గొల్లపూడి కధా మారుతం –3
పాలు విరిగాయి –కొనసాగింపు
సుశీల అమ్మా బామ్మ చని పోయారు .చెల్లి శాంత ‘’పెల్లివారోచ్చారు ‘’అని చెప్పిందొక రోజు .తనకే అనుకొని‘’తండ్రికి ‘’అని విని ,దిమ్మెర పోయింది ‘’పాపం ఈ సుశీల పెళ్లినిగురించి ఆలోచించింది కాని ,చేసుకొనే మనుష్యుల గురించి ఆలోచించ ఆలోచించ లేదు .మామిడి పండు తియ్యగా ఉంటుందని తెలుసు ,దానికి కారణ మయిన మామిడి చెట్టు సంగతి తెలీదు ‘’అంటాడు రచయిత మారుతీ రావు .మూలం లోకి తొంగి చూసి జీవిత సత్యాన్ని చెప్పే మాట లాగా అని పిస్తుంది .ఆ యింట వంట బట్టిన ఊత పదం తోనే అంటే ‘’ఆ ! నాకు పెళ్ళేమిటే?అందులోను ఈ వయస్సు లో‘’అంటూనే తండ్రి పెళ్ళి పీట ఎక్కాడు .పెళ్లి లో ఎవరో సుశీలనడిగితే నవ్వేస్తూ ‘’నా పెళ్ళా !సరేలే అత్తయ్యా !’’అంది .’’ఇప్పటికైనా జరిగితే అదృష్ట వంతు రాలినే అన్న పిచ్చి ఆశ ,జరుగుతుందా /అన్న బలహీన పు అనుమానం ఆ మాటల్లో ప్రతిధ్వనించింది ‘’అవకాశాలు తగ్గుతూ వస్తున్న సూచనలూ ,నిర్లిప్తతా సూచిస్తోందీమాట .
‘’ఆ !నా పెండ్లికేం పోనిస్తూ ‘’అనడం తప్పని సరిగా ఇష్టం లేక పోయినా ఇప్పుడు ఫేషన్ చేసుకోందిసుశీల .’’అలా అనడం నాకో ఫేషన్ అయింది ‘’అని ఇవాళ ఈ 32వ ఏట మరో వాక్యం గా కూడా చేరుస్తోంది .పాలు విరిగి పోతే ఎందుకు విరిగి పోయాయో ,విరిగి పోయిన పాలు ఏం చేస్తున్నారో తనిఖీ చేసే ఉద్యోగం లో చేరిందిప్పుడు .ఆమె మనసులో ‘’విరిగి పోయిన జీవితం నాది .కరగి పోయిన యవ్వనం నాది కరగి పోయిన యవ్వనం ఏమవుతుందో నాకు తెలుసు .విరిగిన పాలు రసగుల్లాలవుతాయి .విరిగి పోయిన యవ్వనం ఏమీ కాదు ‘’అనుకుందా మని అనుకుంది .అనుకొని నవ్వుకుంది .వృధా అయిన యవ్వనం ఎందుకూ కొర గాదనే దృఢ మైన భావం మనసులో గాఢం గా నిలిచి పోయింది ..ఉద్యోగం లో మాత్రం పాలకు పరిష్కారం ఉంది .నిజ జీవితం లో విరిగిన యవ్వనానికి పరిష్కారం చూసుకో లేక పోయింది .ఇలా వృధాగా మిగిలి పోవాల్సి వస్తుందనే బాధ ఆమె గుండె నిండా చేరింది .పరిష్కారం తన చేతుల్లోనే ఉండి జారి పోతోంది ఎప్పటి కప్పుడు .పాపం సుశీల .ఆమె తండ్రి రెండో పెళ్ళికి హర్షించని క్లేయింటులు మాత్రం ‘’ఇంట్లో చెట్టంత పిల్లను పెళ్ళికి ఉంచుకొని ,తాను పెళ్లి చేసుకొని కులుకు తున్నాడు ‘’అని భావించి కొందరు కొత్త ప్లీడర్ల దగ్గరకు జంప్ జిలానీ లయ్యారు
