పద్మశ్రీ తుర్ల పాటి కలం గళం బలం –3

పద్మశ్రీ తుర్ల పాటి కలం గళం బలం –3

 పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం — 2

పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం-1

వుయ్యూరు శాఖా గ్రంధాలయం మొదటి అంతస్తు శంకుస్థాపన

                     కుటుంబ రావు గారి బహు ముఖ ప్రజ్ఞ

                              పత్రికా ,ఉపన్యాస జీవితం 

 కుటుంబ రావు గారి జన్మ స్థానం కృష్ణా జిల్లా పామర్రు .ఆయన కార్య స్థలం గన్నవరం .ప్రస్తుత నివాసమ్  విజయ వాడ .లాయర్ కావాలని అనుకొన్నారు .జర్న లిస్టు అయారు .ఆయన పెద్ద  గురువు ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు .చిన్న  గురువు రైతు నాయకుడు ఆచార్య యెన్ ,జి.రంగా .చిన్నప్పుడు నాటకాల పిచ్చి .రామాయణం లో రాముడు గయో పాఖ్యానం లో కృష్ణుడు గా రామ దాసులో రెండో రామ దాసుగా వేషాలు వేశారు .’’స్వరాజ్యం లో స్వరాష్ట్రం ను మద్రాస్ నుండి వెలువడే ‘’మాత్రు భూమి అనే రాజ కీయ వార పత్రిక లో ప్రధమ వ్యాసం  .‘1947  మార్చి లో రాశారు .అంటే ఆంద్ర రాష్ట్రం మద్రాస్ రాష్ట్రం నుండి వేరు పడి స్వంత రాష్ట్రం ఏర్పడాలని భావం .వీరే దీనికి పత్రిక ద్వారా ఆలోచన కల్గించారు .అదే సంవత్సరం అక్టోబర్ లో గన్న వరం కాంగ్రెస్ మీటింగ్ లో మొదటి ఉపన్యాసం చేశారు .పత్రికా రచనా ,ఉపన్యాస దోరణి సుమారు ఒకే సారి ప్రారంభమయాయి .దీన్నినే వారు ‘’అరంగేట్రం‘’అన్నారు .అంతకు ముందు పామర్రు స్కూల్ లో డిబేటింగ్ లో గళమేత్తినా వేదిక చేసుకొన్నది గన్నవరం లో .ఇక్కడే జర్న లిస్టు గా కూడా రూపు ఏర్పరచుకొన్నారు .తెలుగుకు ప్రాచీన భాషా ప్రతి పత్తిఇవ్వాలని హిందీ తర్వాత రెండవ అది కార భాష తెలుగును చేయాలని .2003 మే నెలలోనే మొదట ఉద్యమం చేసిన ఘనత తనదే నన్నారు .

           DSCF0853 రంగా గారి ‘’వాహిని ‘’రైతు, రాజకీయ వార పత్రికకు కుటుంబ రావు గారి ప్రతిభకు తగ్గ పురస్కారం గా సబ్ఎడిటర్ గా పని చేయమని స్వయం గా రంగా గారే కోరితే పని చేశారు .నెహ్రు దాన్ని ప్రారంభించాడు అది 1970 కే మూత పడింది రెండు నెలలే వీరు అందులో పని చేశారు .చల సాని రామా రేయ్ అనే ఆయన నడుపు తున్న ‘ప్రతిభ‘’కు ఎడిటర్ గా ఉండమని కోరారు .అంతకు ముందు నుంచే ఖాసా సుబ్బా రావు గారి ‘’తెలుగు స్వతంత్ర ‘’వార పత్రికలో ఫ్రీ లాన్స్ జర్న లిస్టు గ ప్రతి వారం వ్యాసాలను రెండేళ్లు రాసి గుర్తింపు పొందారు .ప్రతిభలో ఎడిటర్ గా మంచి గుర్తింపు పొందారు అప్పటికి వీరి వయస్సు పందొమ్మిది మాత్రమె .’’బాయ్ ఎడిటర్ ‘’అని పిలిచే వారట .  ’’ప్రజా పత్రిక ‘’అనే  దిన పత్రిక పెట్టి సహాయ సంపాదకుల్ని చేశారుప్రకాశం గారు  .క్రొవ్విడి లింగ రాజు అసోసియేట్ ఎడిటర్ ప్రకాశం గారు చీఫ్ ఎడిటర్ .ఈయన్ని సెలెక్ట్ చేసిన వారిలో బులుసు సాంబ మూర్తి గారు ఉన్నారు .

