కడో కాపులు కూడా రెడ్లె అని చది వానని సందేహం తీర్చమని నెలకు పైగా రోజుల క్రితం నాకు మెయిల్ రా శారు .నాకు తీరిక ,సమయం ఇప్పుడే దొరికి విషయము అందు బాటు లోకి వచ్చింది కనుక సమాధానం రాస్తున్నాను –
మొదట్లో రెడ్డి పదం రాచరికాన్ని సూచించేది గా ఉండేది .వారిని ‘’రడ్డీలు ‘’అని కూడా అనేవారు .1046లో వేసిన శాసనం లో’’ రెడ్డి కంబు దయ సేసిన ‘’అని రెండు సార్లున్నదని ,రాట్అనే శబ్దం నుండి అది వచ్చిందని దానికి రాజు అనిఅర్ధం అని చరిత్ర కారులు చెప్పారు ..
ఏ..వడి యేలు రాసిన పుస్తకం లో రెడ్ల కు మొదట ‘’కాపు ‘’అనే పేరు కమ్మవారికి ఉండేదని ,ఒక కధ ప్రచారం లో ఉంది .ప్రతాప రుద్రచక్ర వర్తి కాలం లో ఒక రహస్య మైన లేఖ (కమ్మ )శత్రువుల చేతికి చిక్కిందని ,దాన్ని కొందరు అత్యంత ధైర్య ,సాహస ,చాకచక్యా ల తో తెచ్చి ఇచ్చారని వారే ‘’కమ్మ వారు ‘’అయారు అని రాశాడు .1312 లో కాకతీయ గణపతి చక్ర వర్తి కడప జిల్లా లోని , చెన్నూరు గ్రామం లో నాగ నాధుని దేవాలయం లో వేయించిన శాసనం లో రెడ్డి పదాన్ని రాజుకు చేర్చాడు .ఇది రాజ చిహ్నమే అన్నారందరూ .కుల వాచకం కాదు .
కాపుల నుండి వెలమ ,కమ్మ లను ఏర్పరచిన వాడు మొదటి ప్రతాప రుద్రుడే .ఆ తర్వాత వచ్చిన గణపతి దేవుడు ఆ శతాబ్దం లో స్తిర పడిన రెడ్డి ,వెలమ ,కమ్మ కులాల తో సంబంధాలు కలుపుకొని రాజ్య సుస్తిరతసాధించాడు .పల్నాటి యుద్ధం కాలం లో ఈ కులాల మధ్య చిచ్చు బాగా రగి లింది .అసలు వీరంతా వ్రుత్తి చేత సైనికులు లేక క్షత్రియులు ఆకారం లో ,ఆచరణ లో ఒకటిగానే ఉన్నారని’’ ఫ్రాన్సిస్ ‘’అనే చరిత్ర కారుడు రాశాడు .
కాపులను’’ కాంపులు’’అని పిలిచే వారు ,రాసే వారు .1091పశ్చిమ గోదావరి జిల్లా లోని పాలకొల్లు లో మార్యార్కుడు వేయించిన శాసనం లో ‘’కాంపులు ‘’అని కాపులను పేర్కొన్నారు .1094 లో అప్పికట్ల లో వేయించిన శాసనం లో విశ్వేశ్వర మహా దేవరకు’’ అఖండ వత్తి దీపాలకు’’‘’అలుకుం బట్ల ప్రోలి రెడ్డి ,ముదివి రెడ్డి ,నారప రెడ్డి ,వీరు మువ్వురు కాంపులు తమ పుత్రాను పౌత్రిక మా చంద్రార్కము ‘’అని ఉంది . .కనుక కాపులు రడ్లు అయి తర్వాత రెడ్లు అయారని తెలుస్తోంది .శాసనం 190లో ‘’అయ్యప రడ్డి,-కొడుకు ‘’రడ్డి ‘’అని ఉన్నది .వీటన్నిటిని బట్టి రెడ్లు కూడా కాపులే అని భావించ వచ్చని అన్నారు శాసన ,చరిత్ర పరిశోధకులు స్వర్గీయ కొడాలి లక్ష్మీ నారాయణ గారు తమ ‘’విస్మృత ఆంద్ర నాయకుల చరిత్ర ‘’అన్న పరిశోధన పుస్తకం లో .వేమన కూడా ‘’కలి యుగమున నున్న కాపు కులానకు –వేమన తన కీర్తి విక్రయించే ‘’అని రాసుకొన్నాడు .
