కాశీ ఖండం – 10 గృహ పతి అగ్ని దేవుడుగా మారటం

   కాశీ ఖండం – 10

                                                గృహ పతి అగ్ని దేవుడుగా మారటం

తమ పుత్రుడు గృహ పతికి అరిష్టం సంభవించే సూచనలున్నాయనినారద మహర్షి  చెప్పి నందుకు తలిదంద్రులైనవిశ్వానరుడు ,సుచిష్మతి తీవ్ర అందోళనపడ్డారు .అదే విషయం ఒకరికొకరు చెప్పుకొంటూ నిద్రలోనూ పలవరిస్తున్నారు .శివుని తలచుకొంటూ మార్కండేయుని మరణాన్ని ఆపావు నువ్వు మ్రుత్యున్జయుడవని అందరు అంటారు మాకీ శిక్ష ఏమిటి అని వాపోయారు .ఒక రోజు కొడుకు అర్ధ రాత్రి తలి దండ్రుల రోదనకు మెలకువ వచ్చి దుఖానికి కారణం అడిగాడు .,వారు వివరం గా చెప్పారు .అతడు ‘’వరాకినిని , చంచల మైన పురుగు ఏమి చేయ గలదు ?నేనిప్పుడే ప్రతిజ్ఞచేస్తున్నాను .మీ కుమారుడి నైన నేను నా మృత్యువుకు కారణ భూతం అవుతున్న విద్యుద్వహ్ని ని నాశనం చేస్తాను ‘’అన్నాడు .వారా మాటకు పరమ సంతోష పడ్డారు ..శివుని మహిమలను గుర్తు చేశారు .శ్వేత కేతువు కాల పాశ బద్ధుడైతే త్రిపురాన్తకుడైన శివుడే రక్షించాడని ,పాల సముద్ర మధనమప్పుడు పుట్టిన హాలాహలాన్ని కంఠము  లో దాచి లోకాలను రక్షించాడని మూడు లోకాల సంపదను హరించి విర్ర వీగిన అందకాశురుడిని హత మార్చాడని బ్రహ్మాదులను సైతం తన కంటి చూపు తో భయ పెట్టె మన్మ దుడిని మూడోకంటి తో భస్మం చేసి, అనంగుడిగా చేశాడని శివుడు బ్రహ్మ ఇంద్రాది దేవతలకే అది  పతి అని చెప్పి శివుని శరణు వేడి అనుగ్రహం పొందమని హితవు చెప్పారు కుమారుడైన గృహ పతికి

                గృహపతి వెంటనే బయల్దేరి కాశీ పట్నం చేరాడు .అది గంగా నది మణి హారం లాగా ప్రకాశిస్తోంది తెల్లని మంచుతో కప్పబడి సత్వ గుణ లక్షణం తో కనీ పించింది మణి కర్ణికా ఘట్టం చేరి గంగా స్నానం తో పునీతుడై ,విశ్వేశ్వర దర్శనం చేసుకొన్నాడు ఆజ్యోతిర్లిన్గాన్ని దర్శించి ధన్యుదయాడు .మూడు లోకాల సారమంతా ఈ లింగాకారం లో ఉంది  .క్షీర సముద్రం నుండి ఆవిర్భా వించిన అమృత భాండమిది .బ్రహ్మానంద దాయకం .నిరాకార బ్రహ్మం సాకారం గా విశ్వేశ్వర లింగం లో కనీ పిస్తుంది .బ్రహ్మాండ భాండం లోని రత్న సమూహామీ లింగం .మోక్ష వృక్షం యొక్క తియ్యని ఫలం .మోక్షం అనే మల్లికా కుసుమాల మాల .మోక్ష ధనాన్ని చేకూర్చేది .సంసారం అనే చీకటి ని పోగొట్టే వజ్రాయుధమైన సూర్య బింబం .కళ్యాణ రమణి అలంకరించుకొన్న శృంగారపు అద్దం .దేహ దారుల సమస్త కర్మ బీజాలను పండించే బీజ పూరం .విశ్వం లోని కర్మ బీజాల నన్నిటిని లయం చేసి ,మోక్షమిచ్చే విశ్వ లింగం ..తన అదృష్టం నారద మహర్షి హెచ్చరిక వల్ల తాను కాశీ చేరి ఇంత మహాద్భుత శివ లింగాన్ని దర్శించగలిగానని సంబర పద్డాడు విశ్వేశ్వరుని అభిషేకం చేసి ,నీలోత్పలాల తో పూజ చేశాడు .

