పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం — 2

పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం — 2 

 పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం-1 

1972 లో ‘’జై ఆంద్ర ‘’ఉద్యమం ఉద్ధృతం గా జరుగు తున్న రోజులు .ముల్కీ నిబంధనలను అమలు పరచమని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది .అప్పటి ముఖ్య మంత్రి పి.వి.’’ఇదే ముల్కీ నిబంధన ల పై తుది తీర్పు ‘అని తొందర పాటు ప్రకటన చేశాడు .దీనితో ఆంద్ర ప్రజలు అట్టుడికి పోయారు .పి.వి.మంత్రి వర్గాన్ని రద్దు చేసి, కేంద్రం ,రాష్ట్ర పతి పాలన ప్రవేశ పెట్టింది .అసెంబ్లీని సుప్త చైతన్యం లో ఉంచింది .ఇదంతా గమనిస్తూ తుర్ల పాటి ప్రధాని ఇందిరా గాంధికి సుదీర్ఘ లేఖ రాశారు .ముఖ్య మంత్రి కోసం అనేక మంది ప్రయత్నాలలో ఉన్నారు అన్నీ పరి శీలించి ఆంధ్రా ,తెలంగాణా లకుఅనుకూల మైన అభ్యర్ధి జలగం వెంగల రావు అని తేల్చి చెప్పాడు ఆయనకు హోమ్  మంత్రిగా అనుభవం ఉంది తీవ్ర వాదులను అణచి వేసి శాంతి భద్రతలను నిల బెట్టాడు .ఈ లేఖను చూసి ఇందిరా గాంధి అప్పటి గవర్నర్ సలహా దార్ర్ హెచ్ ,సి సరీన్ కు పంపించి ,తనను  కలిసి అభి ప్రాయం సేకరించ మనికోరింది .ఆయన కబురు పంపితే వెళ్లి రాజ భవన్ లో క లిశారు .ఆకాశ వాణిడిప్యుటి డైరెక్టర్ అమృత లాల్ మెహతా కూడా ఉండి తుర్ల పాటిని షరీన్ అడిగిన ప్రశ్న లన్నిటికి ఆయన చెప్పిన జవాబులు రాసుకొంటున్నాడు .అయితే వెంగళ రావు కు శాసన సభ్యుల మద్దతు లేదు కదా అని అడిగాడు .అప్పుడు పద్మశ్రీ ‘’మేడం గాంధి వెంగళరావు ముఖ్య మంత్రి అని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం అంగీక రిస్తుంది ‘’అని చెప్పారు .షరీన్ ఛి రు నవ్వు నవ్వి పరిష్కారం లభించి నందుకు సంతోషపడి ,గౌరవం గా తుర్ల పాటిని పంపాడు. .జలగం కు విషయం తెలిసి వీరిని అడిగితే శాసన సభ్యుల మద్దతు కూడ గట్టమని సలహా నిచ్చారు .ఆ తర్వాతా జలగం ముఖ్య మంత్రి అయిన సంగతి మనకు తెలిసిందే .(అయితే ‘’కోటి రూపా యల ముఖ్య మంత్రి అని ఆ నాడు అందరు చెవులు కొరుక్కున్నారు )ఒక సంక్లిష్ట దశ లో రాష్ట్ర రాజకీయాలను ఒడ్డున పడేసిన రాజకీయ చతురుడు కుటుంబ రావు .

     ఒక సారి నాటి ముఖ్య మంత్రి చంద్ర బాబు స్విస్ దేశ ఆర్ధిక మంత్రి పానల్ రాష్ట్రాన్ని సందర్శించిన సభలో రాష్ట్ర అభి వృద్ధి రేటు ను పది  శాతం పెంచు తామని చెప్పాడు .దానికా స్విస్ మంత్రి హేళన చేస్తూ ఇలా తన దేశం లో ఎవ రరైనా మాట్లాడితే తమ దేశం లో జైల్లోనైనా పెడతారు లేదా పిచ్చాసు పత్రిలోనైనా పడేస్తారని ఘాటు విమర్శ చేశాడట .పాపం బాబు ఏమీ అనలేక పోయాడట .విషయం తెలిసిన తుర్ల పాటి స్విస్ ఆర్ధిక మంత్రికి లేఖ రాస్తూ ‘’మీరు ఎద్దేవా చేసింది ఒక ముఖ్య మంత్రిని కాదు  –ఆయన ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాన్ని .ఆంద్ర దేశ ప్రజలు దీన్ని తీవ్రం గా పరిగనణిస్తారు .మీ వ్యాఖ్య లను ఉప సంహరించు కొండి ‘’అని రాశారు ఆయన లేఖ కు సమాధానం రాసి క్షమాపణ చెప్పి ఉప సంహరించు కొన్నాడట .ఇలా రాష్ట్ర మర్యాదను కాపాడారు పద్మశ్రీ .ఒక సారి సభలో ఈ విషయం అప్పోజిషన్  లో ఉన్న కాంగ్రే పార్టీ వారు ఉదాహరిస్తూ బాబును అవహేళన చేస్తే నాయుడు ఆ స్విస్ మంత్రి సమాధానం ఉన్న పత్రిక లను చూపి ,వాళ్ళ నోరు మూయించాడు ఇక్కడ ధర్మ రాజనీతి ని ప్రదర్శించారు .

