శ్రీ శంకరుల లలి (కవి) తాసౌందర్య లహరి –44(చివరి భాగం )
98 –‘’కదా కాలే మాతః కధయ కలితా లక్తక రసం –పిబేయం ,విద్యార్దీ ,తవ చరణ నిర్నేజన జలం
ప్రకృత్యా ,మూకానా ,మపిచ ,కవితా కారణ తయా –కదా ధత్తే వాణీ ముఖ కమల తాంబూల రసతాం ‘’
తాత్పర్యం –మంగళాక్రుతీ మాతా !జన రంజకత్వం కోసం పూతగా పూసుకొన్న యెర్రని లత్తుక రసం తో ఉన్న నీ చరణాలను కడిగిన పాద్యోదకాన్ని ,బ్రహ్మ విద్య ను అభ్య సించె విద్యార్ధి నైన నేను ,మరణించే లోపల ,యే సమయం లోనైనా పుచ్చు కోగాలనా ? ఆ నీ పవిత్ర పాదోదకం చెవిటి వారికి వినికిడి శక్తిని ,మూగ వాడికి మాటను కలిగించి ,కవిత్వం చెప్ప టానికి కారణం అవటం చేత ,వాణీ ముఖ కమల రస సారస్యాన్ని ఎప్పుడు స్వీకరిస్తుందో కదా ?
విశేషం –శంకర భగవత్పాదులు సామీప్య భక్తీ ని కోరు కొన్నారు .తాంబూల కవిత సరస్వతీ వాదన వాగ్విలాసం తో పోల్చా దాగిన సూక్తి ప్రవాహం .కాళి దాసాదులు సరస్వతి ముఖ కమలస్త తాంబూలం వల్ల మహా కావు లైనారు .భగవతి పాదజాలం లాక్షారసావుకితం కనుక భారతీ ముఖ కమస్త వీటీ (తాంబూలం )రూపం పొంది ,సత్కవితా హేతువు అయింది .మూగ వాడిన ఒకనికి కంచి కామాక్షి అమ్మ తాంబూల రసం నాలుక మీద పడ గానే మహా ఆశుదార గా మహా కవిత్వం అలవోక గా నోటి నుండి వెలువడింది ..ఆయననే ‘’మూక కవి ‘’అంటారు ..ఆయన ఆర్యా శతకం మొదలైన అయిదు శతకాలనుఅమ్మ వారి పై చెప్పారు . వీటినే ‘’మూక పంచ శతి ‘’అంటారు . అద్భుత కవితా ప్రవాహం అందులో ఉంటుంది .ఆయనే తర్వాతా కంచి కామ కోటి పీఠానికి అది పతి కూడా అయారు .అమ్మ దయ అంట గొప్పదని ,ఆమె తాంబూల రసం లో అంతటి మహత్తు ఉందని శంకరుల భావం .అంటే కాదు అంత మహా విద్వాంసుడు వేద వేదాంగాలను ఆవ పోసాన పట్టిన వాడు అయిన ఆయన తనను ‘’విద్యార్ధి ‘’గానే చెప్పుకోవటం వారి వినయానికి ప్రతేక .అమ్మ దయ ఉంటె రానిదేమీ లేదని అర్ధం .
99—‘’సరస్వత్యా లక్ష్మ్యా ,విధి ,హరి ,సపత్నో విహరతే –రతెహ్ పాతివ్రత్యం ,శిదిలయతి రమ్యేణ వపుషా
చిరంజీవంనేవ క్షపిత పశు పాషా వ్యతి కరః –పరా నందా భిఖ్యం రసాయతి రసం త్వద్భజన వాన్ ‘’
తాత్పర్యం –సర్వాపద్నివారి ణీ మాతా !నిన్ను భజించే భక్తుడు సరస్వతి ,లక్ష్మి దేవులతో చిరంజీవి గా వర్ధిల్లు తాడు .బ్రహ్మ ,విష్ణు లకు అసూయ పుట్టిస్తాడు .మన్మధుని సౌందర్యం తో సమాన మైన కాంతి సౌందర్యం కల శరీరం తో ,మన్మధుని భార్య రతీ దేవికే మొహం పుట్టించి ,ఆమె పాతి వ్రత్యానికే భంగం కలిగిస్తాడు .చివరికి జీవ సంబంధాన్ని వది లించుకొని ,జీవన్ముక్తుడై ,సదాశివ తత్వాత్మకుడై ,పరమానంద రస సౌభాగ్యాన్ని అనుభవిస్తాడు .అంటే నీ భక్తుడు అతి సౌందర్య వంతుడు ,తేజస్వి ,వర్చస్వి విద్యా పారంగతుడు ఐశ్వర్య వంతుడు అవుతాడు .
