గొల్ల పూడి కధా మారుతం –8
అభిప్రాయ భేదం -3(చివరి భాగం )
‘’చెట్టి కుక్క అరవటం మర్చి ‘’సీతప్ప దగ్గర కొచ్చింది .’’యజమానికి సేవలు చేసి విసిగి పోయిన నౌకరు లాగ దిగాలు పడి నిలు చుంది ‘’ట .దుకాణం లోకి దిగి ,అక్కడ కల్తీ లేని బియ్యం నెయ్యి ,కంది పప్పు వగైరాలను చూశాడు .ఆ బస్తాల పై తనివి తీరా కూర్చున్నాడు .’’ఈ చెట్టి దొంగ వ్యాపారం మీద తీర్పు చెప్పే న్యాయాధి కారి గా‘’తానున్నట్లు భావించాడు .ఆలోచించిన కొద్దీ ఆ వస్తువుల మీద ,చెట్టి మీద జాలి కలిగింది .ఒక బెల్లం ముక్క కుక్క ముందు గిరాటేశాడు .అది ‘కృతజ్ఞత ‘’తొ కడుపు నింపు కుంటోంది .అప్పటి దాకా చెట్టి పై ఉన్న కృతజ్ఞత నుమర్చి పోయింది .దానికీ తెలిసిందేమో రహస్యం ?లేక సీతప్ప చేస్తున్నది మంచి పనే –ఇలాగే జరగాలి అని పించిందేమో దానికి .అక్కడో పెన్ను ,కాగితం తీసి ,’’నాకు కావాల్సింది మాత్రం పట్టుకు పోతున్నాను .ఇది పోయి నందుకు చెట్టి గారికేం నష్టం లేదు కాని నాకు మాత్రం దినం గడుస్తుంది .మామూలుగా అయితే చెట్టి ఇందుకు వప్పు కొంటాడా మరి ‘’?అని రాసి ,గల్లా పెట్టె పై ఉంచాడు .’’సముద్ర తీరాన నత్త గుల్లలు ఏరి నట్లు తనకు కావలసినవి సంచీ కెత్తుకొన్నాడు .డబ్బు జోలికి పోలేదు .ఏరిన వాటిలో వేటినీ వృధా చేయలేదు .అనవసర మైన్దేదీ ముట్టుకో లేదు ‘’కన్నం లోంచి బయట పడి ,ఇంటికిచేరాడు సీతప్ప .వెళ్తూ కుక్క ముందు ‘’పేలాలు ‘’దిమ్మ రించి పోయాడు .
సీతప్పకు మెలకువ వచ్చే సరికి ఉదయం పది గంటలయింది .స్నానం చేసి ,కాఫీ కి బైటికి వెళ్లి ,పేపరుకొని ,తన పేరుందో లేదో చూసుకొన్నాడు .ఈ సారి ఆశ్చర్య పడటం సీతప్ప వంతు అయింది .’’ప్రఖ్యాత వ్యాపారి వరహాల శెట్టి దుర్మరణం .దుకాణం లూఠీ.’’చదివి తెల్ల బోయాడు .నమ్మలేక పోయాడు .తనకు తెలిసి నంత వరకు ఎక్కడా రక్త పాతం జరగ లేదు .జరిగిన వైనం లేదు .నిశ్చయం గా తెలుసు .ఎందుకైనా మంచి దాని తను తెచ్చిన గోనే నుజాగ్రత్త చెయ్యాలను కొంటుండగా గుమ్మం లో ఎదు రైనాడు ఇన్స్పెక్టర్ వెంకోబ రావు
‘’’ఎరా సీతప్పా !ఈ సారి పద్ధతి మార్చేశావ్ ?’’అన్నాడు .అతనికి రెండు రకాల సంతోషం .తను సీతప్ప పరికరాన్ని ఇంతకాలానికి కను గోన్నందుకు ,ఇంకా సీతప్ప పారి పోకుండా దొరికి నందుకు .’’ఉత్తరం రాయడమూ నేర్చుకున్నావురా ‘’?అని గద్దించాడు .సీతప్ప ధైర్యం గా ‘’ఆ ఉత్తరం చదివితే నిజం మీకే తెలుస్తుంది ‘’అన్నాడు .వెంకోబ‘’అర్ధ మయ్యే వచ్చారా .’’అని ఆ కాగితం అతని ముందుంచాడు .’’ఈ సారి శెట్టి మెడ కే వేశావ్ .పైగా మెడకి కాగితం కడతావా ?’’అన్నాడు వ్యంగ్యం గా .కాగితం చదివాడు సీతప్ప .’’మాకు కావాల్సిందే తీసుకు పోతున్నాం .వీడు పోయి నందు వల్ల ఎవరికీ నష్టం లేదు .కాని చాలా మంది జీవితాలు తృప్తి గా గడుస్తాయి ..మామూలు గా అయితే ఇందుకు ఒప్పుకుంటాడా మరి ?’’ తెల్ల బోయిన సీతప్ప కు కుక్క సంగతి జ్ఞాపకం వచ్చి దాన్ని వెదికితే నిజం తెలుస్తున్దన్నాడు .’’దాని మెదకూ వేశావుగా “’అని ఇంకో చీటీ అందిచ్చాడు వెంకు .’’కుక్క సంగతి సరే సరి ‘’అని ఉన్న కాగితం చదివి సీతప్ప నవ్వుతున్నాడు .’’ఈ సారి నువ్వేనా అని అడగనులే ‘’అన్నాడు ఇన్స్పెక్టర్ ధీమాగా .సీతప్ప నవ్వు అర్ధం కాలేదు వెంగలప్పకు- అదే వెంకోబకు .సీతప్పే ఇలా చెప్పాడు ‘’వీడెవడో మా జాతే లెండి .మా ఇద్దరికీ ఈవిషయం లో ‘’అభిప్రాయ భేదం ‘’ఉంది .అంతే –పదండి ‘’అని ఇన్స్పెక్టర్ వెంట నడిచాడు దొంగ సీతప్ప .