                అలాగే ముఖ్య మంత్రి రామా రావు ప్రధాని రాజీవ్ గాంధిని ‘’దేశ ద్రోహి ‘’అని నిందిస్తే కుటుంబ రావు దీన్ని దేశం లోనీ ముఖ్య  మంత్రు లందరి దృష్టికి తెచ్చి వారి స్పందన కోరారు .ఒక్క కర్నాటక ముఖ్య మంత్రి హెగ్డే మాత్రం తాను ఏకీ భావించటం లేదని సమాధానం రాశాడట ..

          రాష్ట్ర పతి గా కే.ఆర్ నారాయణ్ ఉన్నప్పుడు అధికార పర్యటన లో ఫ్రాన్సుకు వెళ్లారు .అక్కడి ‘’లేమాండ్ ‘’పత్రిక‘’దళిత అధ్యక్షుడు మన అధ్యక్షుని తో సమా వేశం ‘’అని రాసింది .మన విదేశాంగ శాఖ అక్కడి విదేశాంగ శాఖ కు నిరసన తెలియ జేసింది .దీనికి స్పందిస్తూ కుటుంబ రావు గారు ఆ పత్రిక కు లేఖ రాస్తూ ‘’నారాయణన్  ను దళితుడు అయి నందుకు రాష్ట్ర పతి గా ఎన్నుకోలేదని ,జర్న లిస్టు గా జీవితం ప్రారంభించి దౌత్య ప్రతి నిది గా ,కేంద్ర మంత్రిగా ,ఉప రాష్ట్ర పతి గా పని చేసి రాష్ట్ర పతి అయారని ,అత్యున్నత చరిత్ర ఆయనకు ఉన్నదని  ఆయన మహా మేధావి ‘’అని తెలియ జేశారు వందేళ్ళ చరిత్ర గల పేపర్ అలా రాయటం అందులో -స్వాతంత్రం ,సమానత్వం సౌభ్రాతృత్వం అన్న మహాదాశయాలకు ప్రాణం పోసిన పత్రిక అలా  రాయటం ఆశ్చర్యకరం అవమానకరం అని ఘాటుగా విమర్శించారు .ఇలా భారత దేశం లో ఏపత్రిక అయినా రాస్తే ప్రభుత్వం చర్య తీసుకొంటుందని దమ్ముంటే తన లేఖ ను ప్రచు రించమని కోరారు .ఆ పత్రిక తుర్ల పాటి లేఖ ను యదా తధం గా ప్రచురించి ఉత్తమ సంప్రదాయాలను నిల బెట్టుకోంది. ఆ పత్రిక కాపీ భారత రాయ బారి కార్యాలయానికీ పంపింది వారు రాష్ట్ర పతికి పంపారు .నారాయణన్ ఆలేఖ విషయాన్ని తుర్ల పాటి వారితో మన రాష్ట్రానికి వచ్చి నప్పుడు పిలి పించి చెప్పారు .ఇలా ఎవరైనా రాష్ట్రాన్ని, దేశాన్ని అవమానం చేసి నపుడు దీటు గా ఎదుర్కొనే వారు కుటుంబ రావు గారు .మన పరువు నిల బెట్టె వారు .

            ‘’విశా లాంధ్ర’’ ఏర్పాటుకు నెహ్రు అజాద్లు ప్రతి కూలం గా ఉండ టాన్ని  చూసి ‘’ప్రజా సేవ ‘’పత్రిక లో వారిని విమర్శిస్తూ సంపాదకీయం రాశారు .దీని పై అరెస్ట్ వారంట్ వస్తుందని అందరు భయ పడ్డారు .క్షపమాపణచెబుతూ రాయండి అరెస్ట్ చేయరని తెలిసిన పోలీస్ ఆఫీసర్ చెప్పినా వినలేదు ‘’’’అలా చేయను .స్వాతంత్ర ఉద్యమం లో నేను ఎలా నూ పాల్గొన లేదు ..విశాలాంధ్ర కోసం జైలు కెల్లటానికి సిద్ధమే ‘’అని చెప్పారు .నిజామా  బాద్ సభలో విశాలాంధ్ర ఏర్పాటు చేస్తామని నెహ్రు ప్రకటించాడు .దానితో అరెస్ట్ వారంట్ ఆగి పోయింది .జైలుకు వెళ్ళ లేక పోయాననే భావం మాత్రం తుర్ల పాటిని వదల్లేదట .

               గుజరాత్ భూకంప బాది తులకు అమెరికా ప్రెసిడెంట్ క్లింటన్వచ్చి చూసి సహాయం అందించాడు దీనికి ధన్య వాదాలు చెబుతూ తుర్ల పాటి లేఖ రాసి ఇంకా సహాయం చేయాల్సిన అవసరం ఉందని తెలియ జేశారు .దానికి ప్రెసిడెంట్ నుంచి సమాధానం వచ్చింది తాను త్వరలోనే మళ్ళీ గుజరాత్ వచ్చి బాధితులకు మరింత సాయం చేస్తానని హామీ ఇచ్చాడు .ఈ విధం గా ప్రజలంతా నా వారు అనే విశాల దృక్పధం తుర్ల పాటిది .

                  చివరి భాగం లో తుర్ల పాటి వారి కలం గళం ,పత్రికా రచనా, ఉపన్యాస ధోరణి గురించి తెలుసు కొందాం

            సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –29-11-12-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.