గొల్ల పూడి కదా మారుతం –6
నాల్గవ కధ –అభిప్రాయ భేదం –1
గొల్ల పూడి మరో మంచి కదా ‘’అభి ప్రాయ భేదం ‘’దొంగతనం లోను నిజాయితీ పరులుంటారు .వారికి కావలసి నంత వరకే దోచు కొంటారు .దానికోసం మనిషి ప్రాణం తీయరు .ప్రాణాల తో ఆట లాడరు .అయితే చేసిన దొంగ తనం వల్ల వచ్చిన డబ్బూ ,దశకం రాబిన్ హుడ్ లాగా పేదలకు పంచె వాడు ఈ కధలో హీరో –దొంగ సీతప్ప .దొంగతనం చేసిన ప్రతి సారీ దొరికి పోతు జైలుకు వెళ్ళుతూ , జైల్లో మంచి వాడుగా పేరు తెచ్చుకుంటూ ,అక్కడ కష్ట పడి ఒల్లోంచిచ ,పని చేస్తుంటాడు .బయటికి రాగానే ‘’ఆకలి ‘’వేస్తూన్తుంది వాడికి . దొంగ తనానికి వాడి ముద్దు పేరు’’ఆకలి ‘’వాడి భాషలో .అదీ అతని జీవితం .అతనికి ఆకలి అయితే ఎవరూ ఆగలేరు .కొంత మంది ఈ వ్యవస్థలో డబ్బున్న వాళ్ళంతా బూర్జువాలు ,వాళ్ళను దోచుకోవటం కాదు సఫా చేస్తేనే వ్యవస్థ బాగు పడుతుంది అని ఆలోచించే వారూ ఉన్నారుగా ఉంటారుగా .,ఉంటున్నారుగా చూస్తున్నాం గా ఇందులో ఇద్దరూ దొంగలే .అయితే అభిప్రాయ భేదం అంతే .ఒకరు దొరికి జైలుకి వెళ్తే ,మరొకరు సంఘ విద్రోహులు గా గుర్తింప బడి వేరు వేరు పేర్ల తో పిలువా బడి ప్రభుత్వానికి పక్కలోబ ల్లాలవుతారు .సంఘం కంటిలో నిద్ర పోతూంటారు .భాయోత్పాతాలు కల్గిస్తారు .ఈ రెండూ చెడ్డ వె అయినా మొదటి వాడు ప్రమాద కారి కాదు .రెండో వాడి పేరు చెబితేనే భయం .అంత భేదం ఉంది వారి వృత్తిలో ,ప్రవ్రుత్తి లో –ఆ కదా కమామీషె‘’అభిప్రాయ భేదం ‘’ఓ సీతప్ప కద .
‘’సీతప్ప జైలు నుండి విడుదలై అయిదు రోజులు కూడా కాకుండానే అప్పుడే అతనికి ‘’ఆకలి ‘’వేసింది అలవాటుగా .మంచి భోజనం చే గ్లాస్కో పంచె కట్టి ,బీడీ దమ్ము లాగుతూ మాయ దారి మల్లి గాడి లా రిక్షా లో సరదా గా తిరగటం అతనికి నిద్ర లేవ గానే జ్ఞాపకం వస్తాయి కళ్ళు చుట్టూ వెదుకుతాయి .ఆ వెదుకు లాటలో కు లాటలో ధన వంతుల మేడలూ ,వాళ్ళ ఇనప్పేట్టెలు ,ఫాక్టరీలు , గిడ్డంగులు కళ్ళ ముందు సినీ రీలు లాగా కన్పిస్తాయి .ఆ అవసరం కలగటమే ‘’ఆకలి ‘’అంటాడు వాడి మనస్తత్వ విశ్లేషణ చేస్తూ కధకుడు మారుతీ రావు .అతని ఆకలికి తిరుగు లేదు .బ్రహ్మ రుద్రాదులు కూడా అడ్డు చెప్ప లేరు .మర్నాడు పేపర్లో వార్త పడాల్సిందే .సీతప్పకు ఒక నమ్మకం ఉందట .తిండీ బట్టా నయాన్నో భయాన్నో ప్రతి మనిషి సంపాదించుకొనే హక్కు ఉంది అయితే మొదట దీన్ని ‘’నయాన ‘’అమలు జరుప ప్రయత్నించి విఫలు డయ్యాడు .ఇక ‘’భయానక ‘’పద్ధతి తప్పని సరి పరిస్తితులలో అల వాటు పడ్డాడు .అడ్డు పడే వాడెవ్వడు ఇప్పుడు కనీ పించటం లేదు .అందుకని ‘’ఇదే ‘’బాగుందని నిర్ణ యించుకొన్నాడు అలాగే బతుకు తున్నాడు హాయిగా ఉంటున్నాడు ఎవరి మీద చెయ్యి చేసుకోడు .ప్రాణాలు తీయడు సీతప్ప .అసలతడిని చూస్తె దొంగ లా అసలు అని పించడు సన్నటి మల్లు పంచె ,మెడలో బంగారు గొలుసు గుండ్రటి మొహం ,ఎర్రటి బొట్టు –ఇదీ అతని రూపం .కనుక ఎవరూ దొంగ గా భావించరు .చిరు నవ్వు అతని ఆయుధం .
