గొల్ల పూడి కధామారుతం –5 తాజ్ మహల్ –కొన సాగింపు

   గొల్ల పూడి కధామారుతం –5

 

                                                                                      తాజ్ మహల్ –కొన సాగింపు

 నందా లాల్ ఒక్కొక్కటి చూపిస్తూ ,చరిత్ర చెబుతూ తాజ్ మహల్ బాహ్య సౌందర్యాన్ని వర్ణిస్తూ నడుస్తున్నాడు .’’వాడిని చూస్తుంటే చరిత్ర చేతుల్లో నలిగిపోయిన మొగలాయీ సంస్కృతికీ ,జీవితం చేతుల్లో నలిగి పోయిన నందా లాల్ కీ తేడా లేదని పిస్తోంది ‘’అంతం కాచి వడ పోసిన మాట .అతని యెడల అక్షర సత్యం .పాదుషా శయన మందిరం లోంచి చూస్తె ‘’యమునా నది రాజ వంశాన్ని దీవించే పెద్ద ముత్తైదువు లాగా ‘’కన్పించిందట .’’ఇక్కడే పాదు షాదుషాల విలాసాలకు బీద ప్రజల చరిత్రలు శిధిల మై పోయాయి ‘’అని చారిత్రిక సత్యాన్ని తేల్చి చెప్పాడు .ఇప్పుడైనా అంతే –తేడా ఏమీ లేదు .కాలం మారింది మనుసులు మారారు కానీ మనస్తత్వం అదే మూస లో నడుస్తోంది .నందా లాల్ కొంచెం దూరం గా ఉండగా రచయిత భార్యను దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకొని ,ఆమె ఆశ్చర్య పోతే ‘’ముంతాజ్ షాజహాన్ ల అమర ప్రేమ కు పునాది ఈ గదిలోనే పడింది .ఆ ప్రేమ కు మన శ్రద్ధాంజలి ఇది ‘’అంటే ,ఆమె పగలబడి నవ్విందట .షాజహాన్ ను కొడుకు బంధించక పోతే యమునా ప్రక్కనే మరో తాజ్ మహల్ వేలిసేదట ..తండ్రి ప్రయత్నాన్ని మధ్య లోనే ఆపేసిన కొడుక్కి రచయిత ‘కృతజ్ఞత ‘’అంటాడు .అలా నిర్మిస్తే మొదటి దాన్ని అవమానించి నట్లే అవుతుందట .’’అప్పుడే విరిసిన గులాబి పువ్వు ప్రక్కన ,మరొకటి లేనప్పుడే దాని గొప్ప తనం ..పునరుక్తి నవ్యతను చంపేస్తుంది‘’అనటం నవ్యతా నాణ్యతా తెలిసిన పక్వ మైన రచయిత పలుకు .దానికి తిరుగు లేదు .వ్యర్ధ మైన మాట ఒక్కటీ లేకుండా కవిత్వం చెబితే ఎంతో అద్భుతం అని మెచ్చుకొంటాం .కధలో కూడా ఆ నియమాన్ని గొప్పగా పాటించి అక్షర రమ్యతను చేకూర్చి నిల బెట్టుకొన్న వ్యక్తిత్వం గొల్ల పూడిది .