ఇంట్లోకి కొత్తగా వచ్చిన మారుతి తల్లి తనంత వయసు లో ఉన్న సుశీల ,శాంతల్ని రెండు కళ్ళు లాగా చూసుకొని అభిమానం సంపాదించింది .ఆమె కూడా ‘’నాదే ముందమ్మా !బీద కుటుంబం నుంచి వచ్చాను .మీ మధ్య ఉంటూ రోజులు గడుపు కొని ఆయన ముందే సుమంగళి గా వెళ్లి పోతాను .నాకేమీ వద్దు ‘’అని చెప్పటం అల వాటు చేసుకోంది .వీళ్ళకీ ఆమె పై సాను భూతి కలిగింది .అసూయని దరికి రానీ కుండా ‘’అలీ వేలు ‘’తన పాత్రను పోషించింది .అయితే ఆమె మనసు లో భావం వేరు .’’ఆయన ప్రాక్టీస్ తగ్గింది .శాంత పెళ్లి చేసి పంపిస్తే ,తనకు పుట్టే పిల్లలకు తిరుగుండదు .సుశీల ఆర్జన వేన్నీల్లకు చన్నీళ్లకు తోడుగా ఉంటుంది ఆమె పెళ్లీడు ఎలానూ దాటి పోయింది .దీప ముండ గానే ఇల్లు చక్క పెట్టుకోవాలి’’ .ఎవరి ఎత్తులూ ప్రయత్నాలూ వారివి .’’తన ‘’తర్వాత ‘’పరం ‘’అని బాగా వంట బట్టిన మధ్య తరగతి రెండో పెళ్ళాం ఆమె .అంత కంటే ఇంకా ఎలా బాగా ఊహిస్తుంది ?నిత్యం చూస్తున్న తంతే అది సుశీల జీవితం ఇప్పుడు ‘’బంతి ఆటే ‘’ఆడే వారి ఇష్టం .ఆమె నిమిత్త మాత్రం ‘’జరిగిన కద ‘’సినిమా తంతు .
భర్త ను ‘’శాంత కు సంబంధం చూడండి ‘’అని పోరాటం ప్రారంభించింది .ఆయనా సంతోషించాడు .అనుకూల వతి అయిన భార్య ,తన పిల్లల్ని అభి మానించే తల్లి తనకు దొరికి నందుకు .’’సుశీల పెళ్లి మాటేమిటి ‘’?అని ఆయన అడగనూలేదు అడుగుతాడని ఆమె అనుకోనూ లేదు .ఈ విధం గా సుశీల పెళ్లి ఆమె జీవితం లోంచీ ,వాళ్ళ ఆలోచనల్లోంచీ జారి పోయింది ‘’అందుకూ సుశీలకు ‘’నవ్వే వచ్చిందట ‘’.అవును స్తిత ప్రజ్ఞత్వం అలవాటై పోయిందిగా .బల వంతపు బ్రాహ్మనార్ధం గా .ఇంట్లో పరిస్తితి తెల్సుకొని ,జీర్ణించుకొని ఒక రోజు ‘’చెల్లీ !నాన్న గారు నీకు డసంబంధం చూస్తున్నారమ్మా .’’అంది ఆరిందాగా .శాంత సిగ్గు పడి నవ్వి ‘’పో అక్కా !నాకు పెళ్ళే వద్దు బాబూ !’’అంది .ఆ మాటకు నివ్వెర పోయిన సుశీల ‘’ఈ మాట ఎవరి తో నన్నా అన్నావాఅమ్మా ?’’అంది లాలనగా .తన గతాన్ని జ్ఞాపకం చేసుకోంది‘’లేదు ఏం ?’’అని అడిగింది చెల్లి ‘’ఎవరి తోను అనకూడ దమ్మా .కొందరు అదృష్ట వంతులకే ‘’వొద్దు అంటే కావాలి అని అర్ధం ‘’నీ లాంటి అమ్మాయికి ‘’వద్దు ‘’అంటే’’ వద్దనే’’ అర్ధం .తెలిసిందా’’ ?అన్నది జీవిత సత్యాన్ని వంటబట్టించుకొన్న వేదాంతి ఉటంకించే ‘’శ్రుతి ‘’వాక్యం .లాగా ..