విశేషం –సాధకుడు తానే మన్మధుని వంటి శరీరం పొంది ,రతీ దేవినే భ్రమింప జేస్తాడని భావం .బ్రహ్మ ,విష్ణు లకుఅసూయ కల్గిస్తాడు .పశువు అంటే జీవుడు .ఇంద్రియాల చేత ప్రపంచాన్ని చూసే వాడని అర్ధం.’’పశు –బందనే ‘’అవిద్య చేత బద్ద్దు డైన జీవుడే పశువు .పాశం అనేది అవిద్య ‘’.అదిథిహ్ పాశం ప్రముమోక్త్వే తన్నిమః –పశుభ్యః పశు పతయే కరోమి ‘’అని శ్రుతి .ఆదిత్య మండలాన్తర్గత మైన అదితి అనే స్త్రీ శక్తి అవిద్యా కృత బంధాన్ని విముక్తి చేయుగాక అని పై దాని అర్ధం .అదితి–పశు పతి ఐన సదా శివుని తో పాశ విముక్తి చేస్తాడని భావం .
అవిద్యా పాశం వది లించుకొంటే సదా శివ రూపుడు అవుతాడు .పరా నంద ,పరా నందాత్మిక ,పరా నంద జ్యోతి లో రసిస్తున్నాడు .ఆస్వాదిస్తున్నాడు .ఇదంతా భగవతి ని భజించే వాడికే సాధ్యం .భజించటమే సేవించటం అని అర్ధం .
ఆత్మ జ్ఞానం కలిగినా ,ధర్మా నుష్టాదులకు ఫలా పేక్ష లేక పోయినా ,సంస్కార వశం తో చక్ర భ్రమణం వల్ల శరీర సంబంధం ఉంటుంది .భజనలు రెండు రకాలు మొదటిది షట్చక్ర సేవ రెండోది ధారణా .షట్చక్ర సేవ –ఆధార ,స్వాధీ ష్టానాలలో ఉపాసన ఉండదు .కారణం తమస్సు చేత అవి ఆవ రింప బడి ఉన్నాయి .మణి పూరకం నుంచి సహస్రారం వరకు పూజ ఉంటుంది .మణి పూరక పూజాదులకు ఆమె సమీపం లోకి చేరతారు .అనాహత చక్ర పూజా పరులకు సాలోక్య ముక్తి వస్తుంది .అంటే దేవి పట్టణం లోనే ఉంటారు .విశుద్ధ చక్రోపాసకులకు సామీప్య ముక్తి లభిస్తుంది .పాద సేవ చేసే సేవకులవటం వల్ల ఆజ్ఞా చక్రోపసకులకు సారూప్య ముక్తి వస్తుంది .అంటే ఆమె తో సమాన రూపాన్ని పొందుతారు .వీరందరికి బాహ్య బాహ్య దుఖాన్ని వదిలేసె శక్తి ఉండదు .దేహ ధారణా ఉంటుంది కనుక సాయుజ్య ముక్తి రాదు .సాయుజ్యమే శాశ్వత ముక్తి అని భావం .అది భగవతి భజన వల్ల ఆస్వాద్యమవుతుంది .
లోకం లో స్త్రీ సమ్మేళనం వల్ల పరమ సుఖం లేదు .అన్ని దుఖాలు పోతేనే సాయుజ్యం .అది శివ శక్తి సంపుటాన్తర్భాగం .పశువులు జ్ఞాన గర్వితులు .పరలోక సుఖం లేనివారు .విద్య లేదు ఒట్టిఐహిక సుఖ జీవులు ,పాశ బందితులు .
రసో వై సహః ‘’అని శ్రుతి భగవతి సకల సేవా రాధ్య .సర్వ దేవతాధిక .సకల ప్రపంచ ఉత్పత్తి మాతృక .సర్వ మంత్ర జలోత్కట .అలాగే భగవతి భక్తులు కూడా .బ్రహ్మాదుల కంటే ఉత్కృష్ట స్తితి ని పొందుతారని పిండి తార్ధం.
