గొల్ల పూడి కధా మారుతం –22
పదవ కధ –ఆమె –
ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఇరవై ఏళ్ళు పని చేసి బదిలీ పై స్వగ్రామం చేరాడు రచయిత .పాత ఇల్లు బూజు దులిపి స్వంత ఇంట్లో చేరాడు .స్వచ్చమైన పల్లె టూరి గాలి వెలుతురు లభించి నందుకు భార్యాభర్త లిద్దరూ ఆనందించారు .కిటికీ దగ్గర కూర్చుని తనివి తీరా గాలి పీలుస్తున్నారు .కిటికీ కి అవతల పొగడ చెట్టు ఉండి .మంచి వాసన తొ గాలి వస్తోంది .’’మంచి వారి మీద ,చెడ్డ వారి మీద వర్షించే భగ వంతుని కరుణ లాగా మురుగు కాల్వ మీద ,దుమ్ము రోడ్డు పైనా దాని పూలు పరుచుకోన్నాయి .లేక పోతే మంచికి విలువేమిటి “’?అని ప్రశ్నిస్తాడు రచయిత .హఠాత్తుగా తలెత్తి చూశాడు తనకు పట్టిన అదృష్టానికి పొంగి పోయాడు .ఆమె దర్శనం తొ పులకించి పరవశించి పోయాడు .ఎంతో మంది కాలేజి అమ్మాయిలూ ప్రౌఢలు అటుగా వెళ్తున్నా అందరి లోను ఆమె అతన్ని బాగా ఆకర్షించింది .’’ఆ సౌందర్యపు పలకరింత కు దిగ్భ్రాంతు డయ్యాడు ఆ గుప్త సౌందర్యానికి అచేతనం గా చూస్తూ ఉండి పోయాడు .అలా ఎంతకాలం తదేకం గా ఉన్నాడో గుర్తు లేదు .క్రమం గా కను మరుగై కలలోంచి జారి పోయి నట్టుంది ‘’
ఆ రాత్రి అంతా ఆమె ముగ్ధ సౌందర్యపు ఆలోచనలతో అతనికి నిద్రే లేదు ఆ సౌందర్యం అతడిని వివ శుడిని చేసింది .బుజ్జగించి ,లాలించి జోల పాడి నట్టుంది .తన్మయత్వం తొ అచేతనుడిని చేసింది .మర్నాడు అదే తీరున కూర్చుని సౌందర్యారాధన చేశాడు .’’తారున్యపు తొలి చాయలు ఆమె చెక్కిళ్ళు యెర్రని కెంపు లాంటి చీర .ఆకాశానికి ఎగసిన అగ్ని శిఖా ‘’లాకన్పించింది.మరీ పరి శీలించి చూస్తె ఆ ఎర్రదనం పలుచ బడి సుప్త సౌందర్యం పరవశున్ని చేసింది .భార్య పసి గట్టింది .తనను కాదని అతని మనసు ఎవర్నో ఆకర్షించిందని ఈర్ష్య పడింది .చలి గాలిలో అలా ఎందుకు కూర్చుంటారు అంటూ చెప్పలేని బాధ తొ ప్రేమతో చెప్పింది .అయితే ఆమె ను చూడటం తనకి వ్యసనమే అయింది .ఒక్కో రోజు అసలు కన్పించేది కాదు ఆ తర్వాత ‘’యెర్రని తాంబూలచర్వణం తొ తామసం కల్గించే పెద్ద ముత్తైదువ లాయెర్రని కోపం తొ ఒక్కోసారి దిగులుతో కుంచించుకు పోయి కన్పించేది .చేత నైతే ఆమె దుఖం తీర్చాలని ఉబలాట పడే వాడు .అశక్తత వల్ల ఏమీ చేయ లేక పోయే వాడు కిటికీ దగ్గర అలాగే తపస్సు చేసే వాడు ఆమె కోసం .కళ్ళు అశ్రు శిక్తాలయ్యేవి .భార్య ఎప్పుడో తట్టి లేపి అతని కన్నీరు చూసి దిగ్భ్రాంతి చెందేది .అప్పటికే చీకటి పడి ఆమె అదృశ్య మయేది .భార్యకు ఇతన్ని చూస్తుంటే దిగులేసింది .
ఓ నాటి సాయంత్రం ప్రత్యేకాలన్కరణం తొ ఆమె కని పించింది .ఆ సౌందర్య సందర్శ నంతొ లీన మయ్యాడు .భార్య ఏడుపు తొ ఈలోకం లోకి వచ్చాడు .ఆమె ఈతని బాధకు కారణం అడిగింది కన్నీరే జవాబు .’’మీరేవరినో చూస్తున్నారు మీ ఇద్దరి రాయ బారాన్ని నేను గమనిస్తున్నా .నేను చచ్చినా ఆమె ముఖం చూడను గాక చూడను‘’అంది ఆమెను భర్త కిటికీ దగ్గరికి లాక్కేల్లినప్పుడు .చివరికి ఆమె ను చూపించాడు .ఆమె నిర్ఘాంత పోయింది ఆశ్చర్యం, విస్మయం ఆమె ను అవాక్కు చేశాయి .అయితే భర్తను నమ్మలేక పోయింది .మోసం చేస్తున్నడను కొన్నది .’’నేను రోజు చూసేది ఈ సంధ్యనే .ప్రతి రోజు పడమటి ఆకాశాన్ని వెలిగించే పెద్ద ముత్తైదువ .పెదవుల పై కేందామర ,చెక్కిళ్ళ పై రంగులు ఆమె నిత్య యవ్వని ఆ సౌందర్యానికి మూర్చ పోనీ దెవ్వరు ?’’అన్నాడు .
భార్యకు ఒకటే నవ్వు .దీపాలు వెలిగాయి .సంధ్య జేగురైంది .భార్య మంగళ సూత్రం కళ్ళ కద్దు కొని అఆతని కళ్ళల్లోకి చూసి లోపలికెళ్ళి పోయింది ‘’సంధ్యనూ అతడినీ ఏకాంతం గా వదిలేసి ‘’అని ‘’సంధ్యా వందనం‘’చేస్తాడు కవి గా రచయిత గొల్లపూడి .సస్పెన్స్ లో అద్భత మైన కధా గమనం కొసమెరుపు భార్యకు ఊరట .-భర్త ఈ వయసులో ఎవరి పైనా మరులు గోన నందుకు .,తన మాంగల్యం పచ్చ గా నిల్చి నందుకు .చిన్న విషయాన్ని మహాద్భుత రీతి లో గొప్ప కేన్వాస్ పై చిత్రించిన నేర్పు ఇది .ఆ సౌన్దర్యారాధనకు ,వర్ణనకు మనసు పరవ శిం చదామనకు కూడా? .అదే మారుతీయం .గొల్లపూడి తనం , గొప్పదనం ,నూతనత్వం. ఆ సంధ్యా సుందరికి ఆనంద నీరాజనాలు ‘
మరో కధలో మళ్ళీ కలుద్దాం
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –20-12-12-ఉయ్యూరు