మధుర సుధలు శ్రీ కృష్ణ లీలామృతం కధలు

మధుర సుధలు శ్రీ కృష్ణ లీలామృతం కధలు

 

మిత్రుడు శ్రీ టి.వి.సత్యనారాయణ (తాడి మేటి వెంకట సత్య నారాయణ )శ్రీ కృష్ణుని పరం గా రాసిన కదా సంపుటి ‘’శ్రీ కృష్ణ లీలామృతం ‘’పుస్తకాన్ని నిన్న అంటే 19-11-12సోమవారం నాడు –సరసభారతి 39 వ సమా వేషం లోమహిళా దినోత్సవ సందర్భం గా  స్థానిక ఫ్లోరా స్కూల్ లో ,ప్రముఖ సాహితీ వేత్త ,సీనియర్ జర్నలిస్ట్  ముఖ్య అతిధి శ్రీ మతి డాక్టర్ కే .బి.లక్ష్మి ఆవిష్కరించారు .సరస భారతి గౌరవాధ్యక్షురాలు ,ఫ్లోరా ప్రిన్సిపాల్ శ్రీ మతి జోశ్యుల శ్యామలా దేవి అధ్యక్షత వహించిన సభలో ,కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబారావు ,శ్రీ టి.వి.,సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ వేదిక నలంకరించారు .లక్ష్మి గారు మాట్లాడుతూ మహిళా సాధికారత అవసరమని ,మహిళలకు అక్షరాస్యత ,ఆర్ధిక స్వావ లంబనం ,విధాన నిర్ణయాలలో స్వేచ్చ ఉంటేనే సాధికారత సాధించగలరని అన్నారు ,మహిళలు ఆత్మా విశ్వాసం తో ముందుకు సాగాలని ,స్త్రీ శక్తి అమోఘ మైనదని ఆమె ఆది పరాశక్తి అని అంబ అని పురుషునికి పరిపూర్నత నిచ్చే ఆలిగా ,బిడ్డలను తీర్చి దిద్దే అమ్మగా స్త్రీ శక్తి అమోఘమని ఆమె ‘’స్త్రీ శక్తి ‘’ని ఆవిష్కరించి అందరినీ మెప్పించారు .దుర్గా ప్రసాద్ ‘’ఈ  రోజు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధి జన్మ దినమని ఈ రోజును దేశ సమైక్యతా దినోత్సవం గా ,మహిళా సాధికారిక దినో త్సవం గా జరుపుకొంటున్నారని చెబుతూ ,సుమారు ముప్ఫై ఏళ్ళ నాడు ‘’ఇండియన్ ఎక్స్ప్రెస్ ‘’సంపాదకుడు ఫ్రాంక్ మోరేస్ ‘’the only man in the congress party is indiraa gaandhi ‘’అని రాశాడని తెలియ జేశారు .ముప్ఫై  అయిదేళ్ళ క్రితం ఈ రోజునే దివి సీమ ఉప్పెన వచ్చిందని గుర్తు చేశారు .గుర్తి కొండ సుబ్బారావు మాట్లాడుతూ ప్రపంచం లో ముగ్గు రు మహిళా ప్రధానులు –ఇందిరా గాంధి ,మార్గరేట్ థాచర్ ,సిరి మావో బండారు నాయకే మహిళా శక్తి ఏమిటో నిరూపించారని  తమ దేశాలను తీర్చి దిద్దారని ,ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేశారని గుర్తు చేశారు .అంతకు ముందు ఇటీవలే మరణించిన అపర సత్యభామ ,అభినవ ,అభినయ సత్య భామ,’’కూచి పూడి నాట్య నిఘంటువు ‘’ పద్మశ్రీ వేదాంతం సత్య నారాయణ శర్మ గారి మరణానికి సంతాపం ప్రకటించారు ..దివి తాలూకా మాణిక్యం ,చల్ల పల్లి దగ్గిర ఉన్న పెదప్రోలు నివాసి శ్రీ కృత్తి వెంటి శ్రీనివాస రావు కేంద్ర సాహిత్య అకాడెమి కి కార్య దర్శి గా పదోన్నతి పొందినందుకు హర్ష ధ్వానాల మధ్య అభినందనలు తెలియ జేశారు .,దుర్గా ప్రసాద్ శ్రీని వాస రావు కుటుంబం తో తనకు యాభై ఏళ్ళ క్రితమే ఉన్న పరిచయాన్ని శ్రీను చిన్న తనాన్ని జ్ఞాపకం చేసుకొన్నారు .దాదాపు వంద మంది పది, తొమ్మిది తరగతుల విద్యార్ధినులు,మహిళా ఉపాధ్యాయులు పుర ప్రముఖులు సమావేశం  లో పాల్గొని నిండు దనం చేకూర్చారు .సత్య నారాయణ గారు సరస భారతి ఆధ్వర్యం లోనే తన పుస్తకావిష్కరణ జరగాలన్న తన కల అద్భుతం గా రంగ రంగ వైభవం గా నెర వేరిందనిసంతోషం తో  తెలిపారు లక్ష్మి గారికి,సత్య నారాయణ గారికి సరస భారతి నిర్వాహకులు  శాలువాలు కప్పి సరసభారతి పుస్తకాలను ,గురజాడ ఫోటో ఉన్న జ్ఞాపికలను అంద జేశారు .కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి కార్య క్రమాన్ని ఆసాంతం పర్య వెక్షిస్తూ నిర్వహించారు  గ్రంధాలయ వారోత్స వాల సందర్భం గా పుస్తకావిష్కరణ జరగటం మర్చి పోరాని సంఘటన  అని అందరు మెచ్చుకొన్నారు .దుర్గా ప్రసాద్ పుస్తకాన్ని సమీక్ష చేస్తూ ,పరిచయం చేశారు .