100—‘’ప్రదీప్త జ్వాలా భిర్దివస కర ,నీరాజన విధి –స్సుదా,సూతే స్చంద్రోపల జలల ,వైరర్ఘ్య రచనా
స్వకీయై రంభోభి స్సలిల నిది సౌహిత్య కరణం –త్వదీయా భిర్వాగ్భిస్తవ జనని ,వాచాం స్తుతి రియం ‘’
తాత్పర్యం –మనో వాచామ గోచరీ తల్లీ !వాక్ ప్రపంచానికి తల్లి వైన నీవు ఇచ్చిన నీ స్వరూపాలైన వాక్కుల చేత నిన్ను నేను కొని యాడుతున్నాను .తనవి అయిన కాంతి దివిటీ లతో సూర్యుడికి నీరాజనం పట్టి నట్లు ఉంది నా చేష్ట .తన సంబంధ మైన చంద్ర కాంత శిలనుంచి వచ్చే నీటి తో చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి నట్లుంది .తన సంబంధ మైన జలాల చేత తర్పణం చేసి ,సముద్రుని దప్పిక తీర్చటం లాగా ఉంది నా వెర్రి చేష్ట. .నీవు పరా శక్తివి .నిన్ను స్తుతించే శక్తి ఎవ్వరికీ లేదు .అహంకారం వదిలి సర్వం నీ కరుణ యే నని నీ స్తోత్రం చేస్తూ ముగిస్తున్నాను .
విశేషం –సర్వము భగవతియే .చేతనా చేతనం అంతా ఆమెయే .స్తోత్రమే శ్రీ దేవి అయితే ఈ స్తోత్రం చేయటం అపరాధమే .అందుకే ‘’క్షం తవ్యం ‘’అని క్షమించ మని చమని వేడుకొన్నారు వేదాంత శంకరులు .’’త్వదీయాభిర్వాగ్భిస్తవ ‘’అంటే ఆమెయే మాతృకా రూపిణి .మాత్రుకాక్షరాలు ఆమె .ఆమె స్తుతి .’’మాతృకా వర్ణ లిప్తాంగీ –మహా చక్ర మాధ్యగాం’’అని లలిత .
పరా ,పశ్యంతీ ,మాధ్యమా ,వైఖరీ రూప వాక్కు ల వల్ల ‘’త్వయైవ ఉల్లసితా వైఖరీ ,సంరుజ్ఞ్ముభిత తన్మయ ,మాత్రుకాక్ష రైహ్ త్వయి వస్తు రితి ఆకారంత క్షకారాంత మాతృకా వర్ణ రూపిణీ ‘’అని లలితా సహస్రం ..ఇంతటి మేధావి ,పరమ ఉపాసకులు సాక్షాత్తు కైలాస వాసి ఈశ్వరుడు ,ఆత్మ జ్ఞాని ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకు,భగవద్గీత కు అమోఘ వ్యాఖ్యానాలు రచించి భక్తీ స్తోత్రాలను అనర్గళం గా చెప్పి ,అద్వైత మాతా చార్యులై,షణ్మతస్తాపకులై ,సకల జనోద్దారకులై ,వేద మార్గ పద గామి యైన శ్రీ శ్రీ శ్రీ శంకర భగవత్పాదులు అలౌకికా నందం తో లలితా రా భట్టారిక వైభవాన్ని ‘’సౌందర్య లహరి ‘’లో నిక్షిప్తం చేశారు .ఇందులో వారి కవితా సౌందర్య లహరి నీ దర్శించుకోన్నాం .దీన్ని చదివితే ఇంకా దేన్నీ చదవనక్కర్లేదన్నట్లున్న రచన ఇది .సాధన చేసే వారికి చేసి నంత .ఇప్పటి దాకా ఆ పరమ వైభవాన్ని దర్శించి తరించాం .దీని లోని అంతరార్ధాన్ని పరమ శోభాయ మానం గా వివరించారు ‘’సదా శివా నంద నాద ‘’బిరుదాంకితులు బ్రహ్మశ్రీ తుమ్మల పల్లి రామ లింగేశ్వర శర్మ గారు ..ఆ అమృత పానమే మనకు శ్రీ రామ రక్ష .
ఇతి మంగళం మహాత్ –సంపూర్ణం .
దీపావళి శుభా కాంక్ష లతో
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –10 – 11-12-ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com