             ఇక్కడ పని చేస్తూ ప్రకాశం గారి కార్య దర్శి గా రాత్రి వేలల్లో పని చేసి జోడు గుర్రాల బండి నడిపారు .అప్పటికి ఇరవై ఒక్కఏళ్ళు .కాశీ నాధుని వారు ఆంద్ర పత్రిక లోకి రమ్మని ఆహ్వానిస్తే తాను ప్రకాశం గారి శిష్యుడి నని ప్రకాశం గారిపై ఎదురు దాడి చేసే ఆంద్ర పత్రిక లో తాను పని చేయలేనని నిర్మోహ మాటం గా చెప్పారు తుర్ల పాటి ..చల పతి రావు గారు బెజ వాడ నుంచి ‘’ప్రజా సేవ ‘’అనే వార పత్రిక నడిపారు దీనికి కుటుంబ రావు ఎడిటర్. ఐదేళ్లు సాగింది .తెన్నేటి వారు ‘శాసన ‘’పేరా జాతీయ ,అంతర్జాతీయ విశేషాలు అందులో రాసే వారట .

           కే.ఎల్.యెన్.ప్రసాద్, నార్ల కలిసి ఆంద్ర జ్యోతి స్తాపించారు నార్ల ఎడిటర్ .ఈయన సహాయ సంపాదకులు నార్లకు‘’ఏక లవ్య శిష్యుడిని ‘’అని గర్వం గా చెప్పుకొంటారు .నార్ల లాగా సంపాదకీయాలు రాసే వారు లేరని చెబుతారు .ఆయన్ను పాత్రికేయ ద్రోణా చార్యు లన్నారు .1960 may 21నఆంధ్ర జ్యోతి లో ఉద్యగం ప్రారంభించారు .అయిదేళ్ళు పని చేసి తర్వాతా జి .ఎస్ .రాజు గారి కోరిక పై ఆయన కార్య దర్శి గా పని చేశారు .మళ్ళీ నార్ల కోరిక మేరకు జ్యోతి కి వచ్చారు .1991 వరకు నార్ల తో పని చేశారు నార్ల విరమించుకొన్న తర్వాత నండూరి రామ మోహన రావు సంపాదకు లైనారు వీరి ఉద్యోగం మామూలే నందూరితో ఇరవై ఏళ్ళు పని చేశారు సంపాదకీయాలు రాశారు .సంపాదక రచయిత గా ,సండే ఎడిషన్ ఇన్చార్జి గా ,సినిమా ఎడిటర్ గా చీఫ్ రిపోర్టర్ గా వివిధ బాధ్య తలు నిర్వ హించారు .

               1960 లో నార్ల వారి అభిప్రాయాన్నను సారించి ‘’వార్తల లోనీ వ్యక్తీ ‘’శీర్షిక ప్రారంభించి ఇప్పటి దాకా వార్త పత్రిక లో కూడా కోన సాగిస్తున్నారు .జ్యోతి లో మూడు దశాబ్దాలు ,వార్తలో రెండు దశాబ్దాలు దీన్ని కోన సాగించి అర్ధ శాతాబ్దిపైగాఒకే శీర్షికను   నిర్వహించిన ఏకైక వ్యక్తీ గా రికార్డు సృష్టించారు .ఒక్క వారం కూడా మానేయ కుండా రాసిన ఘనత వీరిది .సుబ్బి రామి రెడ్డి ఛలోక్తి గా ‘’తుర్ల పాటి వారే వార్తల లోనీ వ్యక్తీ అయారు ‘’అన్నాడు .