                              పుస్తక పరిచయం

             ఇందులో పద కొండు కద లున్నాయి ఏకాదశి విష్ణువుకు ప్రీతీ కరమైనది కనుక అన్నే కధలున్డటం బాగున్నది .ఇవన్నీ శ్రీ కృష్ణుని జీవితం తో భక్తుల జీవితం తో ముడి పడి ఉన్న కధలు .భక్తీ ,ఆర్తి రంగరించి రాసినవి .శ్రీకృష్ణుని స్నేహితులు బాల్య సఖులు ,ఆయన్ను ఆరాధించే వారు ,ఇష్ట సఖులు వారి అంత రంగాల ఆవిష్కరణ,నిష్కల్మష మైన ప్రేమ చిప్పిలే కధలు రచయిత మనల్ని ద్వాపరం లోకి తీసుకొని అన్నీ చూపిస్తాడు చక్కని ప్రకృతి వర్ణన ఉంది .చిన్నపిల్లలు హాయిగా చదువు కొనే కధలు .

                 మొదటి కద శ్రీ కృష్ణుని బాల్య స్నేహితుడు కాలి వైకల్యం ఉన్న ‘’లోట్టాయి ‘’ది ,కాలు లొట్ట పోయిందని, కన్ను లొట్టపోయిందని అంటూంటాం .ఏకం గా వాడి అంగ వైకల్యానికి తగిన లోట్టాయి పేరు పెట్టాడు రచయిత .వాడికి తాడి చెట్లు ఎక్కి, లేత తాటి ముంజలు కోయటం వెన్నతో పెట్టిన విద్య .అవి ఎప్పుడూ కోసి కన్నయ్యకు పెడుతూ ఉంటాడు .అందరితో బాటు చద్ది భోజనాలు తింటూ ,కృష్ణుడు పెట్టిన ఎంగిలి ముద్దలకు పరవశించే వాడు ,ఆ ఎంగిలి చేత్తోనే తాటి ముంజెలు క్కిట్టయ్యక్ నోటికి అందించే వాడు .ఇదే వాడి దిన చర్య .కాళీయ మర్దనం రోజు వీడు కృష్ణుని వెంట వెళ్ళలేదు .ఇంటి వద్దే ఉండి పోయాడు .సంగతి తెలిసి ఆదరా బాదరా తాటి ముజలు కోసి తాటాకు పొట్లం లో కట్టి ,తాబేటి బుర్రలో నీళ్ళు తెసుకొని మడుగు దగ్గరకు పరి గేత్తాడు .కృష్ణుడు అలిసి పోయాడు శక్తి తగ్గి పోయింది ఈ సంగతి యశోద తో సహా ఎవరికీ తోచలేదు .లోట్టాయి కిట్టయ్యకు బుర్ర లోని చల్లని నీళ్ళు తాగించి, లేత ముజలు తిని పించి తేగలు పెట్టాడు .కన్నయ్య పరమానందం అనుభ వించాడు .యశోద లోట్టాయి తెలివికి అబ్బుర పడి వాడిని ఒళ్ళోకి తీసుకొని ముద్దు పెట్టు కొంది .