అశోకుని పై ‘’లఘు సర్వస్వమే ‘’ప్రత్యెక సంచిక

 అశోకుని పై ‘’లఘు సర్వస్వమే  ‘’ప్రత్యెక సంచిక

 సాహితీ బంధువులకు –మీకొక అమూల్య కానుక ను అందిస్తున్నాను ..

           గుంటూరు జిల్లా మంగళ గిరి నుండి వెలువడే ‘’ బుద్ధ భూమి పత్రికవారు  ‘’అక్టోబర్ –నవంబర్ సంచికను అశోకుని ప్రత్యెక సంచిక గా వెలువరించారు .దేవానాం ప్రియ ,ప్రియ దర్శి బిరుదు పొంది ,కళింగ యుద్ధ విజయం తర్వాత బౌద్ధ ధర్మావలంబి యై ,ఆఅహింసకే ప్రాధాన్యత నిచ్చి ,ఆ మత వ్యాప్తికి అవిరళ కృషి, చేసి తన కూతురు ,కుమారులను సింహళం మొదలైన దేశాలలో వ్యాప్తికోసం పంపి త్రికరణ శుద్ధి గా ధర్మాన్ని పాలిస్తూ ,పాలింప జేస్తూ ఆదర్శ చక్ర వర్తి అని పించుకొని బౌద్ధారామాలకు భూరి విరాళాలిచ్చి బౌద్ధ స్తూప నిర్మాణం చేసి ,మహా సభలు నిర్వ హించిన మహనీయుని పై ఈ సంచిక తేవటం హర్ష ణీయం .దీనికిశ్రీ రేకా కృష్ణార్జున రావు గారిని ,వారికి సహక రించిన వారికి అభి నందనలు .ఒక రకం గా ఇది అశోకుని పై ‘’లఘు సర్వస్వం ‘’అని పిస్తుంది .చాలా విషయాలను సేకరించి రాయించి, మంచి అరుదైన చిత్రాలను,వర్ణ చిత్రాలను  పొందు పరచి నిర్వ హించిన కార్యం ఇది .ashokuni pai pratyeka sanchika -1

         ‘’ఒక రాజు లేక చక్ర వర్తి యుద్ధం లో వీర విజయం సాధిస్తే పొంగిపోయి ఇంకా యుద్ధాలు చేసి రాజ్య విస్తరణ చేయటం చూశాం .కాని అశోక చక్ర వర్తి కళింగ యుద్ధం తర్వాత  రక్త పాతానికి నికి విచలితుడై పూర్తిగా మారిపోయి అహింసా వ్రతాన్ని అవలంబించి యుద్ధాలు ఇక చేయను అని ప్రకటించాడు .ఇలాప్రపంచం మొత్తం మీద ఏ రాజు ,ఏ చక్ర వర్తి  నిర్ణయం తీసుకోలేదు .అదీ అశోకుని ఘనత ‘’అని చరిత్ర కారులు మెచ్చారు ..మూడవ సంగీతి ని నిర్వహించాడు .దమ్మ మహా మాత్రులనే ప్రత్యేకాధి కారుల్ని నియమించాడు .సత్వర న్యాయం ఆయన లక్ష్యం .ఆయన ఉదార మానవతా దృష్టికి జేజేలు .పన్నులను ఆపన్నులకు, ప్రజా సంక్షే మానికి విని యోగించాడు .మనిషిగా జీవించటం మరణాన్ని జయించటం నేర్పాడు .మూగ జీవుల ఆరాటాన్ని గుర్తించి సేవ చేశాడు .

        ashokuni pai pratyeka sanchika -2  సామ్రాట్ అశోక అంటేనే ఒళ్ళు జలద రిస్తుంది .ఉప గుప్తుడు లేక మొగ్గలి పుత్ర తిష్యుని వల్ల బౌద్ధ ధర్మాన్ని పొందాడు .కుమార్తె సంఘ మిత్ర ను,కుమారుడు మహేంద్రుని బోధి వృక్ష శాఖ నిచ్చి శ్రీ లంకకు పంపాడు .అక్కడ వారు‘’అనూ రాధ పురం ‘’క్రీ.పూ.247లో దానిని వారు నాటి నట్లు చరిత్ర చెబుతోంది .సుస్తిర పరి పాలన కోసం సామ్రాట్ భవన ,కాంభోజ ,ఆంద్ర ,భోజ ,పారింద దేశాలకు స్వయం ప్రతి పత్తి తొ శాసనాధికారాలిచ్చాడు .మహా పాత్ర ,రాజుక్ ,ప్రాదేశిక్ ,మొదలైన అధికారులను ఏర్పాటు చేసి ఎవరి విధి వారు నిర్వ హించేట్లు చేశాడు .