అది బ్రహ్మ సూత్రము కాదు కాదు –‘’బ్రాహ్మ చారిణి సూత్రం ‘’ఎంత అర్ధ మైనా అందులోంచి పిండ వచ్చు .సుశీల మనసు గొప్పది .పేరు ను సార్ధకం చేసుకొనన్న మధ్య తరగతి మహిళా వ్యక్తిత్వం .కనుక చెల్లి పెళ్ళికి అసూయ పడ లేదు .ఈర్ష్య, ద్వేషం లేవు .మనస్పూర్తిగా ఆశీర్వా దించే స్తితికి వచ్చేసింది .జీవితం ఆమెకు నేర్పిన పాఠం ఇది .బాగా వంట బట్టి పోయింది .అంతకంటే తానేమీ చేయ గల పరిస్తితి లో లేదుకూడా .ఎవరి పధ్ధతి వారిది .శాంత కూడాఢ క్కా మక్కీలు తిన్న ఘటం లా’’ఫర్లేదక్కా !జరిగేదేదో జరిగి పోయింది .ఇంతకూ మనకు కావలసిన వాడు ఎక్కడో పుట్టి ఉంటాడు .’’అంది తన లానే .’’చచ్చి పోయిన పాత బామ్మల ఆలోచనలు బతికున్న కొత్తమ్మాయిలలో ప్రతి ఫలించి నందుకు సుశీల నవ్వింది ‘’అంటాడు కదా రచయిత .తరాలు మారుతున్నా భావనా తరంగాలు ‘’సంచితం ‘’లాగా అలా తర్వాతి తరం లో చేర్తున్నాయని భావం
సుశీల శాంత తో గొప్ప వేదాంతి లా ‘’అవునమ్మా !పుట్టే ఉంటాడు .నేనే నీకోసం పుట్టానని చెప్పడు .పెళ్ళయాక ఇతనే నాకోసం పుట్టాడని గుర్తు పట్టగలం .అంతకు ముందే గుర్తు పట్టాలను కోవటం .పట్ట బోవటం ప్రమాదం తల్లీ !పుట్టిన వాడు రాక పోతాడా అని అని ఎదురు చూడటమూ ప్రమాదమే .అప్పుడతను పుట్టి ,పెరిగి తప్పుడు దార్లంట ప్రయాణం చేసే ప్రమాదం ఉంది‘’అమ్మనీ ,బామ్మనీ రాదనీ నవ్వితే ముభావం గా కనీ పించే పెళ్లి కొడుకునీ, గోపాలాన్నీ గుర్తు చేసుకుంటూ చెప్పింది సుశీల .ఇందులో ఆమె అక్క మనసు కన్పిస్తుంది హఠాత్తుగా ‘’మరి నువ్వెందుకు పెళ్లి చేసుకో లేదక్కా ?అని అడిగితే సుశీల ‘’నీకు సలహా చెప్ప టానికి సుశీలక్కయ్య ఉందమ్మా .నాకు అపట్లో హెచ్చరించే వాళ్ళెవరూ లేక పోయారు అందుకు ‘’అందామని అనుకోన్నదిట .కానీ ,మళ్ళీ తన మామూలు మాటగా ‘’ఆ ! నా పెళ్లి కేం పోనిద్దూ‘’!అంది ఎటు వైపో తిరిగి చూస్తూ ,నిర్లిప్తత ,నిస్సహాయత ,నిర్వీర్యతా ఆమాటల్లో ప్రతిధ్వనించాయి .రచయిత మాటల్లోనే ఆమె ఆంతర్యం చూద్దాం ‘’ఈ జీవితానికింకా పెళ్లి జరిగే అదృష్టమా ?’’అన్న నైరాశ్యం తన పెళ్లి మీద తనే శ్రద్ధ చూప లేదన్న పశ్చాత్తాపం ఆ మాటల్లో ధ్వనించింది .’’అని అద్భుతం గా ఫినిషింగ్ టచ్ ఇస్తాడు ఆరుతీ రావు .మొదటి వాక్యం ,చివరి వాక్యం మధ్య ఇంతకద జరిపించాడు .ప్రతి అక్షరంఆణి ముత్యమే .అనుభవ సారమే .మధ్య తరగతి మహిళాజీవిత చిత్రణే .మహా శిల్ప నిర్మాణమే .