               తాజ్ మహల్ లోపలికి ప్రవేశించారు .అక్కడ గైడులు మాత్రమె అన్నీ చూపిస్తారు .నందాలాల్ కు ఆకలి వేసివిశ్రాంతి కోరాడు .అప్పుడంటాడు మారుతీ రావు ‘’ప్రపంచం లో కల్లా అత్యద్భుత మైన దృశ్యం వాడికి దైనందిన గమ్య స్తానం మనకి వినోద యాత్ర .వాడికిజీవనాధారం .తాజ్ మహల్ వాడి జీవితం లో ఒక భాగం .చరిత్ర వాడికి ఉపాధి .’’తాజ్ మహల్ వైపు చూడా లన్న ఉత్సాహం కూడా వాడు చూప లేదు .బండి దిగి భార్యా భర్తలు ఆబగా రొట్టె తినడం ప్రారంభించారు .బండి దిగి వీరిద్దరూ ‘’తాజ్ మహల్ లాంటి అద్భుత దృశ్యానికి మేం వర్షం లో తడిసి ముద్దయ్యాం .అన్ని మతాలు ,భావాల సామరస్యం కళా సృష్టి లోనే సాధ్యమవుతుంది గాబోలు ‘’అనుకొని ఆనందిస్తాడు రచయిత .అందర్ని ఏకం చేసేది కళ మాత్రమె కదా .సత్యం పునస్సత్యం . .కళకు అంతటి ఏకీకృతం చేసే బలం ఉంది .అక్కడ మన narrow domestic walls అన్నీ విచిన్న మై పోతాయి .ఆ అపూర్వ కళా సమ్మేళనం లో మనమూ మమేకమవుతాం ..ఆ సృష్టి రహస్యం లో మనమూ తనువు ,మనసూ మరచి ఆనంద రసాను భూతికి లోనౌతాం /బ్రహ్మానంద సహోదరత్వాన్ని పొందుతాం ‘’ఈ సృష్టి అంతా నేనే ‘’అనే పరమేశ్వర తత్వాన్ని ,విశ్వ వ్యాప్తాన్ని అర్ధం చేసుకొంటాం .ఆ క్షణం చాలు జీవితం ధన్యం అయ్యేందుకు .కడ దాకా నిలిచి ఉంటె ఆ అనుభూతి చాలు .అదీ కళ పరమార్ధం .ఇన్ని కోట్ల ప్రజల మనసుల్ని తనవైపుకు ఆకర్షిస్తున్న ఆ పరమాద్భుత శిల్పం ఎంత విలువైనదీ ?ఎంత ధన్యత చెందింది మానవ జాతి ?అని పిస్తుంది .ఆకళా సృష్టికి ఎంత కాలం నుంచి పరవశం చెందు తోన్దీమానవ జాతి ?/అక్కడికి వెళ్ళిన వారంతా మరోలోకం లో గడిపిన ఫీలింగ్ పొందుతారు ఎంత గొప్ప సౌందర్య హర్మ్యమో అని ఆశ్చర్యంతో మనసు పరవళ్ళు తొక్కు తుంది .

          ‘’ వర్షపు దారల వెనక ఒక జేగురురంగు కట్టడం .పాత జ్ఞాపకాల తో పోలిస్తే అదే తాజ్ మహల్ ‘’ అని తేల్చేశాడు .’’వెలిసి పోయిన కల లాగా ,నిర్లక్ష్యానికి గురైన సంస్కృతీ చిహ్నం లా ఒంటరిగా కనీ పించింది తాజ్ ‘’అంటాడు .ఊహ లోనీ తాజ్ కూ ,ఎదుట ఉన్న తాజ్ కూ హస్తి మశాకాన్తర భేదం .కాలుష్యపు కోర తాజ్ అందాన్ని తాగే సింది .ప్రభుత్వమూ ,ప్రజల నిర్లక్ష్యానికి నీరవం గా రోదిస్తోంది .వన్నె చెడి ,వాసి చెడి ఇదేనా తాజ్ అని పిస్తుంది .ఊహల ఉయ్యాల ఒక్క సారి పల్టీ కొట్టింది .కలా ?నిజమా ?అన్న విభ్రాంతి కలిగింది .నిలు వెల్లా ఆశ్చర్యం ఒణికించింది .భయ భ్రాన్తుడిని చేసింది .అందుకే రచయిత మహోన్నత కళా హృదయాన్ని ,కళా సౌందర్యాన్ని వర్ణిస్తూ ‘’కళ కంటే కళా హృదయం ఎంత ఉన్నత మైంది ?సుగుణ రూపి అయిన కళ కు పెరుగు దల లేదు .నిర్గుణాత్మక మైన కళాహృదయానికి అవధి లేదు .ఊహ లోనీ తాజ్ మహల్ ,ఈ వాస్తవకత ముందు కూలిన శిధిల మై పోతోంది ‘’అంటూ బాధ పడ్డాడు చూడాల్సి వచ్చిన సుందర దృశ్యాన్ని అంత నిస్తేజం గా ఉండటాన్ని చూసి .అదీ కళా కారుది తపన .తాము నిర్మించిన కళా ఖండం అలా కూలి పోతుంటే విల విల లాడ తారు . ‘’రచయిత భార్య ‘’ఆహా ! ఎంత బాగుందీ !’’అంది .’’ఊహకు ,వాస్తవికత కు రాజీ కుదుర్చు కొన్న అదృష్ట వంతు రాలు ‘’అని కితాబిస్తాడు .తన దురదృష్టాన్ని నిందించు కొంటాడు .ఆనందించ లేక పోయానే అని తెగ బాధ పడి పోయాడు .నందా లాల్ కు బేరం చేసిన దాని కంటే ఎక్కువే ఇచ్చాడు బండీ బాడుగ .వాడూ ,వాడి భార్య సాష్టాంగ పడి పోయారు .’’బీద వాళ్ళ సంతోషం ఎంత చవుక /కాని ఎంత గొప్ప ?’’వాళ్ళ సంతోషానికి భార్యా భర్తలకు కన్నీళ్లు కారాయి .ఆపుకో లేక పోయారు .అలా,రచయిత ,భార్యా ఆగ్రా వెళ్లి తాజ్ అందాన్ని చెరో రకం గా చూసి మనస్సుల్లో పదిల పరచు కొన్నారు .నందాలాల్ ,భార్యా ఆ రోజుకు సరి పడ్డ దాని కంటే ఎక్కువ వచ్చి నందుకు ఆనంద పడ్డారు .