వాడి ఆనందం వర్ననా తీతం .ఎవరూ లోట్టాయిని గేలి చేసే వారు కాదని భగవంతుని దృష్టిలో అంతా సమానమే నని గోపకులు భావించారని చెప్పారు .ఇదే వారి వేదాంతం అన్నారు రచయిత .కన్నయ్య మురళీ నాదానికి ప్రకృతి పరవశించేదని సర్వ జీవులు అందులో తమ ఆత్మలను పరమాత్మలో సన్నిహితం చేసే పరమాద్భుత ద్రుశ్యమని వర్ణించారు ..ఈ కదా లో వాతావరణాన్ని తెలుగు నేల లో కల్పించారు .ఇది సరైనదేనా అంటే పోతన్న గారు కృష్ణుడితో ఊరగాయలు నంజుడు చూపించారు కదా .కధకుని ఊహ కు జేజేలు పలకాలి .ముళ్ళ పూడి వారి ‘’కానుక ‘’కధా  గుర్తుకు తెస్తుంది.

               రెండో కధ కూడా ఊహా  సంచారమే కాని కొన్ని పేర్లకు సార్ధకత కల్పించారు .శ్రీ కృష్ణుడు ‘’శిఖి పించ మౌళి‘’అన్న దానికి ఆ మూడు మాటలను తీసుకొని కధ అల్లారు .శిఖి అంటే నెమలి దానికన్నులు కూడా .నెమలికి తన అందమైన కన్నులను కన్నయ్య పుట్టిన రోజైన అష్టమి నాడు కానుక గా ఇవ్వాలను కొంటుంది .కాని ఒక వర్షం రోజు పరవశించి నాట్యం చేస్తుంటే శిఖి అనే కోయ వాడు దాన్ని బాణం తో చంపేసి,పించాలను కట్టగా కట్టి కృష్ణుడికి కానుక గా ఇవ్వాలనివేల్తుంటే ఒక నాగు బాము కాటుకు చని ఒతాడు .ఇక్కడ రచయిత ప్రకృతి ని ధ్వంసం సహించ రాదని ,  జీవ హింస నేరమని అలా చేస్తే దానికి శాస్తి జరుగుతుందనే సూచన చేశారు .వాడు చనిపోతు ఒక ముసలి బ్రాహ్మణుడు కిట్టయ్య పుట్టిన రోజున ఏదైనా కానుక ఇచ్చి తన దరిద్రాన్ని పోగొట్టుకొందామని వెళ్తుంటే బోయ ఆయన చేతిలో నెమలి ఈకలు పెట్టి తన కానుక గా కృష్ణునికి ఇవ్వమని ప్రాధేయ పడుతాడు మౌళి అలానే చేస్తాడు .యశోద కొడుకు పుట్టిన రోజున బాగా అలంకరించి సిగలో నెమలి పించం పెట్టింది అది సార్ధకమై అప్పటి నుండి ‘’శిఖి పించ మౌలి ‘’అయ్యాడని సమర్ధించారు .