పాలకుతగిన వేడి లో తోడు చేరిస్తే తగిన ‘’కాపు ‘’లో అద్భుతం గా తోడుకొని ‘’గడ్డ పెరుగై‘’చిలికితే వెన్న అవుతుంది .ఈ మూడిటి లో దేన్లో లోపం ఉన్నా పాలు నిలవ ఉండి ,విరిగి పోతాయి .అవి పులుపు వాసన వేసి ఎవరికీ ఇష్టం గా ఉండవు .అయితే యే కొద్ది అదృష్ట వంతులకొ విరిగిన పాలనూ రస గుల్లా లా మార్చుకొనే సమర్ధత ఉంటుంది .అలాంటి సమర్ధతా ,అదృష్టం లేని సగటు ఆడ పిల్ల సుశీల .అందుకే ఆమె జీవితం ,ఆశలూ యవ్వనం ముద్దు మురిపెం అన్నీ విరిగి పోయాయి .కలలు చెదిరి పోయాయి ఇంట్లో కూడా ఆమె జీవితానికి సరైన మార్గ నిర్దేశం చేసే పెద్దలు లేక పోవటం ,వాళ్ళు పైకి ఒకటి చెప్పి వేరొకటి చేస్తుండటం అనుకొన్నది సాధించటం తన వంతు వచ్చే సరికి అదంతా తల క్రిందు లవటం ఆమె చేసుకొన్న ,పాపమో శాపమో పరిహారమో .దురదృష్టం ఆమె ను తరిమి తరిమి కొట్టింది ఎవరికీ చెప్పుకోలేని ఆమె సిగ్గూ ,ఏకాంతం ,ఆమె మనో భావాలను గ్రహించే పరిణతి ఉన్న వారు ఇంట్లో లేక పోవటం ఆమెకు శాపాలయ్యాయి ఎక్కడికక్కడ రాజీ పడే మనస్తత్వమూ కొంత కారణం .ఈ విధం గా సుశీల అభాగ్య .పెళ్లి కాని కన్య గానే మిగిలి పోయింది .’’ఆమె ఆశల పాలకు తోడు రాలేదు .అందుకే ఆ పాలూ మురిపాలూ విరిగి పోయాయి ‘’,అని పించింది నాకు .
కధ అంటే ఇదీ అని పిస్తాడు గొల్ల పూడి .కొందరి జీవితాలలో ‘’తధాస్తు ‘’దేవతల ప్రభావం ఉంటుంది .అందుకే మనసులోని మంచి భావాన్ని బయటకు చేప్పా లి .నెగటివ్ భావాన్ని వాచ్యం చేయ రాదనీ పెద్దలంటారు .అలాంటి మాట నోరు దాటితే ‘’బాడ్ టేమ్పర్డ్ గాడ్స్ ‘’తధాస్తు అంటారు .అందుకని వ్యతిరేకమే జరుగుతుందని లోక రీతి .కనుక బయటికి దీవిన్చాటమే కాని తిట్టద్దు అంటారు .మారుతి అంటే ఆంజనేయుని పరాక్రమం వామనత్వం నుండి విశ్వ రూపం దాకా ఎదిగింది .ఈ కధలో మారుతీ రావు రచనలో అలా ఎదిగి పోయాడని పిస్తుంది .విశ్వ కదా విపంచి పై నినదించిన కదా రాగం ఇది .హాట్స్ ఆఫ్ మారుతీ రావు .
మరో కదా తో మళ్ళీ కలుద్దాం
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-11-12-ఉయ్యూరు