గొల్లపూడి కదా మారుతం — 1 మొదటి కద –రోమన్ హాలిడే

           గొల్లపూడి కదా మారుతం — 1                                                            

                                               మొదటి కద –రోమన్ హాలిడే

   ‘’ ప్రతి రచయితకు తనదైన ధోరణి ఉంటుంది .శైలి ఉంటుంది .కాని ,ప్రతి కదా లోను కొత్త ధోరణి ,కొత్తదనం చూపుతూ ,కదానికా రచన లో కొత్త ప్రయోగాన్ని చేశారు సుప్రసిద్ధ కధకులు ,నవలా రచయిత ,నాటక రచయితా ,నటుడు,రేడియో ప్రయోక్త ,ఆదర్శ జర్నలిస్టు ,సినీ నటనలోనూ విలక్షణ నటుడై  సంభాషణా చతురుడు అయిన శ్రీ గొల్లపూడి మారుతీ రావు ..నిత్య జీవితం లో మనం చూసే సంఘటనలలో ,మనం చూడని అందమైన కోణాన్ని సరళం గా ,సరసం గా ,ఆవిష్కరించే నేర్పు మారుతీ రావు ది .అచ్చమైన తెలుగు దానానికి ,అపురూప మైన కదా రచనకు ,అందమైన ప్రతి నిధులు గొల్లపూడి గారి కధలు .అందర్ని ఆకర్షించే రస గుళికలు ‘’అన్న మున్నుడి అక్షర సత్యం .అది ఒక లోకం .ఆ లోకపు గవాక్షం తీయటమే ఆలస్యం అలా అలా వెళ్లి పోతూనే ఉంటాం .ఆ భాషకు భావనకు ,శైలికి ,జీవన సత్యాలకు ,సత్య శోధనకు ,శిల్పానికి ముగ్ధుల మై పోతాం .అదొక రస గంగా ప్రవాహమే .ఓలలాడటమే మన వంతు .అన్నీ పరిణతి చెందినా రచనలే .మార్గ దర్శనం చేసేవే .పరి పక్వత సాధించిన కదా ప్రపంచమే ఆయనది .ఊహలోనైనా ఆకాశాన్ని భూమికి అందం గా దింప గల చాతుర్యం ఆయనది తెలుగు కదానికా రచయితలలో అగ్రేసరుల స్తాయి లో నిలువ దగిన పటిమ ,ప్రతిభ ,ప్రాభవం ఉన్న రచయిత .

 

                మనం చెప్పుకోవాల్సిన మొదటి కద –‘’రోమన్ హాలిడే’’ .అంటే విలాస వంతం గా ,ధీమాతో ,రొమాంటిక్ గా చాలేన్జీ గా ,లక్ష్యం లేకుండా బే ఫర్వాగా ,ఖాళీగా గడపటమే రోమన్ హాలిడే అంటే .ఇందులో తనే పాత్ర దారి సూత్ర దారీ -ఇతరులేమైనా ఫర్వ లేదు వాళ్ళ మనో భావాలకు విలువ లేదు సరదా దురద తీరటమే .జాలీడే ,హాలీడే .సాధారణం గా ఈలక్షణాలు మగ వారిలోనే  ఎక్కువ గా ఉంటాయి .దీని పై సవా లక్ష కధలు చదివాం .మరి ‘’ఆ కోతి లక్షణం ‘’ఆడదానికే ఉంటె ?మగ వాడివరికి చెప్పుకొంటాడు ?ఈ అధునాతన ఫాషన్ యుగం లో జల్సా చేయాలని ,అదీ –మగ వారి పొందుతో ఆడుకోవాలనీ అదొక చాలేన్జీ గా తీసుకొన్న అధునాతన నారీ మనో వ్యాపారమే భౌతిక ,మానసిక వ్యభి చారమే ఈ కధకు మూలం .ఢిల్లీ లాంటి మెట్రో లలో బాగా డబ్బు తో మదించిన’’ పోష్’’ మనుష్యులలో ఈ భావం ఆడ వారికే వస్తే ,వారి వింత ప్రవర్తన ఎలా ఉంటుందో అద్దం పట్టే కద ఇది ‘’అని అతన్ని గురించి వర్ణిస్తాడు గొల్ల పూడి .ఉన్నంతలో పైలా పచ్చీస్ గా గడపాలనే సిద్ధాంతం అతంది .తండ్రి చావు బాబాయి కి లభిస్తే ,ఆ బాబాయి ఇచ్చే పదో ,పరకో ,’’శివాయ ‘’కూ లాభించింది .అందుకని ,నిరుద్యోగమే ఉద్యోగం గా ,బతుకుతున్నాడు .ఉద్యోగం కోసం ధిల్లీ చేరి ,బంధువుల ఇంట్లో ఉంటున్నాడు .ఒక రోజు సాయంత్రం ధిల్లీ లో కన్నాట్ సర్కస్ మలుపు లో నించొని ఉన్నాడు .ఇంతలో ఒక ఓడ లాంటి కారు లోంచి మీగడ లాంటి ,వెన్నెల నీడ లాంటి అందమైన అమ్మాయి తొంగి చూసి ‘’హే-యూ ‘’అన్నది .పక్కన ఇంకో పిల్ల కూడా ఉందని గమనించాడు .