సీతప్ప రాసిన కాగితం హంతకులకు చక్క గా సహక రించింది .సాను భూతి తొ శెట్టి ని వదిలితే –వ్యవస్థనే వేరేవిధం గా మార్చాలి అనుకొన్న ‘’అన్నలు ‘’ఇంకా ముందుకొచ్చి ,అసలు శాల్తీనే లేపేశారు .సమూల మైన మార్పు ఇలాగే వస్తుందని వాళ్ళ నమ్మకం .వాళ్ళని పట్టుకో లేని పోలీసు వ్యవస్థ మళ్ళీ సీతప్పకే అరదండాలు వేసింది .దీని వెనుక ఉన్న రహస్యాన్ని శోధించే తీరిక లేదు వారికి .సీతప్ప ఇంకేమీ చెప్పాడు కూడా .తానే ఒప్పుకున్నాడు గా .చేయని నేరం మీద పడ్డా ,తన కంటే ఎంతో ముందున్న ‘’అన్నల ‘’ఆంతర్యాన్ని అర్ధం చేసుకొనన్న వాడు సీతప్ప .చిన చేపను పేద చేప మింగేసే వ్యవస్థ మనది .ఇలా గైనా సమాజం లో మార్పు వస్తుందేమో ననే ఆశ బహుశా సీతప్ప మనసులో ఉండి ఉండ వచ్చు .తన పరికరాలేవీ దొరక నందుకు సంతోషమే వాడికి .అయితే తన ఆలోచనకూ ,వాళ్ళ ఆలోచనకూ భేదందం ఉంది .ఇద్దరూ వ్యవస్థ పై సాను భూతి ,దయా ఉన్న వాళ్ళే .మార్గాలు భిన్నం .అవి కలవవు .సద్యో ఫలితం రావాలని రెండో వారి తలంపు .దానికిదే మార్గ మని నిశ్చయం .దానికి అడ్డమొస్తే –అంతే –తిరుగు లేదు .
ఈ కధలో సీతప్ప గాంధీ గారంతటి వాడని .ఆ చంపిన అజ్నాతులు బోసు బాబు లాంటి వారని నాకు అని పిస్తుంది .వారి సిద్ధాంత భేదాలను ఇంత చక్క గా వ్యక్తీకరించాడు కధకుడైన మారుతీ రావు .అలాగే రాజకీయం తక్షణ ఫలితం కోరు కొంటుందని నిదానపు చిట్కా పని చేయదని అని పిస్తుంది .అహింస ఎంత గొప్ప దైనా ,దాన్ని అలవరచుకొని ,సత్యం తొ జోడించి ఆచరణకు పూను కోరు అని కూడా అని పిస్తుంది .ఇవి సిద్ధాంతాలు గా మాత్రమె చాలా మందికి పనికి వస్తాయేమో నని పిస్తుంది .నిజ జీవితం లో వాటికి విలువ నిచ్చే వారు కనిపించక పోవటం ఆశ్చర్య మేస్తుంది .’’చెవిలో పువ్వు గాడి గా ‘’అలాంటి వారిని భావించే మనుషులం మనం ‘’.shock treatment ‘’ఇవ్వాల్సి నంత paralytic state ‘’లో మన పరిస్తితులున్నాయేమో ,దానికిది హెచ్చరిక ఏమో నని పించింది .సీతప్ప లాంటి వాళ్ళు వెర్రి వెంగాళప్పల్లానే చెలా మణి అవుతారు .ఆపరేషన్ చేసి దుష్టాంగాన్ని ఖండించి శేషాన్గాన్ని రక్షించే వాడే నిజ మైన డాక్టర్. అందుకని ఆ దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని పించదూ ?కుక్కకు పేలాలు పోయటం ఒక విధం గా కుక్కా, దాని యజమాని మరణాలకు సూచనేమో ?చని పోయిన వారి మీద పేలాలు చల్లటం మనకున్న ఆచారం ..ఇది నా ఊహ మాత్రమె .ఇంత మంచి కద రాసి దొంగనే కదా నాయకుడిని చేసి అతని ఆంతర్యాన్ని సమాజపు తీరును ,మారని వ్యవస్థను ,మార్చ టానికి తీవ్ర పద్ధతి అవసరం అన్న క ఠోర సత్యాన్ని ఈ కధలో గొల్ల పూడి చూపించారని పిస్తోంది .ఏదైనా వెరైటీ కద .వరైటీ ట్రీట్ మెంట్ .హాట్స్ ఆఫ్ టు మారుతీ రావు .
మరో కధ తొ మళ్ళీ కలుద్దాం
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –2-12-12-ఉయ్యూరు