పేదవాడు చేయి జాపితే బాగా ముట్ట జెప్తాడు .డబ్బంటే సీతప్పకు నిర్లక్ష్యం ఎక్కువ ..పెద్ద వాళ్ళని ‘’బాబూ ‘’ అనీ ,ఆఫీసర్లను ‘’సారూ ‘’అని వారిని మచ్చిక చేసుకొంటాడు .రాజకీయం బాగా తెలుసు .భక్తీ ఉంది .వేంకటేశ్వరుడే దై వం .శని వారం ఉప వాసం ..’’మంచి దొంగ ‘’ అని పించి మనకు ఇంత మెత్తని వాడు దొంగతనం ఎల్లా చెయ్య గలడు అని అనుమానం కలిగితే ‘’అది పోరబాటు ‘’అంటాడు మారుతీ రావు .
స్వాతంత్ర్య ఉద్యమం లో భక్తులు ,సదాచార పరాయణులు పోరాడి ఉద్యమం కోసం ప్రాణాలను అర్పించాలేదా / అలాగే సీతప్ప బతుకూ ఓ ఉద్యమం లాంటిదే .స్వాతంత్రోద్యమం లో ‘’అహింస ‘’ను అవలంబించి నట్లే ,సీతప్ప కూడా దొంగతనాల్లో కొన్ని కఠోర నియమాలను ఏర్పరచుకొన్నాడు .’’ధన వంతుల ఇళ్ళల్లో లక్షలు దోచలేదు .తనకు సరి పడ దాన్నే తెచ్చు కొనే వాడు .తన పని చాలా నీతి వంత మైన అతని భావం .’’నయాన లొంగని సమాజం భయాన లోన్గుతుంది అని ఈ సమాజం పై అతనికి బోలెడంత సాను భూతి .అందుకే ‘’ఆకలి ‘’లేని సమయాల్లో చాలా మంది ఆకలిని అతను తీర్చాడు .బీద విద్యార్ధులకు సాయం చేశాడు .డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకున్న చాలా మందికోసం మందిప్పించి కొత్త ప్రాణం పోశాడు అంటాడు రచయిత .ఒక రాబిన్ హుడ్ లావారందరికి ఆరాధ్యుదయాడు
అయితే సీతప్ప లక్ష్య సాధన రోజు ,అంటే ముద్దు గా దొంగ తనం రోజు ,లేకుంటే ఆకలి తీర్చుకోవాలనుకొన్న రోజు ఒక పూటే భోజనం చేస్తాడు .ఉపవాసం ఏకాగ్రత ను పెంచు తుందని నమ్మకం .ఎవరి తోను మాట్లాడాడు .కుళ్ళి పోయిన సమాజాన్ని బాగు చేసే ఉద్దేశ్యం ఉన్న వాడిగా ఉద్రేకం తో రొమ్ము లుబ్బిస్తాడు .దానాలు చేస్తాడు .అర్ధ రాత్రి వరకు తన ఆయుధాన్ని పదును పెడ తాడు అతని పరికరాలు ప్రత్యెక మైనవిపోలీసులకు అందనంత చిత్ర మైనవి .వాటి ముందు కాంక్రీటు గోడలూ ఆగవు .స్టీలు బీరువాలు వెన్న ముద్దలవుతాయి .ఇనప్పేట్టెలు తెల్ల బోతాయి .ఇంతెందుకు –ఆఖరికి డబ్బు పోగొట్టు కున్న వాళ్ళు కూడా ఏడుపు మానేసి అతని ‘’కళ ‘’కు ఆశ్చర్య పోతారు .అంత చోర రహస్యం తెలిసిన వాడు .అన్నట్టు అరవై నాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటి అని మనకు తెలిసిందే .బహుశా ఆ కళ లో ‘’చక్ర వర్తి ‘’సీతప్ప .
సీతప్ప చోరీ వృత్తాంతాన్ని మరోసారి
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 30-11-12-ఉయ్యూరు