 

                   ‘’నమశ్శివాయ కురూపి కాదు .పంజాబీ అబ్బాయిలతో పోటీ పడే నల్లటి బారు మీసాలు ,,అంతటి భుజ స్కంధాలు ,వడ బోసిన కాఫీ లాంటి చామన ఛాయా శరీరం ,నిలువెత్తు నిటారు విగ్రహం .ఉద్యోగం అప్ప్లికేషన్లకి ఖర్చు పెట్టగా మిగిలిన డబ్బుతో బట్టల్ని చలువ చేయించుకొని ,చలువ జోడు పెట్టు కొని ,చల్లగా కనీ పించటం హాబీ గా కల వాడు.అదృష్టం తలుపు తట్టిన్డను కొన్నాడు .ఇంగ్లీష్ రాదు కాని ‘’సినీమా హిందీ మాత్రం ‘’వచ్చు .ఆమెను చూసి ‘’క్లోరోఫాం ‘’ఇచ్చిన వాడిలా రిచ్చ పడ్డాడు .సైగాల్తోనే కారేక్కాసేశాడు .ఆమె ప్రక్కన కూర్చున్నాడు .’’ఆమె బుజాలు మగ్గిన దోస పళ్ళు లాగా మిస మిస లాడుతూ న్నాయి ‘’బ్లౌజు బ్రేసరీ కన్నా కాస్త పెద్దదిగా ,జాకెట్టు కన్నా కాస్త చిన్నదిగా ఉండి .ఇరవైవ శతాబ్దపు సంస్కారం ఆమె చేతుల మీంచి బుజాల వరకు వచ్చి ఆగి పోయిందట .గిడస బారిన గడ్డి పూవు లాగా ఉందట .ఆమె ఒళ్ళోబతికే అదృష్టానికి ,తన జీవితాన్నంతా పణం గా పెట్ట వచ్చు ననుకొన్నాడు పాపం .ఆ ఇద్ద రాడాళ్ళుమాట్లాడే భాష తెలీదు కాని ,వాళ్ళ కళ్ళ బాస తెలుసు .

 