            స్నేహ వాత్సల్యం అనే కధలో శ్రీ కృష్ణ కుచేల కద చెప్పారు .కృష్ణ దర్శనం చేసి ఏమీ అడక్కుండా ఇంటికి చేరిన కుచేలుడికి అష్టిశ్వరాలు కనీ పించి ఆశ్చర్య పోతు ‘’కృష్ణా !అడిగితే అడిగి నంతే ఇస్తావు .అడగక పోతే అంతా ఇస్తావు ‘’అని నవ్వుకున్నాడు అన్న మాటే కదా సారాంశం .నాల్గవకధరుక్మిణిఅలిగింది .పెద్దభార్య రుక్మిణికి తీపి ఇష్టం .అదే కృష్ణుడికీ ఇష్టమని భ్రమ పడుతుంది .అష్టమి నాడు రుక్మిణి స్వీట్లు చేసి తిని పిస్తూ మాగన్ను గా నిద్ర పోయింది సత్య పెరుగన్నం తిని పిస్తుంటే మెలకువ వచ్చి లబలబ లాడింది రుక్మిణి .అందరు నవ్వారు .అందుకని రుక్మిణి అలిగింది రుక్మిణి అలంకార ప్రియ .సత్య కాదు .తన స్వామి ఆరాధనే ఆమె ఊపిరి .ఆమె పెంచిన చిలక కూడా స్వామి పేరు తర్వాత సత్య పేరు పలకాలి .రెండోసారి కృష్ణ శబ్డంవిని పిస్తే సహించదు కృష్ణుడు సత్య తో పెద్ద భార్య ఇంటికి వస్తు సత్య పిరుదు మీద మురళి తో ఒక చిన్న దెబ్బ వేయిస్తాడు సత్యనారాయణ .అది మనకూ ,ఆమెకూ ‘’అమ్మ నీకమ్మనీ దెబ్బ ‘’గుర్తుకు తెస్తుంది .తీపి తింటే లావు ఎక్కరు తీపి జబ్బు వస్తుందనే ఆధునిక యువతి  సత్య .

               రామ చిలుక కద రామావతారం తో ప్రారంభమై కృష్ణా వతారం లో పూర్తీ అవుతుంది .సీతాదేవి లంకలో అశోక వృక్షం కిందశోకిస్తూ ఏమీ తిన కుండా గడుపు తుంటే ఒక చిలుక పండిన పండును ఏరి రోజు తెచ్చి ఆమెకిస్తే అది మాత్రమె టిని ప్రాణాలు నిల బెట్టుకోన్నడనేఊహ చేశారు .

రావణుడు దీన్ని సేవకుల ద్వారా గ్రహించి చిలకను చంపే స్తాడు అది ‘’రామా  రామా !చనిపోయి సీతాదేవి ఒడిలో పడింది .ఈ విషయాన్ని రావణ వధానంతరం అయోధ్యలో పట్టాభి షేకం తర్వాతా రాముడికి సీత చెప్పింది అప్పుడు రాముడు ‘’రా బోయే కాలం లో శుక మహర్షి గా ఆ చిలుక జన్మించి భాగవత కధను విని పిస్తాడని ఆ చిలుక ‘’రామ చిలుక ‘’గా ప్రశిద్ధ మావు తుందని చెప్పాడు .కృష్ణా వతారం  లో ఒక చిలుక పండిన పండ్లను గుర్తించటాని పల్లనన్నిటినీ కొరికి కొరికి ముక్కు ఎర్రబడి రక్తం కారుతోంది .చివరికి పండిన పండును  యెర్ర ముక్కు తో కరిచి కృష్ణుడి పాదాల దగ్గర కానుక గా జార విడి చింది .కృష్ణుడు దాన్ని ఎత్తుకొని ముద్దు చేశాడు ‘’పక్షి జాతికి గర్వ కారణ మైన నీ విరిగిన వంకరముక్కు నీకు మరింత అందాన్నిచ్చింది నీకు  భవిష్యత్తు ను చెప్పే విద్య అలవడుతుంది .రామావతారం లో నేనిచ్చిన  వరంగా రామ చిలుక వై యెర్రని ముక్కుతోశోభిస్తూ ,శుక మహర్షి గా అవత రిస్తావు ‘’అని దీవిన్చాడని చక్కని ఊహ చేసి రాశారు .అసంబద్ధం అని పించినా భక్తికి ఏదీ అసాధ్యం కాదని సరిపెట్టుకోవాలి .