          1952ఎన్నికలలో కాంగ్రే స్ పార్టీ ఘోర పరాజయానికి కారణాలు రాస్తూ నెహ్రూకు రెండు లేఖలు రాస్తే వాటిని ఖాసా సుబ్బారావు గారు అను వాదం చేయించి ‘’తెలుగు స్వతంత్ర ‘’లో వేశారు .అవి సంచలం సృష్టించి నెహ్రు దృష్టికి వెళ్ళాయి ‘’ఎవరీ కుటుంబ రావు ‘’అని నెహ్రు ఎంక్వైరీ చేయించాడు .తెలుగు స్వతంత్ర లో ప్రతి వారం రాజకీయ వ్యాసం రాసే వారు .ఆంగ్లం లో రాసిన లేఖలను బహిరంగ పరచే వారు .దీనితో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి .

                         సిని పరిశ్రమ తో సంబంధం

రాష్ట్ర నంది అవార్డుల కమిటికి బెజ వాడ గోపాల రెడ్డి చైర్మన్ ,తుర్ల పాటి సభ్యు డు గా పని చేశారు ఏడు సార్లు ఈ కమిటీ సభ్యులు గా ఉన్నారు .ఆంద్ర ప్రదేశ్ ఫిలిం అసోసియేషన్ ప్రధాన కార్య దర్శి గా 20ఏళ్ళు పని చేశారు .టి.విఆవార్డుకమిటీ లోను ఒక సారి ఉన్నారు .ఆంద్ర ప్రదేశ్ ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ తో ఉన్న సంబంధం వల్ల సినీ పరిశ్రమకు దగ్గరయ్యారు .దీనికి గోపాల రెడ్డి అధ్యక్షులు నలభై రెండు శాఖలుం డేవి. ప్రతి ఏడాది ఫిలిం బాలెట్ పెట్టి ఏదో ఒక పట్నం లో ఫిలిం అవార్డుల సభ జరిపే వారు .అన్ని సభలకు వీరే అధ్యక్షులు .అర్ధ శతాబ్ది గా విజయ వాడ లో జరుగు తున్న సినీ సభలన్నిటికి కుటుంబ రావు గారే అధ్యక్షులై నిర్వ హించటం రికార్డు రివార్డు కూడా .జ్యోతి చిత్ర సిని వార పత్రిక వీరి ఎడిటర్ పేరు మీదే వెలువడేది .ప్రత్యామ్నాయ సంపాదకీయ రచయిత గా రెండో పేజి ఫీచర్ ఎడిటర్ ,సినిమా పేజి ఎడిటర్ గా పని చేశారు .కేంద్ర ఫిలిం సలహా సంఘం ,సెన్సార్ బోర్డ్ సభ్యత్వం పొందారు .సభలన్నితికి వ్యాఖ్యాత గా ఉనడటం వల్ల‘’ఉపన్యాస కేసరి ‘’అనే బిరుదు పొందారు .

            అక్కినేని నాగేశ్వర రావు అరవై సిని మాలలో నటించిన ఘన విజ యానికి గాను సినీ వజ్రోత్సవం జరిపారు .ఆయనకు ‘’నట సామ్రాట్ ‘’అనే బిరుదిచ్చింది కుటుంబ రావు గారే అప్పటికి వీరి వయసు ఇరవై నాలుగేల్ళీ ( 1950 )నాగ్కు గజారోహణ ఊరేగింపు మొదలైనవి బెజ వాడలో భారీ గా ఏర్పాటు చేశారు .అనుకోకుండా వర్షం వచ్చి గాంధీ స్కూల్ లో జరగాల్సిన సభ రద్దు అయింది .ఆ రాత్రి ఫిలిం చేంబర్ లోనే సభ జరిపి బిరుదు ప్రదానం చేశారు .అప్పటి నుంచి ‘’నట సామ్రాట్ అక్కి నేని ‘’అనటం అల వాటైనది .అక్కినేనికి పద్మ భూషణ పురస్కరంవచ్చి నప్పుడు విజయ వాడ లో పెద్ద సభ జరిపారు ‘’ఈ పద్మ భూషణ్ కంటే నాకు విజయ వాడ ప్రజలు ప్రదానం చేసిన నట సామ్రాట్ బిరుదు కే నా ద్రుష్టి లో విలువ ఎక్కువ ‘’అన్నాడు నట సామ్రాట్ .ఆ బిరుదు వచ్చి ఇప్పటికియాభై ఏళ్ళు దాటాయి .అక్కినేని హైదరా బాద్ కు ఆహ్వానించి కళా తపస్వి విశ్వ నాద సమక్షం లో తుర్ల పాటిని సన్మా నించారు .