1111 లో ఖర నామ సంవత్సర ఫాల్గుణ బహుళ పాడ్యమి సోమ వారం శ్రవణా నక్షత్ర యుక్త కర్కాటక లగ్నం లో కాకతి రుద్రదేవుడు ఆయా కులాలకు గోత్ర్తము మొద లైన బిరుద నామాలు యెర్పరచి నట్లు తెలుస్తోంది .అప్పటికి ఇంకా పల్నాటి యుద్ధం జరగలేదని ,రెండవ ప్రతాప రుద్రుడు తాత గారు ఏర్పరచిన కుల గోత్రాలను ప్రకటింఛాడని అంతకు పూర్వమే ఉన్న కాపు కులం నుండి ఒకటవ ప్రతాప రుద్రుడు వెలమ ,కమ్మ లను ఎర్పరచాడని ,కాపు ,వెలమ ,కమ్మ ,రెడ్డి ,తెలగ మొదలైన కులాల వారంతా ఆర్యులేనని కొడాలి వారి అభిప్రాయం.కుంభీ జాతి నుండి వెలమ వారోచ్చారని ,కూర్మీల నుండి కమ్మ ,తెలగ కాపు ,రెడ్లు అయారని ఆయనే చెప్పారు .కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది వెలనాడు అని కైఫీయత్తుల్లో ఉంది .కమ్మ వారికి మూల పురుషు లైన దుర్జయులకు ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం
రెడ్లు కొండ వీడు ను పాలించే టప్పుడు ‘’కొండ వీటి దండ కవిలె’’ రాయించారు .అందులో వెలమ ,బలిజ ముస్లిం మొదలైన 39 సామంతులను పేర్కొన్నారు .ఇందులో కమ్మ నాడు, కమ్మ రాష్ట్రాల పేర్లు లేవు .మహా రాష్ట్రుల కాలం లో ‘’చౌత్‘’అనే పన్ను అంటే నాల్గో వంతు పన్నును కమ్మ వారు వసూలు చేయటం వల్ల ‘’చౌదరి ‘’అనే పేరు వచ్చిందని తెలుస్తోంది .మహా రాష్ట్రులకు పూర్వమే ఈ పేరు ఉందట. .అయోధ్య లోని ధన వంతు లైనవారు ‘’చౌదరి శబ్దాన్ని’’ గౌరవ సూచకం గా పెట్టు కొనే వారని ‘’కార్నెజీ అన్న చరిత్ర కారుడు ‘’రాసి నట్లు లక్ష్మీ నారాయణ గారు పేర్కొన్నారు ..జమీందారీ ,దేశ పాండ్యా ,దేశ ముఖ ,చౌదరి అనే శబ్దాలు బిరుద నామాలు గానో ఉద్యోగ నామాలు గానో కుల విచక్షణ లేకుండా ఉన్నాయని తెలుస్తోంది .
ఆంద్ర శాత వాహనులకు పూర్వమే కాపులు లేక కూర్మీలు గుంటూరు మండలానికి వచ్చి ,బౌద్ధ స్తూపాలను నిర్మించారని ,వీరు బౌద్దులైన లిచ్చవులు ,ఇక్ష్వాకులు అయి ఉండచ్చు నని వీరిలోని వారే ,కమ్మ ,కాపు ,తెలగ ,రెడ్డి కులాల వారని, వీరంతా ఏక గర్భ జనితులని కొడాలి వారి భావన .కనుక వీ రందరూ ఆర్య క్షత్రియులే కాని శాతవాహన వంశస్తులు కారని ఆయన నిశ్చితాభిప్రాయం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-11-12—ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
rayalaseema loni reddlandarini kapulantaru.maa certificates annintlo maa caste kapu ane vuntundi.
perkonabadina vishayalalo vastavaniki aaskaramu ekkuvaganunnadi , mantada vastavyulaina kodeboyina vari gurinchi pariseelinchi vari puttu poorvottaralanu teliyajeya prardhana
రాయలసీమ రెడ్లు కాపులు అని రాసుకోవడం నిజమే….కానీ వారు కాపు,తెలగ,బలిజ, ఒంటరి తెగకు సంబంధించిన వారు కాదు. 1886 లో అప్పటి దెప్యూటీ కలెక్టర్ నరహరి గోపాల క్రిష్ణమయ్య చెట్టి రాసిన కర్నూల్ మాన్యువల్ చూడండి. బలిజ కాపులు పూర్వాచార కులాలకు పెద్దలు. వీరిలో కులాంతర వివాహాలు కానీ, విధవా వివాహాలు కానీ లేవు. రాయలసీమలోని కాపులుగా చెప్పుకునే రెడ్ల ఆచారాలు వేరు. పూర్వాచార కులాలకు పూర్తిగా విరుద్ధమైన ఆచారాలను కలిగివున్నారు కనుక వీరు కచ్చితంగా బలిజ కాపులలో అంతర్భాగమయ్యే అవకాశమేలేదు. 1799 లో నాలుగవ కర్నాటక యుద్ధం జరిగింది 1800 లలో దత్తమండలాలైన బళ్ళారి, కర్నూలు,కడప, అనంతపురం ప్రాంతాలను నిజాం బ్రిటీషు వారి ధారా దత్తం చేశాడు. అప్పటివరకు వంశపారంపర్యంగా గ్రమాధికార హక్కులను కలిగి వున్న బలిజ దేశాయిరెడ్లు పన్నుల వసూళ్ళకు సహకరించలేదు. అప్పుడు బయటి సమాజం నుండి కొంతమందిని కౄరంగా పన్నులు వసూలు చేయడానికి తెచ్చి పెట్టారు. సెట్టిసమయాలనే అధ్బుత వ్యవస్థను రద్దు చేసిన బ్రిటిషర్లు వాటి స్థానంలో కోర్టుల వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలా జనజీవన స్రవంతిలోకి రెడ్ల ప్రవేశం జరిగింది. 17వ శతాబ్దం నాటి ఔరంగాజేబు శాసనాలలో సైతం రెడ్డి అనే కులం పేరు కనిపించదు. దక్షిణాదిలో ఉన్న కుడి ఎడమ కులాల జబితాలో కూడా రెడ్డి కులం కనిపించదు. అందువల్ల వీరిని బయటి సమాజం నుండి వచ్చిన వారిగానే భావించాల్సి వస్తోంది.