            బౌద్ధ సాహిత్యం లో ‘’అశోకా వదానం ‘’అనేది ‘’దివ్యావ దానం ‘’అనే బృహత్ గ్రంధం లో ఒక భాగం .ఇందులో ఆయన గురించి సమగ్ర చరిత్ర కన్పిస్తుంది అశోకుని కుమారుడు ధర్మ వివర్ధనుడు అతని కళ్ళకు అసాధారణ శోభ వుండేది అతడినే కుణాలుడు అంటారు .ఉపగుప్తుని శిష్యుడై ధర్మ శిక్షణ పొందాడు .కాంచన మాల తొ వివాహ మైంది అతడిని తక్ష శిలకు రాజ ప్రతినిధిని చేశాడు తండ్రి .సెలవు తెసుకొంటు పిన తల్లి అశోకుని రెండవ భార్య అయిన తిష్య రక్షిత దగ్గరకు వెళ్లాడు .ఆమెకు మనస్సు చలించింది .చలించలేదు కొడుకు ..కోపం తొ అతడినిసర్వ నాశనం చేయాలని సంకల్పించింది .అశోకునికి జబ్బు చేసి కొంత కాలం అపస్మారకం లో ఉన్నాడు .రాజ ముద్రిక సంపాదించి అతడికి శిక్ష వేసి కళ్ళు పీకించి ,పదవి లాగేసింది .అతను ఒంటరిగా పాటలీ పుత్రం చేరి భిక్ష చేస్తూ జీవించాడు .ఒక రోజు వీధిలో వీణ వాయిస్తుంటే ఆ కమ్ర నాదాన్నిఆస్థాన విద్వాంశుడు   పోల్చుకొని అతడే కుణాలుడు అని గ్రహించాడు .అశోకునికి భార్య కుణాలుని పై అనేక అభి యోగాలు మోపింది .విచారణ జరుపుతుంటే  ఆయనకు నిజం తెలిసింది భార్య కు శిక్ష విధించే సభ ఏర్పాటు చేశాడు . అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు సభాస్తలిలో సామ్రాట్ అశోక .ఆమెను చిత్ర హింసలు చేసి చంపమని ఆజ్న జారీ చేశాడు ధర్మ అశోకుడు .అప్పుడు ‘’నాన్నా ‘’ అంటూ ఒక స్వరం విన బడింది .అతడే కుణాలుడు .’’ఉప గుప్తుల వారి అనుగ్రహం  వల్ల నేను ధర్మ రాజ పుత్రుడినయ్యాను .మీరు గడించి నంత పుణ్యం ఏ చక్ర వర్తీ గడించలేదు .ఒక్క సారి ఉప గుప్తుడిని బుద్ధ భగ వానుడిని తలచు కోండి .నా తల్లి తిష్య రక్షిత కు క్షమా భిక్ష పెట్టండి‘’అని అర్ధించాడు .చండా శోకుడు శాంతాశోకుడై ధర్మా శోకుడైనాడు .ఇలాంటి మనకు తెలీని విష యాలను లో చేర్చారు ..