              తన పేరు ‘’మీనూ ‘’అంది .కంఠం. మెత్తగా రెండు తలగడ ల కింది నుంచి బయటికి వస్తున్న ఊపిరి లాగా ఉంది ..ఊపిరికి కూడా సెంటు పూసి నట్లుంది .కారు మాత్రం జర్రున పాకుతూనే ఉంది మనుషుల మధ్యలోంచి .’’పుట్ట మరచి పోయిన బద్ధకపు పాములా ‘’డ్రైవరు మాత్రం స్తిత ప్రజ్నుడిలా ,కారులో జరిగే అపూర్వ మానసిక సంఘర్షణ తో తన కేమీ ప్రమేయం లేకుండా తోల్తున్నాడు .ఆమె మాత్రం నమశ్శివాయయ ను ‘’ఉద్యోగిని క్షమించిన అధికారి  లాగా‘’కాళ్ళ చివర్నించి నవ్వింది .ఆమె పెదాలు సగం కొరికిన జామి పళ్ళు .వల్లే వాటు రెండో ‘’శిఖరాన్ని ‘’తప్పించుకొని మధ్య నుంచి పారుతున్న సెలయేటి లాగా ,వక్షోజాల మధ్య ఒరిగి పోయింది .’’గుండె ఎగరటం చూసి ,ఆమె కూడా తన లాగా వణుకు తోందేమో నని భ్రమ పడ్డాడుపాపం ప్రేమ పిచ్చోడు అర్ధమైందా అన్నట్టున్న ఆమె నవ్వుకు .అర్ధమైన్దన్నట్టున్న అతని నవ్వే సమాధానం .కారు ఎయిర్ పోర్ట్ క్వార్టర్లు దాటి,ఒక బంగ్లా ముందు ఆగింది .దిగమంటే దిగాడు .ఆ బంగ్లా ఎవరో పైలెట్ ఆఫీసర్ ది అని గుర్తించాడు .హాలులోంచి గదిలోకి చేరారు .ఆమె పచ్చని రూపానికి అతని కళ్ళు తిరిగి పోతున్నాయి .చెమటలు పడుతున్నాయి .ఒక అపూర్వ తల్పం పై నమశ్శివాయ ను కూర్చో బెట్టి పానీయం ఇచ్చింది .అతనికే రంగు ఇష్టమో అడిగి ,గులాబీ రంగుతో గదంతా నింపింది .గులాబి అత్తరు చల్లింది ,గులాబీ రంగు నైట్  గౌన్ వేసుకోంది .క్షణం లో రోజ్లావెండర్ బరువైన వాసనలు తియ్యటి అనుభావాల్లాగా వాళ్ళిద్దర్నీ పెన వేశాయి .అతని సహాయం తో గౌను కూడా తీసే సింది .ఆమె నడుం ఆధారం గా ఒక సారి ఉంగరం లా ,తిరిగి అతని ఒళ్ళో వాలింది .ఆ సౌందర్యపు పలకరింతకు అతనికి మనసు వశం తప్పింది .’’లైట్లు ఆర్పనా? అన్న మాట ను అతను ఆమె పెదాల దగ్గరే కోరికే శాడు ‘’‘’ఆతర్వాత వారిద్దరికి మాట్లాడే తీరికే లేదు .

              తెల్లారింది .తెలివచ్చి నమశ్శివాయ చూస్తె మీనూ లేదు .మీనం లాగా జారిపోయింది .యేవో అస్పష్టం గా మాటలు విని పించాయి ‘’ఉదయం –ప్లేన్ –సాబ్ –కారు రెడీ ‘’అన్న డ్రైవరు గొంతు ‘’అలాగే కానీ ‘’అన్న మత్తుగా ఉన్న ఆడ గొంతు విన్నాడు .మత్తు లోంచి తేరుకొని గది బయటికి చేరాడు .రెడీ గా ఉన్న కారు డోర్ తీసి నమస్శివయను లోపలి తోసి డ్రైవర్ కారు పోనిస్తున్నాడు .ఆ చేతిలో అధికారం లేదు ,క్రౌర్యం లేదు ,కానీ కర్తవ్యమ్,కార్య దీక్షా ఉన్నాయి అంటాడు రచయిత మారుతీ రావు .కన్నాట్ సర్కస లో తన పాత జీవితం దగ్గర కారు ఆగింది ‘ఉ ఠో’’అన్నాడు కారు చక్రధారి .సినిమా అయినతర్వాత ఇంకా సీట్లో కూర్చున్న ప్రేక్షకుడిని గేటు వాడు బెదిరించిన మాటలా ఉన్నదటట .దిగ గానే జర్రున జారి పోయింది కారు .రోజ్ లావెండర్ వాసన మాత్రం వదల్లేదు నమశ్శివాయ ను . .