             మళ్ళీ పదేళ్లకు రచయిత ఆగ్రా వెళ్లాడు స్నేహితులతో .నందాలాల్ గుర్తించి ,పలకరించాడు .మిత్రు లంతా కార్లలో తాజ్ సందర్శనానికి వెల్లా లని నిర్ణ యించారు .ఆ మాట నందా లాల్ విని ‘’ఫర్వా నై సాబ్ –సాయం కాలం తమ దర్శనానికి వస్తా .ఒక అరగంట నాతో రండి ‘’అన్నాడు .అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి .తాగుడు బాగా అల వాటైందని తెలుస్తోంది .గొంతులో ఇదివరకటి సౌమ్యత కనీ పించలేదు .పదేళ్ళ క్రితం దిగులుండేది .ఇప్పుడు నవ్వుతున్నాడు .’’వయస్సు ,జీవితం పట్ల పిరికి తనాన్ని చంపేసి, వేదాంతాన్ని మిగిల్చింది ‘’అంటాడు గొల్లపూడి అతన్ని చూసి .ఆ సాయంత్రం స్నేహితులతో తాజ్ చూసి వచ్చిన తర్వాత నందా లాల్ వచ్చి తన బండీ లో ఇంటికి తీసుకొని వెళ్లి తన కధంతా చెప్పుకొన్నాడు .మూడేళ్ళ కితమే భార్య చని పోయింది .ఒంటరిగా నే బండీ నడుపుకొంటున్నాడు .’’శిధిలమైన పాదుషా ల గోరీల మీద నుంచి కూడా ధైర్యం గా గమనిస్తున్న మొగలాయీ సంస్కృతీ ,చరిత్రా ఇవాళ సజీవ శైదిల్యాన్ని అనుభ విస్తున్న నందా లాల్ దగ్గరి కొచ్చి ఆగిపోయింది .ఆగ్రా ప్రాచీన సంస్కృతీ చైతన్యం లో నందాలాల్ ఒక భాగమైతే ఇవాళ ఆ చైతన్య స్తంభించి పోయి నట్టే కదా !’’అంటాడు .అతని గత ,ప్రస్తుత జీవితాలను ,సంస్కృతినీ బేరీజు వేస్తూ .ఇంటి దగ్గర ఒక చిన్న తులసి కోట లాంటిఎర్రటి కోట దగ్గరికి తీసికెళ్ళాడు నందా లాల్ .అక్కడ తాను అతి భక్తితో ,వినయం తో వంగి నమాజు చేశాడు .ఆశ్చర్య పోతున్న రచయిత తో తన భార్య అక్కడే చని పోయిందనీ ,అదే ఆమె జ్ఞాపిక అనీ కన్నీళ్ళ తో వివరించాడు .