       ashokuni pai pratyeka sanchika -3     అశోకుడు గుహాలయాలు ,ఏక శిలా స్తంభాలు ,ఎన్నో నిర్మించాడు అవి గొప్ప వాస్తు శాస్త్ర విధానం లో ఉన్నాయి .చైనా దేశం లో జీజియాంగ్ రాష్ట్రం లో జింగ్ బో అనే పట్టణం లో ఉన్న అయిదు పర్వతాలలో ఒకటైన ‘’అశోక పర్వతం ‘’మీద ‘’అశోకా రామం ‘’క్రీ.పూ282లో నిర్మించ బడింది .అశోకుని శిల శాశనాలు మహా రాష్ట్ర లోనీ గిర్నార్ ,ఉత్తరాంచల్ లో కాటస ,భువనేశ్వర్ లో దోలి ,జోగడ ,పాకిస్తాన్ లో షాబాజ్ గర్హి ,మాన్ షెరా ,మహా రాష్ట్రలో సోపార ,ఆంధ్రాలో ఎర్రగుడి .,ఉత్తర ప్రదేశ్ లో అలహా బాద్ ,బీహార్ లో రాధియా లో ,ఉన్నాయి .అశోకుని సారనాద్ స్తూపం ,అక్కడి అశోక చక్రం ,భారత దేశానికి అధికార చిహ్నమైన మూడు తలల సింహం మన జాతి చరిత్రలో ఒక టై నాయి .

          ప్రపంచానికే ఆదర్శ పాలకుడని పించుకొన్నాడు అశోక చక్ర వర్తి తను భోజనం చేస్తున్నా స్నానం చేస్తున్నా నిద్రిస్తున్నా  ఏ సమయం లో నైనా అధికారులు వచ్చి తనను కలుసుకో వచ్చునని ప్రజా విషయం కంటే తనకేదీ ముఖ్యం కాదని చెప్పాడు .ధనం కంటే ధర్మం  తోనే అభి వృద్ధి జరగాలని కోరాడు . అహింసా, ఆదరణ ,శాంతి ,సహజీవనం ,సాను భూతి తోనే మాన వాళికి మంచి జరుగు తుందని నమ్మాడు .అన్య మతాలను కూడా ఆదరించి మత సహనం చూపిన మాన్యుడైనాడు .విశాల దృక్పధం, సర్వ జీవ సౌభాగ్యమే ఆయన ఆశయం .అది సాధించి అందరికి మార్గ దర్శి అయాడు .ఉన్నత సంస్కృతి ,నాగరకత లకు మూల పురుషుడని పించుకొన్నాడు .వార్తా పత్రికల రూప శిల్పి అశోకుడు .ఆయా ప్రాంతాల సమా చారాన్ని రాజ దాని లో అందరికి అందించాలని దర్బారు బయట సమాచారాన్ని రాయించి సమాచార విప్లవం తెచ్చాడు .

           నేపాల్ దేశం లో అశోకుడు బౌద్ధ దీక్ష తీసుకొన్న దీపావళి రోజును ఘనం గా దీప తోరణాలను అలంకరించి‘’అశోక దీపావళి‘’గా జరుపు కొంటారు .గిరిజనుల అమాయ కత్వాన్ని కాష్ చేసుకొనే వారికి తీవ్రం గా దండించాడు గిరిజనులను గురించి పట్టించుకొన్న మొదటి రాజు గా గుర్తింప బడ్డాడు .పర్యావరణ పరి రక్షణ కోసం మొక్కలు నాటించి దారులను ఏర్పాటు చేసి యాత్రికులకు సత్రాలు కట్టించాడు .ఇంత గొప్ప పరి పాలకుని పేర దేశం లో ‘’ఒక విశ్వ విద్యాలయంకూడా  లేక పోవటం శోచనీయం ‘’అన్నారొక రచయిత ఇందులో . ఇది అందరి దృష్టినీ ఆకర్షించాలి .ప్రభుత్వం పై ఒత్తిడి చేయాలి .

              ఒక సారి ఒక బౌద్ధ భిక్షువు పాదాలకు తల వంచి నమస్కరించాడు సామ్రాట్ .ఆయన మంత్రి ‘’;యశుడు‘’ఒక మహా రాజు అలా చేయ రాదనీ అన్నాడు .చిరు నవ్వుతో ముందుకు కదిలాడు .కొన్ని రోజుల తర్వాత ఒక మాంసం కొట్టు నుంచి గొర్రె, మేక, తొ బాటు ఒక అనామక మనిషి తల తెప్పించి బంట్రోతుల  కిచ్చి అమ్ముకొని రమ్మన్నాడు .వారు నగరం అంతా తిరిగినా మనిషి తలను ఎవరు కోన లేదు .మిగిలిన రెండు జంతువుల తలలు అమ్ము డయాయని చెప్పారు అప్పుడు మంత్రిని పిలిచి అది అనామకు డైన మనిషి శిరస్సు అయినా ఎవరు కొన లేదని, తన శిరస్సు విక్ర యిస్తే కొంటారా ?అని అడిగాడు ..అప్పుడు చక్ర వర్తి ‘’ప్రకృతి లో పక్షుల,జంతువుల శిరస్సు కంటే నిరుప యోగ మైన మానవుని శిరస్సు ను వంచి ఒక జ్ఞాని పాదాలకు నమస్కరిస్తే గౌరవం తగ్గు తుందా?’’అని అడిగాడు అదీ చక్ర వర్తి ఔన్నత్యం ,గురు గౌరవం ..