            అన్నా అన్న కధలో శ్రీ కృష్ణుడు రుక్మిణికి వస్త్రాపహరణం సమయం లో అనంత మైన చీరాల నిచ్చే సందర్భానికి ఒక కధ సృష్టించారు .ఒక సారి ద్రౌపది గంగా స్నానం చేస్తుంటే ఒక ముని గారి కౌపీనం నీటి వేగానికి కొట్టుకు పోతే తనకు ఇంద్రుని భార్య శచీ దేవి ఇచ్చిన దివ్య వస్త్రాన్ని ఆయనకు ప్రదానం చేసిందట .ఆముని ‘’ఆపత్ సమయే అక్షయ మస్తు ‘’అని ఆమె ను దీవించాడు కృష్ణుడు మేఘ మల్హార రాగం ఆలపిస్తే గోపికలు ఒడ్డున పడేసిన వస్త్రాల్ని మళ్ళీ ఒడ్డుకు చేరి వారి మానాలను కాపాడాయని ఊహ చేయటం తమాషా .

                  భామా కలాపం సత్య భామది అయితే వీరు ‘’రాదా కలాపం ‘’కదా రాశారు .శ్రీకృష్ణ మురళీ గానానికి జగతి వెన్నెల రేయి పరవ శిస్తుంటే రాధ మువ్వల తో ఆనంద నృత్యం చేస్తోంది .ఆమె కాళి గజ్జెలు మూడు జారి శ్రుతి తప్పుతోంది .ఆయన మువ్వాలను ముద్దాడి పై ఖండువా పట్టు దారానికి కట్టి దాన్ని తన మోహన మురళికి కట్టి ఆనంద భైరవిని ఆలాపిస్తుంటే రాధ మువ్వ గోపాలుని ప్రేమ తత్వానికి హృదయం ఆర్డర మై రెండు చేతులు జోడించి ,ఆయన మెడ చుట్టూ చేతులు వేసి పరవశించినదన్నది కధాంశం కొందరు మురళికి మువ్వలు కట్టివాయిన్చాతాన్ని కదకు అతికించారు .. .

          నీలి కలువ తాను కూడా తెల్ల కలువల సోయగం పొందాలంటే ఏం చెయ్యాలనే తపన లో గడుపుతోంది తనెవరూ  చూ డటం లేదని కోయరని బాధ గూడు కట్టింది ఆదానిలో ఒక అమావాస్య రోజు తెల్లకలువాలకు చంద్ర దర్శనం లేక నిరాశ పడ్డాయి ముడుచుకు పోయాయి నీలి కలువ పెట్టిన ముద్దులకు కళలు నింపుకొని ఆకశం లో చంద్రుడు వెన్న ముద్దా లా వెలిగాడు .కన్నె ముద్దు లాగా ఉన్నదనుకోంది రాధ .నీలి కలువ ముద్దుల తో చందమామ ముఖం లో మచ్చ ఏర్పడి వింత సోయగాన్నిచ్చింది .ఒక రాజుకు లేక లేక కృష్ణుని దయ వల్ల ఆడ సంతానం కలిగింది ఆమె పేరు నీలిమ  అందాల రాశి అయితే నలుపు రంగు .పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకు రాలేదు . చివరికి ఒక రాకుమారుడు చేసుకోవటానికి అంగీకరించాడు .ఆమె అతన్ని నీలి కలువ తెచ్చి ఇస్తే పెళ్లి చేసుకొంటా నంది.అతడు తిరిగి తిరిగి నీలి కలువ ఉన్న చోటికి ఆమెతో బాటు అందర్నీ తెసుకొని వెళ్లాడు .నీలి కాలువను అడిగిన కారణాన్ని అతడే ఆమెకు చెప్పి ఆశ్చర్యం కలిగించాడు ‘నీకు ప్రకృతి ఇష్టం .నీలాగే నీ ప్రకృతిని ప్రేమించే భర్త కావాలని నీ కోరిక కేవలం ప్రేమిస్త,చాలదు ఆరాధించాలి ప్రకృతి లో మమైక్యం  అయిన వారు పూలు కోయారు ఆ సౌందర్యాన్ని ఆరాధిస్తారు అందుకే నేను ఆ పువ్వు కోయలేదు .అందుకే నేను ఆ పువ్వును కోయలేదు ‘’అని చెప్పాడు .అతని ప్రకృతి ఆరాధనా కు ఆమె సంతోష పడి కౌగిలించుకోన్నది చివరగా రచయిత కొన్ని ప్రక్రుతిసూక్తులు చెప్పి కదముగిస్తాడు .స్తాడు ‘’ప్రకృతి ఉన్నంతకాలం ప్రేమ ఉంటుంది .ప్రేమకు నిరీక్షణ ఉంటుంది .అది రాధలా ఉంటుంది .ప్రపంచానికి రాధ చెప్పే గాధలా ఉంటుంది .ప్రేమకు విషాదం లేదు వినోదం తప్ప .ఖేదం లేదు మోదం తప్ప .శోకం లేదు నాకం తప్ప ‘’ప్రేమే రాధ .ప్రేమ ప్రపంచాన్ని రాధకే రాసిచ్చాడు .