Right 100 % balija, kapu, telaga ontari , munnuru is kapu’s only
Kammas were Kshatriyas their origen was very strong. From kambhoja mahajana padha they split as kamma khubhi kambhi Kshatriyas. 3rd century ago there was kammarastram kammaratham Kammanadu. These Kammanadu splited as velnadu and palnadu those who ruled these areas they were called as kammaprabhus Kammakshatriyas. Durjaya is Kammas greatest vamsa. Kakatiyas and musunuris are Kamma durjayas. Kakatiya Kamma empire and Musunuri Kamma empire are the greatest empires of Telugu pride.
Velma came from Kamma, reddy came from kapu reddy means pants kapu ” Reddy are Kapus.
Kammas names Naidu, Chowdary,Raidu, rao, varma past century’s, Nayakar in Tamil Naidu
Velma’s were
Velma’s names are Naidu, raidu, rao
) చంద్రవంశ క్షత్రియులలోని ఒకానొక శాఖ “”దుర్జయ వంశీయులు””, చంద్రవంశ క్షత్రియ మూలాలు కలిగిన ఒకప్పటి కూర్మారాధకులైన (జైనులైన) “”దుర్జయాన్వయులు”” – “”కాకతీయులు”” మొదలైన కమ్మవారి మూల పురుషులు………………….2) “”కమ్మవారికీ, కాకతీయులకూ”” మూలపురుషుడైన “”కమ్ర మహారాజు”” ఈ సముదాయంలోనివాడే. కాకతి అనే జైన దేవతను కులదేవతగా పూజించిన కారణంగా వీరిని కాకతీయులు అనేవారు. కాకతీయ పాలకులలో మొదటి బేతరాజు (క్రీ.శ. 1000 – 1030), మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1030 – 1075) జైనులే. జైనమతాన్ని వదిలేసి, శైవం స్వీకరించిన రెండవ బేతరాజు( క్రీ.శ. 1075 – 1110) పరమ మాహేశ్వరుడని అనుమకొండ శాసనం పేర్కొంది. అప్పటివరకూ జైన మతంలో కులగోత్రాల ప్రసక్తిలేకుండా జీవించిన వీరు శైవం స్వీకరించాక అప్పటి సామాజిక అవసరాలకు తగినట్లుగా కురమ అనే కులంగా ఏర్పడ్డారు…………………………………………………………..3) “”కాకతీయులు”” తాము క్షత్రియులమని కొన్ని శాసనాలలో, చతుర్థ వంశజులమని కొన్ని శాసనాలలో చెప్పుకున్నప్పటికీ, “”జైన మతంలో”” ఉండగా “”కుల గోత్రాలను”” విసర్జించిన కారణంగా వారిని నాటి సమాజం క్షత్రియులుగా గుర్తించక శూద్రులుగానే భావించినట్లుంది. ఆ ఆత్మ న్యూనతా భావం వారిలో ఆధిక్యతా భావం ఏర్పడడానికి దారితీసింది. ఆ ఆధిక్యతా భావంతోనే కొందరు కాకతీయ ప్రభువులు తమను తాము ‘అత్యర్కేందు కుల ప్రసూతులు’ గా అంటే సూర్య – చంద్ర వంశాల కంటే మిన్నయైన కులానికి చెందినవారిగా భావించేవారు. ప్రతాపరుద్రీయ కావ్యంలో విద్యానాథుడు కాకతీయులు ‘ అత్యర్కేందు కుల ప్రసూతుల’ నే పేర్కొన్నాడు…………….కాకతీయులు-దుర్జయ వంశస్థులు……….కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది “”(కమ్మ నాడు, కమ్మ రాష్ట్రాలు)వెలనాడు”” అని కైఫీయత్తుల్లో ఉంది.””కమ్మ”” వారికి మూల పురుషు లైన “”దుర్జయులకు”” ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం…………1)శాసనాధారాలను బట్టి “బయ్యారం శాశనం” ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.
2) “గూడూరు శాసనం”లో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.
3) “చేబ్రోలు శాశనం” ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన – బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు……..