              అశోకుని చివరి రోజులు చాలా భారం గా గడవటం విచార కరం .పట్ట మహిషి అసంది మిత్ర వివాహమైన ఇరవై తోమ్మిదిఏళ్ళ కే మరణించింది .చాలా కాలం పునర్వివాహం చేసుకో కుండానే గడిపాడు .తప్పని పసరి పరిస్తితులలో‘’తిష్య రక్షిత ‘’ను ద్వితీయం చేసుకొన్నాడు .ఆమె అతని పట్ల చాలా క్రూరం గా వ్యవహరించింది .ఆయన ఎంతో ప్రేమ గా పెంచు కొంటున్న బొధి వృక్షానికి విషం పెట్టించి క్షీణింప జేస్తుంది తట్టుకోలేక కృశించి పోతాడు భయ పడి ఆ చెట్టుకు వెయ్యి కుండల పాలు పోసి నెమ్మదిగా బ్రతి కించింది .అశోకుడు ఆనందం తొ గొప్ప ఉత్సవం చేశాడు ఒక సారి ఆజీవకులు అనే బౌద్ధ వ్యతి రేకులు బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేశారు .వాళ్ళను గుర్తించి తలలు నరకమని,నరికిన ప్రతి తలకు ఒక బంగారు నాణెం బహుమతి గా ఇస్తానని అశోకుడు ప్రకటించాడు .అలాంటి సమయం లో అశోకుని తమ్ముడు‘’విగత అశోకుడు ‘’రోగంతొ బాధ పడుతూ ,ఒక ఇంట్లో విశ్రాంతి తీసుకొన్నాడు ..అతని ఆకారం చూసి ఆజీవుకుడని అను మానించి, అర్ధ రాత్రి ఆ ఇంటి యజమాని భార్య సాయంతో విగత శోకుడిని విగత జీవుణ్ణి చేశాడు .ఆ తలను అశోకుడికి చూపి బంగారు నాణెం ఇవ్వ మని  కోరాడు .తమ్ముడి తలను గుర్తించి ,అశోకుడు నిశ్చే ష్టు డయాడు. . .తన తప్పు తెలుసు కొని ‘’శిర చ్చేదం‘’శిక్ష ను రద్దు చేశాడు  

                చివరి రోజుల్లో తీవ్ర అనారోగ్యం పాలైనాడు .బౌద్ధ సంఘాలకు వంద కోట్ల బంగారు నాణాలు ఇవ్వాలని అనుకొని తొంభై ఆరు కోట్లు ఇచ్చేశాడు .మిగిలిన ఆరుకోట్లు ఇవ్వ టానికి మనుమడు ,కుణా లుని  కొడుకు‘’సంప్రది’’ఒప్పుకోకుండా గట్టి నిఘా పెట్టాడు అయినా తనకు భోజనం పెట్టె బంగారు పళ్ళాలను ఇచ్చేశాడు వెండి పళ్ళాలతో భోజనం పెడితే వాటినీ ఇచ్చేశాడు రాగి వాటిని కూడా చివరికి కి పింగాణీ పళ్ళాలు కూడా ఇచ్చేశాడు .ఇది తెలిసి మనవడు భోజనానికి ‘’ఓక అరకాయ ఉసిరి కాయముక్కను ‘’పంపాడు .నిర్వేదం చెందిన సామ్రాట్ ఈ రాజ్యానికి రాజేవ్వరు అని రాజ భటులను అడిగితే ‘’మీరే ‘’అని వారు అంటే ‘’నా తృప్తికోసం అంటున్నారు మీరు .నా పరిస్తితి ఇది‘’అని ఆ ముక్కను చూపి దాన్ని కూడా ‘’కుక్కుటా రామం ‘’లోనిభిక్షుకులకు అందజేయమని సేవకుడికిచ్చి పంపాడు .వారంతా దాన్నే మహా ప్రసాదం గా చూర్ణం చేసి తిన్నారట ..ఇదీ చాలామందికి  తెలీని విషయమే . . ఇది చదివి గుండె చెరువు కాని పాఠకుడు ఉండడు.