            యశోదకు ఆడ పిల్ల లేదనే బాధ ఉంది బాల కృష్ణుని   ఒక రోజు రాధ ఆడ వేషం వేసి ఒళ్లంతా ముద్దులు కుమ్మరించి అలంకరించింది .అవి ఆయన మెడకు హారం లా ఉన్నది .ముద్దులు మూట కడుతూ ‘’కిట్టమ్మ ‘’అని పించాడు అతడే ‘’కిట్టమ్మా బాల కిట్టామ్మా ‘’అయాడని చక్కని కద అల్లారు ..గోవర్ధన గిరిని గోకులం లోని వృషభ సంతతి కొమ్ముల మీదకు ఎత్తేట్లు చేసి తాటి చెట్టును తులా దండం చేసి కృష్ణుడు ఉపాయతో పైకి లేపాడని దాని కింద గోవులు గోపాలురు హాయిగా సేద తీరి ఇంద్రుని భయం నుండి కాపాడుకోన్నారని ఇది ఆధునిక తులా దండ సూత్రమే నని సమర్ధించారు ‘’గోవర్ధన గిరి ‘’కద లో .చివరి కదా జాంబవతీ పరిణయ శుభ లేఖ .ఇందులో లగ్న పత్రిక రాశారు .జాంబవంతుని గర్వాపహరణం చెప్పారు .జాంబ వంతుడు తన గుహ లో దాచుకొన్న తేనే తుట్టెను కూడా కృష్ణునికి కానుక గా ఇచ్చాడు .జాంబవతి కళ్యాణం జరిపించే వార్తను తుట్టె లోని మధుపాలు వన మంతా తిరిగకళ్యాణ తీపి వార్త ను  చాటింన్చాయట .అందుకే వాటికి ‘’మధు పదములు ‘’-మధుపం ‘’అనే పేరు వచ్చినదని చమత్కరించారు .జాంబవతీ కల్యాణాన్ని తెలుగు ఆచారం ప్రకారం కోయ వారి పద్ధతిలోఅయిదు రోజులు చేయించారు . .

              ఈ కధల్లో కొన్ని ‘’స్వాతి ‘’మొదలైన పత్రిక లలో ప్రచురింప బడి ప్రాచుర్యం పొందాయి .సత్యనారాయణ గారి అనన్య కృష్ణ భక్తికి, ఆయన లో జీర్నించిన శ్రీ కృష్ణ భావానికి ఈ కధలు గొప్ప ఉదాహరణలు .అందరు చదివి ఆనందించాలని కోరుతున్నాను .’’చినుకు ‘’మాస పత్రిక ఈ పుస్తకాన్ని అత్యంత మనోహరం గా అందం గా ప్రచురించి శ్రీ కృష్ణ మొహనత్వాన్ని కలిగించింది . .

               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-11-12- ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.