               అంత క్రితం సాయంత్రం మీనూ ,నీలాలు పందెం వేసుకోన్నారట .’’ఆడ దాని అందానికి తల వంచటం ఎలాంటి మగాడి లో నైనా కన్పించే బలహీనత ‘’అని మీనూ అంటే ,’’అలా తల వంచి నట్లు కనీ పించటమే అతని బలం కూడా ‘’అని నీలూ అనాగా  మాటా మాటా పెరిగింది .’’ఇరవయ్యవ శతాబ్దపు నగర సంస్కారం లో పీకల లోతుకు మునిగిన అమ్మాయి –మాట దక్కించు కోవాలనే పైశాచిక స్వాభి మానం తిరగ బడ్డప్పుడు జరిగిన కార్య క్రమమే ఈ సంఘటన అని నేను చెప్పదలచుకో లేదు ‘’అంటాడు కధను ముగిస్తూ కధకుడు మారుతీ రావు .’’పాపం ఆశ చావని నమశ్శివాయ అనే చేవలాయ మర్నాడు దారి వెతుక్కొంటూ ,ఆ బంగ్లా చేరితే ,గేటు దగ్గర గూర్ఖా అతి క్రూరం గా పోమ్మన్నాడని ,ఓడ లాంటి నిన్నటి కారు నీడ లో డ్రైవరు బీడీ కాల్చుకొంటు కూర్చున్నాడని ,ఆ పోర్టికో లో నే తుపాకీ ని పాలిష్ చేస్తూ పచార్లు చేస్తున్న బారు మీసాల వ్యక్తిని ఆశ్చర్యం గా చూస్తూ నమశ్శివాయ వెనక్కి తిరిగోచ్చాడని‘’నేను అస్సలు చెప్పను ‘’అని గొల్ల పూడి అన్నా ,నేను మీకు అంతా చెప్పేశాను .ఇదీ మన నవ నాగరిక సంస్కృతీ సభ్య సమాజమూ .ఇక్కడ జరిగేది విలువల వలువ లూడటమే .సద్యో భావాల రేతస్కలనమే .వివేకం లేని వింత మనస్తత్వాల కేళీ రతి యే .ఆట గాయి తనమే .వచ్చిన చాన్సు ను వదులు కోరాదన్న తపనే నిలకడ లేని ఆలోచనా ప్రవాహమే .ఆరాటమే .ఇవన్నీ మనల్ని శాసిస్తున్నాయి .ఆ ఉచ్చులో ప్రతి వాడు పడి ఊబిలో దిగి పోతున్నాడు .ఎవరు ఉద్ధరించాలిఈ శిధిలా సంస్కృతిని ?దీనికి నిష్కృతి ఏదీ /ఇన్ని ప్రశ్నలనుమన ముందుంచే కద ఇది .’’Be a Roman in Rome ‘’అన్నారు .కాని Be a Roman in India ‘’కాదు మన ఆదర్శం .రోమియో బతుకు నీచం ,భ్రష్టం .అంతా దిగ జారుడే అయితే పునరుత్థానం ఎప్పుడు ?

                ‘’అదృష్టం అంటే అంత నమ్మకం లేదు నమశ్శివాయకు ‘’అని కద ప్రారంభిస్తాడు గొల్లపూడి .’’ఇంకా ఆసక్తీ ,ఆకలీ తీరక ,ఆ బంగ్లా చేరాడు ‘’అని ముగిస్తాడు ఈ మధ్యది అంతా మానసిక సంఘర్శణే.మనస్తత్వాల ఆవిష్కరణే..ప్రతి మాటా అనుభవపు ఊట .కల్పనా లా ఉన్నా ,మెట్రో లలో నిత్యం జరిగే ‘’నీలి కధే ‘’దోబూచు లాటలే  .మనసునుకట్టేసి శరీరం తో ఆడుకొనే కామ కళాకేళియే .అద్దం పట్టి నట్లు రచించాడు గొల్లపూడి మారుతీ రావు .ఇలా జరుగుతుందా అని ఆశ్చర్య పోనక్కర్లేదు వాస్తవ చిత్రీకరణమే ఈ కద .

                ఇంకో కద తో మళ్ళీ కలుసు కుందాం

       సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-11-12-ఉయ్యూరు 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.