                   చివరి ఘడియల్లో అశోకుని విశ్వాస పాత్రుడు రాధ గుప్తుడు వచ్చి ‘’ఈ భూ మండలానికి మీరే చక్ర వర్తులు ‘’అన్నాడు .అంతె -ప్రభుత్వ ఖజానా తప్ప మిగిలిన భూ మండలాన్ని  బౌద్ధా రామాలకు దానం గా ఇచ్చేశాడు .ఇలా చేయటం ఏదో గొప్ప పదవికోసం కాదని ,మనస్సు మీదసార్వ భౌమాదికారాన్ని పొందటానికే నని చెప్పాడు .ఇదే తాను చేసిన దాన ఫలం అని చెప్పి రాజాజ్న గా రాయించి దాని మీద తన పంటి ముద్ర తొ రాజ ముద్ర వేశాడు .ఇక్కడ మనకు శిబి ,దధీచి మొదలైన త్యాగ ధనులు గుర్తుకొస్తారు .తన 71 వ ఏట తుది శ్వాస విడి చాడు అశోక సామ్రాట్ .ఇది ఆ మహా మహుని చివరి దయనీయ గాధ. .విచలితుల మవుతాం ..

   ఇలాంటి ఎన్నో అద్భుత మైన విశేషాల తొ ఈ ప్రత్యెక సంచిక అల రారింది . అమూల్య మైన విషయాలున్న ఈ సంచికను కొని  చదివి, దాచుకో దగిన ఆభరణం . .మరొక్క సారి ‘’రేకా వారి బృందాన్ని’’మనసారా అభి నందిస్తున్నాను . చివరగా అశోక ధర్మ చక్రం మీద శ్రీ తియ్య గూర సీతా రామి రెడ్డి గారి హృదయ మైనపద్యాన్ని  ఉదహరిస్తాను .

     ‘’దివ్యమై ,మోక్ష గంతవ్యమై ,భవ్యమై ,బబోధి సంభావ్య మగుచు

      భాగ్యమై ,సంబోధి భాగమై ,ఆస్రవ మృగ్యమై ,ముని జన యోగ్య మగుచు

      నిత్యమై ,బొది సంస్తుత్యమై ,నిర్వాణ సత్యమై ,సాధన కృత్య మగుచు

       బోధియై సద్ధర్మ వేదియై ,హేతు ప్రమోదియై యమృత స్వాది యగుచు

               సంప్రజన్య సంక్రాంతుల సంచ రించు –సర్వ మంగళ చక్రంబు సర్వ త్రాణ

               జయద యమల చక్రము బుద్ధ జ్ఞాత ధర్మ –చక్ర మిది మారుని దునుము ఆయుధమ్ము ‘’.

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-12-12-ఉయ్యూరు

          

సాహితీ బంధువులకు శుభ కామ నలు .నూజి వీడు రెవిన్యు డివిజన్ నిర్వ హించే” ప్రపంచ తెలుగు మహా సభల” సందర్భం గా రేపు ఎనిమిదవ తేది అంటే శని వారం సాయంత్రం నూజి వీడు లోఆర్ .డి వో.గారి ఆధ్వర్యం లో  జరిగే కార్య క్రమం లో ఉయ్యూరు జోన్ లో నన్ను ఎంపిక చేసి సన్మానిం చాలని సంకల్పించినట్లు ,నాకు ఆవిషయాన్ని  ఆర్.డి .వో.గారు తెలియ జేయమని చెప్పి నట్లు ఇప్పుడే నూజి వీడు నుండి ఆ సభల కన్వీనర్ శ్రీ శిఖా ఆకాష్ గారు ఫోన్ చేసి తెలిపారు .ఇది సరస భారతికి జరిగే సన్మానం గా భావిస్తూ అంగీకారం తెలియ జేశాను . మీ –గబ్బిట  దుర్గా ప్రసాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.