               ఒక శివ లింగాన్ని ప్రతిష్ట చేసి ,కంద మూలాలను తింటూ రోజూ వెయ్యి ఎనిమిది పుష్పాలతో పూజిస్తూ ఆరునెలల పది హేను రోజులు గడిపాడు .రాలిన ఆకులను మాత్రమె భక్షిస్తూ ,జలం మాత్రమె త్రాగుతూ మరో ఆరు నెలలు ఆ శివలింగానికి పూజ జరిపాడు .ఇలా రెండు సంవత్స రాలు తీవ్ర ధ్యానం చేశాడు .అప్పుడు అతనికి పన్నెండవ ఏడు వచ్చి ,నారదుడు చెప్పిన గండం సమీపించింది

               వజ్రాయుధం తో ఇంద్రుడు వచ్చి గృహ పతి ఎదుట ప్రత్యక్ష మైనాడు .వరం ఇస్తాను గ్రహించామన్నాడు .గృహ పతి ‘’నీ వరం నాకక్కర లేదు .నాకు వరం ఇవ్వాల్సిన వాడు శంకర మహా దేవుడొక్కడే ‘’అని కరా ఖండీ గా చెప్పాడు .దేవేంద్రుడు ‘’నా కంటే శంకరుడు అంటూ వేరే లేడు .నేనే దేవ దేవుడిని వరం కోరుకో ‘’అన్నాడు గృహ పతి‘’అహల్యా జారుడివి నువ్వు .నేను పశు పతిని తప్ప వేరొకరి నుండి వరాన్ని గ్రహించను ‘’అని చెప్పేశాడు .కోపా వేశం తో ఇంద్రుడు వజ్రాయుధం ఎత్తిఆ బాలుని మీదకు వచ్చాడు .ఆ  హఠాత్ సంఘటనకు పశుపతి మూర్చ పోయాడు .వెంటనే మహా శివుడు ప్రత్యక్షమై బాలుని శరీరాన్ని స్పృశించాడు .బాలుడు లేచి కూర్చున్నాడు .శ్రుతి వాక్యాలు ,గురు వాక్యాల వల్ల  వచ్చింది శివుడని గ్రాహించాడు . ఆ ఆనంద పార వశ్యం లో ఆయనకు నమస్కరించటం ,స్తోత్రం చేయటమే మర్చి పోయాడు .అప్పుడు గౌరీ పతి గృహ పతి తో ‘’ఇంద్రుడిని వజ్రాయుధం చూసి నువ్వు భయ పడ్డావు ..అది కాని ,యముడు కాని నిన్నేమీ చేయలేరు .నేనే ఇంద్రుని రూపం లో వచ్చి నిన్ను భయ పెట్టాను .నేను నీకు వరమిస్తున్నాను .ఇప్పటి నుంచి నువ్వు ‘’అగ్ని ‘’అనే పేరుతో పిలువబడతావు .నువ్వు దేవతలకు ముఖం గా ఉంటావు .అన్ని జీవ రాసుల జఠ రాలలో నివ శిస్తావు .దేవేంద్ర ,యమధర్మ రాజుల మధ్య ఉన్న దిక్కుకు నువ్వు అధిపతివి అవుతావు .నువ్వు స్తాపించిన ఈ లింగం ‘’అగ్నీశ్వరుడు ‘’అని పిలువ బడ తాడు ఈ లింగం అన్ని లింగాల కంటే తెజస్వంత మైనది .దీన్ని అర్చించిన వారికీ విద్యుత్ వల్లా ,అగ్ని వల్లా భయం ఉండదు .అగ్ని మాన్ద్యభయం ఉండదు .అకాల మరణం రాదు .సర్వ సమృద్దినిస్తుంది నీ భక్తులు ఎక్కడ మరణించినా అగ్ని లోకం చేరతారు .తిరిగి కాశీ నగరం వచ్చి ,కల్పాంతం లో మోక్షాన్ని పొందుతారు .అగ్నీశ్వరుని అర్చించిన వాడు అగ్ని లోకం చేరుతాడు .అతని పితృ దేవతలు కూడా తరిస్తారు ‘’అని చెప్పి శంకరుడు అదృశ్యమైనాడు .గృహపతి అయిన అగ్ని తల్లి దండ్రులు చూస్తుండగానే దేవ విమానమెక్కి ఆగ్నేయ దిశకు వెళ్ళాడు .శివుడు అగ్నిని ఈ దిశకు అది పతి గా అభిషేకించాడు శివుడు ఆగ్నేయ లింగం లో ప్తతిష్టిత మై, భక్తుల కోర్కెలను తీరుస్తున్నాడు .ఈ విషయాలన్నీ విన్న శివశర్మ ,భర్త అగస్త్యముని వల్ల విన్న లోపాముద్రా దేవి పరమానందం అనుభవించారు.

                     సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-11-12-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.