           1978 లో అధికార భాషా సంఘం సభ్యులయారు .దాని అధ్యక్షులు వందే మాతరం రామ చంద్ర రావు వీరికి ఈ సభ్యత్వం రావటానికి మూడు పి.లు కారణం అన్నారు అవి ప్రెస్ ,పిక్చర్ ,ప్లాట్ ఫాం అని వివరించారు .తెన్నేటి విశ్వ నాదం గారి శాస్తి పూర్తీ కమిటీ కి వీరినే ప్రధాన కార్య దర్శి ప్రకాశం గారు రోమన్ హీరో జూలియస్ స్సీజర్ అయితే ,తెన్నేటి అంటోని అన్నారు పార్టీ మారిన సభ్యుడు వెంటనే రాజీ నామా చేయాలనే ఆదర్శాన్ని విశ్వ నాదం గారు మొదటే ఆచరించి అందరికి మార్గ దర్శి అయ్యారు (1951 ).ఆయన జీవితసం తెరచిన పుస్తకం .      

           వీరు అంబేద్కర్ నెహ్రు ఇందిరా లను ఇంటర్ వ్యూ చేసిన ఘనులు .రాజాజీ తో ‘’తున్తర్వ్యు ‘’చేశారు .పట్టాభి ని కేంద్ర ఆర్ధిక మంత్రి చెయ్యమని అయ్యదేవర వారి సన్మాన సభలో ప్రకటించి హర్ష ధ్వానాలన్దుకొన్నారు .

                     మూడు సార్లు దక్కని పద్మశ్రీ

1988 లో కుటుంబ రావు జర్న లిస్టు జీవితానికి నలభై ఏళ్ళు వచ్చిన సందర్భం గా సన్మాన సభలో పాల్గొన్న తొంభై ఏళ్ళ వృద్దు రంగా వచ్చి ఆశీర్వా దించి వీరికి ‘’పద్మ శ్రీ ‘’బిరుదు ఇవ్వాలని తీర్మానం చేయించి ప్రధాని రాజీవ గాంధికి పంపారు .రాలేదు .పి.వి.కాలం లోను మొండి చెయ్యి చూపారు .వాజ్ పాయి టైం లోను రాలేదు .కే,.ఆర్ నారాయణన్ అధ్యక్షుడి గా ఉన్నప్పుడు లభించింది పద్మశ్రీ .వీరు అనారోగ్యం గా ఉంటె గవర్నర్ తివారి రాజ భవన లోనే పరోక్ష సన్మానం చేశారు .

        DSCF0810    పది హేడే ల్లవీరి మనుమడు జవహర్ లాల్ వీరి జీవిత చరిత్ర రాసి తాతకు దగ్గులు నేర్పాడు .దాన్ని మెచ్చి ప్రింటర్ ఉచితం గా ముద్రించటం విశేషం .పాత్రికేయ జీవితం ప్రారంభించి అరవై అయిదేల్లయింది .ఇప్పటి దాకా తన కలాన్ని విది లిస్తూనే ఉన్నారు .గళాన్ని విని పించి చైతన్య పరుస్తూనే ఉన్నారు .ఆ రెండే కుటుంబ రావు గారికి బలం ..ఇప్పటికీ వ్రుద్ధత్వపు చాయలు ఆయనలో కనీ పించవు .నెహ్రు కోటు తో చిద్విలాసం తో ఎన్ని సభల్లో నైనా ప్రసంగిస్తున్నారు .ఎంత అక్షర రాసి నైనా కుమ్మరిస్తున్నారు ..అవే ఆయఅనకు వరం .ప్రస్తుతం రాష్ర గ్రంధాలయ సంఘానికి చైర్మన్ గా ఉంటూ లైబ్రరీలకు భవన నిర్మాణాన్ని ప్రదమ విషయం గా తీసుకొని తీవ్ర కృషి చేస్తున్నారు .శతోత్తర మానం భవతి

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-11-12—ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.