              ‘’విధి విధించిన శాపాన్ని నిశ్శబ్దం గా స్వీకరించి ,ఆ ఒంటరి తనాన్ని భార్య పట్ల కృతజ్ఞత తో నిమ్పుకొన్నాడు ‘’అంటూ మారుతీ రావు  పదేళ్ళ నాటి ఆమె రూపాన్ని ,నిండుదనాన్ని జ్ఞాపకం చేసుకొన్నాడు .ప్రపంచమంతా దీన్ని గుర్తించక పోయినా ,వాడికేం బాధ లేదు .వాడికీ వాడి ఆప్తులకీ తెలుపు కొంటె చాలు .’’వాళ్ళ జ్ఞాపకాల్లో అమరత్వం సిద్ధింప జేశాడు ‘’.తాజ్ మహల్ లో ఉన్నత మైన కట్టడం ,భార్య పట్ల ప్రేమాను రాగాలతో పాటు ధనం లభిప జేసే ఠీవీ దర్పం ఉన్నాయి .ఇక్కడ నిర్మిత మైన ఈ చిన్ని కట్టడం లోను అంత ఔన్నత్యమూ ఉంది .అంతకు మించిన ప్రేమాను రాగాలున్నాయి .కానీ ,వాటి తో బాటు బీదరికం ఇచ్చిన నిరాడంబరత ,విశ్రాన్తీ ఉన్నాయి ‘’అని ఆ రెండు స్మృతి చిహ్నాల్నీ బాగా ఎస్టిమేట్ చేశాడు .ఇంతేనా –ఇంకా ఉంది.

     ‘’’’అక్కడ విశ్ర మించే ప్రేమ మూర్తి ,నలుగురి మధ్యా అను నిత్యం గుర్తింప బడే అదృష్ట వంతు రాలైతే –ఇక్కడ విశ్రమించిన నందా లాల్ పొట్టి భార్య నలుగురి ప్రమేయం లేని ప్రశాంత సుషుప్తి ననుభ వి స్తున్న అదృష్ట వంతు రాలు .భార్యతో సుఖాన్నీ ,భార్య లేని దుఃఖాన్నీ తనకే మిగుల్చు కొన్న అదృష్ట వంతుడు నందా లాల్ .ఆ తాజ్ మహల్ నిఅంతా విస్మయం తో చూస్తుంటే ,ఇది ఒక గుర్రబ్బగ్గీ వాడి హృదయాన్ని ఆర్ద్రం చేసే తాజ్ మహల్ ‘’అంటాడు గొల్లపూడి .తనకోసం ఇంత దూరం వచ్చి నందుకు కృతజ్ఞత తో కాళ్ళ మీద పడతాడు నందా లాల్ .ద్రవించి పోయిన హృదయం తో‘’ఈ సారి నిజ మైన తాజ్ మహల్ ని చూశాను ‘’అనుకొంటాడు రచయిత సంతృప్తిగా .రెండు సహ్రుదయాల పరస్పర సంగమం .కన్నీళ్లు ,ఆర్ద్రతా కాక అప్పుదు ఇంకేమి  ఉంటాయి?ఇలా కధను హృదయంగమం గా చిత్రించాడు .ప్రతి అక్షరం లో అను భూతి ,రసాను బూతి ,సాను భూతి ఆప్యాయత ,ఆర్ద్రత తొణికిస లాడుతాయి .గతకాలపు వైభవాన్నీ కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తూ వర్త మానాన్ని దాని ఎదగ లేని స్తితి నీ చక్కగా చూపిస్తాడు .శిధిల మై పోతున్న సంస్కృతీ విలు వలని కాపాడు కొ లేని మన జడత్వాన్ని మెత్త గా మందలిస్తాడు .మనిషి పట్ల సహాయ ,సాను భూతులు ఎంత దగ్గరకు చేరుస్తాయో నిరూపించాడు .ప్రేమా ,అనురాగాలే నందా లాల్ వాడి పొట్టి భార్యా .ఇద్దరు కలిసి ఆనందాన్ని పంచుకొన్నారు .విధి బలీయ మై భార్య దూరమై పోతే , ఆ అనుబంధాన్ని తనదైన  శైలి లో చిరు దీపం లా,చిట్టి కోటలో దాచుకొన్నాడు .ఆత్మీయతను చూపి ,ఆనందం పొందాడు ..ఎందరు రచయితలు తాజ్ మహాల్ని చూడ లేదు ?అయితే వారి కెవ్వరికీ కనీ పించని ‘’ఆస లైన తాజ్ మహల్ ను‘’మారుతీ రావు చూడ గలిగాడు .అదీ అతని ప్రత్యెక చూపు .ఇదే అందరి కంటే అతన్ని ప్రత్యేకం చేసింది .దాన్ని గొప్ప కద గా మలిచాడు .’’కదానికా కళా రంగం లో ఓ అందమైన కధా తాజ్ మహల్ ని  నిర్మించి సహస్రాధికులతో జేజేలు పలికిస్తున్నాడు గొల్ల పూడి అని పించింది నాకు మాత్రం .

            మరో కధ  తో మళ్ళీ కలుద్దాం

            సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –29-11-12-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.